1. వెనుగొండ వంశీయుల మూలపురుషుడు?
1) మాధవ వర్మ 2) దుర్జయుడు
3) దుర్గరాజు 4) మేడరాజు
2. 'వెనుగొండ' వంశీయుల రాజధాని 'పొలవాస' ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్ 2) కరీంనగర్
3) నిజామాబాద్ 4) మెదక్
3. 'వీరకమల' జినాలయాన్ని నిర్మించింది?
1) రెండో మేడరాజు 2) గుండరాజు
3) మొదటి మేడరాజు 4) జగ్గరాజు
4. పొలవాస రాజ్యాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపింది ఎవరు?
1) మొదటి బేతరాజు 2) రుద్రదేవుడు
3) మొదటి ప్రోలరాజు 4) రెండో బేతరాజు
5. కందూరిచోడ పాలకుల్లో చివరివాడు?
1) నాలుగో భీముడు 2) గోకర్ణుడు
3) వీరమల్నాథదేవచోడుడు 4) రామనాథచోడుడు
6. క్రీ.శ. 1282లో 'ఆగామోత్కూర్' శాసనం వేయించింది ఎవరు?
1) నాలుగో భీముడు 2) గోకర్ణుడు
3) వీరమల్నాథదేవచోడుడు 4) రామనాథ చోడుడు
7. కింద పేర్కొన్న ఏ శాసనంలో రుద్రమదేవి ప్రస్తావన ఉంది?
1) ఇదంపల్లి 2) ఆగామోత్కూర్
3) మామిళ్లపల్లి 4) అచ్చంపేట
8. కింది ఏ ప్రాంతాల్లో జగత్ ప్రసిద్ధమైన వజ్రాలు లభించేవి?
1) గోకారం, కొప్పోలు 2) పానగల్లు, పరిటాల
3) పరిటాల, వెల్లటూరు 4) వెల్లటూరు, పానగల్లు
9. క్రీ.శ.1104లో కొలనుపాకలో 'వీరనారాయణాల యాన్ని' నిర్మించిందెవరు?
1) గుండరాజు 2) జగద్దేవుడు
3) జగ్గదేవుడు 4) లక్ష్మణదేవుడు
10. రాజధానిని 'మాన్యఖేటం' నుంచి 'కల్యాణి'కి మార్చిన పాలకుడు?
1) సత్యాశ్రయుడు 2) రెండో తైలపుడు
3) మూడో జయసింహుడు
4) రెండో జయసింహుడు
11. 'కల్యాణి చాళుక్య' వంశం గురించి ఏ కావ్యంలో ఉంది?
1) గధాయుద్ధం 2) కవిజనాశ్రయం
3) నీతిశాస్త్రముక్తావళి 4) విక్రమార్జున విజయం
12. కింది వాటిలో అనేక పర్యాయాలు చోళుల దండ యాత్రకు గురైన ప్రాంతం ఏది?
1) పానగల్లు 2) ఇంద్రపురి
3) కొలనుపాక 4) విజయపురి
13. చోళరాజు కల్యాణి చాళుక్యులను ఓడించిన ప్రాంతం ఏది?
1) మొసంగి 2) ఇంద్రపురి
3) కొలనుపాక 4) విజయపురి
14. హౌయసాలులు, కాలచురి వంశీయులు ఎవరిపై తిరుగుబాటు చేసి ఓడిపోయారు?
1) మూడో సోమేశ్వరుడు
2) మొదటి జగదేకమల్లుడు
3) రెండో జగదేకమల్లుడు
4) ఆరో విక్రమాదిత్యుడు
15. బిజ్జలుడు ఏ వంశానికి చెందినవాడు?
1) కాలచురి 2) హౌయసాల
3) కాకతీయ 4) కందూరు చోడ
16. మూడో తైలపుడిని తొలగించి బిజ్జలుడు 'కల్యాణి'ని ఆక్రమించిన సంవత్సరం?
1) క్రీ.శ. 1153 2) క్రీ.శ. 1154
3) క్రీ.శ. 1155 4) క్రీ.శ. 1156
17.వీరశైవ మతాన్ని స్థాపించింది ఎవరు?
1) ముగ్ధ శివాచార్యుడు 2) బసవేశ్వరుడు
3) బద్దెన 4) బిజ్జలుడు
18. క్రీ.శ. 1189లో కల్యాణి చాళుక్యులను అంతమొందించింది?
1) ముదిగొండ చాళుక్యులు 2) యాదవులు
3) కాకతీయులు 4) హౌయసాలులు
19. కల్యాణి చాళుక్య వంశ చివరి పాలకుడు?
1) నాలుగో సోమేశ్వరుడు 2) మూడో తైలపుడు
3) మూడో జగదేకమల్లుడు 4) జయకర్ణ
20. కల్యాణి చాళుక్యులు ఏ మతాన్ని ఎక్కువగా అభిమానించారు?
1) వైష్ణవం 2) వీరశైవం
3) బౌద్ధం 4) జైనం
21. పానగల్లు వద్ద 'ఉదయ సముద్రం' తవ్వించినవారు?
1) మొదటి ఉదయనుడు 2) రెండో ఉదయనుడు
3) శ్రీదేవి తొండయ 4) గోకర్ణుడు
22. సంస్కతంలో 'ఉదయాదిత్యాలంకారం' గ్రంథాన్ని రాసిందెవరు?
1) మొదటి ఉదయనుడు 2) రెండో ఉదయనుడు
3) శ్రీదేవి తొండయ 4) గోకర్ణుడు
23. కందూరిచోడుల రాజధానిని పానగల్లు నుంచి వర్ధమానకోటకు మార్చినవారు?
1) మొదటి ఉదయనుడు 2) రెండో ఉదయనుడు
3) మూడో భీముడు 4) గోకర్ణుడు
24. కాకతీయ రుద్రదేవుడికి తన కూతురు 'పద్మావతి'ని ఇచ్చి వివాహం చేసి సంధి చేసుకున్న రాజు ఎవరు?
1) రెండో ఉదయనుడు 2) మొదటి ఉదయనుడు
3) మూడో భీముడు 4) గోకర్ణుడు
25. మామిళ్లపల్లి శాసన కాలం?
1) క్రీ.శ. 1175 2) క్రీ.శ. 1176
3) క్రీ.శ. 1178 4) క్రీ.శ. 1180
26. మూసీనది మీద 'నమిలె' వద్ద ఆనకట్ట నిర్మించింది ఎవరు?
1) కాకతీయులు 2) కల్యాణి చాళుక్యులు
3) ముదిగొండ చాళుక్యులు 4) కందూరిచోడులు
27. కందూరిచోడుల మతం?
1) జైనం 2) వైదికం
3) బౌద్ధం 4) వైష్ణవం
28. ఏ పాలకులు దాదాపుగా 40 శాసనాలు వేయించారు?
1) కాకతీయులు 2) కందూరి చోడులు
3) ముదిగొండ చాళుక్యులు 4) కల్యాణి చాళుక్యులు
29. ఏ శాసనంలో అచ్చమైన తెలుగుభాష కనిపిస్తుంది?
1) ఆగామోత్కూర్ 2) పేరూర్
3) మామిళ్లపల్లి 4) పానగల్లు
30. 'గోకర్ణ ఛందస్సు' లక్షణ గ్రంథ రచయిత?
1) రెండో ఉదయనుడు 2) రెండో గోకర్ణుడు
3) మొదటి గోకర్ణుడు 4) మొదటి ఉదయనుడు
31. మొదటి గోకర్ణుడి కాలం నాటి శాసన కవి?
1) అప్పకవి 2) త్రిపురాంతకుడు
3) కస్తూరి రంగకవి 4) రుద్రకవి
32. ఎవరికి 'పొలవాస' పాలకులనే పేరు కూడా ఉంది?
1) కందూరి చోడులు 2) ముదిగొండ చాళుక్యులు
3) రాష్ట్రకూటులు 4) వెనుగొండ వంశీయులు
33. ముదిగొండ చాళుక్యుల వంశ మూలపురుషుడు?
1) కుసుమాయుధుడు
2) మొదటి చాళుక్య భీముడు
3) రణమర్థుడు 4) నిరవద్యుడు
34. ముదిగొండ చాళుక్యుల రాజధాని ఏది?
1) ముదిగొండ, ఖమ్మం జిల్లా
2) పానగల్లు, నల్లగొండ జిల్లా
3) పానగల్లు, మహబూబ్నగర్ జిల్లా
4) ముదిగొండ, వరంగల్ జిల్లా
35.'ఒల్లాల' శాసనం వేయించింది ఎవరు?
1) మొదటి తొండయ 2) మల్లికార్జునచోడుడు
3) రెండో తొండయచోళ 4) కుమార కొండయచోళ
36. రామలింగాలగూడెం వద్ద 'మార్కండేశ్వరాలయ' శాస నాన్ని వేయించింది?
1) మైలాంబిక 2) మల్లికార్జునుడు
3) రెండో తొండయ 4) మూడో భీమచోడుడు
37. 'మార్కండేశ్వరాలయ' శాసన కాలం?
1) క్రీ.శ. 1100 2) క్రీ.శ. 1105
3) క్రీ.శ. 1107 4) క్రీ.శ. 1110
38. క్రీ.శ. 1124లో 'పానగల్లు' శాసనం వేయించింది?
1) మైలాంబిక 2) మల్లికార్జునుడు
3) రెండో తొండయ 4) మూడో భీమచోడుడు
39. క్రీ.శ. 1128లో అనుముల శాసనం వేయించింది?
1) శ్రీదేవి తొండయ 2) భీముడు
3) గోకర్ణుడు 4) మొదటి ఉదయనుడు
40. తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏది?
1) విక్రమార్జున విజయం 2) కవిజనాశ్రయం
3) నీతిశాస్త్రముక్తావళి 4) గధాయుద్ధం
41. కందూరిచోడ రాజులు ఎంత మంది అని చరిత్రకారుల అభిప్రాయం?
1) 16 2) 15 3) 17 4) 18
42. 'కందూరిచోడ' వంశ మూలపురుషుడు?
1) మొదటి భీమదేవచోడుడు 2) మొదటి తొండయ
3) ఇరుగ
4) మొదటి ఉదయచోడుడు
43. నేలకొండపల్లి శాసనాన్ని వేయించిందెవరు?
1) మొదటి భీమదేవచోడుడు 2) మొదటి తొండయ
3) రెండో ఉదయచోడుడు
4) మొదటి ఉదయచోడుడు
44. నేలకొండపల్లి శాసన కాలం?
1) 1175-76 2) 1171-72
3) 1173-74 4) 1178-79
45. 'మైలాంబిక' ఎవరి భార్య?
1) మొదటి తొండయ 2) కుమార కొండయచోళ
3) రెండో తొండయచోళ 4) మల్లికార్జున చోడుడు
46. 'కవిజనాశ్రయం' గ్రంథకర్త ఎవరు?
1) మల్లియరేచన 2) జినవల్లభుడు
3) పంపకవి 4) బద్దెన
47. 'సుమతీ శతకం', 'నీతిశాస్త్రముక్తావళి'ని ఎవరు రాశారు?
1) మల్లియరేచన 2) జినవల్లభుడు
3) రెండో బద్దెగుడు 4) మొదటి బద్దెగుడు
48. కల్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు?
1) రెండో తైలపుడు 2) సత్యాశ్రయుడు
3) రెండో జయసింహుడు
4) మొదటి జయసింహుడు
49. రెండో తైలపుడి ఆస్థాన కవి ఎవరు?
1) జినవల్లభుడు 2) పంపకవి
3) రన్నకవి 4) బద్దెన
50. 'కౌథేం' శాసన కాలం?
1) క్రీ.శ. 1005 2) క్రీ.శ. 1009
3) క్రీ.శ. 1015 4) క్రీ.శ. 1020
51. కల్యాణి చాళుక్య రాజ్య స్థాపన కాలం?
1) క్రీ.శ. 963 2) క్రీ.శ. 967
3) క్రీ.శ. 970 4) క్రీ.శ. 973
52. పంపకవికి 'ధర్మపురి'ని అగ్రహారంగా ఇచ్చిన రాజు ఎవరు?
1) మూడో బద్దెగుడు 2) మూడో అరికేసరి
3) రెండో నరసింహుడు 4) రెండో అరికేసరి
53. పంపకవి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు?
1) మూడో బద్దెగుడు 2) మూడో అరికేసరి
3) రెండో అరికేసరి 4) మొదటి అరికేసరి
54. వేములవాడ చాళుక్యుల్లో కవి, పండితుడైన రాజు ఎవరు?
1) రెండో అరికేసరి 2) మూడో బద్దెగుడు
3) మూడో అరికేసరి 4) అమోఘవర్షుడు
55. 'విక్రమార్జున విజయం' గ్రంథ రచయిత?
1) భవభూతి 2) రెండో అరికేసరి
3) పంపకవి 4) మల్లియరేచన
సమాధానాలు
1.2 2.2 3.3 4.2 5.4
6.4 7.2 8.3 9.2 10.2
11.1 12.3 13.1 14.3 15.1
16.4 17.2 18.4 19.1 20.2
21.2 22.2 23.3 24.1 25.3
26.4 27.2 28.2 29.1 30.3
31.2 32.4 33.3 34.1 35.2
36.4 37.2 38.1 39.1 40.2
41.3 42.1 43.3 44.1 45.3
46.1 47.3 48.1 49.3 50.2
51.4 52.4 53.3 54.1 55.3