1. సమ్మక్క - సారక్క జాతరలో దేవతలకు బంగారం పేరుతో ఏమి సమర్పిస్తారు?
ఎ) బెల్లం బి) పూలు
సి) పండ్లు డి) వస్త్రాలు
2. పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అన్నదెవరు?
ఎ) దాశరథి బి) సురవరం
సి) కాళోజీ డి) దేవులపల్లి
3. బుక్కపట్నం రామానుజాచార్యులు నిర్వహించిన తెలంగాణ తొలి దినపత్రిక ఏది?
ఎ) మషీర్-ఎ-దక్కన్ బి) మాతృభూమి
సి) ఇమ్రోజ్ డి) తెలంగాణ
4. తన 'కాశీయాత్ర చరిత్ర' గ్రంథంలో మొహర్రం పండుగ గురించి ప్రస్తావించిన రచయిత?
ఎ) ఏనుగుల వీరస్వామయ్య బి) చందాల కేశవదాసు
సి) ధర్మవరపు సీతారాం డి) దాశరథి రంగాచార్య
5. బోనాల పండుగనాడు అమ్మవారి విగ్రహం ముందు బియ్యం పిండిలో పసుపు కలిపి సంప్రదాయ పద్ధతి లో ముగ్గులు వేయడాన్ని ఏమంటారు?
ఎ) సాక బి) రంగం సి) పటం డి) ఊరడి
6. గిరిజనుల ప్రముఖ పండుగైన తీజ్ పండుగను ఏ నెలలో జరుపుకుంటారు?
ఎ) శ్రావణం బి) కార్తీకం సి) చైత్రం డి) ఆషాడం
7. 'శోభ' అనే సాహిత్య పత్రిక వరంగల్ నుంచి ఎవరి సంపాదకత్వంలో వెలువడేది?
ఎ) దేవులపల్లి రామానుజరావు
బి) పి.వి.నరసింహారావు
సి) విశ్వనాథ సత్యనారాయణ
డి) కాళోజీ నారాయణరావు
8. గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
ఎ) ఆదిలాబాద్ బి) ఖమ్మం
సి) నల్లగొండ డి) వరంగల్
9. ఇక్కత్ అనే కళారూపం విశిష్టత?
ఎ) పోచంపల్లి వస్త్రాలపై డిజైన్
బి) నిర్మల్ కొయ్యబొమ్మల కథ
సి) పెంబర్తి ఇత్తడి ముడి వస్తువు డి) ఏదీకాదు
10. గరగ నృత్యాన్ని ఏ పండుగ సందర్భంగా వీధుల్లో ప్రదర్శిస్తారు?
ఎ) మొహర్రం బి) బతుకమ్మ
సి) బోనాలు డి) ఉర్సు
11. 2008లో ఏర్పాటైన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన పండుగ?
ఎ) బతుకమ్మ బి) బోనాలు
సి) సమ్మక్క-సారక్క డి) మొహర్రం
12. తెలంగాణలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం?
ఎ) భ్రమరాంబ బి) జోగులాంబ
సి) మహంకాళి డి) పరమేశ్వరి
13. వాత్సాయన కామసూత్రాల్లో ఏ శాతవాహన చక్రవర్తి ప్రస్తావన ఉంది?
ఎ) శ్రీముఖుడు బి) పులోమావి
సి) కుంతల శాతకర్ణి డి) ఖారవేలుడు
14. తెలుగులో తొలి యక్షగానమైన సుగ్రీవ విజయం రాసింది?
ఎ) అద్దంకి గంగాధరుడు బి) పొన్నగంటి తెలగన్న
సి) కందుకూరి రుద్రకవి డి) సారంగు తమ్మయ్య
15. శతపత్రం అనేది ఏ తెలంగాణ కవి ఆత్మకథ?
ఎ) గడియారం రామకృష్ణ శర్మ
బి) కాళోజీ నారాయణరావు
సి) సామల సదాశివ డి) సురవరం ప్రతాపరెడ్డి
16. నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన తెలంగాణ కళారూపం ఏది?
ఎ) బుర్రకథలు బి) శారదా కథలు
సి) వేదాంత కథలు డి) గొల్ల సుద్దులు
17. హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎవరి నివాసంలో ఏర్పాటు చేశారు?
ఎ) కొమర్రాజు లక్ష్మణరావు బి) ఉన్నవ లక్ష్మీనారాయణ
సి) ఆదిపూడి సోమనాథరావు డి) రావిచెట్టు రంగారావు
18. తెలంగాణలో రెండో అతి పెద్దదైన గొల్లగట్టు జాతర కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఇక్కడి దైవం లింగమంతుల స్వామి
బి) దీనినే పెద్దగట్టు జాతర అని కూడా పిలుస్తారు
సి) ఇది సూర్యాపేట జిల్లాలో ఉంది
డి) పైవన్నీ సరైనవే
19. పూర్వ కాలంలో రంజు కళాకారులు ఎవరిని యాచించి జీవనం గడిపేవారు?
ఎ) రెడ్లు బి) వెలమలు
సి) విశ్వబ్రాహ్మణులు డి) వైశ్యులు
20. 'గుడిసెలు కాలిపోతున్నాయి' అనే రచన ద్వారా జాతీయ పురస్కారం పొందిన తెలంగాణ కవి?
ఎ) సి.నారాయణరెడ్డి బి) బోయి భీమన్న
సి) కోదాటి నారాయణరావు
డి) ఉన్నవ లక్ష్మీనారాయణ
21. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి సరైన అంశం ఏది?
ఎ) ఇది భూపాలపల్లి జిల్లా మేడారం గ్రామంలో జరుగుతుంది
బి) ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర
సి) రెండేండ్లకొకసారి మాఘశుద్ధి పౌర్ణమి రోజున నిర్వహిస్తారు డి) పైవన్నీ సరైనవే
22. దళిత బోయ జంగయ్య రాసిన ఏ కావ్యానికి శ్రీశ్రీ స్మారక పురస్కారం లభించింది?
ఎ) జాతర బి) జగడం
సి) హెచ్చరిక డి) గొర్రెలు
23. కింది వాటిలో తెలంగాణలో భౌగోళిక సూచిక గుర్తింపు మొదట పొందింది ఏది?
ఎ) పెంబర్తి ఇత్తడి కళ బి) హైదరాబాద్ బిర్యానీ
సి) హలీం డి) పోచంపల్లి వస్త్రాల డిజైన్
24. జాయపసేనాని రాసిన నృత్య రత్నావళిలోని భంగి మల శిల్పాలు ఏ దేవాలయంలో కనిపిస్తాయి?
ఎ) రామప్ప దేవాలయం బి) వేయి స్తంభాల గుడి
సి) వేములవాడ దేవాలయం
డి) బాసర సరస్వతి ఆలయం
25. తెలంగాణలో అత్యధికంగా ఉన్న గిరిజన తెగ?
ఎ) కోయలు బి) లంబాడీలు
సి) చెంచులు డి) గోండులు
26. తెలుగు వారి తొలి విజ్ఞాన సర్వస్వంగా గుర్తింపొం దిన పాల్కురికి సోమనాథుని రచన?
ఎ) బసవ పురాణం బి) పండితారాధ్య చరిత్ర
సి) అనుభవ సారం డి) చతుర్వేద సారం
27. కాకతీయ రుద్రదేవుడు నీతిసారం గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు?
ఎ) తెలుగు బి) సంస్కృతం
సి) కన్నడం డి) ప్రాకృతం
28. తెలంగాణలో తొలి రైతు కావ్యం కాపుబిడ్డను రాసింది ఎవరు?
ఎ) గంగుల శాయిరెడ్డి
బి) వట్టికోట ఆళ్వారుస్వామి
సి) రుక్నుద్దీన్
డి) వేముగంట నరసింహాచార్యులు
29. బోనాల పండుగలో భాగమైన 'రంగమెక్కుడు' అంటే?
ఎ) బోనం (భోజనం సమర్పించడం)
బి) జంతు బలులు సి) శివసత్తుల భవిష్యవాణి
డి) ఊరేగింపు
30. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ ఏ మాసంలో వస్తుంది?
ఎ) శ్రావణం బి) భాద్రపదం
సి) ఆశ్వీజం డి) కార్తీకం
31. వరంగల్లు నగర వర్ణన, నాటి సామాజిక పరిస్థితులను చక్కగా వర్ణించిన కావ్యం?
ఎ) క్రీడాభిరామం బి) కళాపూర్ణోదయం
సి) కుమార సంభవం డి) పండితారాధ్య చరిత్ర
32. సాంఘిక దురాచారమైన జోగినీ వ్యవస్థను రూపు మాపడానికి సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించిందెవరు?
ఎ) అరిగె రామస్వామి బి) భాగ్యరెడ్డి వర్మ
సి) త్రిపురనేని రామస్వామి చౌదరి
డి) కుందుకూరి వీరేశలింగం
33. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు తొలిసారి ఎంపికైనవారు?
ఎ) సి.నారాయణరెడ్డి
బి) తిరుమల శ్రీనివాసాచార్య
సి) దాశరథి రంగాచార్య
డి) కాళోజి నారాయణరావు
34. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ఐదో రోజును ఏమంటారు?
ఎ) అటుకుల బతుకమ్మ
బి) వెన్నముద్దల బతుకమ్మ
సి) అట్ల బతుకమ్మ
డి) నానబియ్యం బతుకమ్మ
35. తెలంగాణలో ఎంతమంది ప్రసిద్ధమైన బాసర సరస్వతి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
ఎ) కృష్ణా బి) గోదావరి
సి) మంజీర డి) భీమ
సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.ఎ 5.సి
6.డి 7.ఎ 8.ఎ 9.ఎ 10.సి
11.ఎ 12.బి 13.సి 14.సి 15.ఎ
16.ఎ 17.డి 18.డి 19.సి 20.బి
21.డి 22.సి 23.డి 24.ఎ 25.బి
26.బి 27.బి 28.ఎ 29.సి 30.సి
31.ఎ 32.ఎ 33.బి 34.సి 35.బి
Authorization