ఎంఎఫ్ఎల్లో 14 ఉద్యోగాలు
చెన్నైలోని మద్రాస్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: జనరల్ మేనేజర్-2, కంపెనీ సెక్రటరీ-1, మేనేజర్-2, డిప్యూటీ మేనేజర్-2, సేఫ్టీ ఆఫీసర్-1, వెల్ఫేర్ ఆఫీసర్-1, జూనియర్ మెడికల్ అసిస్టెంట్ (పురుషులు)-1, జూనియర్ ఫైర్‌మ్యాన్-4.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ/ ఎంబీఏ/సీఎస్/బీఈ/ బీటెక్/పీజీ/డిప్లొమా/ఎస్ఎస్ఎల్సీతో పాటు కొన్ని పోస్టుల కు సర్టిఫికేషన్ కూడా ఉండాలి.
వయసు: పోస్టులను బట్టి 21-50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పోస్టులను బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జీఎం పోస్టులకు రూ.1000బీ జూనియర్ మెడికల్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ మ్యాన్ పోస్టులకు రూ.250బీ మిగిలిన పోస్టులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఉచితం.
దరఖాస్తుకు చివరితేదీ: మే 20, 2019.
వెబ్సైట్:http://madrasfert.co.in
Authorization