1. తూర్పు ఇండియా వర్తక సంఘం ఎవరికాలంలో ఏర్పడింది? -అక్బర్
2. ఆంగ్లేయులు ఎవరికాలంలో భారత్‌లో వర్తక స్థావరాలు ఏర్పరచుకొన్నారు? -జహంగీర్
3. జహంగీర్ కాలంలో ఆంగ్లేయులు ఎక్కడ మొదటి వర్తక కేంద్రం స్థాపించారు? -సూరత్
4. జహంగీర్ ఎప్పుడు మరణించాడు? -క్రీ.శ. 1627
5. షాజహాన్ రాజ్యానికి వచ్చింది? -క్రీ.శ. 1628
6. మద్రాస్‌లో సెయింట్జార్జ్కోట ఏ మొగల్ చక్రవర్తి కాలంలో నిర్మాణమైంది? -షాజహాన్
7. ఎవరికాలంలో కాందహార్ మొగలులు చేయిజారి పోయింది? -జహంగీర్
8. జహంగీర్ కాలంలో ఇంగ్లండ్ రాజు నుంచి రాయ బారిగా వచ్చిందెవరు? -సర్ థామస్‌రో (1615)
9. మొదటిసారి పోర్చుగీస్ వారితో వైరం ఏ మొగలు చక్రవర్తి కాలంలో ఏర్పడింది? -జహంగీర్
10. చైనా కనిపెట్టిన పేపర్‌ను భారతదేశం ఎప్పటి నుండి దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది?
-క్రీ.శ. 13వ శతాబ్దం నుండి
11. అశోక చక్రవర్తివలె పాలన సాగించాలనుకొన్న మొగల్ చక్రవర్తి? -అక్బర్
12. తుజుక్-ఇ-జహంగీరీ అనే స్వీయ గ్రంథాన్ని రాసింది?
-జహంగీర్
13. ఆగ్రాకోటలో ధర్మ గంటను ఏర్పరచిన మొగలు రాజు ఎవరు? -జహంగీర్
14. ఏ మొగలు చక్రవర్తి తాను బతికి వుండగానే తన సమాధి నిర్మాణం ప్రారంభించారు?
-అక్బర్ దీనిని పూర్తిచేసింది జహంగీర్
15. అఖిల భారతదేశం ఒక్కటిగా ఉండాలని కోరుకున్న భారత జాతీయ పిత? -అక్బర్
16. రణతంబూర్, చిత్తూర్ కోటలను స్వాధీనం చేసు కొన్నది? -అక్బర్
17. అక్బర్ కాలంలో బెంగాల్‌ను ఏ వర్తక యాత్రికులు దర్శించేవారు? -చైనా, ఆగేయాసియా
18. ఏ మొగలు చక్రవర్తి పాలనను స్వర్ణయుగం అంటారు?
-షాజహాన్
19. ప్రపంచ అద్భుతకట్టడాలలో ఒకటైన తాజ్‌మహల్‌ను నిర్మించిందెవరు? -షాజహాన్
20. ఆగ్రాలోని మోతీ మసీదు, ఢిల్లీలోని ఎర్రకోట, జామా మసీదు, నెమలి సింహాసనం ఎవరికి సంబంధించి నవి? -షాజహాన్
21. షాజహాన్ సైనిక విధానంలో చేసిన మార్పు?
-మహారాష్ట్రులను సైన్యంలో చేర్చుకొనుట
22. అహ్మద్‌నగర్‌ను మొగల్ సామ్రాజ్యంలో కలిపినది?
-షాజహాన్
23. గోల్కొండ, బీజాపూర్లను అణచివేసి సామంత రాజ్యాలు చేసినది? -షాజహాన్
24. తాజ్‌మహల్‌ను ఎవరి జ్ఞాపకార్థం నిర్మించారు?
-షాజహాన్ భార్య ముంతాజ్ మహల్
25. షాజహాన్ కుమార్తెలు?
-రోషనారా, జహనారా, గౌహర్
26. షాజహాన్ ఆస్థాన గాయకుడు? -లాన్సేన్
27. జహంగీర్ సమకాలికుడైన రాజపుత్రరాజు?
-అమర్‌సింగ్
28. షాజహాన్‌కు 1658లో జైలుశిక్ష విధించారు. అయితే అతను ఎప్పుడు మరణించాడు? -క్రీ.శ. 1666
29. షాజహాన్ ఆస్థానకవి? -అబ్దుల్ హమిద్ లాహిరి
30. షాజహాన్ (ఢిల్లీ భాగం) అనే నగరాన్ని నిర్మించిం దెవరు? -షాజహాన్
31. మొగలుల రాష్ట్ర పాలకుని పేరు? -సుబేదార్
32. మొగలుల జిల్లా పేరు? -సర్కార్
33. మొగలుల సర్కార్ అధిపతి? -ఫోజ్దార్
34. మొగలుల తాలుకా పేరు?
-పరగణా (పరగణా అధిపతి షిక్దార్)
35. గ్రామపంచాయతీ అధిపతి? -ముకుద్దామ్
36. గ్రామపంచాయతీ అధిపతి ముకుద్దామ్ విధులు?
-శాంతి భద్రతలు
37. గ్రామ పట్వారీ విధులు? -రికార్డుల నిర్వహణ
38. అల్లకల్లోలంగా ఉన్న మొగలు రాజ్యంపై దండయాత్ర చేసింది? -నాదిర్షా (క్రీ.శ.1739), పర్షియా
39. నాదిర్షా దండయాత్ర చేసినపుడు ఢిల్లీని పాలిస్తున్న మొగలు చక్రవర్తులు? -మొహమ్మద్‌షా
40. నాదిర్షా బిరుదు? -ఇరాన్ నెపోలియన్
41. ఏ సింహాసనాన్ని నాదిర్షా పర్షియాకు తీసుకెళ్లాడు?
-నెమలి సింహాసనం
42. మొగలు పాలకుల మతం? -సున్నీ (ఇస్లాం)
43. మొగలుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి?
-వ్యవసాయం
44. మొగలుల కాలంలో ప్రధాన పరిశ్రమ?
-వస్త్ర పరిశ్రమ
45. మొగలుల కాలంలో కాగితపు పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి? -సియాల్‌కోట, ష్వాజాదీపూర్
46. రామాయణం, మహాభారతం, అధర్వణవేదం పర్షియా భాషలోకి అనువాదం ఎవరికాలంలో జరిగింది?
-మొగలుల
47. పద్మావతీ రచయిత, గొప్ప హిందీ కవి అయిన మాలిక్ మహమ్మద్ జయాసీ ఎవరి కాలంవారు? -మొగలుల
48. కాశ్మీర్ దేశపు అక్బర్ అని ఎవరికి బిరుదు?
-జైన్-ఉల్-అబిదిన్
49. మూడో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?
-క్రీ.శ.1761 జనవరి 14
50. అఫ్ఘాన్‌ను నిర్మించింది? -అహ్మద్‌షా అబ్దాలీ
51. షాజహాన్ పెద్దకుమారుడు దారాసుకోవ్ రాసిన గ్రంథం? -మహాసంద్రసంగ్రామం
52. షాజహాన్ కాలంలో ఢిల్లీని దర్శించిన ఫ్రెంచి వర్తకుడు?
-ట్రానెర్నియార్
53. షాజహాన్ ఆస్థానంలోని ప్రసిద్ధ సంస్కృత కవి?
-జగన్నాథపండితుడు
54. జగన్నాథపండితుడు రాసిన ప్రముఖ గ్రంథాలు?
-రసగంగాధరం, గంగాలహరి
55. షాజహాన్ పోగొట్టుకొన్న కోట? -కాందహార్
56. ఔరంగజేబు పూర్తిపేరు?
-మొహియుద్దీన్-మహమ్మద్
57. ఆలంగీర్ అనగా అర్థం ఏమిటి? -ప్రపంచ విజేత
58. ఆలంగీర్ అను బిరుదు ఎవరికి ఉంది? -ఔరంగజేబు
59. షాజహాన్ పెద్దకుమారుడు 'ధారా'ను వధించింది?
-ఔరంగజేబు
60. భారత ఉపఖండం మొత్తం పాలించిన మొగల్ చక్రవర్తి? -ఔరంగజేబు
61. ఏ మొగలు చక్రవర్తి తన పాలనా కాలంలో అధిక కాలం దక్షిణభారత్‌లో గడిపాడు? -ఔరంగజేబు
62. ఆంగ్లేయులకు కలకత్తాలో(1690)లో వర్తక స్థావ రానికి అనుమతించినది? -ఔరంగజేబు
63. మొగలుల అధికారం అహమ్మద్‌నగర్‌లో ఏర్పడకుండా కృషి చేసిన వ్యక్తి? -మాలిక్ అంబర్
64. ఔరంగజేబు అవలంభించిన ఇస్లాంమత శాఖ? -సున్నీ
65. ఔరంగజేబు షాజహాన్‌కు ఎన్నో కుమారుడు? -3వ
66. ఔరంగజేబు పాలనలో ఎన్ని సుభాలు ఉన్నాయి? -21
67. హిందూ దేవాలయాలను నాశనం చేయుటకు ఔరంగ జేబు ఏ ఉద్యోగులను నియమించెను? -దరోగా
68. సోమనాథదేవాలయం, కాశీనాథుని పవిత్ర దేవాల యాన్ని నాశనం చేసిందెవరు? -ఔరంగజేబు
69. హిందువులపై అక్బర్ రద్దు చేసిన జిజియాపన్నును మరలా విధించిందెవరు? -ఔరంగజేబు
70. రాజపుత్రుల, మరాఠీల, జాట్ల, సిక్కులతో వైరం తెచ్చుకొన్నది? -ఔరంగజేబు
71. ఇస్లాం మత సిద్ధాంతాల ప్రకారం రాజ్యాన్ని నడపాలను కొన్న మొగలు చక్రవర్తి? -ఔరంగజేబు
72. భరత్పూర్ సంస్థానాన్ని ఎవరు స్థాపించారు? -జాట్లు
73. మధురజాటులు ఎవరి నాయకత్వంలో ఔరంగజేబుపై తిరుగుబాటు చేసారు? -గోక్లా
74. రాజపుత్రులు ఎవరి నాయకత్వంలో ఔరంగజేబుపై తిరుగుబాటు చేసారు? -దుర్గాదాస్
75. బుందేల్‌ఖండ్‌కు స్వాతంత్రం ప్రకటించి ఔరంగజేబును ప్రతిఘటించింది? -చత్రసాల్
76. మొగలు వైభవం, మధ్యయుగం ఎవరితో అంతరిం చాయి? -ఔరంగజేబు
77. ఔరంగజేబు తర్వాత రాజ్యానికి వచ్చింది?
-మొదటి బహదూర్షా
78. దాదాపు భారతదేశాన్నంతటిని పాలించిన మొగలు చక్రవర్తి? -ఔరంగజేబు
79. బీజాపూర్, గోల్కొండ ఎవరి కాలంలో మొగలులకు దక్కినవి? -ఔరంగజేబు
80. ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించిన సంవత్సరం?
-1687
81. దక్కన్లో ఎంతవరకు అక్బర్ రాజ్యం విస్తరించింది?
-గోదావరి
82. హిందువులపై జీహాద్ (యుద్ధప్రకటన) రద్దు చేసింది?
-అక్బర్
83. ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్.. అక్బర్‌ను ఏమని సంబోధించే వారు? -కాంబేరాజు ఎక్బర్
84. ఎలిజబెత్ ఎవరిని అక్బర్ దగ్గరికి రాయబారిగా పంపించెను? -న్యూబెర్రీ
85. సతి ఆచారాన్ని ఖండించిన మొగలు చక్రవర్తి ఎవరు?
-అక్బర్
86. మున్సబ్ అంటే ఏమిటి?
-ర్యాంక్, హోదా, ఉద్యోగం
87. అక్బర్ పాలనలో అత్యంత ముఖ్యమైన అధికారులు?
-వజీర్ (రెవిన్యూ), బక్షీ (మిలటరీ)
88. ముఖ్య న్యాయాధికారి? -ఖాజీ
89. అక్బర్ కాలంలో ప్రముఖ హిందీ కవులు?
-అబ్దుల్ రహీం, వల్లభాచార్య, కేశవదాన
90. అక్బర్ ఎక్కడి నుండి దర్శనమిచ్చేవాడు?
-దీవానీ-ఇ-ఆమ్ (జరోకా)
91. అక్బర్ రాష్ట్రాలకు పెట్టిన పేరు?
- సుభా (అక్బర్ రాజ్యంలో 12 సుభాలుండేవి)
92. అక్బర్ కాలంలో పట్టణ పాలన అధికారిని ఏమంటారు? -కొత్వాల్
93. జహంగీర్ అసలు పేరు? -సలీం
94. జహంగీర్ పెద్ద కుమారుడు? -ఖుస్రూ
95. ఎవరి కాలంలో మొగలు చిత్రకళ ఉన్నతస్థాయికి చేరింది? -జహంగీర్
96. లలితకళలకు నిరాధరణ ఏ మొగలు చక్రవర్తి కాలంలో జరిగింది? -ఔరంగజేబు
97. నూర్జహాన్ ఎవరిభార్య? -జహంగీర్
98. నూర్జహాన్ అసలు పేరు? -మెహరున్నీసా
99. మెహరున్నీసా మొదటి భర్త?
-షేర్ అఫ్ఘాన్ అనే పేరున్న ఆలీకులి ఖాన్
100. మెహరున్నిసాకు జహంగీర్ మొదట ప్రధానం చేసిన బిరుదు? -నూర్మహల్
101. మెహరున్నిసాకు జహంగీర్ చివరిగా ప్రధానం చేసిన బిరుదు? -నూర్జహాన్
102. నూర్జహాన్ అంటే ఏమిటి?
-అంత:పుర సుందరి, ప్రపంచపు వెలుగు
103. నూర్జహాన్ పరిపాలనా విధానాన్ని సహించని సేనాని ఎవరు? -మహబత్‌ఖాన్ కాబూల్
104. జహంగీర్‌ను బంధించి 100 రోజులు మొగల్ సింహాసనాన్ని పాలించింది? -మహబత్‌ఖాన్
105. కాబూల్‌లోని ప్రముఖ సేనాని మహబత్‌ఖాన్ 1607 సందర్శించింది? -సర్ విలియం హాకీన్స్
106. నూర్జహాన్ పరిపాలనా విధానాన్ని సహించని రాకుమారుడు? -షాజహాన్
107. జహంగీర్‌పై తిరుగుబాటు చేసిన ఖుర్రంను అణచివేసిన జహంగీర్ సేనాని? -మహాబత్‌ఖాన్
108. నూర్జహాన్ కుమార్తె పేరు? -లాడ్లీబేగం
109. జహంగీర్‌కు నూర్జహాన్‌కు ఏ సంవత్సరంలో వివాహం అయ్యింది? -క్రీ.శ. 1611
110. ఆంగ్లేయులు మొదటిసారి ఎవరికాలంలో భారత్‌కు వచ్చారు? -అక్బర్
111. ఔరంగజేబు ఆస్థానానికి వచ్చిన ఫ్రెంచి దేశస్తుడు?
-బెర్నియర్
112. అబుల్హసన్ (తానీషా) అనే గోల్కొండ ప్రభువును బంధించినది? -ఔరంగజేబు
113. మతం కారణంగా తేజ్ బహుదూర్ (సిక్కుల తొమ్మిదవ గురువు)ను ఉరితీసింది? -ఔరంగజేబు
114. కడపటి మొగలుల కాలం? -క్రీ.శ.1707 -1857
115. మహా మొగలుల పాలనాకాలం?
-క్రీ.శ.1526 నుండి1707 వరకు
116. మొగలుల ప్రధానమంత్రిని ఏమంటారు? -వకీల్
117. మొగలుల ఆర్థికమంత్రిని ఏమంటారు?
-వజీర్/దీవాన్
118. మొగలుల సేనాపతిని ఏమంటారు? -మీర్భక్షి
119. మొగలుల న్యాయశాఖమంత్రిని ఏమంటారు? -ఖాజీ
120. మొగలుల రాష్ట్రం పేరు? -సుభా
121. 3వ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్నది?
- అఫ్ఘాన్ పాలకుడు అహ్మద్‌షా అబ్దాలీ ఒకవైపు,
సదాశివరావు నాయకత్వంలో మరాఠా సైన్యం,
రెండవ షా అలం నాయకత్వంలో మొగలు సైన్యం
(అబ్దాలీ గెలిచాడు)
122. మొగల్ చక్రవర్తులలో చివరివారెవరు?
-రెండో బహదూర్షా
123. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడనే నెపంపై రెండవ బహుదూర్‌షాను బ్రిటీష్‌వారు ఏ జైలుకు పంపారు? - రంగూన్
Authorization