1. 'కోలిక ' వృత్తుల వారు అనగా?
1) పద్మశాలి 2) వడ్రంగి
3) హాలిక 4) కుమ్మర
2. తెలంగాణలో ఇనుపయుగంలోనే అక్షరాలను పోలిన రాతలను, ఇనుప యుగపు ప్రజలు, సమాచార వ్యక్తీకరణకు వినియోగించిన ఆధారాలు ఎక్కడ బయట పడ్డాయి?
1) రామగిరి 2) రాయగిరి
3) ఫణిగిరి 4) పెద్దబంకూర్
3) ఇప్పటి వరకు లభిస్తున్న ఆధారాలను బట్టి మొదటి తెలుగు మాట ఏది?
1) నాగబు 2) అత్త 3) అన్న 4) పిల్ల
4. కిందివారిలో ఎవరు తన గ్రంథంలో గోదావరి నదిని గంగ లేదా 'గౌతమీ గంగ' అని ప్రస్తావించిన వారు?
1) టాలెమి 2) ప్లీని
3) ఇత్సింగ్ 4) ఫాహియాన్
5) కింది వాటిలో దేనిలో శాతవాహనులను ఆంధ్రులని పేర్కొన లేదు?
1) మత్స్యపురాణం 2) నాణేలు శాసనాలు
3) వాయుపురాణం 4) బ్రహ్మండపురాణం
6) శాతవాహన వంశ స్థాపకుడు చిముకుని నాణాలు ఎక్కడ దొరికాయి?
1) నాగార్జున కొండ 2) కోటిలింగాల
3) కొండాపూర్ 4) ధూళికట్ట
7. తెలంగాణ ప్రాంతంలో క్రీ.పూ.6వ శతాబ్దిలో వెలసిన మొట్టమొదటి రాజ్యం?
1) ములక 2) మగద 3) అస్మక 4) అవంతి
8. బుద్ధుని సమకాలికుడు?
1) బుద్ధఘోష 2) బావరి
3) బాణభట్ట 4) బాదన
9. 'కపిస్థవనం అనగా?
1) మామిడి చెట్ల వనం 2) వేపచెట్ల వనం
3) వెలగచెట్ల వనం 4) మర్రి చెట్ల వనం
10. అపరశైల అనగా?
1) ధన్యకటకం 2) శ్రీపర్వతం
3) గుంటుపల్లి 4) జగ్గయ్య పేట
11. ఆచార్య నాగార్జుని సహృల్లేఖను ప్రతి విద్యార్థి కంఠస్థం చేసేవాడని ఎవరు పేర్కొన్నారు?
1) ఫాహియాన్ 2) ఇత్సింగ్
3) టాలెమి 4) ప్లీని
12. ''శాతవాహనుడు అదే రాజు నాణెము'' ఎక్కడి తవ్వ కాలలో లభించింది?
1) కొండాపూర్ 2) ఫణిగిరి
3) పెద్దబంకూర్ 4) నాగార్జున కొండ
13. రాగిరేకులతో చేసిన మానవాకృతులు, భజన చేసే ఇత్తడి రేకులు ఎక్కడ లభించాయి?
1) పేరుపల్లి 2) వలసగట్టు
3) అందుగుల 4) కానాపూర్
14. శాతవాహనుల మొదటి రాజధాని?
1) అమరావతి 2) కోటిలింగాల
3) పైఠాన్ 4) ధాన్యకటకం
15. కింది వాటిని దేని ప్రకారం ఇక్ష్వాకులు నలుగురు రాజులు?
1) మత్స్య పురాణం 2) నాణేలు
3) శాసనాలు 4) వాయుపురాణం
16. ఇక్ష్వాకుల మూల పురుషుడు?
1) ఎహవల శాంతమూలుడు 2) వీరపురిసదతుడు
3) రుద్రపురిసదతుడు 4) మొదటి శాంతమూలుడు
17. ఏ ఇక్ష్వాకుల రాజు లక్ష ఆవుల్ని, లక్ష నాగళ్ళను దానం చేసినట్లు శాననాల్లో ఉంది?
1) వీరపురుషదత్తుడు 2) రుద్రపురుషదత్తుడు
3) మొదటి శాంతమూలుడు 4) రెండో శాంతమూలుడు
18. ఏ సంవత్సరంలో ఏలేశ్వరంలో జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలపు కట్టడాలు, వస్తు సామాగ్రి వెలుగు లోకి వచ్చాయి?
1) 1972 2) 1952 3) 1963 4) 1984
19. ఫణిగిరి బౌద్ధక్షేత్రం ఏ కాలానికి చెందినది?
1) శాతవాహనులు 2 ) ఇక్ష్వాకులు
3) విష్ణుకుండినులు 4) చాళుక్యులు
20. ఇక్ష్వాకుల రాజధాని?
1) అమరావతి 2) బ్రహ్మపురి
3) విజయపురి 4) శుక్రపురం
21. ఆచార్య నాగార్జునుడి సంబంధం లేని గ్రంథం ఏది?
1) ప్రజ్ఞాపారమిత 2) మాధ్యమిక కారికా
3) రత్నావళి 4) కాతంత్రవ్యాకరణం
22. గుణాఢ్యుడు 'బహత్కథ' అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు?
1) పాకృతం 2) సంస్కృతం
3) పైశాచీ 4) తెలుగు
23. మహారాజు బిరుదుగల ఇక్ష్వాకుల రాజు?
1) వాశిష్టపుత్ర సిరి శాంతమూలుడు
2) మాధరీ పుత్ర వీరపురుషదత్తుడు
3) రుద్రపురుష దత్తుడు
4) ఎహువలశాంతమూలుడు
24. శ్రీ పర్వతం ఏ బౌద్ధాని ప్రసిద్ధి?
1) హీనయాన 2) మహాయాన
3) ధేరవాద 4) జనవాద
25. రెండు అశ్వమేథ, రాజసూయ యాగం నిర్వహించిన శాతవాహనరాజు?
1) గౌతమీ పుత్ర శాతకర్ణి 2) మొదటి శాతకర్ణి
3) శ్రీముఖుడు 4) మొదటి పులుమావి
26. విష్ణుకుండినుల రాజు చిహ్నం?
1) లంఘిస్తున్న సింహం 2) నందిపాదం
3) స్వస్తిక్ 4) త్రిరత్నం
27. అగ్నిష్టోమ, అగ్నిహౌత్ర, అశ్వమేథ, వాయిపేయ యాగాలను చేసి ఇక్ష్వాకుల రాజు?
1) రుద్రపురుష దత్తుడు
2) ఎహువల శాంతమూలుడు
3) వీర పురుషదత్తుడు
4) మొదటి శాంతమూలుడు
28. శ్రీ పర్వతంలో ఛుళధమ్మగిరిపై చైత్య గృహాన్ని నిర్మించిన వారు?
1) బోధిశర్మ 2) ఉపాసిక బోధిసిరి
3) రుద్రపురుషదత్తుడు 4) వీరపురుషదత్తుడు
29. కోటిలింగాల్లో ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాల్లో క్రీ.పూ. 2 వశాతాబ్దానికి చెందిన స్థానిక పాలకు లైన గోబధ, నారయ, కంవాయ, సమగోపరాజులు విడుదల చేసిన నాణేలు దొరికాయి?
1) క్రీ.శ.1963 2) క్రీ.శ. 1978
3) క్రీ.శ.2001 4) క్రీ.శ.1952
30. జనవల్లభుని కుర్యాల శాసనం ఏ సంవత్సరం నాటిది?
1) క్రీ.శ.945 2) క్రీ.శ. 935
3) క్రీ.శ.756 4) క్రీ.శ. 972
31. కటుకూరు శాసనం ఏ కాకతీయ రాజుకు సంబం ధించినది?
1) రుద్రదేవుడు 2) గణపతిదేవుడు
3) ప్రతాపరుద్రుడు 4) మహదేవుడు
32. ఇక్ష్వాకుల కాలంనాటి ఒక 'ఇటుక రాతి ఆలయం' ఎక్కడ బయటపడింది?
1) బైరాల గుట్ట 2) చాడ
3) గాజుల బండ 4) కంది
33. 'శ్రీ పర్వతాధిపతి' అనే బిరుదుగలవారు?
1) మొదటి శాంతమూలుడు
2) వీరుపురుషదత్తుడు
3) రుద్రపురుష దత్తుడు
4) రెండవ శాంతమూలుడు
34. ఉదయంత్రిక అనగా?
1) వెదురు పనివారు 2) నీటిపారుదల నిపుణులు
3) ధాన్యవర్తకులు
4) సువాసన ద్రవ్యాలను తయారు చేసేవారు
35. 'కువలయమాల' అనే గ్రంథాన్ని రచించిన వారు?
1) కుతుహలుడు 2) ఉద్యోతనుడు
3) గుణాఢ్యుడు 4) హలుడు
36. 'చిత్తశుద్ధి ప్రకరణం' అనే గ్రంథాన్ని రాసినవారు?
1) గణపతిదేవుడు 2) గణగదేవుడు
3) ఆర్యదేవుడు 4) నాగార్జునుడు
37. 'సర్వదేవాలయం' ఎక్కడ నిర్మించారు?
1) ఏలేశ్వరం 2) ఫణిగిరి
3) ఇంద్రపాలనగరం 4) కుసుమంచి
38. ఏ నదికి 'వృద్ధనది' అని పేరు కూడా ఉన్నది?
1) గోదావరి 2) కృష్ణా
3) మంజీర 4) ప్రాణహిత
39. ఎక్కడి రాక్షసగూళ్ళలో గుర్రం అస్ళిపంజరం దొరికింది?
1) పోచంపాడు 2) పాండవులగుట్ట
3) యాదగిరి గుట్ట 4) ఏలేశ్వరం
40. ఎక్కడి గుంత సమాధిలో 'పడవ ఆకారపు శవ పేటిక' ఆధారాలు లభ్యమైనవి?
1) గుండాల 2) ఉప్పలపాడు
3) మల్లూరు గుట్ట 4) జానంపేట
41. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సమాధిలో ఏ ఆహార ధాన్యం బయటపడ్డాయి?
1) వరి 2) బార్లి 3) రాగులు 4) ఉలవలు
42. గ్రామ రికార్డుల్లో పొందుపరిచిన అంశాల ప్రతులను ఏమంటారు?
1) తాళపత్రాలు 2) కవిలెలు
3) కైఫీయతులు 4) ఇతిహాసం
43. పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని సంగనోనిపల్లి రాతి గుహల్లో ప్రధానమైన 'జింకల చిత్రాలు' ఏ యుగానికి చెందినవి?
1) మధ్యపాతరాతియుగం 2) మధ్యరాతి యుగం
3) కొత్తరాతి యుగం 4) ఎగువ పాత రాతియుగం
44. 'వసకర' అనగా?
1) వ్యవసాయదారులు 2) ధాన్యవర్తకులు
3) వెదురు పనివారు 4) నేతపనివారు
45. శాతవాహనుల కాలంలో రాజభాష?
1) పాళీ 2) సంస్కృతం
3) ప్రాకృతం 4) దేశి
46. 'గాథాసప్తశతి'లో గాథ అంటే ఏమిటి?
1) కథ 2) పద్యాలు
3) కావ్యం 4) గేయాలు
47. 'కవి వత్సలుడు' అనే బిరుదుగల వారు?
1) శ్రీ పాలితుడు 2) కుమారిలుడు
3) హలుడు 4) శాతకర్ణి
48. ఆచార్య నాగార్జునుడు ఎవరి సమకాలికుడు?
1) గౌమమీపుత్ర శాతకర్ణి 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) శివశ్రీ శాతకర్ణి 4) రెండవ పులోమావి
49. కుమారీలుడు అనే కవి ఏ శాతవాహన రాజు కాలానికి చెందినవాడు?
1) హాలుడు 2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) శాతకర్ణి 4) శ్రీ ముఖుడు
50. అజంతా గుహల్లోని 9, 10వ గుహలలో దొరికిన శాసనాల మీద ఏ శాతవాహన రాజు పేరు ఉన్నది?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) వాశిష్టిపుత్ర పులోమావి 4) శివశ్రీ శాతకర్ణి
51. జైన తీర్థంకరుల్లో పదవవాడైన శ్రీతల నాధుడి జన్మస్థలం?
1) బాదలపురి 2) బోధన్
3) మగధ 4) కంది
52. 'పూస' అంటే?
1) ఆచార్యుడు 2) దేవుడు
3) శిష్యుడు 4) నాయకుడు
53. టిబెటన్ అత్యున్నత యోగతంత్రానికి చెందిన ఒక బౌద్ధతాంత్రిక పద్ధతిని ఏమంటారు?
1) ధర్మచక్ర 2) జైనమతం
3) కవిటవన 4) సుత్తనిపాదం
54. శాతవాహనుల రాణులు ఏ మతాన్ని విశేషంగా ఆదరించారు?
1) వైదిక మతం 2) జైనమతం
3) బౌద్ధమతం 4) శైవమతం
సమాధానాలు
1.1 2.2 3.3 4.2 5.2
6.2 7.3 8.2 9.3 10.2
11.2 12.1 13.3 14.2 15.3
16.4 17.3 18.3 19.2 20.3
21.4 22.3 23.1 24.2 25.2
26.1 27.4 28.2 29.2 30.1
31.2 32.4 33.2 34.2 35.2
36.3 37.1 38.1 39.1 40.2
41.3 42.3 43.2 44.3 45.3
46.2 47.3 48.2 49.1 50.2
51.1 52.1 53.2 54.3
- పృథ్వికుమార్ చౌహాన్
డైరెక్టర్, పృథ్వివస్ ఐఏఎస్ స్టడీసర్కిల్
దిల్సుఖ్నగర్,హైదరాబాద్
ఫోన్: 9177602890