1. కింది వాటిలో సరికానిది తెలపండి
ఎ) అన్నపూర్ణశిఖరం - అత్యున్నత హిమాలయాలు
బి) మహాభారత శ్రేణి- నిమ్న హిమాలయాలు
సి) దుద్వా కొండలు - బాహ్య హిమాలయాలు
డి) ధౌల్‌ధార్ శ్రేణి - ట్రాన్స్ హిమాలయాలు
2. ఏ రకమైన వర్షపాతాన్ని ఋతుపవన ఆరంభ జల్లుల ని అంటారు?
ఎ) పర్వతీయ వర్షపాతం బి) సంవహన వర్షపాతం
సి) చక్రవాత వర్షపాతం డి) ఎ, సి
3. నక్షత్రాల జన్మస్థానం ఏది?
ఎ) బ్లాక్ హోల్ బి) నోవా
సి) సూపర్నోవా డి) నెబ్యులా
4. సూర్యునికి, భూమికి మధ్య ఏ రోజున అతితక్కువ దూరం ఉంటుంది?
ఎ) డిసెంబర్ 22 బి) సెప్టెంబర్ 21
సి) జూన్ 14 డి) జనవరి 3
5. ఒక గంట సమయంలో భూమి ఎన్ని అక్షాంశాలు తిరుగుతుంది?
ఎ) 60 అక్షాంశాలు బి) 30 అక్షాంశాలు
సి) 20 అక్షాంశాలు డి) 15 అక్షాంశాలు
6. లండన్‌లో తెల్లవారి సమయం 5:30 ఎఎమ్ అయితే భారత్‌లో అప్పుడు సమయం ఎంత?
ఎ) ఉదయం 10గం|| 30ని||
బి) రాత్రి 10గం||
సి) ఉదయం 11గం||
డి) రాత్రి 9గం||30ని||
7. కింది వాటిలో సరికానిది/వి గుర్తించండి
రాష్ట్రం కనుమ
1. సిక్కిం జలప్లా
2. హిమాచల్‌ప్రదేశ్ రోహ్ తంగ్
3. జమ్ముకశ్మీర్ అఘిల్
4. అరుణాచల్‌ప్రదేశ్ థగులా
ఎ) 1, 2 బి) 1 మాత్రమే సి) 3, 4 డి) 4 మాత్రమే
8. సిక్కిం రాష్ట్రంలో ఉన్న కనుమలు ఏవి?
1. బుర్జిలా 2. జోజిలా
3. జలప్లా 4. నాథులా
ఎ) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) 2, 4
9. నేషనల్ హైవే -7 ఏయే నగరాలను కలుపుతుంది?
ఎ) తిరువనంతపురం - ఢిల్లీ
బి) వారణాసి - కన్యాకుమారి
సి) కాండ్లా - కలకత్తా డి) ఢిల్లీ - కలకత్తా
10. నేషనల్ హైవే -7 నూతన సంఖ్య?
ఎ) జాతీయ రహదారి - 44
బి) జాతీయ రహదారి - 40
సి) జాతీయ రహదారి - 26
డి) జాతీయ రహదారి - 16
11. కింది వాటిలో సరైనది ఏది?
1) పశ్చిమ తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి - 17
2) తూర్పు తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి - 5
3) పశ్చిమ తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి - 8 4) తూర్పు తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి - 10
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 4 డి) 2, 4
12. ఢిల్లీ ముంబయిని కలిపే జాతీయ రహదారి ఏది?
ఎ) జాతీయ రహదారి - 6
బి) జాతీయ రహదారి - 7
సి) జాతీయ రహదారి - 8
డి) జాతీయ రహదారి - 9
13. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజిస్తున్న జాతీయ రహదారి ఏది?
ఎ) జాతీయ రహదారి - 1
బి) జాతీయ రహదారి - 4
సి) జాతీయ రహదారి - 6
డి)జాతీయ రహదారి - 10
14. రచనా దోబ్ ఏ రెండు నదుల మధ్యగల సారవంతమైన ప్రాంతం?
ఎ) బియాన్-సట్లేజ్ బి) రావి-బియాస్
సి) చీనాబ్-రావి డి) జీలం-చీనాబ్
15. షెవరారు కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) తమిళనాడు బి) కర్ణాటక
సి) మహారాష్ట్ర డి) రాజస్తాన్
16. దూప్ఘర్ శిఖరం ఏ పర్వతాలలో ఎత్తైనది?
ఎ) వింధ్యా పర్వతాలు
బి) పూర్వాంచల్ పర్వతాలు
సి) నీలగిరి పర్వతాలు
డి) సాత్పూరా పర్వతాలు
17. పంచమర్హి అనే వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది?
ఎ) సాత్పూరా పర్వతాలు
బి) వింధ్యా పర్వతాలు
సి) అన్నామలై పర్వతాలు
డి) పూర్వాంచల్ పర్వతాలు
18. 'దూప్ఘర్' పర్వత శిఖరం సాత్పూర శ్రేణికి చెందిన ఏ కొండల్లో ఉంది?
ఎ) మైకాల కొండలు బి) మహదేవ్ కొండలు
సి) రాజ్‌పిప్లా కొండలు డి) గర్విల్ఘర్ కొండలు
19. సాత్పూర శ్రేణికి చెందిన కొండలు ఏవి?
ఎ) కార్టమమ్ కొండలు బి) గవిల్ఘర్ కొండలు
సి) రాజ్‌పిప్లా కొండలు డి) మహదేవ్ కొండలు
20. సాత్పూర శ్రేణిలో ఏ దిశలో ఏ కొండలు విస్తరించి ఉన్నాయో జతచేయండి
దిశ కొండ
1. ఉత్తరం పి. మహదేవ్ కొండలు
2. దక్షిణం క్యూ. గవిల్ఘర్ కొండలు
3. తూర్పు ఆర్. మైకాల్ కొండలు
4. పశ్చిమం ఎస్. రాజ్‌పిప్లా కొండలు
ఎ) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
సి) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
డి) 1-ఎస్, 2-ఆర్, 3-క్యూ, 4-పి
21. సియాచిన్ హిమనీనదం ఏ లోయలో ఏర్పడింది?
ఎ) చుంబిలోయ బి) నుబ్రాలోయ
సి) కులులోయ డి) కాంగ్రాలోయ
22. సూర్యునిలో అధికశాతం ఉన్న జడవాయువు?
ఎ) క్రిప్టాన్ బి) నియాన్
సి) హీలియం డి) ఆర్గాన్
23. సూర్యునిలో అత్యధికంగా ఉన్నవాయువు?
ఎ) ఆక్సీజన్ బి) నైట్రోజన్
సి) హీలియం డి) హైడ్రోజన్
24. విశ్వరలో దుమ్ము, ధూళి, వేడివాయువులతో కూడిన మేఘావృత మండలం ఏది?
ఎ) నోవా బి) సూపర్నోవా
సి) బ్లాక్ హోల్ డి) నెబ్యులా
25. కోపర్నికస్ అనే పోలెండ్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం?
ఎ) భూకేంద్రక సిద్ధాంతం
బి) మహవిస్పోటన సిద్ధాంతం
సి) సూర్య కేంద్రక సిద్ధాంతం
డి) ద్వి నక్షత్ర పరికల్పన
26. ఆల్ఫాసెంటారే అనే నక్షత్రానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి
ఎ) సూర్యుడు తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం
బి) సూర్యుడు దగ్గరగా గల నక్షత్ర మండలం
సి) సూర్యుడు తర్వాత ప్రకాశవంతంగా కనిపించే నక్షత్ర మండలం
డి) సూర్యుడు తర్వాత పెద్దగా కనిపించే నక్షత్రం
27. సూర్యుని తర్వాత భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం ఏది?
ఎ) ఫ్రాక్సిమా సెంటోరి బి) సిరియన్
సి) బిటల్గ్లక్స్ డి) ఎప్సిలాన్ అరిగా
28. కరోనాకు సంబంధించి సరైన వ్యాఖ్యను తెలుపండి
ఎ) సూర్యునిలోని ప్రకాశవంతమైన మండలం
బి) సూర్యాంకాలు ఏర్పడే మండలం
సి) సూర్యగ్రహణ సమయంలో కనిపించే మండలం
డి) సూర్యాస్తమయంలో మాత్రమే కనిపించే మండలం
29. డుడుమా జలపాతం ఏ నది వల్ల ఏర్పడింది?
ఎ) కావేరి బి) నర్మద
సి) మాచ్‌ఖండ్ డి) తపతి
30. పాక్యోంగ్ విమానాశ్రయం ఏ రాష్ట్రానికి చెందింది?
ఎ) అరుణాచల్‌ప్రదేశ్ బి) మేఘాలయ
సి) సిక్కిం డి) మణిపూర్
31. ఈశాన్య రాష్ట్రంలో నిర్మించిన తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) సిక్కిం బి) త్రిపుర
సి) నాగాలాండ్ డి) మణిపూర్
32. జాతీయ రహదారులు ఎక్కువ గల రాష్ట్రం ఏది?
ఎ) మధ్యప్రదేశ్ బి) ఉత్తరప్రదేశ్
సి) పశ్చిమబెంగాల్ డి) బీహార్
33. అన్ని రకాల రహదారులు ఎక్కువున్న రాష్ట్రం ఏది?
ఎ) మధ్యప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) తమిళనాడు డి) కేరళ
34. కింది వాటిలో సరైనది ఏది?
1) అతి చిన్న జాతీయ రహదారి - 47 ఎ
2) దేశాన్ని తూర్పు పడమరలుగా విభజిస్తున్న జాతీయ రహదారి - 7
3) మొత్తం రహదారుల్లో జాతీయ రహదారుల శాతం - 30
4) పొడవైన జాతీయ రహదారులు ఎక్కువున్న రాష్ట్రం - మధ్యప్రదేశ్
ఎ) 1, 2 బి) 2,4 సి) 1, 3, 4 డి) 1, 2,3
35. దేశంలో పొడవైన జాతీయ రహదారుల్లో మొదటి రెండు ఏవి?
1. జాతీయ రహదారి - 5
2. జాతీయ రహదారి - 6
3. జాతీయ రహదారి - 7
4. జాతీయ రహదారి - 8
ఎ) 1, 2 బి) 4, 2 సి) 1, 3 డి) 3, 2
36. కృష్ణ బిలాలపై పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త?
ఎ) విలియం జోన్స్ బి) స్టీఫెన్ హాకింగ్స్
సి) విలియం హెర్షల్ డి) హిపార్కర్
37. నిహారికలను మొదటిసారి గుర్తించిన శాస్త్రవేత్త?
ఎ) హ్యూజెన్ బి) ఎరస్టోనిస్
సి) విలియం హెర్షల్ డి) జాన్ వీలర్
38. నేపాల్ హిమాలయాలకు సంబంధించి సరైన విష యాలను తెలుపండి
1) కాళీ-తీస్తా నదుల మధ్య విస్తరించి ఉన్నాయి
2) సట్లేజ్-కాళీ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి
3) పండ్ల తోటలకు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందినది
4) ఎవరెస్ట్ లాంటి ఎత్తైన శిఖరాలు ఇక్కడ ఉన్నాయి
ఎ) 1, 2 బి) 1, 4 సి) 2, 3 డి) 2, 4
39. కుమయొన్ హిమాలయాలకు సంబంధించి సరికాని విషయాలను తెలుపండి
1) ఇక్కడ మత పరమైన కేంద్రాలు అధికంగా ఉన్నాయి
2) ఇవి సింధూ సట్లేజ్ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి
3) ఈ ప్రాంతంలో కనిపించే సరస్సులను 'తాల్' అని పిలుస్తారు
4) నాథులా, జలప్లా కనుమలు వీటిలోనే ఉన్నాయి
ఎ) 1, 3 బి) 2, 4 సి) 1, 4 డి) 2, 3
40. భారతదేశంలో పొడవైన సరిహద్దు గల మొదట రెండు దేశాలు?
ఎ) బంగ్లాదేశ్, చైనా బి) బంగ్లాదేశ్, నేపాల్
సి) బంగ్లాదేశ్, పాకిస్తాన్
డి) బంగ్లాదేశ్, మయన్మార్
41. భారతదేశంలో తక్కువ సరిహద్దు గల చివరి రెండు దేశాలు?
ఎ) నేపాల్, మయన్మార్ బి) భూటాన్, నేపాల్
సి) ఆప్ఘనిస్తాన్, భూటాన్ డి) నేపాల్, భూటాన్
42. ఏ కనుమను 'గేట్ వే ఆఫ్ శ్రీనగర్' అని పిలుస్తారు?
ఎ) షిప్కిలా బి) బనిహాల్
సి) నిఫిలా డి) బోలాన్
43. లే-జమ్ము ప్రాంతాలను కలిపే కనుమ ఏవి?
ఎ) ఖర్దుంగ్లా బి) షిప్కిలా
సి) జోజిలా డి) రోV్ాతంగ్
44. కింది వాటిలో సరియైనది తెలుపండి
1) బౌద్ధమత కేంద్రం - ధర్మశాల
2) అడవుల పరిశోధన కేంద్రం - డెహ్రాడూన్
3) ఆలుగడ్డల పరిశోధన కేంద్రం - సిమ్లా
4) ఐఏఎస్ శిక్షణా కేంద్రం - డల్హౌసి
ఎ) 1, 4 బి) 3, 4 సి) 1, 2, 3 డి) 1, 2, 4
45. ప్రపంచంలో అతిపెద్ద అగ్ని పర్వత దీవి?
ఎ) ఆస్ట్రేలియా బి) ఐస్లాండ్
సి) ఐర్లాండ్ డి) గ్రీన్‌ల్యాండ్
46. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్చిపెలాగో ఏది?
ఎ) ఫిలిప్పైన్స్ బి) జపాన్
సి) ఇండోనేషియా డి) మారిషస్
సమాధానాలు
1.డి 2.బి 3.డి 4.డి 5.డి
6.సి 7.డి 8.సి 9.బి 10.ఎ
11.ఎ 12.సి 13.సి 14.సి 15.ఎ
16.డి 17.ఎ 18.బి 19.ఎ 20.బి
21.బి 22.సి 23.డి 24.డి 25.సి
26.బి 27.ఎ 28.సి 29.సి 30.సి
31.ఎ 32.బి 33.బి 34.ఎ 35.డి
36.బి 37.ఎ 38.బి 39.బి 40.ఎ
41.సి 42.బి 43.సి 44.సి 45.బి
46.సి
- జి.ఉపేందర్
హైదరాబాద్
ఫోన్ నెం : 9676669049
Authorization