1. శిస్తు వసూలు అధికారుల జీతభత్యాల కోసం రైతుల నుంచి వసూలు చేసిన పంట శాతం?
ఎ) 5 బి) 2 .5 సి) 4 డి) 8
2. షేర్షా సైనిక సంస్కరణలకు మార్గదర్శి?
ఎ) మహ్మద్ బిన్ తుగ్లక్ బి) తైమూర్
సి) అల్లావుద్దీన్ ఖిల్జీ డి) బాబర్
3. షేర్షా చరిత్రకు ముఖ్య ఆధారమైన తారిఖ్-ఇ-షేర్షాహిని రచించింది?
ఎ) జెఎన్ సర్కార్ బి) కాఫీఖాన్
సి) మీర్జా హైదర్ డి) అబ్బాస్ షేర్వాణి
4. కింది వాటిలో షేర్షా బిరుదు?
ఎ) సుల్తాన్-ఇ-అదిల్ బి) న్యాయసింహ
సి) హస్రల్-ఇ-అలా డి) పైవన్నీ
5. షేర్‌ఖాన్ జీలా ఒడ్డున నిర్మించిన దుర్గం?
ఎ) కలింజర్ బి) రొహటాస్
సి) జలందర్ డి) బెలూచ్
6. షేర్షా కాలానికి సంబంధించి సరైనది?
ఎ) గ్రామాధికారి - ముఖద్దం
బి) రాజ్యంలోని సర్కార్లు - 47
సి) షేర్షా సమాధి - ససారాం డి) పైవన్నీ
7. షేర్షా కాలంలో వాడిన భూమి కొలత పరికరం?
ఎ) భిగా బి) గజ్
సి) కంకుట్ డి) ఆష్రఫీ
8. షేర్షా నిర్మించిన విశ్రాంతి మందిరాలు?
ఎ) మండి బి) సరాయు
సి) పహ్ర డి) ఆరాంఘర్
9. షేర్షా పాలనా కాలం ఏది?
ఎ) 1535-40 బి) 1540-45
సి) 1545-50 డి) 1550-55
10. షేర్షా మరికొంత కాలం జీవించి ఉంటే మొఘలా యిల చరిత్ర రంగం మీదకు వచ్చేది కాదని అభిప్రాయ పడింది?
ఎ) వుల్సీహేగ్ బి) జెఎన్ సర్కార్
సి) ఆర్పీ త్రిపాఠి డి) వి.ఎ.స్మిత్
11. మరాఠాలు మొదట ఎవరి వద్ద అధికారులుగా పనిచేశారు?
ఎ) విజయనగర రాజులు బి) బహమనీలు
సి) మొఘలులు డి) కుతుబ్‌షాహీలు
12. మరాఠా సామ్రాజ్య నిర్మాణంలో ముఖ్య పాత్ర?
ఎ) దేశ్‌ముఖ్ వంశం బి) గైక్వాడ్ వంశం
సి) భోన్స్లే వంశం డి) ఠాక్రీ వంశం
13. శివాజీకి సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ) రాజధాని - రాయగఢ్
బి) తొలి దాడి - తొరణి దుర్గం
సి) సంరక్షకుడు - దాదాజీ కొండదేవ్
డి) పైవన్నీ
14. శివాజీ రాజ్యం పేరు?
ఎ) హిందూరాజ్యం బి) స్వరాజ్య
సి) భోన్స్లే రాజ్యం డి) ఏదీకాదు
15. శివాజీ బిరుదు కానిది ఏది?
ఎ) హైందవ ధర్మోద్ధారక బి) ఛత్రపతి
సి) సింహసనాధీశ్వర డి) మరాఠా వీర
16. శివాజీ సూరత్ ముట్టడి జరిపిన సంవత్సరం?
ఎ) 1663 బి) 1664
సి) 1665 డి) 1666
17. శివాజీ పట్టాభిషేకం జరిపిన సంవత్సరం?
ఎ) 1654 బి) 1664
సి) 1674 డి) 1680
18. శివాజీ నిర్మించిన దుర్గం ఏది?
ఎ) ప్రతాప్‌ఘడ్ బి) రాయగడ్
సి) తోరణ డి) సి మాత్రమే
19. శివాజీ పోర్చుగీసు వారి సాయంతో నిర్మించిన ఓడరేవు?
ఎ) మలవాన్ బి) కొలాబా
సి) సూరత్ డి) కాలికట్
20. శివాజీ చివరి దండయాత్ర ఏ ప్రాంతంపై జరిపాడు?
ఎ) కనౌజ్ బి) కర్ణాటక
సి) అజ్మీర్ డి) నాందేడ్
21. శివాజీకి సంబంధించి కింది వాటిలో సరైనదేది?
1) మంత్రి మండలిని అష్టప్రధాన్ అంటారు
2) శివాజీ జాగీర్దారీ పద్ధతిని రద్దు చేశాడు
3) ఇతను విధించిన భూమిశిస్తు - 2/5 వ వంతు
4) శత్రురాజ్యాలు శివాజీని చెల్లించే పన్ను - చౌత్
ఎ) 1, 2,3 బి) 3, 4
సి) 1, 3, 4 డి) 1, 4
22. చౌత్ అనగా ఎన్నవ వంతు పన్ను?
ఎ) 1/3 బి) 1/5 సి) 1/4 డి) 1/8
23. శివాజీ కాలంలో ముఖ్య రేవు పట్టణం?
ఎ) మలవాన్ బి) కొలంబా
సి) సూరత్ డి) దేబాల్
24. శివాజీ యుద్ధ నౌక పేరు?
ఎ) సామ్రాట్ బి) విరాట్
సి) మంచుకో డి) విక్రాంత్
25. శివాజీ అశ్విక దళానికి సంబంధించి సరైనది?
ఎ) ఒక హవల్దార్ - 25 అశ్వికులు
బి) ఒక జమేదార్ - 125 అశ్వికులు
సి) ఒక హజారీ - 1250 అశ్వికులు
డి) పైవన్నీ
26. శివాజీ అష్టప్రధాన్లలో సుమంత్ అనగా?
ఎ) సైనిక మంత్రి బి) ఆర్థిక మంత్రి
సి) విద్యా మంత్రి డి) విదేశాంగ మంత్రి
27. శివాజీ భూమిశిస్తు విధానానికి మార్గదర్శి?
ఎ) అక్బర్ బి) షేర్షా
సి) మాలిక్ అంబర్ డి) అల్లావుద్దీన్
28. శంభాజీకి ఆశ్రయమిచ్చిన మొఘల్ యువరాజు?
ఎ) అక్బర్-2 బి) షా ఆలం - 2
సి) ఆలంగీర్ - 2 డి) మహ్మద్‌షా
29. సతారాను రాజధానిగా చేసుకుని మరాఠా సామ్రాజ్యాన్ని పాలించింది?
ఎ) శంభాజీ బి) సాహు
సి) రాజారాం డి) షాహిభాయి
30. గెరిల్లా యుద్ధ పద్ధతుల్ని అవలంభించిన మరాఠా పాలకులు?
ఎ) శివాజీ బి) తారాభారు
సి) రాజారాం డి) ఎ, బి
31. డల్హౌసీ రాజ్య సంక్రమణం విధానంలో కలిసి పోయిన తొలి రాజ్యం?
ఎ) సతారా బి) సంబల్పూర్
సి) ఝాన్సీ డి) అవధ్
32. మరాఠా సామ్రాజ్య పున:స్థాపకుడిగా పేర్కొన్నది?
ఎ) బాజీరావు - 1 బి) బాలాజీ విశ్వనాథ్
సి) బాజీరావ్ - 2 డి) నారాయణరావ్
33. మొదటి బాజీరావ్ నిజాంను ఓడించిన చివరి యుద్ధం?
ఎ) సూరత్ బి) పాల్థేడ్
సి) ముషిగావ్ డి) భోపాల్ యుద్ధం
34. మరాఠా మాకియావెల్లి అని ఎవర్ని పేర్కొంటారు?
ఎ) మాధవరావ్ బి) నానా ఫడ్నవీస్
సి) సదాశివరావ్ డి) నానాసాహెబ్
35. రెండవ శివాజీగా పేరుగాంచింది?
ఎ) బాలాజీ బాజీరావ్ బి) సదాశివరావ్
సి) మొదటి బాజీరావ్ డి) బాలాజీ విశ్వనాథ్
36. 'మొఘలుల్ని బలహీనం చేయాలంటే పెరుగుతున్న మొఘలుల వృక్షాన్ని కూకటివేళ్ల దగ్గర నాశనం చేస్తే మిగిలిన శాఖలన్నీ వాటంతట అవే నశిస్తాయి' అని పలికింది?
ఎ) బాజీరావ్-1 బి) నానాఫడ్నవీస్
సి) నానాసాహెబ్ డి) మాధవరావ్
37. క్షయ వ్యాధితో మరణించిన మరాఠా పీష్వా?
ఎ) నానాసాహెబ్ బి) సదాశివరావ్
సి) మాధవరావ్ డి) బాజీరావ్-1
38. పీష్వాల అధికారానికి ముఖ్య కేంద్రం?
ఎ) సతారా బి) నాగపూర్
సి) ఔరంగబాద్ డి) పూనా
39. పీష్వాలలో చివరి వాడు?
ఎ) నారాయణరావ్ బి) మాధవరావ్
సి) సదాశివరావ్ డి) బాజీరావ్-2
40. మరాఠా పాలనలో చివరి పాలనా విభాగం?
ఎ) మహల్ బి) సర్కార్
సి) సవార్ డి) సర్దేశ్
41. కింది వాటిలో సరైనది?
ఎ) మొదటి కర్ణాటక యుద్ధ ఫలితం - ఎక్స్-లా-చాపెల్ సంధి (1748)
బి) రెండవ కర్ణాటక యుద్ధ ఫలితం - పాండిచ్చేరి సంధి (1754)
సి) మూడవ కర్ణాటక యుద్ధ ఫలితం - పారిస్ సంధి (1763) డి) పైవన్నీ
42. కింది వారిలో ఆర్కోట్ వీరుడిగా పేరొందిన వాడు?
ఎ) డూప్లే బి) కౌంట్-డీ-లాలీ
సి) రాబర్ట్‌క్లైవ్ డి) చందాసామెల్
43. మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం నాటి ఫ్రెంచ్ గవర్నర్?
ఎ) డూప్లే బి) బున్సీ
సి) ఐర్‌కూట్ డి) కౌంట్-డి-లాలీ
44. వందవాసి యుద్ధం జరిగిన సంవత్సరం?
ఎ) 1758 బి) 1760 సి) 1762 డి) 1765
45. బీజాపూర్, కాలికట్, అహ్మద్సాగర్ పాలకులు పోర్చుగీసులకు వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో కూటమిని ఏర్పాటు చేశారు?
ఎ) 1561 బి) 1571 సి) 1581 డి)1566
46. ఆంధ్రలో వర్తక వ్యాపారం కోసం చివరిగా వచ్చిన వారు?
ఎ) డచ్ బి) బ్రిటీష్
సి) డేన్లు డి) పోర్చుగీసు
47. ఆంధ్రాలో వర్తక స్థావరానికి పోర్చుగీసువారికి అనుమతి జారీ చేసిన గోల్కొండ నవాబు?
ఎ) ఇబ్రహీం కుతుబ్‌షా బి) మహ్మద్ కుతుబ్‌షా
సి) కులీ కుతుబ్‌షా డి) అబ్దుల్లా కుతుబ్‌షా
48. ఏ సైనిక చర్య ద్వారా పోర్చుగీసు అధీనంలోని డయ్యూడామన్, గోవాలను భారత్‌లో విలీనం చేశారు?
ఎ) ఆపరేషన్ విజరు బి) ఆపరేషన్ పరాక్రమ్
సి) ఆపరేషన్ ఆక్టోపస్ డి) ఆపరేషన్ కాటర్‌పిల్లర్
49. దేశంలోని మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించిన సంవత్సరం?
ఎ) 1773 బి) 1793 సి) 1813 డి) 1833
50.ఫాదర్ ఆఫ్ బ్రిటీష్ ఇండియా ఆర్మీగా ఎవర్ని పిలుస్తారు?
ఎ) వెల్లస్లీ బి) డల్హౌసీ
సి) కారన్ వాలీస్ డి) మేజర్ స్ట్రింగర్ లారెన్స్
51. కింది వాటిని జతపరచండి
అంశం స్థాపించిన సం||
1. బెనారస్ సంస్కృత పాఠశాల ఎ.1784
2. బెంగాల్ ఏసియాటిక్ సంస్థ బి. 1781
3. కలకత్తా మదర్సా సి. 1791
4. విశ్వవిద్యాలయ చట్టం డి. 1904
ఎ) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
52. నరబలి శిశుహత్యలు పాటించే భోండ్ తెగలో మానసిక పరివర్తన కోసం కృషి చేసింది?
ఎ) మేజర్ హిక్స్ బి) మేజర్ మాక్ఫర్సన్
సి) విలియం స్లీమెన్ డి) థామస్ హిస్లాప్
53. కింది వాటిని జతపరచండి
గిరిజన తెగ గవర్నర్ జనరల్
1. కోలి ఎ. వారన్ హేస్టింగ్స్
2. బిల్ బి. మార్కోస్ హేస్టింగ్స్
3. ఖోండ్లు సి. హెన్రీ హర్డింజ్
4. సంథాల్ డి. డల్హౌసీ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
54. కింది వాటిని జతపరచండి
గిరిజన తెగ తిరుగుబాటు సం||
1. సంథాల్ ఎ. 1846-48
2. ఖోండ్ బి. 1855-56
3. కోలి సి. 1817-19
4. బిల్లు డి. 1784-85
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సమాధానాలు
1.బి 2.సి 3డి. 4.డి 5.బి
6.డి 7.ఎ 8.బి 9.బి 10.డి
11.బి 12.సి 13.డి 14.బి 15.డి
16.బి 17.సి 18.డి 19.ఎ 20.డి
21.ఎ 22.సి 23.డి 24.సి 25.డి
26.డి 27.సి 28.ఎ 29.సి 30.డి
31.ఎ 32.బి 33.డి 34.బి 35.సి
36.ఎ 37.సి 38.డి 39.డి 40.ఎ
41.డి 42.సి 43.బి 44.బి 45.బి
46.డి 47.డి 48.ఎ 49.బి 50.డి
51.ఎ 52.బి 53.ఎ 54.డి
ఆంజనేయులు పాటిమిని
ఎం.ఎ. హిస్టరీ
వనపర్తి ఫోన్: 9701623874