Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెప్పలు వదిలేసి
కనుపాపలెప్పుడో
రెక్కలు కట్టుకు
పట్నానికి ఎగిరిపోయాయి
వెలసిన గూళ్ళలో
వాలిన అలసిన దేహాలు
ఎక్కే పొద్దునూ దిగే పొద్దునూ
శూన్యంలో లెక్కిస్తున్నాయి
పిచ్చుకలు ఏరే గింజలన్నీ
ఈకలు మొలవని పిల్లలకే
అక్కడ
నాలుగు మెతుకులన్నా
నోటికందాయో లేదోననే దిగులు
బతుకు సంద్రపు అగాధాలు
ఆ ముసలి చూపుల్లో
అన్నం కావాలంటూ
బుజ్జి కాళ్ళను నేలకు కొట్టే తాజా దశ్యం
కంటి రెటీనాలో దోగాడుతూ
ఖాళీతనపు లోతుల్లో
ఈదులాడే కర్కశ కరోనా
ఆ తలపుల వలపోతకు
చెబుతుందో లేదో
వయసు రక్తానికి మరిగిన సంగతి
- నస్రీన్ ఖాన్, 9652432981