Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాడు ముందునుంచీ అంతే
నా ఉచ్ఛ్వాస నిశ్వాసలను
నియంత్రించాలనుకునే
యంత్ర నియంత వాడు
నేనెప్పటికీ వాడి కాలికింద చెప్పులా
ఉండాలనేది వాడి
రాయని రాజ్యాంగ సూక్తం
నా వొంటి రంగు వాడి కళ్ళల్లో దాగి ఉన్న
శతాబ్దాల నిశబ్ద కసిని
నిద్ర లేపుతుంది
నా ఉనికి వాడి నరనరాల్లో
విష భాండాలను కుమ్మరిస్తుంది
వాడెప్పుడూ నాకోసం
పంజరాలను అల్లుతూనే ఉంటాడు
నన్నంతం చేసేందుకు నిరంతరం
కుట్రల చితిని పేరుస్తూనే ఉంటాడు
వామనుడి మూడోపాదం
నా నెత్తిన పెట్టేందుకు
సిద్ధంగానే ఉంచుతాడు
నా కనురెప్పల కదలికలకు
కాపలా కంచెలు
నాటుతూనే ఉంటాడు
అప్పుడూ ఇప్పుడూ
ఎప్పుడూ వాడంతే
అప్పుడెప్పుడో
వాడి చిన్ని మెదడుకా స్ట్రోకు
వచ్చినప్పటి నుంచి
వింత చేష్టలు, బలుపు కేకలు
నిత్యం ద్వేషాగ్ని రోత కూతలు
కొండంత మనిషి ప్రాణానికి
శ్వాసే పిసరంత ఊపిరని తలచి
నా ఉచ్ఛ్వాసకు ఉరి పోస్తే...
నా శ్వాస ఆగిందనే నిజం
వాడి తలకెక్కే లోగా
నా జాతిని పాతాళానికి తొక్కాలనే
వాడి వెర్రి ప్రేలాపనలు
గడప దాటే లోగా
నే విడిచిన నిశ్వాసపు వేడి గాడ్పులు
నా ప్రజల్లో రగులుతున్న కోపాగ్ని
గుండా(డె)ల్ని మండేలా చేస్తే
దావానలంలా సెగలు కక్కుతూ
నగరాల్లో కదంతొక్కుతున్న నల్లకలువలు
వీధుల్లో మిలియన్ల మండేలాలు
ఇప్పుడు వాడికి ఊపిరాడటం లేదు
నవ షaఅ'్ bతీవa్‌ష్ట్రవ ....
రాజ్యం వాడిదే
ఆయుధమూ వాడిదే
అయితేనేం...
ఉవ్వెత్తున లేచిన జనాగ్రహ జ్వాలలు
వాణ్ని కలుగు(బంకరు)లోకి తరిమేసాయి
అణ్వాయుధ శిఖరాన్నని
విర్రవీగే వాణ్ని
తన కనుసైగతో ప్రపంచాన్నే
నియంత్రించాలన్న దురహంకారాన్ని
కలుగుల్లో కాపురానికి పంపాయి
నా ఒక్కడి ప్రాణం
నా ఒక్క ప్రాణమే
ఉత్ప్రేరకమై
వెలిగించిన స్వేచ్చా నెగళ్ళు
ప్రభవించిన 'క్లైమేట్ ఛేంజ్'
కలుగుల్లోకి దూరి మరీ
వాడ్ని జనం ముందు నిలబెడుతుంది
ఫ్లాయిడంటే ఒక్క వ్యక్తి కాదు
జనం గుండెల్లో రెపరెపలాడే స్వేచ్చ
ఫ్లాయిడంటే ఇప్పుడు సునామీలు
సష్టిస్తున్న చైతన్యపు ఫ్లూయిడ్
ప్రపంచాన్ని న్యాయం వైపు
నడిపిస్తున్న స్వేచ్చాగీతం
వాడికెన్నడు తెలవాల
స్వేచ్చకు రంగులుండవని
వాడెన్నటికీ అంతే!
- కట్టా సత్య ప్రసాద్
94900 98918