1. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు?
ఎ) నవంబర్-మే బి) మే-జూన్
సి) అక్టోబర్-ఏప్రిల్ డి) జూన్-సెప్టెంబర్
2. సింధు నాగరికత పశ్చిమ అగ్ర ప్రాంతం ఏది?
ఎ) దోలవీర బి) దైమాబాద్
సి) సుత్కజెండార్ డి) అలంగీర్పూర్
3. అమ్రివద్ద తవ్వకాలు జరిపింది ఎవరు?
ఎ) మజుందార్ బి) Bవారెస్
సి) వై.వి.శర్మ డి) నార్మన్ బ్రౌన్
4. వేయి యజ్ఞాలు జరిపిన ప్రదేశంగా వర్ణించిన నగరం ఏది?
ఎ) మొహంజదారో బి) హరప్పా
సి) కాళీభంగన్ డి) రంగాపూర్
5. మానవుడు సంచార జీవనం నుంచి స్థిరజీవిగా మార్పు చెందినట్టు భారత ఉపఖండంలో ఆనవాళ్ళు లభించిన తొలి ప్రదేశం ఏది?
ఎ) భీమారన్ బి) మెహర్ఘర్
సి) చిలాస్ డి) హరమోష్
6. వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) పురావస్తు శాస్త్రం బి) చరిత్ర
సి) క్రిప్టోగ్రఫి డి) డెమోగ్రఫి
7. పాతరాతి యుగపు చిత్రకళ కనిపించు ప్రదేశం ఏది?
ఎ) అజంతా గుహలు
బి) ఎలిఫెంటి గుహలు
సి) బింబేట్కా గుహలు
డి) బెలూన్ గుహలు
8. మధ్య శిలాయుగ కాలాన్ని ఏమంటారు?
ఎ) స్థూల శిలాయుగం బి) వర్తకుల యుగం
సి) కర్షక శిలాయుగం డి) సూక్ష్మ శిలాయుగం
9. నిద్రలో ఉన్నపుడు చేసుకునే వివాహం ఏది?
ఎ) పైశాచిక బి) అసుర
సి) రాక్షస డి) గంధర్వ
10. అతిధికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన 'గోగ్నాను' ఏ కాలంలో పాటించారు?
ఎ) తొలి వేదకాలం బి) మలి వేదకాలం
సి) తొలి వేదకాలానికి పూర్వం డి) గుప్త కాలం
11. ముఖ్యమైన కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి ఆక్రమణల గురించి సలహా ఇచ్చేది?
ఎ) గణ బి) విధాత సి) సమితి డి) సభ
12. జన్మ-పునర్జన్మ, ఆత్మ-పరమాత్మ, సుఖ:దు:ఖాలు, జన్మరాహిత్యం వంటి సమస్యల గురించి చర్యలు గల వేద భాగం ఏది?
ఎ) వేదాంగాలు బి) ఉపనిషత్తులు
సి) ఉపవేదాలు డి) బ్రహ్మణాలు
13. రుగ్వేదంలో వర్ణించిన పర్వతములు ఏవి?
ఎ) నీలగిరి బి) ఆరావళి
సి) హిమాలయాలు డి) వింధ్య
14. రుగ్వేదంలో వర్ణించిన కుభనదికి ప్రస్తుత పేరు?
ఎ) గోమల్నది బి) స్వాట్ నది
సి) ఇండస్ నది డి) కాబూల్ నది
15. బుద్దుని అత్యంత ధనిక శిష్యుడు ఎవరు?
ఎ) ఉపాలి బి) ఆనంద
సి) అనంత పిండక డి) అంగుళినూల
16. బుద్దునికి మనిషి రూపాన్ని ఇచ్చి విగ్రహారాధన ప్రారంభించిన వారు ఎవరు?
ఎ) మహాయానులు బి) హీనాయానులు
సి) మహాసాలఘీకులు డి) స్తవిరవాధులు
17. మనిషి తన విధికి తనే కర్త అని చెప్పింది ఎవరు?
ఎ) బుద్ధుడు బి) మహావీరుడు
సి) శంకరాచార్యుడు డి) అశోకుడు
18. మహాయానంలో బుద్ధునితో పాటు ప్రముఖపాత్ర వహించినది ఎవరు?
ఎ) భిక్షువులు బి) బోధిసత్వులు
సి) జంగములు డి) శిష్యులు
19. ప్రపంచంలో ఉత్సరపాణి, అవసరపాణి అనే దశలు లెక్కించలేనన్ని ఉంటాయని తెలిపే జైనమత సిద్ధాంతం ఏది?
ఎ) ధర్మ సిద్ధాంతం
బి) ఆత్మ పునర్జన్మ సిద్ధాంతం
సి) సకల పురుషసిద్ధాంతం డి) కర్మ సిద్ధాంతం
20. సంకర్షణ అని ఎవరికి పేరు?
ఎ) బలరాముడు బి) బుద్ధుడు
సి) మహావీరుడు డి) నాగార్జునుడు
21. ఉత్తరదిశ వైపు ముఖమును ఉంచి ఖననం చేసే శైవ మతశాఖ ఏది?
ఎ) నిగ్రంథులు బి) లింగాయతులు
సి) శ్రమణులు డి) గరధరాలు
22. మహా పద్మనందుడు అజ్ఞాత కులజుడు అని పేర్కొన్నది?
ఎ) ఉపనిషత్తులు బి) పురాణాలు
సి) బ్రహ్మణాలు డి) వేదాంగాలు
23. బిందుసారుని కాలంలో అశోకుడు ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు?
ఎ) ఉజ్జయిని బి) వైశాలి
సి) మధుర డి) తక్షశిల
24. సంప్రాతికి గల బిరుదు ఏది?
ఎ) బౌద్ధ అశోకుడు బి) ఛండ అశోకుడు
సి) జైన అశోకుడు డి) చార్వాక అశోకుడు
25. 'అందరూ నా బిడ్డలే' అని పేర్కొన్న అశోకుని శాసనాలు ఏవి?
ఎ) సిద్ధపుర, ఎర్రగుడి
బి) దౌలీ, జౌగడ(ఒరిస్సా)
సి) బ్రహ్మగిరి, మహస్థాన
డి) మస్కీ, గుజ్జార
26. చంద్రగుప్త మౌర్యుని సైన్యం గురించి ప్రస్తావించిన చరిత్రకారుడు ఎవరు?
ఎ) ఆర్.శ్యామశాస్త్రి బి) స్ట్రాబో
సి) ప్లీని డి) మెగస్తనీస్
27. అశోకుని తల్లి సుభద్రాంగ, ఆమె చంపా రాజ్యం లోని బ్రహ్మణుల కుమార్తె అని వర్ణించే గ్రంథం ఏది?
ఎ) అశోకవదన బి) దివ్యవదన
సి) వంశతపకాశిని డి) మహవంశం
28. మౌర్యుల కాలంలో మార్కెట్లను పర్యవేక్షించే అధికారి ఎవరు?
ఎ) ఆకారాధ్యక్ష బి) సీతలాధ్యక్ష
సి) సంస్థాధ్యక్ష డి) పోతవాద్యక్ష
29. అర్థశాస్త్రం ప్రకారం పరిపాలనకు ఎన్ని శాఖలు ఉన్నాయి?
ఎ) 34 బి) 36 సి) 37 డి) 38
30. అశోకుడు అవలంభించిన బౌద్ధ ధర్మం, దమ్మ విధానం మౌర్య సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేసిందని మౌర్యుల పతనానికి కారణంగా వాదించినది ఎవరు?
ఎ) డి.డి.కోశాంబి బి) గోసాల్
సి) ఆర.శ్యామశాస్త్రి డి) హరిప్రసాద్ శాస్త్రి
31. గోండ ఫెర్నస్ కాలంలో 'జీసస్ క్రిస్ట్' శిష్యుడైన ఎవరు భారతదేశాన్ని సందర్శించాడు?
ఎ) సెయింట్ జాన్
బి) సెయింట్ పీటర్
సి) సెయింట్ థామస్
డి) సెయింట్ ఆల్ఫాన్స్
32. పుష్యమిత్రుడు రెండు అశ్వమేధ యాగాలు నిర్వ హించినట్టు తెలియజేసే ధనదేవుని శాసనం ఏది?
ఎ) హథిగుంపా బి) అయోధ్య
సి) జూనాగడ్ డి) నందంపూడి
33. పట్టు, పట్టు, ఎట్టు తోగై అనే 18 పుస్తకాలు ఏ సంగమ పరిషత్లో రచించారు?
ఎ) 3వ బి) 2వ సి) 5వ డి) 4వ
34. శకుల గురించి ప్రథమంగా ప్రస్తావించిన శాసనం ఏది?
ఎ) జూనాగడ్ శాసనం
బి) హథిగుంపా శాసనం
సి) డేరియన్-1 శాసనం
డి) అయోధ్య శాసనం
35. మాళ్వా ప్రాంత కార్థమక వంశ క్షాత్రపులలో తొలి రాజు ఎవరు?
ఎ) చస్తనుడు బి) హగమష
సి) యశమలిక డి) భూమికుడు
36. కుషాణుల యుగంలో కన్యాశుల్కం వాడుకలో ఉన్నట్టు ప్రస్తావించిన గ్రంథం ఏది?
ఎ) దివ్యవదన బి) బుద్దచరిత
సి) మహవస్తు డి) మిలిందపన్హ
37. సెంగుట్టవాన్ విజయ యాత్రలను ప్రస్తావించిన తమిళ ఇతిహాసం ఏది?
ఎ) జీవక చింతామణి బి) తిరుతక్కదేవర
సి) శిలప్పాదిగారం డి) మణిమేఖలై
38. పువార్ నగరంలో ప్రతి ఏటా ఇంద్రునికి ఉత్సవాలు జరిపినట్టు పేర్కొన్న సాహిత్యం?
ఎ) పాళీ సాహిత్యం
బి) సంస్కృత సాహిత్యం
సి) సంగం సాహిత్యం డి) ఏదీకాదు
39. నరసింహ గుప్త బాలాదిత్య మాల్వాపాలకుడు యశోధర్మన్తో కలిసి ఏ హుణ దండయాత్రికుడిని ఓడించాడు?
ఎ) నెడుంజెలియన్ బి) మిహిరకులుడు
సి) తోరమానుడు డి) మినాండర్
40. సింహంతో యుద్ధం చేస్తున్నట్టు నాణెముల విడుదల చేసింది?
ఎ) కుమార గుప్తుడు బి) భాను గుప్తుడు
సి) స్కంధ గుప్తుడు డి) సముద్ర గుప్తుడు
41. ఈ కింది వాటిలో 'గుప్తుల కాలానికి సంబంధించిన నాణెం' ఏది?
ఎ) దీనార్ బి) రూపిక
సి) కౌరీలు డి) పైవన్నీ
42. మూడవ అశోకుడు, ఉత్తర పథస్వామి మొదలైన బిరుదులు ఎవరివి?
ఎ) హర్షుడు బి) సంప్రాతి
సి) పుష్యమిత్ర శుంగ డి) సముద్రగుప్తుడు
43. చైనా వాజ్ఞ్మయం ప్రకారం హర్షుని ఆస్థానానికి రాయబారులను పంపిన చైనా చక్రవర్తి ఎవరు?
ఎ) షాన్-ఇ బి) టై-చుంగ్
సి) హన్-ఇ డి) కాన్-షు-ఇ
44. ప్రజల ద్వారా ఎన్నికైన పాలవంశ పాలకుడు ఎవరు?
ఎ) దేవపాలుడు బి) ధర్మ పాలుడు
సి) గోపాలుడు డి) రామ పాలుడు
45. వేదాధిక్యతను వివరించే పూర్వమీమాంస పద్ధతిని ప్రచారం చేసినవాడు?
ఎ) కపిలుడు బి) కుమార్యులభట్టు
సి) శంకరాచార్యుడు డి) గోరఖ్నాథుడు
46. అవంతీ సుందరీకథ అనే పుస్తకం రచించినది ఎవరు?
ఎ) దండిన్ బి) బాణభట్టు
సి) పద్మగుప్త డి) ఉమాపతి
47. రాష్ట్రకూటులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి?
ఎ) స్థాపకుడు - దంతి దుర్గుడు
బి) రాజధాని - ఎల్లోరా
సి) చివరి పాలకుడు - 2వ కర్కరాజు
డి) పైవన్నీ సరైనవే
48. కుషాణుల కాలం నాటి తూనికలు, కొలతలు గురించి ప్రస్తావించిన శాసనం ఏది?
ఎ) ఐహోల్ బి) మధుర
సి) అలహాబాద్ డి) మొహ్రలీ
49. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి
ఎ) పోతువా-కొలతల అధ్యక్షుడు
బి) పాణ- వ్యాపారం, వాణిజ్యం
సి) ఇతిహజక మహామాత్య - స్త్రీ సంక్షేమ అధికారి
డి) సన్నిధాత - ఓడరేవులు
50. ఎవరి కాలంలో ఇస్లాం మతం సున్నీ, షియా తెగలుగా మారింది?
ఎ) హజరత్ ఉమర్
బి) హజ్రత్ ఇమామ్ ఆలీ
సి) హజ్రత్ అబూబకర్
డి) హజ్రత్ ఉస్మాన్
సమాధానాలు
1.సి 2.సి 3.ఎ 4.బి 5.బి
6.ఎ 7.సి 8.డి 9.ఎ 10.బి
11.డి 12.బి 13.సి 14.డి 15.సి
16.ఎ 17.ఎ 18.బి 19.సి 20.ఎ
21.బి 22.బి 23.ఎ 24.సి 25.బి
26.సి 27.ఎ 28.సి 29.ఎ 30.బి
31.సి 32.బి 33.ఎ 34.సి 35.ఎ
36.బి 37.సి 38.సి 39.బి 40.డి
41.డి 42.ఎ 43.బి 44.సి 45.బి
46.ఎ 47.డి 48.బి 49.డి 50.బి
షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
దీపిక పేజీలపై మీ అభిప్రాయాలను, సలహాలను మాకు తెలియజేయండి.
dipika.navatelangana21@gmail.com