Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎనుబై టొంబై దాటనీ
ఏమీ చెయ్యలేక పోనీ
వాళ్ళున్నరంటె
మనకొక భద్రత భావన!
పైతరం నీడనిచ్చే ఒక ఛత్రం!
పాతదైతేనేమి
అక్కడక్కడ మాసికలు పడితేనేమి
మన పైన ఒక రక్షణవలయం!
అమ్మానాన్న ఉన్నంతకాలం
మన వయసే గుర్తుకు రాదు
పత్రికలో ఏదైనా వార్తావశాత్తు
యాబై దాటినోళ్ళను వద్ధులంటుంటే
పోపోర అని ఈసడించుకుంటం
అరవై వయసూ చిన్నదే అనిపిస్తది
తల్లిదండ్రుల సమక్షంలో
ఇంకా బచ్చాగాళ్ళమే అనిపిస్తది.
వ్యవహారాలలో జరిగే పొరపాట్లకు
అందరూ వేలెత్తిచూపెటోళ్ళే భార్యతో సహా
కాని...' పోనీరా....కానీరా....' అని
కడుపులపెట్టుకొని వెనుకేసుకొచ్చేది కన్నోళ్ళే!
ఒళ్ళోకి తీసుకుని తలనిమిరితే
పుష్కలంగా స్రవించే ఎండార్ఫిన్లు సెరటోనిన్లు
హుష్..కాకి....స్ట్రెయిన్లు టెన్షన్లు!
అయిపోయింది..అది గతమయిపోయింది
పైన పట్టిన ఛత్రి మాయమయింది
ఇప్పుడు కింది తరానికి
మనమే ఒక పాత గొడుగు!
- వేముల సత్యనారాయణ, 9849365990