1. ఎవరి కాలంలో నకాశీ కళాకారులు నక్షా అనే పనిని చేసేవారు కనుక వీరుగీసిన చిత్రాలను నక్షాలని అనేవారు?
1) మొగల్స్ 2) కుతుబ్షాహి
3) అసఫ్జాహి 4) కాకతీయులు
2. నిముషాంబ ఎవరి కులదేవత?
1) నకాషీ చిత్రకారులు 2) సాధనాసూరులు
3) భిక్షుక కుంట్లు 4) చిందు కళాకారులు
3. జాజరపాటలు, వెన్నెల పదాలు, గొబ్బిపాటలు, ధవళ గీతాలు, తందాన పదాలు మొదలగువాటిని ఏమంటారు?
1) కీర్తనలు 2) కృతులు
3) పదకవితలు 4) పద్యం
4. కృతి, కీర్తన, పదం, సంకీర్తన వంటి వాటిని నేడు పర్యాయపదాలుగా వ్యవహరిస్తున్నప్పటికీ సాహిత్య ప్రధానమైన రచనలను ఏమంటారు?
1) పద్యం 2) పద కవితలు
3) కృతులు 4) కీర్తనలు
5. తెలుగులో తొలి వచనైక రచనలు చేసిన ప్రథమ సంకీర్తనాచార్యుడు ?
1) అన్నమయ్య 2) రామదాసు
3) త్యాగయ్య 4) కృష్ణమాచార్యులు
6. అన్నమయ్య 32,000 సంకీర్తనల సంఖ్యను అందుకో వాలని కిందివారిలో ఎవరు ఆధ్యాత్మిక, సాంఘిక కీర్తనలు 20,000 వరకు రచించారు?
1) లక్ష్మాగౌడ్
2) లక్ష్మీనారాయణ గౌడ్
3) మన్నెంకొండ హనుమద్దాసు
4) రాకమచర్ల వేంకటదాసు
7. సీతా అనే ముద్రతో 550 గేయకృతులు రచించిన పూర్వ వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన ప్రముఖ తత్వకవి?
1) కైరం భూమదాసు
2) బోయధర్మయ
3) మామిడి పల్లి సాంబశివ వర్శ
4) పరశురామ పంతుల లింగమూర్తి
8. మిత్తిలి కళాకారులు ఉపయోగించేది?
1) పడిగెబుర్ర 2) హంసబుర్ర
3) తబలా 4) హర్మోనియవమ్
9. మిత్తిలి కళాకారుల ప్రదర్శనలో ప్రత్యేకంగా ఉపయో గించే వాయిద్యాన్ని ఏమంటారు?
1) కడ్డీతంత్రి 2) జేగంట
3) రుంజ 4) ఏకతార
10. తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు?
1) మహ్మద్ అబ్దుల్లా 2) చెర్విరాల భాగయ్య
3) మాదారి భాగయ్య 4) అమృత షేర్గిల్
11. తెలంగాణ తొలి చిత్రకారుడుగా గుర్తింపు పొందిన వారు?
1) వెంకట్రామయ్య 2) బాణయ్య
3) వెంకటాచలం 4) జానయ్య
12. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ తొలి ప్రిన్సిపాల్?
1) సుకుమార్ దేవస్కర్ 2) గోపాల్ దేస్కర్
3) సయ్యద్ అమ్మద్ 4) పి.టి.రెడ్డి
13. రూప్‌ఖాన్ పేట రత్తమ్మ రచించిన యక్షగానం పేరు?
1) శివకురవంజి 2) కనకతార చరిత్రము
3) సారంధర 4) మార్కండేయ విలాసం
14. శారగాండ్రు దేనిని భుజాన పెట్టుకొని చేతితో వాయిస్తారు?
1) పడిగె బుర్ర 2) హంసబుర్ర
3) తాంబుర్ర 4) కడ్డీవాద్యం
15. భాట్స్ ఉపయోగించే ప్రత్యేక వాద్యం?
1) డోలి 2) రబాబ్ 3) కిక్రి 4) టిప్లింగ్
16. కోయ చరిత్రను చెప్పే కళారూపం?
1) పట్టెడ 2) జౌజాం
3) డోలి 4)కడ్డీవాద్యం
17. 'మాభూమి ' చిత్రంలో బి.నరసింగరావు ఏ పాత్రలో ఉంటారు?
1) రామయ్య 2) బాలయ్య
3) నాగయ్య 4) జానయ్య
20. పూర్వనల్లగొండ జిల్లా నారాయణపురానికి చెందిన జయసింహారావు అనే దొర గడిలో ఉండే ఎవరి జీవితం 'దాసి' చిత్రకథ?
1) మీనాక్షి 2) కమలాక్షి
3) సంద్య 4) లక్ష్మీ
21. బి.నరసింగరావు 'దాసి' సినిమాను ఏ సంవత్సరంలో తీసారు?
1) 1985 2) 1987
3) 1988 4) 1989
22. పైడిజయరాజ్ నటించిన మొదటి చిత్రం?
1) రసీలి రాణి 2) జగ్మతీజవానీ
3) నైన్ అవర్స్ టు రామా
4) ఖూనీకౌన్ ముజ్రింకౌన్
23. పైడి జయరాజ్ పొందిన అవార్డు?
1) పద్మవిభూషణ్ 2) భారతరత్న
3) పద్మభూషణ్ 4) పద్మశ్రీ
24. తెలంగాణ ఐక్యవేదిక ఆరంభించడంలో ముఖ్య పాత్ర వహించినది ఎవరు?
ఎ) ప్రొ.కేశవరావు జాదవ్ 2) ప్రొ.ఐ.తిరుమలి
3) కొండా లక్షణ్ బాపూజి 4) ఆనందరావు తోట
25. వీవీప్యాట్(ఓటర్ వెరఫయబుల్ పేపర్ ఆడిట్ (టయిల్) ను రూపొందించింది ఎవరు?
1) బీహెచ్ఈఎల్ 2) బీడీఎల్
3) ఈసీఐఎల్ 4) మిథానీ
26. నుమాయిష్ అనగా?
1) మజ్జర్ 2) మచ్చర్
2)మస్నత్-ఇ-ముల్కి 4) బజే-ఇ-ముల్కి
27. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంటులో తొలి పీహెచ్డీ అందుకున్న వ్యక్తి?
1) పల్లాదుర్గయ్య
2) బిరుదురాజు రామరాజు
3) పాకాల యశోధారెడ్డి
4) యం. వెంకటేశ్వరరావు
28. జైలు కథలు రచయిత?
1) వట్టికోట ఆళ్వారు స్వామి
2) సంగెం లక్ష్మీబాయి
3) పొట్లపల్లి రామారావు
4) దాశరథి రంగాచార్య
29. ఎవరి పట్టిన రోజును ప్రపంచ మిమిక్రి దినంగా జరుపు కొంటున్నారు?
1) అచ్చి వేణుగోపాల్ 2) నేరెళ్ళ వేణుమాధవ్
3) పి.టి. రెడ్డి 4) టి.ఎల్. కాంతరావు
30. తెలంగాణ నిర్మాత తీసిన తొలి సినిమా ఏది?
1) ఆరాధన 2) ఆకలి
3) ఆదర్శం 4) చివరకు మిగిలేది
31. హైదరాబాద్‌లో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏది?
1) సినిమాఘర్ 2) నిషాత్ టాకీస్
3) బసంత్ టాకీస్ 4) సెలెక్ట్ టాకీస్
32. మణిశంకర్ అయ్యర్ రాసిన 'రాజీవ్ మై డార్లింగ్' పుస్తకాన్ని తెలుగులో అనువదించినవారు?
1) పి.వి. నరసింహారావు 2) ఆర్. సత్యనారాయణ
3) నందిని సిధారెడ్డి 4) కె. రామచంద్రమూర్తి
33. 1969 కాలంలో మొదటిసారిగా జై తెలంగాణ అంటూ మరణించిన శాలిబండకు చెందిన అమ్మాయి పేరు?
1) కురుణ 2) లక్ష్మి
3) అరుణ 4) వాణి
34. ఏ విదేశీ పత్రిక నేరెళ్ళ వేణుమాధవ్ కథనం ప్రచురించి ఓరుగల్లు నుండి ఐక్యరాజ్యసమితి వరకు ప్రస్థానాన్ని వివరించింది?
1) గల్ఫ్‌న్యూస్ 2) అమెరికన్ రిపోర్టర్
3) ది స్టేట్స్‌మన్ 4) చైనా డైలీ
35. 'మ్యాన్‌కైండ్' పత్రికను నిర్వహించిన వారు?
1) ఎండవల్లి నారాయణ 2) కాళోజి నారాయణరావు
3) యం.టి. ఖాన్ 4) కేవశరావు జాదవ్
36. మిస్ జొహ్రాజాన్ నటించిన తొలి టాకీ చిత్రం ఏది?
1) నందకుమార్ 2) నీతి విజరు
3) అనంగసేన 4) రాధాకృష్ణ
37. 'హైదరాబాద్ కీ నాజ్నీస్' గా పేరుపొందిన నటి?
1) జుబేదా బేగం 2) నిగార్ సుల్తాన్
3) మిస్జొహ్రజాన్ 4) సుల్తానా బేగం
38. బ్రిటన్‌లో ప్రాసెస్ అయిన తొలి భారతీయ చిత్రం?
1) ఆలంఆరా 2) షిరీన్ పరహద్
3) బిల్వమంగళ్ 4) బర్సాత్
39. శంకర్‌సింగ్ సంగీతం చేసిన తొలి చిత్రం?
1) జీవితచక్రం 2) ప్యార్ కీ జీత్
3) షత్రంజ్ 4) బర్సాంత్
40. తోటి కథలో ప్రధానమైన వాయిద్యం?
1) కాలికోవమ్ 2) ప్రేపేరే
3) డోలు 4) కీకిరి
41. బైండ్ల కథలో కథకుడు వాయించే ప్రధానమైన వాయిద్యం?
1) జమిడిక 2) డోలు
3) బత్తెం 4) పలకలు
42. బైండ్లవారు తెల్లగుడ్డపరిచి ప్రతిబోనం నుంచి కొంత అన్నం తీసి గుడ్డ మీద పోస్తారు. ఇట్లా అన్నాన్ని కుప్పగా పోయడాన్ని ఏమంటారు?
1) వీరగోల 2) పంభం
3) కుంభం 4) మైలపట్నం
43. పిచ్చుక కుంట్లు ఎవరి కులస్థుల వంశ చరిత్రను తెలిపే పురాణాలను గానం చేస్తూ కులగోత్రాలను తెలుపుతున్నారు?
1) మాల 2) మాదిగ
3) బైండ్ల 4) రెడ్డి
44. గ్రామాల్లోని అన్ని కులాల వాళ్లను ఆకట్టుకోవడం కోసం విజ్ఞాన వినోదాలను పంచడం కోసం హిందూ పురాణేతిహాస సంబంధగాథను ప్రదర్శి స్తారు. దీనిని ఏమంటారు?
1) గౌరాద 2) మాదిగ 3) బైండ్ల 4) రెడ్డి
45. 'గొందళే' ఏభాషకు చెందిన పదం?
1) తెలుగు 2) ఉర్దూ
3) మరాఠీ 4) పటోట
46. ఏ కులానికి ఉపకులంగా గొంధళీలు వీధిబాగోతం ప్రదర్శిస్తున్నారు?
1) పద్మశాలి 2) ఆరెమరాఠీ
3) మాదిగ 4) కన్నడ
47. కడ్డీ తంత్రి వాయిద్యంపై కథాగానం చేసేవారిలో ప్రసిద్ధ గాయకుడిగా సుప్రసిద్ధ వాయిద్య కారుడిగా పేరున్న వారు ఎవరు?
1) చుక్కరామయ్య 2) బాగారి రామయ్య
3) దురిసేటి రామయ్య 4) కనకాలు
48. కోలాట నృత్యం చేసేటప్పుడు సమూహంలోని కళాకా రులు జంటలు జంటలుగా ఏర్పడతారు. ఆ జంటను కలిపి ఏమంటారు?
1) ఉసెత్తు కోవటం 2) ఉద్ది
3) కొప్పు 4) పలాయి ఇవ్వడం
49. 'సాధనాశూరులు' అనే కళారూపం కళాకారులు ఏ కులం దగ్గర ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తూ ఆశ్రయిస్తారు?
1) గౌడ 2) యాదవ
3) పద్మశాలి 4) మాదిగ
పృథికుమార్ చౌహాన్
డైరెక్టర్, పృథిఐఏఎస్ స్టడీసర్కిల్
దిల్సుఖ్నగర్,హైదరాబాద్
ఫోన్: 9177602890
Authorization