1. తెలంగాణ భాషలో కథలు రాసిన తొలి రచయిత్రి?
ఎ) పాకాల యశోధరెడ్డి బి) ఇల్లిందల సరస్వతిదేవి
సి) బొమ్మ హేమాదేవి డి) భండారు అచ్చమాంబ
2. 'తెలంగాణ జనపరిషత్'తో సంబంధం లేనివారు?
ఎ) ప్రొ|| జయశంకర్
బి) ప్రొ|| కేశవరావు జాదవ్
సి) కొండా లక్ష్మణ్ బాపూజీ డి) దాశరథి
3. 'తహన' విన్యాసం ఏ నృత్యంలో ఉంటుంది?
ఎ) పేరిణి నృత్యం బి) బంజార నృత్యం
సి) గుమేలా నృత్యం డి) థిమ్సా నృత్యం
4. నిగార్ సుల్తానాకు నటిగా గొప్పపేరు తెచ్చిన చిత్రం?
ఎ) రంగభూమి బి) ఆగ్
సి) మొఘల్-ఏ-ఆజమ్
డి) హైదరాబద్ కీ నాజ్నీస్
5. 'ముజ్రా' నృత్యం చేసిన హైదరాబాద్ నర్తకి,నటి, గాయని ఎవరు?
ఎ) మిస్ జోహ్రాజాన్ బి) నిగార్ సుల్తానా
సి) టబు డి) జుబేదా బేగం
6. 1920లో నిర్మించిన 'సెలెక్ట్ టాకీస్' ఆ తరువాత ఏ టాకీస్‌గా మారింది?
ఎ) ఎస్టేట్ టాకీస్ బి) జుమ్రుద్ టాకీస్
సి) సాగర్ టాకీస్ డి) జమున టాకీస్
7. ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ పూర్వపు ఏ జిల్లాకు చెందిన వారు?
ఎ) వరంగల్ బి) నిజామాబాద్
సి) ఖమ్మం డి) కరీంనగర్
8. ఎం.ఎ.రహెమాన్ స్వతంత్రంగా కెమేరామెన్‌గా పనిచేసిన తొలి చిత్రం?
ఎ) బిల్లమంగళ్ బి) ఆలంఆరా
సి) భక్తిమాల డి) సప్తస్వరాలు
9. నారాదాసు లక్ష్మణ్‌రావు, ఉదరుకుమార్ దర్శకత్వం లో 1948లో తీసిన చిత్రం?
ఎ) కొమరంభీం బి) విముక్తి కోసం
సి) బతుకమ్మ డి) భక్తరామదాసు
10. తెలంగాణ సినిమాకు తొలి చరిత్రకారుడు?
ఎ) వారాల ఆనంద్ బి) హెచ్.రమేష్‌బాబు
సి) సి.నారాయణరెడ్డి డి) యు.విశ్వేశ్వరరావు
11. గ్రామీణ వ్యవస్థలో పెత్తందారి వర్గాలకు బలవు తున్న బడుగు జీవులకు అండగా నిలిచిన ఒక వ్యక్తి కథను ఏ సినిమాగా తీశారు?
ఎ) ఊరుమ్మడి బతుకులు బి) మార్గదర్శి
సి) మాంగల్యం డి) నిమజ్జనం
12. 'ఎక్ నయీ ఇతిహాస్' అనే ఏకైక హిందీ చిత్రాన్ని తీసినవారు?
ఎ) హెచ్.వి.బాబు బి) అజిత్
సి) బి.ఎస్.నారాయణ డి) నర్సింగరావు
13. పైడి జయరాజ్ నటించిన తొలి టాకీ?
ఎ) షికారి బి) మాయా
సి) హమారీ బాత్ డి) ఖూనీ కౌన్ ముజ్రింకౌన్
14. సరోజినీ నాయుడు చెల్లెళ్లైన సునాళినీదేవి, మృణా ళినీ దేవిలు 1925లో ఇద్దరు ఏ మూకీ చిత్రంలో నటించారు?
ఎ) ది లైట్ ఆఫ్ ఆసియా బి) నైన్ అవర్స్ టూ రామా
సి) నైటింగేల్ ఆఫ్ ఇండియా డి) జగ్మతీ జవానీ
15. మిస్ జోహ్రాజాన్ 1929లో తొలిసారిగా నటించిన మూకీ చిత్రం?
ఎ) రాధాకృష్ణ బి) నందకుమార్
సి) నీతి విజరు డి) అనంగసేన
16. ఏ సంవత్సరంలో 'పుత్లిబౌలీ బావి' వద్ద 'ఆస్రాని బయోస్కోప్ పేరిట' ఒక తొలితరం సినిమా థియేటర్ ఉండేది?
ఎ) 1918 బి) 1921 సి) 1924 డి) 1926
17. రాజ్‌కపూర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన తెలంగాణకు చెందిన సంగీత దర్శకుడు ఎవరు?
ఎ) బి.శంకర్ బి) లక్ష్మీకాంత్
సి) శంకర్‌సింగ్ డి) ఇక్బాల్ ఖురేషి
18. 'దావత్' నాటకం రాసినవారు?
ఎ) బాదల్ సర్కార్ బి) రవీంద్రనాథ్ ఠాగూర్
సి) సురవరం ప్రతాపరెడ్డి డి) దాశరథి
19. ఎవరికి కేటాయించిన గ్రామాల్లో వారే కథలు చెప్పాలి, వేరేవారు చెప్పడానికి వీలులేదు. దీన్ని ఏమంటారు?
ఎ) వీరగోల బి) మిరాశి హక్కు
సి) గ్రామ హక్కు డి) జన్మ హక్కు
20. చిందోళ్ళు మాదిగల ఆశ్రిత కులంవాళ్ళు కావడం వల్ల పోషిత మాదిగల కోసమే ప్రదర్శించే దాన్ని ఏమంటారు?
ఎ) గౌరాద బి) ఊరాట సి) సింధాట డి) పేవిడి
21. 'జాతర' ఏ పదం?
ఎ) మరాఠా పదం బి) ద్రావిడ పదం
సి) తెలుగు పదం డి) ఉర్దూ పదం
22. 'గోంధళే' అనగా
ఎ) కొలుపు బి) గెలుపు
సి) మరపు డి) మలుపు
23. గుస్సాడీ సమయాన్ని ఏ పండుగగా పిలుస్తారు?
ఎ) ఖండేరావు పండుగ బి) చాంగోజీ పండుగ
సి) సట్టువాజి పండుగ డి) దండారి పండుగ
24. 'గోందళే' ఏ భాషా పదం?
ఎ) తెలుగు బి) మరాఠా
సి) ద్రావిడ డి) ఉర్దూ
25. మాలలకు ఆశ్రిత కులం?
ఎ) మిత్తుల వారు బి) గొందళే వారు
సి) భవానీలు డి) భిక్షుక కుంట్లు
26. గిరిజనులు 'కోలాటాన్ని' ఏమని పిలుస్తారు?
ఎ) పిన్నల్ కోలాట్టం బి) దాండియారాస్
సి) దాండియా డి) దండారి నృత్యం
27. 'కోపు' అనగా?
ఎ) పాట భేదం బి) నాట్యగీతి భేదం
సి) సుట్టు డి) జంట మనిషి
28. కింది వాటిలో భిన్నమైనది ఏది?
ఎ) కంఠకూడిక బి) కండోల వీణ
సి) 12 మెట్ల కిన్నెర డి) కండోళి
29. రాజగోండుల చరిత్ర సంస్కృతిని తన జ్ఞాపకాలతో గుర్తుంచుకుని పురాణాలని గానం చేసే వారిని ఏమంటారు?
ఎ) పటాడి బి) మిత్తిలి
సి) భిక్షుక కుంట్లు డి) సాద్గనాసూరులు
30. మూల స్తంభ పురాణం, విశ్వకర్మ పురాణం, పార్వతీ కళ్యాణం కథలను చెప్పేవారిని ఏమంటారు?
ఎ) రుంజలు బి) సాధనాశూరులు
సి) పర్దాన్లు డి) తోటి
31. 'కాలికొం' అనగా
ఎ) వాయిద్యం బి) కథ
సి) తంబూరా డి) నగారా
32. 'తోలు బొమ్మలాట' అనే గ్రంథాన్ని రాసినవారు?
ఎ) ఆచార్య మొదలి నాగభూషణ శర్మ
బి) ఆచార్య జయధీర్ తిరుమల రావు
సి) ఆచార్య భట్టు రమేష్
డి) ఆచార్య బిరుదురాజు రామరాజు
33. 'ప్రేపేరే' అనగా
ఎ) ఢమరుకం బి) డోలి
సి) సన్నాయి డి) కీకిరి
34. 'శివకురవంజి' యక్షగానాన్ని రచించినవారు?
ఎ) చెర్విరాల భాగయ్య బి) మహ్మద్ అబ్దుల్లా
సి) రత్తమ్మ డి) శారద
35. 'అణాగ్రంథమాల' సంపాదకుడిగా వెల్దుర్తి మాణిక్యరావు అయితే వ్యవస్థాపకుడు ఎవరు?
ఎ) కె.సి.గుప్త
బి) వెంకట రామ నరసింహారావు
సి) వట్టికోట ఆళ్వారు స్వామి డి) ఎం.ఎస్.ఆచార్య
36. 'ఆంధ్ర సారస్వత పరిషత్తు' ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1941 బి) 1942 సి) 1943 డి) 1944
37. 'కోక' అనగా ?
ఎ) వేరుశెనగ బి) పాన్ డబ్బా
సి) తలుపు డి) దారి
38. ఆడవాళ్ళుమాత్రమే చేసే నృత్యం?
ఎ) థిమ్సా నృత్యం బి) పర నృత్యం
సి) హురెకౌలా నృత్యం డి) ఖేల్ నృత్యం
39. 'కల్చర్' ఏ భాష పదం?
ఎ) ఇంగ్లీష్ బి) జర్మనీ
సి) ఫ్రెంచ్ డి) జపాని
40. 'తెలంగాణ'పదం కింది వాటిలో ఏ శాసనంలో ప్రయోగించారు?
ఎ) తెల్లాపూర్ శాసనం బి) వెలిచర్ల శాసనం
సి) నాసిక్ శాసనం డి) నానేఘాట్ శాసనం
41. 'కొత్తగా చెరువులు నిర్మించిన గ్రామాల్లో ఐదు సంవత్సరాల వరకు పన్ను విధించకుండా మినహాయింపు ఇచ్చేదాన్ని ఏమని అనేవారు?
ఎ) బాందులు బి) దుంబాల
సి) దశబంధ డి) దులేటి
42. పశువులను అలంకరించి జరిపే పండుగను ఏమంటారు?
ఎ) కొట్రావుల పండుగ బి) అలానా పండుగ
సి) చాంగోని పండుగ డి) సట్టువాజి పండుగ
43. 'ప్రజా కళలు' పుస్తక రచయిత?
ఎ) ఆచార్య బి.రామరాజు
బి) మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
సి) డా|| జయధీర్ తిరుమలరావు
డి) జూలూరి గౌరిశంకర్
44. కింది వాటిలో భిన్నమైనది ఏది?
ఎ) ఒగ్గుకథ బి) చిందు
సి) పగటి వేషాలు డి) తోలు బొమ్మలాట
45. ఇంటి ముందు పందిరిలో అయిదు లేక తొమ్మిది మంది అదే వంశానికి చెందిన వారికి అన్నంలో బెల్లం కలిపి వడ్డించడాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) చార బంతి బి) బువ్వబంతి
సి) రవ్వ బంతి డి) జమబంతి
46. 'మామిడి కొత్త' అనే డ్యాన్స్‌ను ఎవరు చేస్తారు?
ఎ) కొండరెడ్లు బి) గోండులు
సి) యానాదులు డి) ప్రధాన్‌లు
47. గురువులు మరణించినపుడు వారి పార్థివ దేహాలపై పెద్ద పెద్ద సమాధులను నిర్మించేవారు. వీటిని ఏమని పిలుస్తున్నారు?
ఎ) పీరిలు బి) దర్గాలు సి) చమాకాలు డి) దనీలు
48. 'తబుకు' అనగా?
ఎ) హారతి పళ్లెం బి) అర్రెం
సి) అరికంట్లం డి) తమ్మలి
49. కొంత రక్తాన్ని అన్నంలో కలిపి, ఒక తట్టలో ఆ అన్నాన్ని తీసుకుని చాకలివాడు పొలం దగ్గరకు వెళ్తాడు. ఈ అన్నాన్ని ఏమని అంటారు?
ఎ) బొట్టు బి) సర్వు
సి) అద్దం దోసిలి డి) పచ్చపొలి
50. 'తీజ్' ఉత్సవాలు ఎన్ని రోజులు జరుపుకుంటారు?
ఎ) 5 బి) 7 సి) 9 డి) 11
సమాధానాలు
1.ఎ 2.బి 3.ఎ 4.సి 5.ఎ
6.ఎ 7.ఎ 8.సి 9.బి 10.బి
11.బి 12.సి 13.ఎ 14.ఎ 15.బి
16.బి 17.సి 18.బి 19.బి 20.బి
21.బి 22.ఎ 23.డి 24.బి 25.ఎ
26.డి 27.బి 28.సి 29.ఎ 30.ఎ
31.ఎ 32.ఎ 33.సి 34.సి 35.ఎ
36.సి 37.బి 38.ఎ 39.బి 40.బి
41.బి 42.ఎ 43.సి 44.డి 45.బి
46.ఎ 47.బి 48.ఎ 49.బి 50.సి
Authorization