జలంధర్ నిట్‌లో ప్రొఫెసర్ పోస్టులు
పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ-నిట్) జలంధర్‌లో 117 'ప్రొఫెసర్' పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుత్తూ ప్రకటన వెలువడింది.
పోస్టు పేరు-ఖాళీలు: ప్రొఫెసర్-20, అసోసియేట్ ప్రొఫెసర్-30, అసిస్టెంట్ ప్రొఫెసర్-67
విభాగాలు: బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రా నిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇండిస్టియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్ (ఎ.మేనేజ్మెంట్, బి.ఇంగ్లిష్), ఫిజిక్స్, కెమిస్ట్రీ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్.
వేతనం: ప్రొఫెసర్-రూ.48 వేలు, అసోసియేట్ ప్రొఫెసర్ -రూ.42,800, అసిస్టెంట్ ప్రొఫెసర్-రూ.30 వేలు.
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి పీహెచ్డీ. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం.
ఎంపిక విధానం: మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు: రూ.1,000 (జనరల్/ఓబీసీ), రూ.500 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ).
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని ప్రింటవుట్ తీసుకుని సంబంధిత ధ్రువపత్రాల జెరాక్స్ కాపీలను జతచేసి 'ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పీఓ-ఆర్ఈసీ క్యాంపస్, జలంధర్-144011' చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2017
దరఖాస్తు హార్డ్‌కాపీలు చేరడానికి చివరి తేదీ: అక్టోబర్ 17, 2017
వివరాలకు వెబ్సైట్: www.nitj.ac.in
************************
బీఎస్ఎన్ఎల్లో జేఏఓ పోస్టులు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. దేశ వ్యాప్తంగా ఉన్న తన సర్కిళ్లవారీ కార్యాలయాల్లో 996 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది.
పోస్టు పేరు: జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ)
వేతనం: రూ.16,400-రూ.40,500
మొత్తం ఖాళీలు: 996 (ఓసీ-497+ఓబీసీ-269+ఎస్సీ-153+ఎస్టీ-77).
సర్కిళ్ల వారీ ఖాళీలు: అండమాన్ నికోబార్-4, అసోం-32, బిహార్-22, ఛత్తీస్‌గఢ్-19, చెన్నై టెలికం డిస్ట్రిక్ట్-23, గుజరాత్-71, హర్యానా-36, హిమాచల్‌ప్రదేశ్-18, జమ్ము కశ్మీర్-16, జార్ఖండ్-11, కర్ణాటక-62, కేరళ-41, కోల్‌కత టెలికం డిస్ట్రిక్ట్-8, మధ్యప్రదేశ్-38, మహారాష్ట్ర-135, నార్త్ఈస్ట్ (1) -14, నార్త్ఈస్ట్(2)-5, నార్తర్న్ టెలికం రీజియన్-16, ఒడిశా-20, పంజాబ్- 61, రాజస్థాన్-46, తమిళనాడు-34, ఉత్తరప్రదేశ్ ఈస్ట్-65, ఉత్తరప్రదేశ్ వెస్ట్- 41, ఉత్తరాఖండ్-11, పశ్చిమ బెంగాల్-56.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-72 (ఓసీ-26+ఓబీసీ-23+ఎస్సీ-16+ఎస్టీ-7), తెలంగాణ-19(ఓసీ-11+ఓబీసీ-6+ఎస్సీ-2)
అర్హతలు: ఎంకామ్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 2017 జనవరి 1 నాటికి 20-30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్య ర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లతో పాటు మిగిలిన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్లైన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్-2017 ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: దీన్ని పేపర్-1, పేపర్-2గా నిర్వహి స్తారు. పేపర్-1లో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్/ అవేర్నెస్పై ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్ నుంచి 100 మార్కులకు (షార్ట్ ఆన్సర్స్/ఆబ్జెక్టివ్ టైప్), జనరల్ ఆప్టిట్యూడ్/ అవేర్నెస్ నుంచి 50 మార్కులకు (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు, పేపర్-2లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్/ కాస్ట్ అకౌంటింగ్/ టాక్స్ అండ్ కమర్షియల్ లా అంశాలపై మొత్తం 300 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
సర్కిళ్లవారీ పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. అనంతరం తుది ఎంపిక ఉంటుంది.
ఎగ్జామినేషన్ ఫీజు: రూ.1,000 (ఓసీ/ఓబీసీ), రూ.500 (ఎస్సీ/ఎస్టీ).
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 15, 2017
వెబ్సైట్:www.bsnl.co.in,
www.externalexam.bsnl.co.in
*************************
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) .. దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లోని 48 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు: డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'ఎ' (అడ్మిని స్ట్రేషన్)-3, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, అడ్మిని స్ట్రేటివ్ ఆఫీసర్-4, అకౌంట్స్ ఆఫీసర్-3, అసిస్టెంట్ 'ఎ' (లేబొరేటరీ/రెప్రొ-ఫొటో/లైబ్రరీ)-6, ఆఫీస్ అసిస్టెంట్ 'ఎ'-16, ఇంజనీర్ 'ఎ'(సివిల్)-1, ఎలక్ట్రీషియన్ 'ఎ'-3, ఆపరేటర్ కమ్ మెకానిక్ 'ఎ'(లిఫ్ట్)-4, టెలిఫోన్ ఆపరేటర్ 'ఎ'-1, కుక్ 'ఎ'-3, ప్లంబర్ 'ఎ'-2, బైండర్ 'ఎ'-1.
వేతనం: డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'ఎ', సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు-రూ.15,600-రూ.39,100,
ఇంజనీర్ 'ఎ'పోస్టులకు రూ.9,300-రూ.34,800,
మిగిలిన పోస్టులకు రూ.5,200-రూ.20,200.
అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి ఏదైనా డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా తత్సమానం/ ఏసీఏ/ఏఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/బీఈ/ పదో తరగతి+ఐటీఐ/ ఎనిమిదో తరగతి+ఐటీఐ/ఇంటర్. దీంతోపాటు నిబంధనల మేరకు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌కు 50 ఏళ్లు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-45 ఏళ్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్-40 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని ప్రింటవుట్ తీసుకుని సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు, ఫీజు రిసీట్, ఫొటోలు తదితర అవసరమైన వాటిని జతచేసి కవరులో ఉంచి 'ది సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పర్సనల్ యూనిట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, 203, బీటీ రోడ్, కోల్‌కతా-700108' చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 19, 2017
ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు: అక్టోబర్ 17, 2017
దరఖాస్తు హార్డ్ కాపీలు చేరడానికి గడువు: నవంబర్ 3, 2017
వెబ్సైట్: www.isical.ac.in
*******************
ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటీస్
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) రావత్‌భట్ (రాజస్థాన్) విభాగం.. 60 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటీస్
శిక్షణ వ్యవధి: ఏడాది
ట్రేడ్ విభాగాల వారీ ఖాళీలు: ఫిట్టర్-12, టర్నర్-9, మెషినిస్ట్-9, ఎలక్ట్రీషియన్-12, ఎలక్ట్రానిక్ మెకానిక్-12, వెల్డర్-3, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా)-3.
స్టైపెండ్: కోపాకు రూ.4,514, మిగిలినవాటికి రూ.5,078.
అర్హతలు: విభాగాలను అనుసరించి ఎనిమిదో తరగతి/పదో తరగతి/ ఇంటర్మీడియెట్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ. అలాగే నిబంధనల మేర శారీరక దఢత్వం, ఆరోగ్యం, శారీరక ప్రమాణాలు ఉండాలి. వీటితోపాటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు-కనీసం 137 సెం.మీ, బరువు-కనీసం 25.4 కిలోలు, ఛాతీ-తగినంత ఉండి, గాలిపీల్చినపుడు కనీసం 3.8 సెం.మీ వ్యాకోచించగలగాలి.
వయోపరిమితి: 14-24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ- మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు.
ఎంపిక విధానం: ఐటీఐ మార్కుల ఆధారంగా. మెడికల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: మొదట అభ్యర్థి షషష.aజూజూతీవఅ్ఱషవరష్ట్రఱజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో అప్రెంటీస్‌గా నమోదు తర్వాత నిర్దేశిత విధానంలో దరఖాస్తు పత్రంలో వివరాలు నింపి, దానికి సంబంధిత ధ్రువపత్రాల జెరాక్స్‌లను జతచేసి 'డిప్యూటీ మేనేజర్ (హెచ్ఆర్ఎం), రిక్రూట్మెంట్ సెక్షన్, విజరు భవన్, రావత్భట రాజస్థాన్ సైట్, ఎన్పీసీఐఎల్, పీ.వో-అణుశక్తి, వయా-కోట (రాజస్థాన్), పిన్-323303' చిరునామాకు చేరేలా పంపించాలి.
దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: అక్టోబర్ 10, 2017
వెబ్సైట్: www.npcil.nic.in
**********************
ఎంఆర్పీఎల్లో అప్రెంటీస్ ట్రైనీలు
కర్ణాటకలోని మంగళూరులో ఉన్న మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్).. 189 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఇది ఓఎన్జీసీకి అనుబంధంగా ఏర్పాటైన సంస్థ.
పోస్టు పేరు: అప్రెంటీస్ ట్రైనీ
శిక్షణ వ్యవధి: ఏడాది
మొత్తం ఖాళీలు: 189(గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ-85 ం టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ-104)
విభాగాల వారీ ఖాళీలు :
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీలో.. కెమికల్ ఇంజనీరింగ్-28, సివిల్ ఇంజనీరింగ్-7, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-10, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-9, మెకానికల్ ఇంజనీరింగ్- 23.
టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీలో.. కెమికల్ ఇంజనీరింగ్-26, సివిల్ ఇంజనీరింగ్-7, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-15, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీ రింగ్-10, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్-6, మెకానికల్ ఇంజనీరింగ్-25, కమర్షియల్ ప్రాక్టీస్-15
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ-రూ.10 వేలు, టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ-రూ.7,100
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి కనీసం 55 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏ/ ఓజీపీ ఏతో ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా 2015/ 2016/2017 అక్టోబర్ 7లోపు ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ(ఎన్సీఎల్)కు 45 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగు కేటగిరీలకు 40శాతం మార్కులు/ తత్సమాన సీజీపీఏ/ ఓజీపీఏ చాలు.
ఎంపిక విధానం: రాత పరీక్ష
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి విద్యార్హత విభాగం నుంచి మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. పరీక్షను మంగళూరులో మాత్రమే నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 7, 2017
వివరాలు వెబ్సైట్: www.mrpl.co.in
***********************
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటీస్‌లు
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్).. మధ్యప్రదేశ్ లోని మలజ్ఖండ్లో ఏర్పాటు చేసిన మలజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్‌లో 75 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటీస్
శిక్షణ వ్యవధి : ఏడాది
విభాగాలు-ఖాళీలు: ఎలక్ట్రీషియన్-25, ఆర్మట్యూర్ విండర్ -2, మెకానిక్-12 (డీజిల్-10+ ఏసీ అండ్ రిఫ్రిజి రేషన్-2), వెల్డర్ (జీఅండ్ఈ)-7, ఫిట్టర్-10, టర్నర్-5, డ్రాట్స్‌మ్యాన్-6 (మెకానికల్-3ం సివిల్-3), సర్వేయర్-3, కార్పెంటర్-3, ప్లంబర్-2
వయో పరిమితి: 2017 సెప్టెంబర్ 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ విభాగం లో ఐటీఐ ఉత్తీర్ణత. అలాగే అభ్యర్థులు షషష.aజూజూతీవఅ్ఱషవరష్ట్రఱజూ.స్త్రశీఙ.ఱఅ లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష
దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో దరఖాస్తు పత్రంలో వివరాలు నింపాలి. దానికి సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి 'అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్అండ్ఏ), హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, మలజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్, బిర్సా(తెహ్సిల్), మలజ్‌ఖండ్ (పీ.వో), బాలాఘాట్(డిస్ట్రిక్ట్), మధ్యప్రదేశ్-481116' చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి.
దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 26, 2017
వివరాలకు వెబ్సైట్:www.hindustancopper.com
Authorization