Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముమ్మాటికీ ఇది యుద్ధసమయం
అందరం అనివార్యంగా యుద్ధం చేయాల్సిందే
మనలో ఉన్న కుళ్ళును
కుతంత్రాలనూ పాతర పెట్టి
పోరాటం చేయాల్సిందే
ఇంకో నాలుగు రోజులు
ఈ భూమ్మీద గాలి పీల్చాలంటే
కలిసి కట్టుగా యుద్ధ శంఖాన్ని పూరించాల్సిందే
ఒకప్పుడు దేశాలు దేశాలతో
కత్తులతో, తుపాకులతో,
అణుబాంబులతో యుద్ధం చేస్తే
ఇప్పుడు అన్ని దేశాలు కలిసి
ఒక కనిపించని కరోనాపై
సమరం సాగించాల్సిన సమయం ఇది
మాస్కులతో, సానిటైజర్లతో
ఎవరికి వారు వైరస్‌తో
ఇండ్లల్లో ఉండి యుద్ధం ప్రకటించాల్సిందే
ముసుగు వీరులమై
సమర సూర్యుణ్ణి వెలిగించాల్సిందే
కలవాల్సి వస్తే కరచాలనం మాని
దండం పెట్టి ధన్యులు కండి
నిజానికి యుద్ధామంటే గెలవడం
శత్రువును ఓడించడం
శత్రువు ప్రమాదకారి అయితే
సమూలంగా హతమార్చడం
కరోనాను హతమార్చి
కాపాడుకోవాలి మానవాళిని
అందుకే
యుద్ధం అనివార్యం
శత్రువును నామరూపాల్లేకుండా చేయాలంటే
అందరూ ఐసోలాటెడ్గా ఉండాల్సిందే
ఐసోలేషన్ ఒక్కటే అంతిమ ఆయుధం.
- డాక్టర్ బాణాల శ్రీనివాసరావు