1. చంద్రగుప్త మౌర్యుని ప్రధాన మంత్రి? ్స కౌటిల్యుడు
2. చంద్రగుప్తుడు ఏ నంద వంశపు రాజును ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని (కీ.పూ.322)స్థాపించాడు?
్స ధనవంతుడు
3. చంద్రగుప్తునితో ఓడిపోయి సంధి చేసుకున్న విదేశీ రాజు? ్స సెల్యుకస్ నికేటర్
4. మౌర్యసామ్రాజ్యంలో తన రాయబారిగా సెల్యుకస్ నికేటర్ ఎవరిని నియమించాడు? ్స మొగస్తనీస్
5. 'అర్థశాస్త్రాన్ని'రచించిన వాడు ? ్స కౌటిల్యుడు
6. మొగస్తనీస్ రచించిన గ్రంథం ? ్స ఇండికా
7. సుదర్శన తటాకాన్ని తవ్వించినవాడు?
్స చంద్రగుప్తుడు
8. చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతం(ఉపవాసం) ఆచరించి ఎక్కడ మరణించాడు? ్స శ్రావణ బెళగొళ
9. చంద్రగుప్తుడు అవసాన దశలో నమ్మిన మతం?
్స జైనమతం
10. అశోకుడు కలింగ రాజ్యంతో ఎక్కడ యుద్ధం చేశాడు?
్స థౌలీ(ఒరిస్సా, క్రీ.పూ.261)
11. అశోకుని బౌద్ధమత గురువు? ్స ఉపగుప్తుడు
12. అశోకుడు బౌద్ధమతం స్వీకరించడానికి కారణం?
్స కళింగ యుద్ధంలోని హింస
13. అశోకుడు ధర్మప్రచారం కోసం ప్రత్యేకంగా నియమించిన ఉద్యోగులు? ్స ధర్మమహామాత్యులు
14. అశోక చక్రవర్తి బిరుదులు ?
్స దేవానాంప్రియా, ప్రియదర్శిని
15. కాశ్మీర్ రాజధానికి శ్రీనగర్‌ను నిర్మించినవారు?
్స అశోకుడు
16. గంగ-సోన్ నది సంగమం వద్ద అతిపెద్ద రాజ ప్రాసాధాన్ని అశోకుడు ఏ నగరంలో నిర్మించాడు?
్స పాటలీపుత్ర
17. భారత ప్రభుత్వం రాజ చిహ్నంగా గ్రహించిన నాలుగు సింహాల బొమ్మ అశోకుడు చెక్కించిన స్థూపం ఏది?
్స సారనాథ్
18. పాటలీపుత్రంలో బౌద్ధమహాసభను నిర్వహించిన వారు? ్స అశోకుడు
19. మౌర్యవంశపు చివరిరాజు ? ్స బృహద్రదుడు
20. 'ముద్రారాక్షసం' గ్రంథకర్త? ్స విశాఖదత్తుడు
21. చంద్రగుప్తుడు తవ్వించిన సుదర్శన తటాకం ఎక్కడ ఉంది? ్స గుజరాత్
22. అశోకుడు చెక్కించిన స్థూపాల్లో మిక్కిలి ప్రసిద్ధి గాంచింది? ్స సాంచీ'స్థూపం'
23. పాటలి పుత్రాన్ని వర్ణించిన గ్రీకు రచయిత?
్స మొగస్తనీస్ (ఇండికా)
24. శాతవాహన రాజ్యాన్ని స్థాపించినవాడు?
్స శ్రీముఖ శాతవాహనుడు
25. శ్రీముఖుడు ఏ మగధ రాజును ఓడించి శాతవాహన రాజ్యాన్ని నెలకొల్పాడు? ్స సుశర్మ కన్వా
26. శాతవాహనుల రాజధానులు?
్స ప్రతిష్టానపురం(పైఠాన్),
ధాన్యకటకం(అమరావతి)
27. 'నానాఘాట్ శాసనం'ఏశాతవాహన రాజును ఎక్కువగా ప్రస్తావించింది? ్స మొదటి శాతకర్ణి
28. మొదటి శాతకర్ణి బిరుదు? ్స దక్షిణ పథాపతి
29. సారస్వత వికాసం ఏ శాతవాహన రాజు కాలంలో జరిగింది? ్స హాలుడు
30. హాలుడు రచించిన గ్రంథం ? ్స గాథా సప్తశతి
31. శర్వవర్మ రచించిన వ్యాకరణ గ్రంథం? ్స కాలంత్రం
32. గుణాడ్యుడు రచించిన'బృహత్కథ' ఏ భాషలో ఉంది?
్స ప్రాకృత భాష
33. 'నాసిక్ శాసనం' ఎవరి విజయాలను కీర్తించింది?
్స గౌతమీపుత్ర శాతకర్ణి
34. శాతవాహనులు ఎక్కువ పన్నులను ప్రజల నుంచి ఏ రూపంలో వసూలు చేసేవారు? ్స ధన రూపంలో
35. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని ఆహారాలు విభజించారు. ఆహారినికి అధిపతి?
్స మహామాత్రుడు
36. '' ఆరోగ్య మంజరి' అనే గ్రంథాన్ని రచించినవారు?
్స నాగార్జునుడు
37. పశ్చిమ తీరంలో శాతవాహనుల ముఖ్యరేవు పట్టణాలు? ్స భరుకచ్ఛం, సోపార, కళ్యాణి
38. తీర్పుతీరంలోని శాతవాహనుల ముఖ్యరేవు పట్టణాలు?
్స మైసోలియా(మచిలీపట్నం), ఘంటసాల
39. ఆంధ్రుల గురించి మొదటగా పేర్కొన్న గ్రంథం?
్స ఐతరేయబ్రాహ్మణం
40. నానాఘాట్ శాసనాన్ని వేయించినవారు? ్స నాగనిక
41. శాతవాహన రాజ్యం ప్రధాన ఆదాయ వనరు?
్స భూమిశిస్తు
42. శాతవాహనుల మొదటి రాజధాని?
్స ప్రతిష్టానపురం(పైఠాన్)
43. శాతవాహనుల కాలంలో గ్రామ పాలనను నిర్వహించిన వారు? ్స గ్రామికుడు
44. పారశీకులు అంటే? ్స ఇరానీయన్లు
45. వాయువ్య భారతదేశాన్ని మొదటిగా జయించిన పర్షియన్ చక్రవర్తి? ్స సైరస్
46. అలెగ్జాండర్ భారత దండయాత్ర చేసిన సంవత్సరం?
్స క్రీ.పూ 327
47. మాసిడోనియా రాజు అయిన అలెగ్జాండర్ ఏ దేశస్థుడు? ్స గ్రీకు
48. ఏ ప్రాంతాలను జయించాలని అలెగ్జాండర్ భారత దండయాత్ర చేశాడు? ్స ఆసియామైనర్
49. అలెగ్జాండర్‌కు లొంగిపోయిన తక్షశిల రాజు ?
్స అంభి
50. అలెగ్జాండర్‌తో వీరోచితంగా పోరాడి ఓడిన రాజు?
్స పురుషోత్తముడు(పోరస్)
51. అలెగ్జాండర్ ఎక్కడ చనిపోయాడు?
్స బాబిలోనియా(కీ.పూ.324)
52. అలెగ్జాండర్ మరణం తర్వాత స్వతంత్రం ప్రకటించు కున్న గ్రీకు సైనిక సేనాని ? ్స సెల్యుకస్ నికేటర్
53. పురుషోత్తముని రాజ్యం ఏ ఏ నదుల మధ్య ఉంది?
్స జీలం, చీనాబ్
54. పాటలీపుత్రాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తారు?
్స పాట్నా(బీహార్)
55. 'షాడోశ మహా జనపదాల్లోని ఏ రాజ్యం విలీనమవడం వల్ల మగధ బలమైన రాజ్యంగా ఏర్పడింది? ్స కోసల
56. మొదటి మగధ రాజధాని నగరం ?
్స రాజగృహ(గిరి వ్రజపురం)
57. నూతన రాజధాని 'పాటలీపుత్రం'ను నిర్మించిన వారు?
్స అజాతశత్రువు
58. హర్యాంక వంశం పేరుతో మగధ సింహాసనాన్ని అధిష్టించినవారు? ్స బింబిసారుడు
59. గౌతమ బుద్ధుడి సమకాలీకుడైన మగధ రాజు?
్స బింబిసారుడు
60. వైశాలి నగరాన్ని రాజధానిగా మార్చి మగధను పాలించిన వారు? ్స కాలాశోకుడు
61. ఉగ్రసేనుడనే బిరుదు కలవారు?
్స మహాపద్మానందుడు
62. 'తమిళకం'అంటే ?
్స చేర, చోళ, పాండ్య రాజ్యాల ప్రాంతాలు
63. పాండ్యుల రాజధాని ? ్స మధురై
64. 'నగరం' అంటే ? ్స పాండ్యల రాజులు మధురైలో
ఏర్పాట్లు చేసిన కవి పండిత పరిషత్
65. చేరరాజుల్లో ప్రసిద్ధుడు ? ్స సెంగుత్తవాన్
66. 'ఎర్రచేర' అనే బిరుదు ఉన్న చేరరాజు ?
్స సెంగుత్తవాస్
67. చేరరాజ్యం రాజధాని? ్స వంజి/కరూర్
68. చేరరాజ్యం వర్థిల్లిన ప్రాంతం? ్స కేరళ
69. ప్రాచీన చోళ వంశ స్థాపకుడు ? ్స ఎలార
70. చోళ వంశీయుల్లో గొప్పవాడు ? ్స కరికాలుడు
71. సంగుత్తవాన్ విజయాల గురించి వర్ణిస్తున్న గ్రంథం?
్స శిలాప్పాధికారం
72. చేర, పాండ్య రాజ్యాలను ఓడించిన వారు?
్స కరికాల చోళ
73. కావేరీ నదికి ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసినవారు? ్స కరికాలుడు
74. పాండ్యుల్లో గొప్పరాజు ? ్స నెడుంజెలిమాన్
75. తొల్కపీయర్ రాసిన తమిళ వ్యాకరణ గ్రంథం?
్స తోల్కప్పీయం
76. ప్రముఖ తమిళ ఇతిహాస గ్రంథాలు, రచయితలు?
్స శిలప్పాధికారం(ఇలాంగో అండిగిల్),
మణిమేఖలై(సుత్తీలై సత్తనార్)
77. 'జీవన చింతామణి' అనే వైద్య గ్రంథాన్ని రచించినవారు? ్స తిరుత్తక్కదేవార్
78. కుషాణుల్లో గొప్పవాడు? ్స కణిష్కుడు
79. మధ్య ఆసియాలోని మూచీ తెగకు చెందినవారు?
్స కుషాణులు
80. శకయుగ ప్రారంభకుడు ? ్స కనిష్కుడు
81. కనిష్కుడి రాజధాని ? ్స పురుషపురం(పెషావర్)
82. ఏ దేశంపై సాధించిన విజయం తర్వాత కనిష్కుడికి 'దైవపుత్ర' అనే బిరుదు లభించింది? ్స చైనా
83. కుషాణ రాజ్యంలో గ్రామపాలనను పర్యవేక్షించిన వారు? ్స గ్రామీక, భద్రపాల
84. ఏ బౌద్ధ పండితుడి ప్రభావం వల్ల కనిష్కుడు పరమత సహనం కలవాడిగా మారాడు? ్స అశ్వగోషుడు
85. కనిష్కుడు ఆచరించిన బౌద్ధమత శాఖ?
్స మహాయానం
86. అశ్వగోషుడు రచించిన కావ్యాలు?
్స బుద్ధచరితం, సౌందర్యానందం
87. చరక సంహితను రచించిన వాడు? ్స చరకుడు
88. కనిష్కుడి ఆస్థానంలోని పండితులు?
్స నాగార్జునుడు, వసుమిత్రుడు, పార్శ్వుడు
Authorization