1. 'ఆంధ్రపాణిని' అనేది ఏ పండితుడి బిరుదు?
ఎ) చిన్నయ సూరి
బి) కందుకూరి వీరేశలింగం
సి) కొక్కొండ వెంకట రత్నం
డి) కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి
2. జాషువా 'శిల్పి' ఖండిక ఖండకావ్యం ఏ భాగం లోనిది?
ఎ) మొదటి భాగం బి) రెండో భాగం
సి) మూడో భాగం డి) అయిదో భాగం
3. జాషువా రచించిన ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది?
ఎ) ఫిరదౌసి బి) నా కథ
సి) గబ్బిలం డి) క్రీస్తుచరిత్ర
4. కిందివాటిలో జాషువా బిరుదు కానిది ఏది?
ఎ) నవయుగ చక్రవర్తి బి) కవికోకిల
సి) కవి సామ్రాట్ డి) విశ్వకవి సామ్రాట్
5. 'కాపుబిడ్డ' అనే ఖండిక రచయిత గంగుల శాయిరెడ్డి ఏ ప్రాంతానికి చెందిన రైతుకవి?
ఎ) రాయలసీమ బి) తెలంగాణ
సి) ఉత్తరాంద్ర డి) కోస్తాంధ్ర
6. 'తెలుగు తల్లి' అనే పదాన్ని తొలిసారి ప్రయోగించిన ఆధునిక తెలుగు కవి ఎవరు?
ఎ) జాషువా
బి) కాళోజీ నారాయణరావు
సి) రాయప్రోలు సుబ్బారావు
డి) దాశరథి రంగాచార్యులు
7. రాయప్రోలు సుబ్బారావు రచించిన 'ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అనే గేయం ఏ కావ్యం లోనిది?
ఎ) లలిత బి) తృణ కంకణం
సి) ఆంధ్రావళి డి) జడకుచ్చులు
8. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలంగాణ కవి ఎవరు?
ఎ) కాళోజీ నారాయణరావు
బి) డాక్టర్ సి. నారాయణరెడ్డి
సి) దాశరథి రంగాచార్యులు
డి) బోయి భీమన్న
9. సినారె రచించిన ఏ కావ్యానికి 1988లో జ్ఞానపీఠ్ అవార్డు లభించింది?
ఎ) కర్పూర వసంతరాయులు
బి) నాగార్జున సాగరం
సి) విశ్వంభర
డి) మట్టి-మనిషి- ఆకాశం
10. తెలంగాణ త్రయంగా ప్రసిద్ధి చెందిన కవులు ఎవరు?
ఎ) దాశరథి - కాళోజీ- బోయి భీమన్న
బి) దాశరథి- కాళోజీ - సి. నారాయణ రెడ్డి
సి) పి.వి. నరసింహారావు- కాళోజీ- దాశరథి
డి) బోయి భీమన్న- కాళోజీ- సి. నారాయణ రెడ్డి
11. కిందివాటిలో దాశరథి రచన కానిది ఏది?
ఎ) అగ్నిధార బి) రుద్రవీణ
సి) అగ్నివీణ డి) మహాంధ్రోదయం
12. 'రానున్నది ఏది నిజం.. అదివొకటే సోషలిజం... కలపండోరు భుజం భుజం... కదలండోరు గజం గజం' అని పలికిన అభ్యుదయ కవి ఎవరు? ఏ కావ్యంలోనివి?
ఎ) శ్రీశ్రీ - మహాప్రస్థానం
బి) ఆరుద్ర - త్వమేవాహం
సి) దాశరథి - రుద్రవీణ
డి) అనిశెట్టి - అగ్నివీణ
13. కిందివాటిలో తెలంగాణకు చెందిన చారిత్రక వీరగాథ ఏది?
ఎ) పలనాటి చరిత్ర బి) బొబ్బిలి వీరుల కథ
సి) కాంభోజ రాజు కథ డి) రాణీ శంకరమ్మ కథ
14. కిందివాటిలో చిన్నయ సూరి రచించిన గ్రంథం ఏది?
ఎ) నీతి చంద్రిక బి) బాలవ్యాకరణం
సి) శబ్ద లక్షణ సంగ్రహం డి) పైవన్నీ
15. తొలి తెలుగు కావ్యం 'యయాతి చరిత్ర'కు మూలం ఏది?
ఎ) వ్యాస భారతం
బి) నన్నయ భారతం(అరణ్యపర్వం)
సి) నన్నయ భారతం(ఆదిపర్వం)
డి) నన్నయ భారతం(సభాపర్వం)
16. విజయ విలాస కావ్యానికి 'హృదయోల్లాసవ్యాఖ్య' రచయిత ఎవరు?
ఎ) ఆరుద్ర
బి) కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి
సి) తాపీ ధర్మారావు
డి) వేదం వెంకట రాయశాస్త్రి
17. కొరవి గోపరాజు జన్మస్థానం ఏది?
ఎ) వరంగల్ బి) నిజామాబాద్
సి) కరీంనగర్ డి) నల్లగొండ
18. 'సింహాసన ద్వాత్రింశక' కృతిపతి ఎవరు?
ఎ) హరి బి) హరుడు
సి) మాచల్దేవి డి) హరిహర నాథుడు
19. తెలగు జానపద గేయ సాహిత్యం సిద్ధాంత గ్రంథకర్త ఎవరు?
ఎ) ఆచార్య బి.రామరాజు
బి) డాక్టర్ నాయని కృష్ణకుమారి
సి) డాక్టర్ ఆర్.వి.ఎస్.సుందరి
డి) డాక్టర్ గోపు లింగారెడ్డి
20. స్త్రీల రామాయణ పాటల సంకలన కర్త ఎవరు?
ఎ) డాక్టర్ నాయని కృష్ణకుమారి బి) కృష్ణశ్రీ
సి) ఆచార్య యశోదా రెడ్డి
డి) డాక్టర్ సుమతీ నరేంద్ర
21. 'తెలుగు హరికథా సర్వస్వం' అనే పరిశోథనా గ్రంథకర్త ఎవరు?
ఎ) ఆదిభట్ల నారాయణదాసు
బి) ఆచార్య తూమాణి దోణప్ప
సి) ఆచార్య ఎస్.వి. జోగారివు
డి) ఆచార్య ఆర్.వి.ఎస్.సుందరం
22. 'రేనాటి సూర్య చంద్రులు' గ్రంథకర్త ఎవరు?
ఎ) ఆచార్య బి. రామరాజు
బి) ఆచార్య ఎస్.గంగప్ప
సి) ఆచార్య తంగారాల వేంకట సుబ్బారావు
డి) కృష్ణశ్రీ
23. బాలనాగమ్మ కథలో ప్రధాన రసం ఏది?
ఎ) కరుణం బి) వీరం
సి) అద్భుతం డి) బీభత్సం
24. చిన్నయసూరి నీతి చంద్రిక గ్రంథ కృతిభర్త ఎవరు?
ఎ) సి.పిబ్రౌన్ బి) కల్నల్ మెకంజీ
సి) ఎ.జె.అర్బత్నాట్దొర డి) కూల్డ్రేదొర
25. కిందివాటిలో జానపదోచ్ఛారణలో ఒక లక్షణం ఏది?
ఎ) ఒత్తులు నిలపడం
బి) శ, షలు సకారంగా మారడం
సి) సంయుక్త హల్లులు నిలపడం
డి) హకారం నిలపడం
26. ఒకే అంకం ఉండే రూపక బేధం ఏది?
ఎ) ఈహామృగం బి) ప్రకరణం
సి) భాణం డి) సమవకారం
27. కల్పిత కథ అనేక పాత్రలు, వివిధ సంఘటనలతో కూడిన దీర్ఘమైన వచన రచనను ఏమంటారు?
ఎ) కథానిక బి) వ్యాసం
సి) గల్పిక డి) నవల
28. 'కవి అవిస్పష్ట వాంఛాంకురం, ఒక అంతర్నిగూడ తాపం ఒక చిన్న కావ్యంలో ఊదబడినచో అదిభావ కవిత్వం' అని నిర్వచించిన విమర్శకుడు?
ఎ) విశ్వనాథ సత్యనారాయణ
బి) దేవులపల్లి కృష్ణశాస్త్రి
సి) రాయప్రోలు సుబ్బారావు
డి) సి.నారాయణ రెడ్డి
29. కథ, కథనానికి ప్రాధాన్యం ఉన్న సాహిత్య ప్రక్రియ?
ఎ) ఇతిహాసం బి) పురాణం
సి) కావ్యం డి) వచన కవిత
30. కథానిక రచనలో భాగాలు ఏవి?
ఎ) ఎ) సమకాలీన సమాజం, సంస్కృతి, నాగరికత
బి) పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ
సి) తార్కికత, శాస్త్రీయత, సాదృశ్య సంబంధాలు
డి) మనస్తత్వ చిత్రణ, సంభావ్యత, కాల్పనికత
31. సంపాదకులు, ప్రత్యేక వ్యాసకర్తలు పత్రికలకు రాసే వాటిని ఏమంటారు?
ఎ) వార్తలు బి) సంపాదకీయాలు
సి) వార్తా వ్యాఖ్యానాలు డి) ప్రకటనలు
32. పీఠిక అంటే?
ఎ) పుస్తక రచయిత ఆత్మ నివేదన
బి) పాఘకుల ప్రశంసాపూర్వకలేఖ
సి) పుస్తక రచయిత గ్రంథం గురించి రాసే ప్రచార ప్రకటన
డి) గ్రంథం, దాని నేపథ్యం పరిచయం చేస్తూ రచయిత లేదా మరొకరు రాసే వాక్యాలు
33. ఒక వ్యక్తి తాను రాసుకున్న కథే అయినా సమాజ జీవితాన్ని ప్రతిబింబించేది ఏది?
ఎ) స్వీయ చరిత్ర బి) జీవితచరిత్ర
సి) దినచర్య డి) నవల
34. బిరుదురాజు రామరాజు పరిశోధించిన సాహిత్యం ?
ఎ) జానపద సాహిత్యం
బి) ఆధునిక సాహిత్యం
సి) గేయసాహిత్యం
డి) ఉర్దూసాహిత్యం
35. ఆత్మాశ్రయం, మానవతావాదం, దార్శనిక దృక్పథం, స్త్రీల ఉదాత్తత, వారి ఆత్మగుణ సౌందర్యాల వర్ణన అనే లక్షణాలు ఉన్న కవిత్వం ఏది?
ఎ) భావ కవిత్వం బి) విప్లవ కవిత్వం
సి) దిగంబర కవిత్వం డి) ఉద్యమ కవిత్వం
36. అభ్యుదయ సాహిత్యోద్యమం సాహితీ లోకాన్ని ప్రేరేపించి పథనిర్దేశం చేసిన విధం?
ఎ) భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గుర్తుకు తేవడం
బి) సామాజిక స్పృహ, సవిమర్శక వాస్తవికత, సమసమాజ కాంక్ష పెంపొందించడం
సి) దేశీయ, విదేశీ విజ్ఞాన సంపదను గుర్తుకు తేవడం
డి) సభ్య సమాజంలో మమేకం
37. 'కబ్బ మొకటె పూని గడగడ చదివిన
లోనియర్దమెట్లు తానెఱుంగు
ఎఱుకమాలు చదవులేటికో తెల్పరా' అని పలికిన కవి?
ఎ) బద్దెన బి) వేమన
సి) కాసె సర్వప్ప డి) కవిచొడప్ప
38. 'నన్నయ్యను నరేంద్రుని బొందిలోనే నిద్రపోనియ్యి' అని వ్యాఖ్యానించిన దిగంబర కవి ఎవరు?
ఎ) జ్వాలాముఖి బి) నగముని
సి) నిఖిలేశ్వర్ డి) మహాస్వప్న
39. అనుభూతి కవుల్లో ప్రముఖులు ఎవరు- ఆయన రచన?
ఎ) దేవరకొండ బాలగంగాధర తిలక్- అమృతం కురిసిన రాత్రి
బి) ఆరుద్ర - త్వమేవాహం
సి) సోమసుందర్ - వజ్రాయుధం
డి) శ్రీశ్రీ - మహాప్రస్థానం
40. దళితులను పాత్రలుగా చిత్రించిన ప్రముఖ నవలలు?
ఎ) వేయిపడగలు- హౌస్ సర్జన్
బి) రాజశేఖర చరిత్ర- నారాయణరావు
సి) హేలావతి - మాలపల్లి
డి) గబ్బిలం - నిరుద్ద భారతం
41. విశిష్ట దృక్పథానికి మార్గదర్శకంగా కట్టమంచి రామలింగారెడ్డి రచించిన సాహిత్య విమర్శ గ్రంథం ఏది?
ఎ) విత్వతత్త్వ విచారం
బి) అలంకార తత్త్వం
సి) తెలుగలో కవితా విప్లవాల స్వరూపం
డి) కవిత్వ తత్త్వ విచార విమర్శనం
42. అప్పగింత పాటలు, అలుక పాటలు ఏ జానపద శాఖకు చెందిన గేయాలు?
ఎ) పారమార్థిక గేయాలు
బి) శ్రామిక గేయాలు
సి) స్త్రీల పాటలు
డి) బాలగేయాలు
43. కందుకూరి వీరేశలింగం 'సత్యరాజా పూర్వ దేశయాత్ర' కు ఆధారమైన ఆంగ్ల రచన?
ఎ) గలివర్స్ ట్రావెల్స్
బి) డాన్ క్విక్జోట్
సి) కాంటర్బరీ టేల్స్
డి) పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్
44. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ వ్యాస సంపుటాలు ఏవి?
ఎ) నాటకోపన్యాసాలు సారస్వతా లోకం
బి) వ్యాస మంజరి, పంచరి
సి) సారస్వత నీరాజనం, వ్యాసవాహిని
డి) గౌతమీవ్యాసాలు, సాహిత్య దర్శనం
సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.సి 5.బి
6.సి 7.సి 8.బి 9.సి 10.బి
11.సి 12.సి 13.డి 14.డి 15. సి
16.సి 17.సి 18.డి 19.ఎ 20.బి
21.బి 22.సి 23.సి 24.సి 25.బి
26.సి 27.డి 28.ఎ 29.ఎ 30.బి
31.బి 32.డి 33.ఎ 34.ఎ 35.ఎ
36.బి 37.బి 38.సి 39.ఎ 40.సి
41.ఎ 42.సి 43.ఎ 44.ఎ
Authorization