ఏఐఏటీఎస్ఎల్లో 68 ఖాళీలు
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్ఎల్-తిరువనంతపురం/కన్నూరు స్టేషన్లు).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 68 సెక్యూరిటీ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్ఈసీ సర్టిఫికెట్తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: 2019, మార్చి 1 నాటికి జనరల్ అభ్యర్థులు 28 ఏళ్లు, ఓబీసీలు 31 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలు 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ), ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో.
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 25, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్:www.airindia.com
ఏపీ ట్రాన్స్కోలో ఉద్యోగాలు
ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్కో).. జోన్ల వారీగా ఖాళీగా ఉన్న 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ-ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
జోన్ల వారీ ఖాళీలు: విశాఖపట్నం-54, విజయవాడ-38, కడప-79.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.150బీ ఎగ్జామినేషన్ ఫీజు రూ.350 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.150 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 26, 2019.
ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: ఏప్రిల్ 24, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 25, 2019.
వివరాలకు వెబ్సైట్:www.aptransco.co.in
ఎన్టీసీఎల్లో 109ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీసీఎల్).. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 109 జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, జాయింట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: టెక్నికల్-23, ఫైనాన్స్-25, హెచ్ఆర్-34, అసెట్ మేనేజ్మెంట్-4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, లీగల్-4, మార్కెటింగ్-17.
అర్హతలు: టెక్నికల్ విభాగంలో పోస్టులను బట్టి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఇన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్/టెక్స్టైల్ టెక్నాలజీ/ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణత.
ఫైనాన్స్ పోస్టులకు సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.
హెచ్ఆర్ పోస్టులకు ఎంబీఏ (హెచ్ఆర్)/ఎంఎస్డబ్ల్యూ/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
అసెట్ మేనేజ్మెంట్, లీగల్ పోస్టులకు ఎల్ఎల్బీ ఉత్తీర్ణత.
ఐటీ పోస్టులకు బీటెక్/బీఈ (కంప్యూటర్ సైన్స్)/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
మార్కెటింగ్ పోస్టులకు (ఎంబీఏ-మార్కెటింగ్)/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
గమనిక: అన్ని పోస్టులకు నిబంధనల ప్రకారం అనుభవం తప్పనిసరి.
వయసు: విభాగాలు, పోస్టులను బట్టి 35-50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ ఇంటర్వ్యూ/టెస్ట్/జీడీ తదితర.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 12, 2019.
పూర్తి వివరాలకువెబ్సైట్: www.ntcltd.org