ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈఎన్సీవో- ఎపీజెన్‌కో) 51 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది.
ఖాళీలు: ట్రైనీ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (టీజేఏవో)-26, ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ (టీజేఏ)-25.
వేతన శ్రేణి: టీజేఏవోకు రూ.34,630- రూ.56,760బీ టీజేఏకు రూ.18,725- రూ.34,775.
అర్హతలు: టీజేఏవో పోస్టులకు బీకాం/ఎంకాం/ ఐపీసీసీ (చార్టెర్డ్ అకౌంట్స్)/ ఇంటర్ (కాస్ట్ అకౌంటెంట్స్)/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత, టీజేఏ పోస్టులకు బీఏ/ బీకాం/ బీఎస్సీ/ తత్సమాన విద్యతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2017, అక్టోబర్ 1 నాటికి 34 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేర సడలింపు.
దరఖాస్తు ఫీజు: ఓపెన్ కేటగిరీ/ ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.500 (ఎగ్జామినేషన్ ఫీ- రూ.350+అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ-రూ.150), ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.150 (అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే).
ఎంపిక విధానం: రాతపరీక్ష.
రాతపరీక్ష విధానం: ఇందులో నాలుగు సెక్షన్లు (ఏ,బీ,సీ,డీ) ఉంటాయి. ఈ సెక్షన్లలోని ప్రశ్నలు టీజేఏవో పోస్టులు, టీజేఏ పోస్టులకు వేర్వేరుగా ఉంటాయి. టీజేఏవో పోస్టులకు.. సెక్షన్ 'ఎ'- కోర్ అకడమిక్ కరిక్యులమ్, సెక్షన్ 'బి'-కంప్యూటర్ అవేర్నెస్, సెక్షన్ 'సి'-అనలిటికల్ ఆప్టిట్యూడ్, సెక్షన్ 'డి'- లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ (వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్), టీజేఏ పోస్టులకు.. సెక్షన్ 'ఎ'-న్యూమెరికల్ ఎబిలిటీ, సెక్షన్ 'బి'-లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ (వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్), సెక్షన్ 'సి'- కంప్యూటర్ అవేర్నెస్, సెక్షన్ 'డి'-జనరల్ నాలెడ్జ్ ఉంటాయి.
ప్రతి సెక్షన్లో కనీసం 30 శాతం మార్కులు వచ్చిన వారినే క్వాలిఫైడ్‌గా పరిగణిస్తారు.
రాత పరీక్షలో ఓసీ-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రావాలి.
రాతపరీక్ష మార్కుల మెరిట్, ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష కేంద్రం: విజయవాడ.
దరఖాస్తు విధానం: ఏపీ జెన్కో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2017
రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 12, 2017
వెబ్సైట్: aజూస్త్రవఅషశీ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ
Authorization