Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారని కన్నీటి చుక్క నాన్న
ఆరని గుండె మంట నాన్న
గాంభీర్యం పులుముకున్న నాన్న
ఔదార్యం వంపుకున్న నాన్న
నాన్నంటే తీరాన్ని చేర్చే నావ
నాన్నంటే ముళ్ళను ఏరేసిన త్రోవ
1. ఇంటిల్లి పాదిలో ఒంటరితానై
క్రమశిక్షణ పేరిట అందరిలో వేరై
అణగద్రొక్కుకున్న అనురాగమై
అలకలవెనకన తను త్యాగమై
నాన్నంటే నచ్చనీ మందలింపురా
నాన్నంటే గుచ్చుకునే అదిలింపురా
2.అవసరాన్నిడిగితే అది ఒక వరమై
అదుపుతప్పునేమోయను కలవరమై
ఎండకూవానకూ తడిసిన గొడుగై
బంగారుభవితకు తానే ముందడుగై
నాన్నంటే కుటుంబం వెన్నెముకేరా
నాన్నంటే నాటికకూ తెరవెనుకేరా
- డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
9849693324