Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరేమో..
నేనేమో..
నదుల్ని లోయల్ని
దాటుకొని ఒచ్చానంట
పూలనీ పిట్టల్నీ దాటుకొని
ఈ ఒడ్డు చేరానంట
రెండు కళ్ళకి పట్టేంత ప్రపంచం ఉంటేనేగా
రెండుకళ్లు కావాలి?
చెవులనిండా సరిపోయేంత భాష ఉంటేగా
నా చెవుల్తో నాకవసరం?
చేయుతనివ్వని చేతులెందుకని?
దుఃఖానికి కన్నీళ్లు పొంగని కళ్ళెందుకని?
మరేమో..
నేనేమో..
నా కన్నుల్ని అమ్మేసుకుంటానంటా
చెవుల్ని పీకి బేరం వేస్తానంటా
చేతులకు టాగ్ లైన్ వేసి డిస్కౌంట్ ఆఫర్ చేస్తానంటా
కల్లండోరు కళ్ళు
కాళ్లండోరు కాళ్ళు
నన్నమ్ముకొని నిన్నునువ్వు కొనుక్కో
నిన్నమ్ముకొని నన్నేను కొనుక్కుంటా
ప్రతిసారి లాభమెంతని లెక్కించ్చుకుంటావే గానీ
నష్టమే లాభమై తిరిగొస్తోందని
పెట్టుబడికి రాబడికి
ఎప్పటికీ సమతుల్యం కుదరదని
నిన్ను అమ్ముతున్నవాడివి
నిన్ను కొంటున్నవడివి నువ్వే
మారేమో..
నాకేమో..
ఒకటే సందేహం ఒకటే సందిగ్ధం
మార్కెట్‌కి మార్కెట్‌కి నడుమ మధ్యవర్తినని
మనిషికీ మనిషికీ మధ్య మార్కెట్నని
పారే నది నాకిప్పుడు నిండినపర్సు
చెట్ల ఆకులిప్పుడు రంగు కాగితాలు
ఒకడు నవ్వుని దుఃఖించ్చినట్టు
ఒకడు దుఃఖాన్ని నవ్వినట్టు
కళ్ళని అమ్ముతాడు ఒకడు
ఒళ్ళును బేరంపేడుతుంది మరొకర్తి
పుట్టకలు చావులు
యుద్దాలు శాంతి చర్చలు
అన్నీటా అంతటా ఆవరించింది
ఒకటి అమ్మటం మరొకటి కొనటం
-పెద్దన్న
9866881140