Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిగో
ఆ వంక దాటి రోడ్డున పడి
నాలుగు మైల్లు ఈడసకబోయామంటే
వచ్చేదే సర్కారీ దావఖానా
ఆడ బతికినా స్వర్గమే, చచ్చినా స్వర్గమే !
మంచి చిల్లగొయ్యకి
కాలా వర్ణమైన కంబళితో
సింగారించుకుంటుంది డోలీ
అది ఆదివాసీల చావు బతుకుల పల్లకి
అందాల పల్లకి
కాళ్లతో కదిలే అభినవ అంబులెన్స్
మిట్ట మధ్యాహ్నం
నడి నెత్తిన ఎండ
చిత్రం కాకపోతే
తడిసి ముద్దయింది తండా మొత్తం
చినుకు తడికి కాదు, కట్టలు తెగిన కన్నీటికి
మధ్యలోనే ముక్కుపచ్చలారని
మత శిశువుని ప్రసవించింది
మాయదారి డోలీ
తల్లికి తెలీదు ఈ పాపగాలం
కన్న కొడుకు హరిణ వర్ణ రూపాన్ని
కలలు కంటుంది అపస్మారకంలో...
పాపం పిచ్చి తల్లి
తేలు కుడితే... తేలు కుడితే...
పాము కుడితే... పాము కుడితే..
హాలాహల ఆహాకరాలే
ఆలకించే దిక్కులేదు
బతుకు పయాణమైనా చావు పయాణమైనా
ఆ డోలీలోనే
ఇదెక్కడి చోద్యమో గానీ
ఆ గుడెసల మీదకి
విమానాలొస్తరు , హెలికాప్టర్లొస్తరు
ఇంకొంచెం దూరంలో
రాకెట్లు రయ్యిన దూసుకుపోతాయిగానీ
ఊరికి మాత్రం బస్సు రాదు బండి రాదు
అసలు రానీకి దారే లేదు సారూ!
ప్రజల చేత ప్రజల కోసం పీటమెక్కిన
ఓ పాలకులారా
కనిపించినకాడల్లా కాళ్ళు మొక్కుతం బాంచెన్
జరంత గిరిపుత్రులకేసి చూడరాదే !
అదిగో
అస్త్ర శస్త్ర శాస్త్ర సాంకేతికతలో
ఈ ఇరవై ఒకటో శతాబ్దం
నాది అని విర్ర వీగిన మనిషి
డోలీ కథల వ్యధలో పడి
తల పగిలి చచ్చాడు
రక్తం హౌళీ చేస్తుంది
డోలీ దారి మల్లింది
స్మశానం దిశగా......
(ఆపద కాలంలో ఈ రోజుకి కూడా కనీసం రవాణా సౌకర్యం కూడా లేని గిరిపుత్రుల వ్యధలను చూసి బాధతో..)
- వెంకటేష్ పువ్వాడ,
9743271569