1. వాయు రూపంలోని ఇంధనం?
ఎ) వాటర్ గ్యాస్ బి) పెట్రోల్
సి) కిరోసిన్ డి) ఏదీకాదు
2. వాటర్ గ్యాస్ వేటి మిశ్రమం?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్ + హైడ్రోజన్
బి) కార్బన్ మోనాక్సైడ్+ హైడ్రోజన్
సి) హైడ్రోజన్+ ఆక్సిజన్
డి) కార్బన్ మోనాక్సైడ్+ నైట్రోజన్
3. వాటర్ గ్యాస్‌కు మరో పేరు?
ఎ) రెడ్ గ్యాస్ బి) ఆరెంజ్ గ్యాస్
సి) బ్లూ గ్యాస్ డి) ఎల్లో గ్యాస్
4.ఎరువుల కర్మాగారాల్లో వాడే ఇంధనం?
ఎ) పెట్రోల్ బి) ఎల్పీజీ
సి) సహజ వాయువు డి) వంట చెరుకు
5. కృత్రిమ పెట్రోల్ తయారీలో ఉపయోగించే పద్ధతి?
ఎ) వాకర్ బి) బేయర్
సి) ఫిషర్ - ట్రాప్ష్ డి) ఏదీ కాదు
6. ఢిల్లీలో ప్రజా రవాణాకు వాహనాలకు ఉపయోగించే ఇంధనం?
ఎ) సీఎన్జీ బి) ఎల్పీజీ
సి) బయోగ్యాస్ డి) గోబర్ గ్యాస్
7. తాజ్ మహల్ పసుపు రంగులోకి మారడానికి కారణం?
ఎ) యమునా నది బి) గాలిలోని దుమ్ము, దూళి
సి) మధురా రిఫైనరీ నుంచి విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్
డి) పసుపు నీటితో కడగటం
8. కింది వాటిలో రాకెట్లలో ఉపయోగించే ద్రవ రూపం లోని ప్రొపెల్లెంట్లు?
ఎ) హైడ్రోజన్ బి)హైడ్రోజన్
సి) నైట్రికామ్లం డి) పైవన్నీ
9. కింది వాటిలో ఏ రూపంలో ప్రొపెల్లెంట్లు ఎక్కువ ప్రభావ శీతల కలిగి ఉంటాయి?
ఎ) ఘన బి) ద్రవ సి) వాయు సి) సంకర
10. కిందివాటిని జతపరచండి.
జాబితా-1 (ఇంధన వాయువులు)
ఎ. సీఎన్జీ బి. కోల్ గ్యాస్
సి. ఎల్పీజీ డి. వాటర్ గ్యాస్
జాబితా -2 (ప్రధాన వాయువులు)
1. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్
2. బ్యటేన్, ప్రొపేన్
3. మిథేన్, ఈథేన్
4. హైడ్రోజన్ , మిథేన్, కార్బన్ మోనాక్సైడ్
ఎ. బి సి. డి
ఎ) 2 1 3 4
బి) 3 4 2 2
సి) 2 3 3 2
డి) 3 1 2 4
11. తేమ శాతం అధికంగా ఉండే బొగ్గు రకం?
ఎ) ఆంథ్రసైట్ బి) బిట్యుమినస్
సి) లిగ్నైట్ డి) అన్నీ సమానమే
12. కింది వాటిలో భవిష్యత్ ఇంధనం?
ఎ) ఇథనాల్ బి) ఇథిలీన్
సి) ఎసిటిలీన్ డి) ఈథేన్
13. ఇథనాల్ ఏ పరిశ్రమలో సహా ఉత్పన్నంగా వస్తుంది?
ఎ) చక్కెర బి) ఎరువుల
సి) తోళ్ల డి) రసాయనిక
14. కింది వాటిలో క్యాన్సర్ కలిగించే గుణముంది?
ఎ) ఆల్కేన్లు బి) ఆల్కీన్లు
సి) ఎరోమాటక్ సమ్మేళనాలు డి) ఆల్కైన్ హాలైడ్లు
15. పెట్రోలియం నుంచి వివిధ ఉత్పత్తులు వేరు చేసే ప్రక్రియ?
ఎ) కిణ్వణం బి) స్వేదనం
సి) నిర్షాత స్వేదనం డి) అంశిక స్వేదనం
16. పరిశ్రమల్లో ఏ ఇంధనాలకు ప్రాధాన్యం ఇస్తారు?
ఎ) వాయు బి) ద్రవ
సి) ఘన డి) ఘన, ద్రవ మిశ్రమం
17. మంచి ఇంధనానికి ఉండాల్సిన లక్షణాలు?
ఎ) తేలికగా నిల్వ చేసేలా ఉండటం
బి) తక్కువ ఉష్ణోగ్రత వద్ద మండగలగటం
సి) అధిక కెలోరీఫిక్ విలువ కల్గి ఉండటం
డి) పైవన్నీ
18. గ్యాసోలిన్ అని దేనికి పేరు?
ఎ) కిరోసిన్ బి) పెట్రోల్
సి) ఎల్పీజీ డి) సీఎన్జీ
19. కర్ర బొగ్గు ఎలా తయారు చేస్తారు?
ఎ) గాలిలో కర్రను మండించడం
బి) గాలి లేకుండా కర్రను మండించడం
సి) శుద్ధమైన ఆక్సిజన్‌లో కర్రను మండించడం
డి) జడ వాయువుల మధ్య కర్ర మండించడం
20. భారత దేశంలో అధిక శాతం విద్యుచ్ఛక్తికి ఆధారం?
ఎ) గాలి బి) నీరు
సి) బొగ్గు డి) సూర్యరశ్మి
21. వీటిలో దేన్ని మండిస్తే ఎక్కువ శక్తి విడుదల అవుతుంది?
ఎ) ఎల్పీజీ బి) పెట్రోల్
సి)హైడ్రోజన్ డి) వంట చెరుకు
22. ఏ ఇంధనం తక్కువ కాలుష్యం వెద జల్లుతుంది?
ఎ) ఎల్పీజీ బి.పెట్రోల్
సి) హైడ్రోజన్ డి. వంట చెరుకు
23. పెట్రోల్ ప్రధానంగా వేటి మిశ్రమం?
ఎ) ఆల్కేన్లు అనే హైడ్రోకార్బన్లు
బి) ఆల్కీన్లు అనే హైడ్రోకార్బన్లు
సి) ఆల్కైన్లు అనే హైడ్రోకార్బన్లు
డి) అరోమాటిక్ సమ్మేళనాలు
24. చమురు బావుల నుంచి మొదటగా వచ్చేది?
ఎ) సహజవాయు మిశ్రమం బి) పెట్రోల్
సి) ఈథర్ డి) కిరోసిన్
25. కింది వాటిలో సరైంది?
ఎ) చమురు మీద నీరు తేలుతుంది
బి) నీటిపై చమురు తేలుతుంది
సి) రెండూ కలిసి ఉండొచ్చు
డి) ఎలాగైనా ఉండొచ్చు
26. కింది వాటిలో సహజ ఇంధనం?
ఎ) పెట్రోల్ బి) డీజిల్
సి) నేల బొగ్గు డి) బొగ్గు
27. ముడి చమురును పగులగొట్టి విఘటనం చెంది నప్పుడు ఉత్పత్తి అయ్యే వాయువు?
ఎ) సీఎన్జీ బి) ఎల్పీజీ
సి) కార్బన్‌డైఆక్సైడ్ డి) నైట్రోజన్ ఆక్సైడ్
28. ఆల్కేన్ల పరమాణుభారాల ఆరోహణ క్రమం?
ఎ) మిథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యుటేన్
బి) బ్యుటేన్, ప్రొపేన్, ఈథేన్, మిథేన్
సి) మిథేన్, బ్యుటేన్, ప్రొపేన్, ఈథేన్
డి) మిథేన్, ప్రొపేన్, బ్యుటేన్, ఈథేన్
29. ఎల్పీజీలో ముఖ్య అనుఘటకాలు?
ఎ) ప్రొపేన్, బ్యుటేన్ బి) ఆక్సిజన్, నైట్రోజన్
సి) ఆక్సిజన్, హైడ్రోజన్ డి) మిథేన్, ఎసిటలీన్
30. కింది వాటిలో సరైన వాఖ్యలు?
ఎ) ప్రత్యేకంగా రూపొందించిన వెజల్స్లో నిల్వ చేయడానికి, రవాణాకు అనువుగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్.ఎన్. జి)ను అత్యంతా శీతల ఉష్ణోగ్రతల్లో, అధిక పీడనంలో ద్రవీకరిస్తారు
బి) భారతదేశంలో మొదటి ఎల్,ఎన్.జి టెర్మినల్‌ను హసన్‌లో నిర్మించారు
సి) ఎల్పీజీ నుంచి నేచురల్ గ్యాస్ లిక్విడ్స్‌ను వేరు చేస్తారు. వీటిలో ఈథేన్, ప్రొపేన్, బ్యుటేన్, సహజ గాసోలిన్లు ఉంటాయి.
ఎ) ఎ మాత్రమే బి) ఎ, సి
సి) బి, సి డి) ఎ, బి, సి
31. వాతావరణం ఎక్కువగా కాలుష్యమయ్యే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ?
ఎ) గాలి బి) హైడెల్ సి) కోల్ డి) సోలార్
32. కింది వాటిలో తెల్ల బొగ్గు అని దేనికి పేరు?
ఎ) పవన విద్యుత్ బి) జల విద్యుచ్ఛక్తి
సి) థర్మల్ విద్యుచ్ఛక్తి డి) అణు విద్యుత్
33. కార్బన్ శాతం అధికంగా ఉంటే బొగ్గు రకం?
ఎ) ఆంథ్రసైట్ బి) బిట్యుమినస్
సి) లిగ్నైట్ డి) పీట్
34. బొగ్గు పొయ్యిని తలుపులు మూసిన గదిలో మండిం చడం వల్ల వచ్చేది?
ఎ) కార్బన్ మోనాక్సైడ్ బి) కార్బన్ డై ఆక్సైడ్
సి) అమ్మోనియం డి) మిథేన్
35. ఇటీవల 'యాంటీ నాకింగ్' కారణంగా టెట్రా ఇథైల్ లెడ్...ను వాడకపోవడానికి కారణం?
ఎ) దానిలో లెడ్ వాయు కాలుష్యం కలగ జేస్తుంది
బి) పెట్రోల్‌తో చర్యపొందుతుంది
సి) సరిగా పని చేయదు డి) ఖరీదెక్కువ
36. కింది వాటిలో శిలాజ ఇంధనం కానిదేది?
ఎ) బొగ్గు బి) పెట్రోల్
సి) సహజవాయువు డి) కలప
37. అతి తక్కువ కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేసే ఇంధనం?
ఎ) సీఎన్జీ బి) పెట్రోల్
సి) బొగ్గు డి) కిరోసిన్
38. గోబర్ గ్యాస్‌లో ముఖ్య అనుఘటకం?
ఎ) మీథేన్ బి) ప్రొపేన్
సి) బ్యుటేన్ డి) హైడ్రోజన్
39. వంట గ్యాస్‌లో తొంబైశాతం కంటే ఎక్కువ ఉండేది?
ఎ) హైడ్రోజన్ బి) సల్ఫర్ డైఆక్సైడ్
సి) హీలియం డి) మీథేన్
40. జీవాధారిత గ్యాస్(బయోగ్యాస్)లోని ప్రధానాంశం?
ఎ) మీథేన్ బి) ఈథేన్
సి) బ్యుటేన్ డి) ఎసిటలీన్
41. ఎల్పీజీ లీకేజీని గుర్తించడానికి వాడే పదార్థాలు?
ఎ) థయోపీన్ బి) అమైల్ మెర్కాప్టాన్
సి) ఇథేన్ థయోల్ డి) పైవన్నీ
42. ఎల్పీజీ లీకేజీని గుర్తించే పదార్థలంలో వాసనకు కారణమైన మూలకం?
ఎ) ఫాస్ఫరస్ బి) సల్ఫర్
సి) క్లోరిన్ డి) బ్రోమిన్
43. ఆటోగ్యాస్ అని దేనికి పేరు?
ఎ) ఎల్పీజీ బి) సీఎన్జీ
సి) ఎల్ఎన్జీ డి) హైడ్రోజన్
44. పెట్రోల్ నాణ్యతను కొలిచే ప్రమాణం?
ఎ) ఆక్టేన్ సంఖ్య బి) సీటేన్ సంఖ్య
సి) అవగాడ్రో సంఖ్య డి) ఏదో ఒక సంఖ్య
45. సహజవాయువులో ముఖ్య అనుఘటకం?
ఎ) మీథేన్ బి) ప్రొపేన్
సి) బ్యుటేన్ డి) ఎసిటలీన్
Answers
1. ఎ 2.బి 3.సి 4.సి 5.సి
6.ఎ 7.సి 8.డి 9.బి 10.బి
11.సి 12.ఎ 13.ఎ 14.సి 15.డి
16.ఎ 17.డి 18.బి 19.బి 20.సి
21.సి 22.సి 23.ఎ 24.ఎ 25.బి
26.సి 27.బి 28.ఎ 29.ఎ 30.బి
31.సి 32.బి 33.ఎ 34.ఎ 35.ఎ
36.డి 37.ఎ 38.ఎ 39.డి 40.ఎ
41.డి 42.బి 43.ఎ 44.ఎ 45.ఎ
Authorization