Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భయం ఇప్పుడిక నిశ్చల దశ్యం
నిషాద విషాదం చుట్టూ
ఎక్కడిదో ఒక ప్రాచీన శోకపు కల్లోలం
అంతః వెలివేతలపై అప్పుడొకసారి అప్పుడొకసారి
ఆగి ఆగి దుఃఖగీతాలందుకుంటున్నాయి.
2
ఇప్పుడు దేవుడెవరు?
హదయానికి కొట్టిన ఇనుప నాడాలతో
ఏకబిగిన కురుస్తున్న వాడి ప్రార్థనలు!
అడ్డంగా దొరికిన ఏ కన్నీటి చుక్కనైనా
పదడుగుల లోతులో పూడుస్తున్న ఖననం!
3
ఒకటీ...వందా...వెయ్యి..
తెర పైకి సరికొత్త సాంఖ్య సిద్ధాంతం
ష్!!!
ఎవడి దేహంలో వాడి రోగాన్ని
రట్టు చేయాలనుకోకు
ఆండ్రాయిడ్ స్క్రీన్ పై ఇంట్రోస్పెక్ట్ తో
ఇన్స్టంట్ సమాదులపై వరుసకథనాలు!
బ్రేకింగ్ న్యూస్ లు!
4
దాచేయి
మతదేహాలను రాత్రికి రాత్రికి దాటించేరు
సగం పూడ్చిన విగత వార్త
ఎప్పటికో ఎక్సుమేషన్లోనే కదా స్క్రోలింగయ్యేది
నిస్తేజంగా పడిఉండే టీవీ డిబేట్లల్లో
ఆదర్శాన్నంతా పుక్కిలించి ఊసి,
ఊపిరి పీల్చుకొంటారు!
5
ఎటొచ్చీ
ఒకటే సూచన
వార్త హదయవిదారకంగా ఉండాలంతే!!
వార్త సెన్సేషన్ కావాలంతే!!
- సి.వి.సురేష్, 99660 78281