దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లోని 7883 క్లర్క్/క్లరికల్ హోదా పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్).. సీడబ్ల్యూఈ (కామన్ రిటన్ ఎగ్జామినేషన్) క్లర్క్స్-7 నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: క్లర్క్/క్లరికల్ కేడర్
మొత్తం పోస్టులు:7,883
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు (బ్యాంకుల వారీ): ఆంధ్రప్రదేశ్-485, తెలంగాణ-344
అర్హతలు: ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ అంశాల్లో (ఆపరేషన్స్/లాంగ్వేజ్) పరిజ్ఞానం, పనిచేయగల నైపుణ్యం (సర్టిఫికెట్) ఉండాలి. లేదా సం బంధిత డిగ్రీలో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలి. దీంతోపాటు అభ్యర్థి దరఖాస్తు చేసుకునే సంబంధిత కేంద్ర పాలిత ప్రాంతం/రాష్ట్రం ప్రాంతీయ అధికార భాషలో పట్టు (మాట్లాడడం, రాయడం, చదవడం) తప్పనిసరి.
వయో పరిమితి: 2017 సెప్టెంబర్ 1 నాటికి 20-28 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, మిగిలిన రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: సీడబ్ల్యూఈ క్లర్క్-7 ద్వారా పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అనే రెండు దశల్లో ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మాజీ సైనికోద్యోగ కేటగిరీల అభ్యర్థులకు రూ.100, మిగిలిన అభ్యర్థులకు రూ.600
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 3, 2017
వెబ్సైట్: www.ibps.in
Authorization