1) కింది వాటిని జత పరచండి
సరిహద్దు నది దేశాలు
1) ఆముర్ పి) రష్యా-చైనా
2) ఆరెంజ్ క్యూ) దక్షిణాఫ్రికా-నమీబియా
3) రియోగ్రాండ్ ఆర్) మెక్సికో-అమెరికా
4) ఓడర్ ఎస్) జర్మనీ-పోలెండ్
ఎ) 1-ఎస్, 2-క్యూ, 3-ఆర్, 4-పి
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4- ఎస్
సి) 1-క్యూ, 2-ఆర్, 3-పి, 4-ఎస్
డి) 1-ఆర్, 2- క్యూ, 3-ఎస్, 4-పి
2) భారత దేశంలోని ఎక్కువ శాతం నీరు ఏ సముద్రం లో కలుస్తుంది?
ఎ) అరేబియా సముద్రం
బి) బంగాళా ఖాతం
సి) హిందూ మహా సముద్రం డి) ఎ, సి
3) కిందివాటిలో సరైనవి తెలపండి
1. సింధు ఉపనదుల్లో పొడవైనది - సట్లేజ్
2. మూడు దేశాల్లో ప్రవహించే ఏకైక ఉప నది - సట్లేజ్
3. టిబెట్ రాసాసి సరస్సు నందు జన్మించే నది - సట్లేజ్
4. షిప్కిలా కనుమ గుండా భారత్‌లో ప్రవేశించే సింధు ఉపనది - సట్లేజ్
ఎ) 2,3,4 బి) 1,4
సి) 1,2,3 డి) పైవన్నీ సరైనవి
4) సరికానిది గుర్తించండి.
నది జన్మస్థానం
ఎ) తుంగభద్ర వరాహ పర్వతాలు
బి) మూసి అనంతగిరి గుట్టలు
సి) పెన్నా నంది దుర్గ కొండలు
డి) స్వర్ణముఖి బ్రహ్మగిరి కొండలు
5) వరల్డ్ రివర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) మే 2వ ఆదివారం
బి) జులై మొదటి శనివారం
సి) సెప్టెంబర్ చివరి ఆదివారం
డి) నవంబర్ 3వ శనివారం
6) రెండు నదుల మధ్య ఉన్న నగరం ?
ఎ) వారణాసి బి) హౌరా
సి) లక్నో డి) అయోధ్య
7) కింది వాటిని జత చేయండి?
పట్టిక 1 పట్టిక 2
1. బెంగాల్ దు:ఖ దాయిని పి) దామోదర్
2. బీహార్ దు:ఖ దాయిని క్యూ) కోసి
3. అసోం దు:ఖ దాయిని ఆర్) బ్రహ్మపుత్ర
ఎ) 1-క్యూ, 2-పి, 3-ఆర్
బి) 1-ఆర్, 2-క్యూ, 3-పి
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్
డి)1-ఆర్, 2-పి, 3-క్యూ
8) శివసముద్రం, హోగైనెక్కల్ జలపాతాలు ఏ నదిపై ఉన్నాయి?
ఎ) సువర్ణరేఖ బి) మహి
సి) దామోదర్ డి) కావేరి
9) కింది వాటిలో అతి తరుణ నదిగా పిలిచే నది?
ఎ) సింధు బి) గంగ
సి) కృష్ణ డి) గోదావరి
10) కింది వాటిని జత చేయండి
నది కలిసే ప్రాంతం
1. నైలు పి) మధ్యధరా సముద్రం
2. అమెజాన్ క్యూ) దక్షిణ అట్లాంటిక్
3. మిసిసిపి ఆర్) మెక్సికో సింధు శాఖ
4. లీనా ఎస్) ఆర్కిటిక్ మహాసముద్రం
ఎ) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
బి) 1-ఎస్, 2-క్యూ, 3-ఆర్, 4-పి
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
డి) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
11) కృష్ణరాజసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు?
ఎ) కావేరి బి) కృష్ణ
సి) తుంగభద్ర డి) శరావతి
12) తిలయ, మైదాన్, కోనారు డ్యాంలు ఏ ప్రాజెక్టుకు చెందినవి?
ఎ) చంబల్ ప్రాజెక్టు
బి) మయురాక్షి ప్రాజెక్టు
సి) రిహుడ్ డ్యాం
డి) దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు
13) కావేరి నది జల వివాదంలో ఉన్న ప్రముఖ రాష్ట్రాలు?
ఎ) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్
బి) తమిళనాడు - కేరళ
సి) కేరళ - కర్ణాటక
డి) తమిళనాడు - కర్ణాటక
14) తెలుగు గంగ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య విస్తరించి ఉంది?
ఎ) ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు
బి) కర్ణాటక - తెలంగాణ
సి) తెలంగాణ - మహారాష్ట్ర
డి) ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక
15) ఇందిరాగాంధీ కాలువకు నీరందించే ఒక నది?
ఎ) సట్లేజ్ బి) తపతి
సి) కావేరి డి) నర్మద
16) క్రింది వాటిలో అంతర్జాతీయ ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించండి.
1. చంబల్ 2. గండక్
3. కోసి 4. రామ్‌గంగా
ఎ) 1,2 బి) 2,3
సి) 3,4 డి) 1,4
17) మన దేశంతో పాటు కోసి పథకం వల్ల ప్రయోజ నాన్ని పొందుతున్న మరో దేశం
ఎ) భూటాన్ బి) బర్మా
సి) బంగ్లాదేశ్ డి) నేపాల్
18) నీటి పారుదల సాంద్రత ఎక్కువ గల రాష్ట్రం
ఎ) మహారాష్ట్ర బి) తెలంగాణ
సి) పంజాబ్ డి) హర్యానా
19) సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందుతున్న రెండు రాష్ట్రాలను తెలపండి?
1. గుజరాత్ 2. మధ్యప్రదేశ్
3. హర్యానా 4.పంజాబ్
ఎ) 1,2 బి) 2,3
సి) 1,4 డి) 2,4
20) హోగైనక్కల్ ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదం?
ఎ) కేరళ - తమిళనాడు
బి) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్
సి) కార్ణాటక - మహారాష్ట్ర
డి) కర్ణాటక - తమిళనాడు
21) రావి నదిపై గల ప్రాజెక్టును తెలపండి?
ఎ) ధీన్డ్యాం
బి) పల్లివసల్ ప్రాజెక్టు
సి) కొయానా ప్రాజెక్టు
డి) మెట్టూరు డ్యాం
22. సరైన ప్రవచనాన్ని తెలపండి?
ప్రవచనం1: వార్థా- గోదావరి నదికి ఉపనది
ప్రవచనం2: కాబూల్- సింధూనదికి ఉపనది
ఎ) 1, 2 సరైనవి
బి) 1, 2 సరైనవి కావు
సి) 2 మాత్రమే సరైనది
డి) 1 మాత్రమే సరైనది.
23) కింది వాటిని జత పరచండి
ప్రాజెక్టు రాష్ట్రం
1. సలాల్ ప్రాజెక్టు పి) జమ్మూ కాశ్మీర్
2. జయక్ వాడి ప్రాజెక్టు క్యూ) మహారాష్ట్ర
3. తావా ప్రాజెక్టు ఆర్) మధ్యప్రదేశ్
4. పల్లివసల్ ప్రాజెక్టు ఎస్) కేరళ
ఎ) 1-ఎస్, 2-క్యూ, 3-ఆర్, 4-పి
బి) 1-క్యూ, 2-ఎస్, 3-పి, 4-ఆర్
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
డి) 1-ఆర్, 2-పి, ఆ-3-ఎస్, 4-క్యూ
24) కలకత్తా నౌకాశ్రయం కొరకు నిర్మించిన ప్రాజెక్టు ?
ఎ) మయూరాక్షి బి) ఫరక్కా
సి) కాంగ్ సబాతి డి) దామోదర్‌వ్యాలీ
25) డ్యాం - 999 అనే సినిమా ఏ ప్రాజెక్టు ప్రధానాం శంగా నిర్మించారు?
ఎ) ముల్ల పెరియార్ ప్రాజెక్టు
బి) తెహ్రీ డ్యాం
సి) భాక్రానంగల్ ప్రాజెక్టు
డి) బాగ్లీహార్ డ్యాం
26) మేధాపాట్కర్ ఏ ప్రాజెక్టును వ్యతిరేకించింది?
ఎ) సర్దార్ సరోవర్ డ్యాం
బి) ఆల్మట్టి డ్యాం
సి) భాక్రానంగల్ ప్రాజెక్టు
డి) మయూరాక్షి ప్రాజెక్టు
27) సట్లెజ్ నదిపై గల ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్టు?
ఎ) ఉకారు ప్రాజెక్టు
బి) సలాల్
సి) ధూల్ హస్తి
డి) నాధ్పా జాక్రి
28) దేశంలో మొదటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ?
ఎ) బాబ్లీ ప్రాజెక్టు
బి) తిపయిముఖ్ ప్రాజెక్టు
సి) దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు
డి) హీరాకుడ్ ప్రాజెక్టు
29) ఇండియా, పాకిస్థాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1960 బి) 1965
సి) 1970 డి) 1975
30) సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం భారత్ ఏ నదుల జలాలను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు?
ఎ) సింధు, జీలం, రావి
బి) సింధు, బియాస్, సట్లేజ్
సి) బియాస్, సట్లేజ్, రావి
డి) జీలం, చినాబ్
31) సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం భారత్ ఏ నదీ జలాలను తక్కువగా ఉపయోగించుకోవాలి?
ఎ) బియాస్, జీలం, చినాబ్
బి) చినాబ్, జీలం, సింధు
సి) జీలం, రావి, సట్లేజ్
డి) సట్లేజ్, చినాబ్, రావి
32) ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుననుసరించి తమిళ నాడు, కర్ణాటకకు ఎన్ని టీఎంసీల కావేరి నదీ జలాలు కేటాయించారు?
1. తమిళనాడు - 419 టీఎంసీలు
2. కర్ణాటక 270 టీఎంసీలు
3. తమిళనాడు 404.25 టీఎంసీలు
4. కర్ణాటక 284.75 టీఎంసీలు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) 2, 4
33. కన్హాజాతీయ పార్కు చేరువులో ఉన్న నది?
ఎ) సోన్ బి) కోసి
అలకనంద డి) బెట్యా
34. బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు సుమారుగా ఎంత?
ఎ) 2500 కి.మీ బి) 2650 కి.మీ
సి) 2900 కి.మీ డి) 3, 250 కి.మీ
35. పెన్‌గంగా, వెన్‌గంగా, వార్దా నదుల కలయికతో ఏర్పడిన నది?
ఎ) ప్రాణహిత బి) మహానది
సి) మంజీర డి) వంశదార
36. నర్మద నదికి సంబంధించి సరికానిది ఏది?
1) పగుల లోయ గుండా ప్రవహిస్తుంది
2) మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ల గుండా ప్రవహిస్తుంది.
3) పశ్చిమ దిశలోని అరేబియా సముద్రంలో కలిసే నదులలో అతి పెద్దది.
4) కపిల ధార, ధువన్ థార్, మార్బుల్, ఈ నది ఏర్పరిచే జలపాతాలు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 4 డి) పైవన్నీ సరైనవి
37) తమిళనాడు - కేరళ మధ్య వివాదస్పద ప్రాజెక్టు
ఎ) మెట్టూరు బి) ముళ్లపెరియార్
సి) ఇడుక్కి డి) శబరిగిరి
సమాధానాలు
1.బి 2.బి 3.డి 4.డి 5.సి
6.ఎ 7.సి 8.డి 9.బి 10.సి
11.ఎ 12.డి 13.డి 14.ఎ 15.ఎ
16.బి 17.డి 18.సి 19.ఎ 20.డి
21.ఎ 22.ఎ 23.సి 24.బి 25.ఎ
26.ఎ 27.డి 28.సి 29.ఎ 30.సి
31.బి 32.సి 33.డి 34.సి 35.ఎ
36.డి 37.బి
- జి.ఉపేందర్
హైదరాబాద్
ఫోన్ : 9676669049
Authorization