ఫ్యాక్ట్ లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
కోచిలోని ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ (ఫ్యాక్ట్) లిమిటెడ్.. 274 మేనేజ్మెంట్ ట్రైనీ, టెక్నీషియన్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (డిజైన్-సివిల్)-1, సీనియర్ మేనేజర్ (ఇంజనీరింగ్ డిజైన్, హెచ్ఆర్, మెటీరియల్స్, లీగల్)-10, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ-1, మెడికల్ ఆఫీసర్-1, డిప్యూటీ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఫైనాన్స్-12, ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్, సేల్స్, హిందీ)-13, మేనేజ్మెంట్ ట్రైనీ-51, టెక్నీషియన్-79, డ్రాఫ్ట్స్‌మెన్-3, క్రాఫ్ట్స్‌మెన్-27, రిగ్గర్ హెల్పర్-8, హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్-5, అసిస్టెంట్-18, డిపో అసిస్టెంట్-20, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-4, స్టెనోగ్రాఫర్-10, శానిటరీ ఇన్స్పెక్టర్-1, నర్స్-6, క్యాంటీన్ సూపర్ వైజర్-4.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ ఎంబీబీఎస్/సీఏ/ డిప్లొమా/ పదో తరగతి ఉత్తీర్ణత. నిర్దిష్ట అనుభవం కూడా ఉండాలి.
వయసు: పోస్టులను బట్టి 26-48 ఏళ్ల మధ్య ఉండాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: మేనేజీరియల్ పోస్టులకు రూ.1000, నాన్ మేనేజీరియల్ పోస్టులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ,ఈఎస్ అభ్యర్థులకు ఉచితం.
ఎంపిక: పోస్టులను బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: మే 6, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: మే 20, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://fact.co.in
Authorization