Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధార పడకుండా స్వేచ్ఛగా బతకడం రచయితగా ఉండటం వల్ల సాధ్యమవుతుందని భావించాను. ఎవరి అనుమతి కోసమో ఎదురు చూడకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి, చదవ డానికి, నిద్రపోవడానికి, అనుకున్నది చేయడానికి తగిన స్వేచ్ఛ రచయితగా ఉన్నప్పుడే సాధ్యమవుతుం దనుకున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే స్వేచ్ఛా జీవనం సాగించడానికి రచయితను కావాలనుకున్నాను''. ఒక సందర్భంలో రచయిత కావాలని ఎందుకు అనుకున్నారన్న ప్రశ్నకు ఆర్.కె.నారాయణ్ ఇచ్చిన సమాధానమది. స్వేచ్ఛా ప్రియత్వంతోనే ఆయన రచయిత అయ్యారని ఆ మాటల్ని బట్టి స్పష్టమవుతుంది. అయితే ఈ స్వేచ్ఛ కోసం ఎంతో మూల్యం చెల్లించాలి. అందుకు సిద్ధపడినవాళ్ళే సాహిత్య ప్రపంచంలో మనగలుగుతారు.