1. 2019 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేరు ఏమిటి?
ఎ) జనరల్ బడ్జెట్
బి) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
సి) ఆఫ్ ఇయర్లీ బడ్జెట్
డి) బడ్జెట్‌కు పేరు లేదు
2. క్రీడా రంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కేటాయింపులో సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) 2019-20కి రూ.2,216.92 కోట్లను కేటాయించారు
2) ఇది గతేడాదితో పోలిస్తే రూ.500 కోట్లు అధికం
3) 2018-19 లో క్రీడలకు రూ.2002.72 కోట్లను కేటాయించారు.
ఎ) 1, 3 సరైనవి బి) 1, 2 సరైనవి
సి) పైవన్నీ సరైనవే డి)ఏవీకాదు
3. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కింది ప్రధాన పథకాల కేటాయింపులో బడ్జెట్ అంచనా విలువలను జతపరచండి?
1. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన ఎ) రూ.11000 కోట్లు
2. సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర వాటా
బి)రూ.25853 కోట్లు
3. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం
సి) రూ.931 కోట్లు
4. ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన
డి. రూ.13900 కోట్లు
5. అమృత్, స్మార్ట్ సిటీలు ఇ. రూ.9516 కోట్లు
ఎ) 1-ఇ, 2-బి, 3-సి, 4-ఎ, 5-డి
బి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి, 5-ఇ
సి) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-డి
డి) 1-బి, 2-ఇ, 3-సి, 4-ఎ, 5-డి
4. తాత్కాలిక బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల విలువ?
ఎ) రూ.3,111.20 కోట్లు బి) రూ.3500.20 కోట్లు
సి) రూ.3,725.45 కోట్లు డి) రూ.3,850.45 కోట్లు
5. 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి'వ పథకం సరైన సమాచారాన్ని గుర్తించండి?
1) 2 హెక్టార్ల దాకా సాగుభూమి ఉండే రైతులకు ఏడాదికి రూ.6వేలు అందిస్తారు
2) ఈ పథకం 2018 డిసెంబర్ 1 నుంచి అమలవుతుంది
3) ఇందుకోసం కేంద్రం రూ.75 కోట్లను కేటాయించింది
4) దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారు
ఎ) 1, 2, 3 సరైనవి బి) 2, 3, 4 సరైనవి
సి) పైవన్నీ సరైనవే డి) 1, 2 మాత్రమే
6. మహిళల భద్రత కోసం కేటాయించిన రూ.50 కోట్లు 'నిర్భయనిధి' ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది?
ఎ) కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ
బి) కేంద్ర హోం శాఖ
సి) కేంద్ర రక్షణ శాఖ డి) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
7. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి కేటాయించిన వివరాలలో కింది వానిలో సరైన దానికి గుర్తించండి?
1) కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో రూ.61,398 కోట్లు కేటాయించారు.
2) 'ఆయుష్మాన్ భారత్' గతేడాది కంటే 16 శాతం అధికంతో రూ.6400 కోట్లు కేటాయింపు
3) ఎయిడ్స్, ఎస్టీడీ నియంత్రణకు రూ.2500 కోట్లు కేటాయింపు 4) పైవన్నీ సరైనవే
ఎ) 1, 2 మాత్రమే బి) 3, 2 మాత్రమే
సి) 4 మాత్రమే డి) 1, 3 మాత్రమే
8. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖకు కేటాయిం చిన అంశాలలో ఈ కింది ఏది వానిలో సరైనదో గుర్తించండి?
1. 2019-20లో రైల్వే స్థూల ఆదాయం : రూ.2,72, 705.68 కోట్లు
2. 2019-20లో జీతాలు సహా రెవెన్యూ వ్యయం రూ.10వేల కోట్లు
3. దేశీయంగా రూపొందిన సెమీ హైస్పీడ్ రైలుకు 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' అని పేరు
4. 2019-20 లో రూ.1.58 లక్షల కోట్లు మూలధన ఖర్చుగా కేటాయింపు
ఎ) 1, 3 మాత్రమే బి) 1, 2, 3 మాత్రమే
సి) పైవన్నీ సరైనవే డి) 1, 3, 4 మాత్రమే
9. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో ఎంత శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇస్తోంది?
ఎ) 5.6 శాతం బి) 3.3 శాతం
సి) 3.4 శాతం డి) 2.43 శాతం
10. ప్రధాన మంత్రి పంటల బీమా యోజన కింద 2019-20 లో కేంద్ర ప్రభుత్వం భరించనున్న బీమా ప్రీమియం మొత్తం విలువ ఎంత?
ఎ) రూ.14 వేల కోట్లు బి) రూ.6.13 వేల కోట్లు
సి) రూ.15 వేల కోట్లు డి) రూ.15.6 వేల కోట్లు
11. సెక్షన్ 87ఎ ప్రకారం చెల్లించాల్సిన పన్ను మొత్తంలో నుంచి ఇచ్చే రాయితీని ఏమంటారు?
ఎ) రిబేటు బి) డిస్కౌంటు
సి) ట్యాక్స్ రెడ్యూజ్ డి) ట్యాక్స్ డిస్కౌంట్
12. ద్రవ్య లోటు నుంచి చెల్లించిన వడ్డీలను తీసి వేస్తే వచ్చే మొత్తాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) సాధారణ లోటు బి) ప్రాథమిక లోటు
సి) ద్వితీయ శ్రేణి లోటు డి) తృతీయ శ్రేణి లోటు
13. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంత శాతం నమోదవుతుందని తాత్కాలిక బడ్జెట్లో అంచనా వేశారు?
ఎ) 3.3 శాతం బి) 3.7 శాతం
సి) 3.4 శాతం డి) 3.5 శాతం
14. తాత్కాలిక బడ్జెట్ (2019-20) ప్రకారం జీఎస్టీ నుంచి ప్రతీ రూపాయిలో ఎంత విలువ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం లభించనుంది?
ఎ) 0.70 పైసలు బి) 0.23 పైసలు
సి) 0.21 పైసలు డి)0.50 పైసలు
15. అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో నెలకు రూ. 3000ను అందించే సరికొత్త పథకం?
ఎ) ప్రధాన మంత్రి సురక్ష పింఛన్ యోజన
బి) ప్రధాన మంత్రి పింఛన్ యోజన
సి) ప్రధాన మంత్రి కార్మిక సంరక్షణ యోజన
డి) ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్
16. 2019-20 మధ్యంతర కేంద్ర బడ్జెట్లో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకం?
ఎ) ప్రధాన మంత్రి కిసాన్ సంక్షేమ యోజన
బి) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన
సి) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
డి) ప్రధాన మంత్రి రైతు బంధు నిధి
17. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం బడ్జెట్ విలువ ఎంత?
ఎ) రూ. 25.64 లక్షల కోట్లు బి) రూ. 26.74 లక్షల కోట్లు
సి) రూ. 28.74 లక్షల కోట్లు డి) రూ. 27.84 లక్షల కోట్లు
18. 2019 ఫిబ్రవరి 1న కేంద్ర తాత్కాలిక బడ్జెట్ (2019-20)ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ఎవరు?
ఎ) పీయూష్ గోయల్ బి) రాజ్‌నాథ్ సింగ్
సి) అరుణ్ జైట్లీ డి) సుష్మా స్వరాజ్
19. మహిళల అక్రమ రవాణా బాధితుల పునరావాస కార్యక్రమం కోసం కింది ఏ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్లను 2019-20 బడ్జెట్లో కేటాయించింది?
ఎ) మహిళా శక్తి కేంద్రాలు బి) ఉజ్వల
సి) బేటీ బచావో బేటీ పడావో డి) సేవ్ స్త్రీ
20. దేశ వ్యాప్తంగా గోసంపదను జన్యుపరంగా తీర్చిది ద్దేందుకు, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం?
ఎ) గోసంరక్షణ నయా విధాన్
బి) గో అయోగ్
సి) రాష్ట్రీయ కామధేను అయోగ్
డి) గో సంరక్షణ అయోగ్
21. 2019-20 బడ్జెట్లో ప్రకటించిన రెవెన్యూలోటు, కోశలోటు, ప్రాథమిక లోటులను వరుసగా గుర్తించండి?
ఎ) రూ.8,06,507 కోట్లు, రూ.7,03,999 కోట్లు, రూ.38,938 కోట్లు
బి) రూ.4,70,214 కోట్లు, రూ.7,03,999 కోట్లు, రూ.38,938 కోట్లు
సి) రూ.7,03,999 కోట్లు, రూ.8,06,507 కోట్లు, రూ.38,938 కోట్లు
డి) రూ.38,938 కోట్లు, రూ.7,03,999 కోట్లు, రూ.4,70,214 కోట్లు
22. పీయూష్ గోయల్ కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా ఏ రోజు నుంచి కొనసాగుతున్నారు?
ఎ) 2018 డిసెంబర్ 31
బి) 2019 జనవరి 23
సి) 2019 జనవరి 26
డి) 2019 జనవరి 1
సమాధానాలు
1.బి 2.ఎ 3.సి 4.ఎ 5.సి
6.బి 7.సి 8.డి 9.డి 10.ఎ
11.ఎ 12.బి 13.సి 14.సి 15.డి
16.సి 17.డి 18.ఎ 19.బి 20.సి
21.బి 22.బి
Authorization