Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవనసంధ్యలోని వద్ధులకు
వైద్యం లేదక్కడ
ఆ మనుషులు ఎవరైతేనేమీ
బ్రతికించాలి.
దేశదేశాలు ప్రేమించాలి
వాళ్లు కనికరించబడాలి
వద్ధ ఉపనిషత్తులోని
మనుషులు వాళ్లు
జీవనసార గ్రహీతలు వాళ్లు.
బ్రతుకుసంధ్య లోని జీవులు వాళ్ళు
ఎన్నో ఎన్నెన్నో
కష్ట సుఖాల పండిపోయిన వాళ్ళు
కరుణతో కనికరించే వాళ్ళు
మానవతకు దారి చూపిన వాళ్ళు
మనిషితనంతో వెలిగేవాళ్ళు
- సిహెచ్. ఆంజనేయులు,
77025 37453