1. ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు?
ఎ) నీలం సంజీవరెడ్డి బి) ఆర్.వెంకట్రామన్
సి) శంకర్‌దయాళ్ శర్మ డి) వి.వి.గిరి
2. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మొదటగా ఏ సభలో ప్రవేశపెట్టాలి?
ఎ) లోక్‌సభ బి) రాజ్యసభ
సి) ఏ సభలోనైనా డి) శాసనసభ
3. ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఎవరు?
ఎ) సర్వేపల్లి రాధాకృష్ణన్
బి) మహ్మద్ హిదయతుల్లా
సి) శంకర్‌దయాళ్‌శర్మ డి) పైవారందరూ
4. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి?
ఎ) కె.కృష్ణకాంత్ బి) హమీద్ అన్సారీ
సి) వి.వి.గిరి డి) శంకర్‌దయాళ్ శర్మ
5. ఎవరి సలహా ప్రకారం రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలిని ఏర్పాటు చేస్తారు?
ఎ) ప్రధానమంత్రి బి) ఉపరాష్ట్రపతి
సి) ఎన్నికలసంఘం డి) ఆర్థికసంఘం
6. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం జీవన్మరణాలలో ప్రధాన మంత్రి కీలకపాత్ర పోషిస్తారని ఎవరు పేర్కొన్నారు?
ఎ) లార్డ్ మన్రో బి) లార్డ్మార్లే
సి) హెచ్.జె.లాస్కీ డి) కె.టి.షా
7. భారత రాష్ట్రపతి ఒకే ఒకసారి తన పాకెట్ వీటో అధికారాన్ని ఏ బిల్లు కోసం ఉపయోగించారు?
ఎ) హిందూ చట్టం
బి) భారత తపాలా సవరణ చట్టం
సి) నిర్భయ చట్టం
డి) వరకట్న నిషేధ చట్టం
8. కింది వారిలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఎవరికి లేదు?
ఎ) రాజ్యసభకు రాష్ట్రపతి నియమించే సభ్యులు
బి) లోక్‌సభకు రాష్ట్రపతి నియమించే సభ్యులు
సి) విధాన సభకు గవర్నర్లు నియమించే సభ్యులు
డి) విధాన పరిషత్ సభ్యులు
9. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సరైన వరుస క్రమం ఏది?
1) గుజరాత్ 2) అస్సాం
3) ఆంధ్రప్రదేశ్ 4) తెలంగాణ
ఎ) 1, 2, 3, 4 బి) 3, 4, 2, 1
సి) 3, 1, 4, 2 డి) 3, 2, 4, 1
10. రాష్ట్రపతి ఎవరి ప్రతిపాదన మేరకు క్షమాభిక్ష పెడతారు?
ఎ) కేంద్ర మంత్రి మండలి తీర్మానం
బి) భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) కేంద్ర ఎన్నికల సంఘం
డి) భారత అటార్నీ జనరల్
11. 1950లో రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నికైనపుడు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించారు?
ఎ) హెచ్.వి.ఆర్. అయ్యంగార్
బి) వి.కె.అగ్నిహోత్రి
సి) కె.ఎం.మున్షి
డి) గోపాలస్వామి అయ్యంగార్
12. భారత రాష్ట్రపతి వీటో చేయలేని అంశాలు ఏవి?
ఎ) రాజ్యాంగ సవరణ బిల్లు
బి) ఆర్థిక బిల్లులు
సి) రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ బిల్లులు
డి) పైవన్నీ సరైనవే
13. కింది వాటిలో రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సినవి ఏవి?
ఎ) ద్రవ్యబిల్లులు
బి) కేంద్ర బడ్జెట్
సి) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు
డి) పైవన్నీ సరైనవే
14. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండే పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారు?
ఎ) అమెరికా బి) జర్మనీ
సి) జపాన్ డి) రష్యా
15. ప్రస్తుత రాష్ట్రపతి భవన్లో అధికారికంగా మొదటి సారిగా అడుగుపెట్టిన వ్యక్తి?
ఎ) లార్డ్ కర్జన్ బి) లార్డ్ ఇర్విన్
సి) లార్డ్ మేయో డి) లార్డ్ కానింగ్
16. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన ఉప ప్రధాని ఎవరు?
ఎ) అటల్‌బిహారీ వాజ్‌పేయి బి) ఎల్.కె.అద్వానీ
సి) చంద్రశేఖర్ డి) దేవీలాల్
17. రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి మహిళ ఎవరు?
ఎ) ప్రతిభా పాటిల్ బి) మీరాకుమార్
సి) లక్ష్మీ సెహెగల్ డి) సుమిత్ర మహజన్
18. కింది వారిలో ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎవరు?
ఎ) నీలం సంజీవరెడ్డి బి) జ్ఞాని జైల్‌సింగ్
సి) శంకర్‌దయాళ్‌శర్మ డి) పైవారందరూ
19. ఉపరాష్ట్రపతి అయి రాష్ట్రపతి కాని వారు ఎవరు?
ఎ) కె.కృష్ణకాంత్
బి) బైరాన్‌సింగ్ షెకావత్
సి) మహ్మద్ హిదయతుల్లా డి) పైవారందరూ
20. కింది వారిలో రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతులు గా పని చేసిన వారు?
ఎ) వి.వి.గిరి బి) మహ్మద్ హిదయతుల్లా
సి) బి.డి.జెట్టి డి) జ్ఞానీ జైల్‌సింగ్
21. పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి ఎవరు?
ఎ) శంకర్‌దయాళ్ శర్మ బి) కె.కృష్ణకాంత్
సి) వి.వి.గిరి డి) వెంకట్రామన్
22. 2017లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యహరించారు?
ఎ) షంషేర్.కె.షరీఫ్ బి) ఆర్.ఎస్.క్రాస్‌మన్
సి) బి.సి.కాంబ్లే డి) జి.ఎస్.పతక్
23. జాతీయ జనాభా నియంత్రణ మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
ఎ) రాష్ట్రపతి బి) ఉపరాష్ట్రపతి
సి) ప్రధానమంత్రి డి) ఆర్థిక సంఘం చైర్మన్
24. ఆధునిక నవభారత నిర్మాతగా ఏ భారత ప్రధాన మంత్రిని పిలుస్తారు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ బి) ఇందిరాగాంధీ
సి) మొరార్జీ దేశారు డి) చరణ్‌సింగ్
25. దేశంలో రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా పని చేసిన ఏకైక వ్యక్తి?
ఎ) లాల్‌బహదూర్‌శాస్త్రి బి) గుల్జారిలాల్ నందా
సి) చంద్రశేఖర్ డి) చరణ్‌సింగ్
26. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు విలువకు సంబం ధించి కిందివాటిని జతపరచండి?
జాబితా 1 జాబితా 2
1. ఉత్తరప్రదేశ్ ఎ. 208
2. తమిళనాడు బి. 176
3. అరుణాచల్‌ప్రదేశ్ సి. 08
4. బీహార్ డి. 173
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
27. రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యతా ఓట్ల ద్వారా గెలిచిన వ్యక్తి?
ఎ) డా. రాజేంద్రప్రసాద్ బి) వి.వి.గిరి
సి) ఎన్.సంజీవరెడ్డి డి) వెంకట్రామన్
28. భారత రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిపాదించిన వారు?
ఎ) బి.ఆర్.అంబేద్కర్ బి) జవహర్‌లాల్‌నెహ్రూ
సి) కె.టి.షా డి) కె.ఎం.మున్షీ
29. భారత రాష్ట్రపతి వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
ఎ) సుప్రీంకోర్టు బి) కేంద్ర ఎన్నికల సంఘం
సి) పార్లమెంటు డి) కేంద్ర ఆర్థిక సంఘం
30. భారత రాష్ట్రపతి పదవి నుంచి తొలగించే పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) రష్యా బి) ఐర్లాండ్
సి) అమెరికా డి) దక్షిణాఫ్రికా
31. కింది వాటిని జతచేయండి?
జాబితా 1
1. విదేశాల్లో మరణించిన ప్రధాని
2. గరీబీ హఠావో
3. నిరంతర ప్రణాళఙకను ప్రవేశపెట్టినవారు
4. రైతు బాంధవుడిగా పేరుగాంచినవారు
జాబితా 2
ఎ. లాల్ బహదూర్ శాస్త్రి బి. ఇందిరాగాంధీ
సి. మొరార్జీ దేశారు డి. చరణ్‌సింగ్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
32. కింది వారిలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వ్యక్తి ఎవరు?
ఎ) చరణ్‌సింగ్ బి) రాజీవ్‌సింగ్
సి) ఐ.కె.గుజ్రాల్ డి) మన్మోహన్ సింగ్
33. ఏ ప్రధాన మంత్రి తన ఒక పదవీ కాలంలో అత్యధిక సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు?
ఎ) మొరార్జీ దేశారు బి) రాజీవ్ గాంధీ
సి) చంద్రశేఖర్ డి) పి.వి. నరసింహారావు
34. కింది వాటిలో భారతరత్న బిరుదులు పొందిన ప్రధాన మంత్రుల సరైన వరుస క్రమం ఏది?
1) గుల్జారీలాల్ నందా 2) ఇందిరాగాందీ
3) లాల్‌బహదూర్ శాస్త్రి 4) మొరార్జీ దేశారు
ఎ) 1, 2, 3, 4 బి) 3, 2, 4, 1
సి) 2, 3, 1, 4 డి) 1, 3, 2, 4
35. ఎక్కువ మంది ప్రధాన మంత్రులను అందించిన రాష్ట్రం?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) గుజరాత్
సి) మహారాష్ట్ర డి) తమిళనాడు
36. జోడు పదవుల బిల్లు విషయంలో ఏ రాష్ట్రపతి సస్పెన్సివ్ వీటో ఉపయోగించాడు?
ఎ) జ్ఞాని జైల్‌సింగ్ బి) కె.ఆర్.నారాయణన్
సి) అబ్దుల్ కలాం డి) వి.వి.గిరి
37. భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలు మన రాజ్యాం గంపై జరిపే దోపిడీ వంటిది అని ఎవరు పేర్కొన్నారు?
ఎ) అలెన్ గ్లౌడ్ హిల్ బి) హెచ్.వి.కామత్
సి) టి.టి.కృష్ణమాచారి డి) కె.ఎం.నంబియార్
38. కింది వారిలో కార్మిక ఉద్యమాలతో సంబంధం ఉన్న రాష్ట్రపతి ఎవరు?
ఎ) బాబూ రాజేంద్రప్రసాద్ బి) వి.వి.గిరి
సి) ఆర్.వెంకట్రామన్ డి) శంకర్‌దయాళ్ శర్మ
39. 'వింగ్స్ ఆఫ్ పైర్' గ్రంథం రచించిన రాష్ట్రపతి ఎవరు?
ఎ) ఎ.పి.జె. అబ్దుల్ కలాం బి) ప్రణబ్‌ముఖర్జీ
సి) కె.ఆర్.నారాయణన్ డి) వి.వి.గిరి
40. కింది వాటిలో ఉపరాష్ట్రపతుల సరైన వరుస క్రమం ఏది?
1) జాకీర్‌హుస్సేన్ 2) ఎం.హిదయతుల్లా
3) బి.డి.జెట్టి 4) కె.ఆర్.నారాయణన్
5) వెంకటరామన్
ఎ) 1, 3, 2, 4, 5 బి) 1, 3, 2, 5, 4
సి) 1, 4, 3, 2, 5 డి) 1, 5, 2, 3, 4
41. కింది వారిలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి రానివారు ఎవరు?
ఎ) రాష్ట్రపతి బి) ఉపరాష్ట్రపతి
సి) ప్రధాన మంత్రి డి) స్పీకర్
42. కేంద్ర కార్యనిర్వాహకశాఖ గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు?
ఎ) 3వ భాగం బి) 4వ భాగం
సి) 5వ భాగం డి) 6వ భాగం
43. భారతదేశంలో రాజ్యాంగ అధిపతి అని ఎవరిని పేర్కొంటారు?
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి
సి) సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి) స్పీకర్
44. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారు?
ఎ) బ్రిటన్ బి) అమెరికా
సి) ఐర్లాండ్ డి) రష్యా
45. భారత రాష్ట్రపతి కాకముందు భారతరత్న పొందిన వ్యక్తి?
ఎ) జాకీర్ హుస్సేన్ బి) డా.రాజేంద్రప్రసాద్
సి) నీలం సంజీవరెడ్డి డి) ఎస్.రాధాకృష్ణన్
46. భారత రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా ఎక్కడ ప్రవేశపెడతారు?
ఎ) సుప్రీంకోర్టు బి) లోక్‌సభ మాత్రమే
సి) రాజ్యసభలో మాత్రమే
డి) పార్లమెంటులోని ఏ సభలోనైనా
సమాధానాలు
1.ఎ 2.బి 3.డి 4.సి 5.ఎ
6.సి 7.బి 8.డి 9.సి 10.ఎ
11.ఎ 12.డి 13.డి 14.సి 15.బి
16.బి 17.ఎ 18.డి 19.డి 20.బి
21.బి 22.ఎ 23.సి 24.ఎ 25.బి
26.ఎ 27.బి 28.సి 29.సి 30.సి
31.ఎ 32.సి 33.డి 34.బి 35.ఎ
36.సి 37.డి 38.బి 39.ఎ 40.బి
41.డి 42.సి 43.ఎ 44.బి 45.ఎ
46.డి
Authorization