1. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) థియాలజీ - మతాల అధ్యయనం
బి) ఎఫిగ్రఫి - శాసనాల అధ్యయనం
సి) ఎకినో గ్రఫీ - సంకేతాల అధ్యయనం
డి) పైవన్నీ సరైనవే
2. ఈ కింది వాటిలో నవీన శిలాయుగానికి సంబంధించి సరైనది ఏది?
ఎ) వస్త్రాలు నేయుట వీరి గొప్ప విజయం
బి) వ్యవసాయం ఆరంభం
సి) పశువుల మచ్చిక
డి) పైవన్నీ సరైనవే
3. ద్రావిడ నాగరికతలో కుటుంబంలో పెద్ద ఎవరు?
ఎ) తండ్రి బి) తల్లి
సి) పెద్ద కుమారుడు డి) పెద్ద కుమార్తె
4. సింధు నాగరికతా ప్రాంతానికి రాజధాని ఏది?
ఎ) హరప్పా బి) దోలవీర
సి) మొహంజొదారో డి) కాళిభంగన్
5. కాగ్జీ అనగా?
ఎ) కోడిగుడ్డు ఆకారపు పాత్రల తయారీ
బి) చతురస్త్రాకారపు పాత్రల తయారీ
సి) రాగి పాత్రల తయారీ
డి)కోతి ఆకారపు పాత్రల తయారీ
6. దాసులు అనగా ఎవరు?
ఎ) ఆర్యేతరులు
బి) మొదటగా వచ్చిన ఆర్యులు
సి) అనార్యులు డి) రాక్షసులు
7. రుగ్వేదంలో 'తురస్తగోప' అని పేర్కొనబడిన దేవుడు ఎవరు?
ఎ) వరుణుడు బి) ఇంద్రుడు
సి) సూర్యుడు డి) అగ్ని
8. ఆర్యుల 'టెరెస్ట్రయిల్' దేవుళ్ళు ఎవరు?
ఎ) పృథ్వీ బి) సోమ
సి) అగ్ని డి) పైవారందరూ
9. రామాయణం ఏమి తెల్పును?
ఎ) కృష్ణుని చరితము బి) విష్ణువు చరితము
సి) రాముని చరితము డి) ఏదీకాదు
10. పాటలీపుత్రంలో దిగంబరులు, శ్వేతాంబరుల మధ్య ఏకాభిప్రాయ సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
ఎ) దేవరధి బి) సంథి విగ్రహ
సి) పార్శ్వనాథుడు డి) భద్రబాహు
11. జైన అంగములు ఎన్ని?
ఎ) 10 బి) 16 సి) 12 డి) 18
12. గణ అనే పదాన్ని తెగ అని వివరించింది ఎవరు?
ఎ) డేవిడ్ వార్నర్ బి) రైస్ డేవిడ్
సి) జౌన్ మార్షల్ డి) కల్నల్ టాడ్
13. ఈ కింది వాటిలో జైన మత క్షీణతకు గల కారణం ఏమి?
ఎ) అజయ పాలునిచే జైన దేవాలయాలు నాశనం
బి) అల్లావుద్దీన్ ఖిల్జీచే జైన దేవాలయాలు నాశనం
సి) కులవ్యవస్థలో హిందూ మతానికి సన్నిహితంగా ఉండడం
డి) పైవన్నీ సరైనవే
14. 'భద్రబాహువు చరిత్ర'ను రచించింది ఎవరు?
ఎ) రత్నానందుడు బి) రత్నాకరుడు
సి) మక్కలిగోశాలి డి) గజేంద్రుడు
15. ఈ కింది వాటిలో 'సిద్ధార్ధునికి' సంబంధించిన పేరు ఏది?
ఎ) బుద్దుడు బి) తథాగతుడు
సి) గౌతముడు డి) శాక్యముని
16. మన దేశానికి బౌద్దం సమకూర్చిన ప్రయోజనం ఏమి?
ఎ) విగ్రహారాధన ఖండన
బి) వాస్తు శిల్పకళలు అభివృద్ధి
సి) ప్రజల్లో మానసిక సమగ్రత
డి) పైవన్నీ సరైనవే
17. చాణక్యుడిని 'ఇండియన్ బిస్మార్క్' అని ప్రశంసించిన చరిత్రకారుడు?
ఎ) ప్రొ|| జాకబ్ బి) ఆర్.సి.మజుందార్
సి) ప్లూటార్క్ డి) ఆర్.గుహ
18. బౌద్ధ భిక్షువు రూపంలో ఉన్న అశోకుడి శిలా విగ్రహాన్ని చూశానని పేర్కొన్న చైనా యాత్రికుడు ఎవరు?
ఎ) ఇత్సింగ్ బి) హ్యుయాన్‌త్సాంగ్
సి) మెగస్తనీస్ డి) మొగలిపుత్ర తిస్స
19. మౌర్యుల కాలంలో 'సీతా' అన్నపదానికి అర్థం ఏమి?
ఎ) కొయ్య బి) నాగలి
సి) మట్టి డి) గోవు
20. స్త్రీలు చక్రవర్తికి అంగరక్షకులుగా ఉండేవారు అని పేర్కొన్న గ్రంథం?
ఎ) హర్షచరిత్ర బి) ఇండికా
సి) బృహత్కథ డి) హితోపదేశం
21. విష్ణు భక్తుడిగా ప్రకటించుకున్న కుషాణు పాలకుడు ఎవరు?
ఎ) వాసుదేవుడు బి) కనిష్కుడు
సి) వశిష్కుడు డి) హవిష్కుడు
22. ఆచార్య నాగార్జునుడి జీవితాన్ని చైనా భాషలో రచించిన వాడు ఎవరు?
ఎ) బాణుడు బి) కుమారజీవుడు
సి) మెకంజీ డి) హ్యుయాన్‌త్సాంగ్
23. తొలి తెలుగు పదం 'నాగబు' అనే పదాన్ని కను గొన్న పండితుడు ఎవరు?
ఎ) వేటూరి సుందరారాంమూర్తి
బి) నేలటూరి వెంకటరమణ
సి) వేటూరి ప్రభాకరశాస్త్రి డి) కల్నల్ మెకంజీ
24. 'బృహత్ జాతక రత్నావళి' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) వరాహమిహురుడు బి) భాస్కరుడు
సి) ఆర్యభట్టు డి) వసుబంధు
25. హర్షుడిని పంచరాజ్యాలకు ప్రభువు అని పేర్కొంటున్న ఆధారం?
ఎ) రత్నావళి బి) సి-యూ-కే
సి) నాగానందం డి) ప్రియదర్శిని
26. ఈ కింది వాటిలో 'దేవాలయ నగరం'గా ప్రసిద్ధి గాంచినది ఏది?
ఎ) పట్టడక్కల్ బి) బాదామి
సి) ఐహోల్ డి) ఆలంపూర్
27. 'మకరధ్వజుడు' అని బిరుదు గల రాజు ఎవరు?
ఎ) అమోఘవర్షుడు బి) కుబ్జవిష్ణు వర్థనుడు
సి) రెండోపులకేశి డి) చాతక్యభీమ
28. పుదుచ్చేరి సమీపంలో త్రిభువనం వద్ద విద్యా సంస్థను ఏర్పరిచిన చక్రవర్తి?
ఎ) మొదటి రాజేంద్రుడు బి) మొదటి రాజరాజు
సి) విజయాలయ చోళ డి) దంతిదుర్గుడు
29. 'హిందూ జాతీయ వీరుడు' అనే ప్రశంస పొందిన చక్రవర్తి ఎవరు?
ఎ) పృథ్వీరాజ్ చౌహాన్ బి) జయచంద్రుడు
సి) సింహరాజ్ డి) ముంజురాజు
30. యోగా శాస్త్రంపై 'రాజమార్తాండము' అను గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) తోమార బి) భోజరాజు
సి) బల్లాలసేన డి) ఉపేంద్రుడు
31. 'కులీన పాలన' అను ప్రత్యేక పాలనా వ్యవస్థను బెంగాల్ లో ప్రవేశపెట్టిన సేన వంశపాలకుడు ఎవరు?
ఎ) మంజురాజు బి) జయదేవుడు
సి) బల్లాలసేనుడు డి) భీమరాజు
32. భక్తి ఉద్యమకారుడు 'శంకరాచార్యులు' మరణించిన ప్రాంతం ఏది?
ఎ) పెరంబదూర్ బి) కోణార్క్
సి) కేదారీనాథ్ డి) సింహాచలం
33. మహ్మద్‌ఘోరీ హత్య చేయబడిన సంవత్సరం ఏది?
ఎ) క్రీ.శ. 1191 బి) క్రీ.శ. 1193
సి) క్రీ.శ. 1209 డి) క్రీ.శ. 1206
34. మంగోలు నాయకుడు చెంగిజ్‌ఖాన్ దండయాత్రను తెలివిగా తప్పించివాడు ఎవరు?
ఎ) కుతుబుద్దీన్ ఐబక్ బి) ఇల్టుట్మిష్
సి) బాల్బన్ డి) రజియా సుల్తానా
35. అడవులను నరికి పంట భూములుగా మార్చిన ముస్లిం పాలకుడు ఎవరు?
ఎ) అల్లావుద్దీన్‌ఖిల్జీ బి) బాల్బన్
సి) ఫిరోజ్‌షా డి) సికిందర్ లోఢి
36. అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించిన ఉత్తరాది రాజు ఎవరు?
ఎ) గుజరాత్ - కర్ణదేవుడు
బి) చిత్తోడ్ - రతన్‌సింగ్
సి) రణతంబోర్ - హంవీర దేవుడు
డి) పైవన్నీ సరైనవే
37. మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇక్తాల సంఖ్య?
ఎ) 23 బి) 16 సి) 26 డి) 12
38. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి 'సైనిక మంత్రి'ని ఏమని పిలిచేవారు?
ఎ) దివాన్-ఇ-ఆరీజ్ బి) ఆరీజ్-ఇ-మాలిక్
సి) దాబిర్-ఇ-మాలిక్ డి) నాయబ్ నజీర్
39. వరంగల్‌లో 'కేశవస్వామి' ఆలయంను నిర్మించినది ఎవరు?
ఎ) రెండవ ప్రోలరాజు బి) రెండవ బేతరాజు
సి) మొదటి ప్రోలరాజు డి) మొదటి బేతరాజు
40. ఈ కింది వాటిలో కాకతీయుల రేవు పట్టణం ఏది?
ఎ) గోల్కొండ బి) నెల్లూరు
సి) మోటుపల్లి డి) పాకాల
41. వెనీస్ యాత్రికుడు మార్కోపోలో దర్శించిన పాండ్య రాజు ఎవరు?
ఎ) శ్రీమార వల్లభుడు బి) సుందర పాండ్యుడు
సి) కరికాల చోళ డి) కులశేఖరుడు
42. వీర కంపన రాయలు తమిళదేశంలో ముస్లిం పాలనను అంతం చేసిన సంవత్సరం ఏది?
ఎ) క్రీ.శ. 1371 బి) క్రీ.శ. 1471
సి) క్రీ.శ. 1361 డి) క్రీ.శ. 1267
43. రామయణ గాథలను తెలిపే శిల్పాలు గల దేవాలయం ఏది?
ఎ) లేపాక్షి బి) హజారా రామాలయం
సి) బాలకృష్ణ ఆలయం డి) పాపనేశ్వర ఆలయం
44. ఇబ్రహీం కుతుబ్‌షా చే పోషించబడిన తెలుగు కవి ఎవరు?
ఎ) పొన్నెగంటి తెలగనార్యుడు
బి) అద్దంకి గంగాధర కవి
సి) కందుకూరి రుద్రకవి డి) పైవారందరూ
45. భారతదేశ చరిత్రలో 'దౌరా' యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
ఎ) క్రీ.శ. 1532 బి) క్రీ.శ. 1530
సి) క్రీ.శ. 1540 డి) క్రీ.శ. 1545
46. అక్బర్ చేత 'కవిరాయ' బిరుదు పొందిన వాడు ఎవరు?
ఎ) బాబూ రాందాస్ బి) బీర్బల్
సి) కేశవదాస్ డి) తాన్సేన్
47. శివాజీ నిర్మించిన ముస్లిం పవిత్రుని సమాధి?
ఎ) బాబా యాకుత్ బి) బాబా కమ్రుద్దీన్
సి) జహంగీర్ బాబా డి) షాబుద్దీన్ బాబా
48. బృందావన్‌లో 'గోవిందదేవ' దేవాలయాన్ని నిర్మించింది ఎవరు?
ఎ) షాజహాన్ బి) షేర్షా
సి) అక్బర్ డి) ఔరంగజేబు
49. ఇండియాలో మొట్టమొదటి మాతృభాషలో ప్రచురించిన పత్రిక ఏది?
ఎ) ది పాట్రియాట్ బి) సమాచార్ డైలీ
సి) ది నేషనలిస్టు డి) సమాచార్ దర్పణ్
50. ఖాసీం రజ్వికి భయపడకుండ విమర్శించిన 'ఇమ్రేజ్' ఉర్దూ పత్రిక సంపాదకులు ఎవరు?
ఎ) లాయక్ ఆలీ బి) షోయబుల్లాఖాన్
సి) అబ్దుల్ రహీం డి) అబ్దుల్ సత్తార్
సమాధానాలు
1.డి 2.డి 3.బి 4.సి 5.ఎ
6.బి 7.ఎ 8.డి 9.సి 10.ఎ
11.సి 12.బి 13.డి 14.ఎ 15.డి
16.డి 17.ఎ 18.ఎ 19.బి 20.బి
21.ఎ 22.బి 23.సి 24.ఎ 25.బి
26.ఎ 27.బి 28.ఎ 29.ఎ 30.బి
31.సి 32.సి 33.డి 34.బి 35.బి
36.డి 37.ఎ 38.బి 39.ఎ 40.సి
41.డి 42.ఎ 43.బి 44.డి 45.ఎ
46.బి 47.ఎ 48.సి 49.డి 50.బి