ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువల మొత్తాన్ని ఆ దేశ జాతీయాదాయం అంటారు. ప్రతి ఆర్థిక వ్యవస్థలో లభించే వివిధ వనరులను వుపయోగించుకొని వస్తుసేవల ఉత్పత్తిని అధికం చేసుకోవడాన్ని ఆర్థికాభివద్ధి అంటారు. ఒక దేశ జాతీయాదాయ స్థాయిని బట్టి, వివిధ రంగాల వాటాలు, వివిధ వర్గాల ప్రజల ఆదాయాలు, ప్రజల జీవన ప్రమాణ స్థాయి మొదలైన అంశాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. జాతీయాదాయాన్ని మూడు విధాలుగా చెప్పవచ్చును.
1. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువ మొత్తం (Value of Output).
2. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తికారకాలకు లభించిన
ఆదాయాల మొత్తం (Total Income Received).
3. ఒక సంవత్సర కాలంలో దేశంలోని ప్రజలు వస్తుసేవలపై చేసిన మొత్తం వ్యయం (Total Expenditure).
జాతీయాదాయం నిర్వచనాలు
''దేశంలోని శ్రమ, మూలధనం ప్రక తి వనరుల సహాయంతో ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి కాబడిన నికర వస్తుసేవల విలువ మొత్తమే జాతీయాదాయం'' - ఆల్ఫ్రెడ్ మార్షల్.
''ద్రవ్యంతో కొలువదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని విదేశాలనుంచి లభించే నికర ఆదాయాన్ని జాతీయాదాయం అంటారు'' -ఎ.సి.పిగూ.
''వినియోగదారులకు అందే సేవలు, అట్లాంటి సేవలు భౌతిక వస్తువులనుండి కాని,మానవ కల్పితమైన పరిస్థితులవల్ల కాని లభించినవన్నీ జాతీయాదాయం''
- ఇర్వింగ్ ఫిషర్.
''ఒక దేశంలోని ఉత్పాదక వ్వవస్థ నుంచి ఒక సంవత్సర కాలంలో అంతిమ వినియోగదారులకు చేరిన వివిధ వస్తుసేవల నికర మొత్తాల సమాహారమే ఆ దేశపు జాతీయాదాయం'' - సైమన్ కుజ్నెట్.
జాతీయాదాయం - భాగాలు (National Income-Components)
జాతీయాదాయం స్థూల చలాంకం. దీనిని నిర్ణయించే చలాంకాలను ఉప స్థూల చలాంకాలు అంటారు. వీటినే జాతీయాదాయంలోని భాగాలుగా పేర్కొంటారు.
స్థూల జాతీయోత్పత్తి= GNP= C + I + G (X - M) + (R - P)
C= సమిష్టి వినియోగం.
I= సమిష్టి పెట్టుబడి.
G= ప్రభుత్వ వ్యయం
X=ఎగుమతులు
M= దిగుమతులు
R=విదేశాల నుండి వచ్చే ఆదాయం
P=విదేశాలకు వెళ్ళే ఆదాయం
NFFI = (Net Foreign Factor Income) = (R - P).
జాతీయాదాయం -భావనలు (National Income - Concepts) జాతీయాదాయంలోని భాగాలను తెలుసు కున్న తర్వాత, జాతీయాదాయంలోని వివిధ భావనలను వివరించ వచ్చును. జాతీయాదాయంలోని వివిధ భావనలను కింద పేర్కొనబడినవి.
1. స్థూల జాతీయోత్పత్తి= GNP= C + I + G (X -M) + NFFI.
2. నికర జాతీయోత్పత్తి= NNP = GNP -- D.
3. స్థూల దేశీయోత్పత్తి= GDP = C + I + G (X - M).
4. నికర దేశీయోత్పత్తి= NDP = GDP - D.
5. ఉత్పత్తికారకాల దష్ట్యా నికర జాతీయాదాయం = NNPFC = NNP - Ti+ Su.
6. వ్వష్ఠి ఆదాయం = PI = NNPFC -Tc - Pu - Sd + Tp.
7. వ్యయార్హ ఆదాయం= DI = PI -PT.
8. తలసరి ఆదాయం = PI = NI / Population.
9. నిజ జాతీయాదాయం = ప్రస్తుత ధరలలో జాతీయా దాయం / ప్రస్తుత ధరల సూచీ X100
1. స్థూల జాతీయ ఉత్పత్తి (Gross National Prod uct): ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువ మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. వస్తుసేవల విలువను మార్కెట్ ధరలతో గుణిస్తే స్థూల జాతీయోత్పత్తి విలువ తెలుస్తుంది.
GNP = C + I + G (X -M)+(R-P), స్థూల జాతీయో త్పత్తి సూత్రంలో
C= సమిష్టి వినియోగం,
I= సమిష్టి పెట్టుబడి,
G= ప్రభుత్వ వ్యయం,
X= ఎగుమతులు, M= దిగుమతులు.
R= విదేశాల నుండి వచ్చే ఆదాయం,
P= విదేశాలకు వెళ్ళే ఆదాయం.
స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వస్తువును రెండుసార్లు లెక్కించకూడదు. ముడి పదార్థాలను, మాధ్యమిక వస్తువుల విలువను జాతీయాదాయంలో లెక్కించరాదు. ముడి పదార్థాలను, మాధ్యమిక వస్తువుల విలువను జాతీయాదాయంలో చేర్చరాదు అన్నప్పుడు సహజంగా ఒక సందేహం కలుగు తుంది. ఉదా: ఒక సంవత్సర కాలంలో జాతీయోత్ప త్తిని లెక్కించేటప్పుడు ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశలలో వున్న మాధ్యమిక వస్తువుల విలువను గూడా ఆ సంవత్సరం జాతీయోత్పత్తిలో చేర్చుతారు. ఉపయోగించకుండా వున్న ముడి పదార్థాలు, వివిధ దశలలో వున్న మాధ్యమిక వస్తువులు, అమ్మకుండా తయారైన వస్తువులను ఇన్వెం టరీలు (Inventories) అంటారు. ధరలలో వచ్చే మార్పు లను తొలగించడానికి స్థిర ధరలలో (Income at constant prices), ధరల సూచీని (Price Index) ఉపయోగించి జాతీయాదాయాన్ని లెక్కించాలి. అలాగే నికర దేశీయ వ్యాపారాన్ని కలుపాలి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే ఆ తేడాను తీసివేయాలి. ఒకవేళ ఎగుమతుల కంటే దిగుమతులు తక్కువగా ఉంటే ఆ తేడాను కలుపాలి.
2. స్థూల దేశీయోత్పత్తి (Gross Domestic Product) : ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి నుండి విదేశాలనుండి లభించే నికర ఆదాయాన్ని (Net Foreign Factor Income) తీసి వేస్తే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది.
GDP = C + I + G (X -M) లేదా GNP = GDP+ (R-P) (నికర విదేశీ ఆదాయం- NFFI)
స్థూల జాతీయోత్పత్తిలో ఒక దేశంలోని వ్యక్తులు, సంస్థలు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఆర్జించిన ఆదాయాలను పరిగణలోనికి తీసుకుంటారు. స్థూల దేశీయోత్పత్తిలో దేశీయంగా జరిగే ఉత్పత్తిని పరిగణలోనికి తీసుకుంటారు. ఉదా: అమెరికా దేశానికి చెందిన ఒక సంస్థ మనదేశంలో 100 కోట్ల ఉత్పత్తిని చేసిందనుకుందాం. మన దేశ GDP లెక్కించేటప్పుడు 100 కోట్లను మనదేశ స్థూల దేశీ యోత్పత్తిలో దీనిని చేర్చుతారు. అయితే GNP లెక్కిం చేటప్పుడు దీనిని తీసివేస్తారు. ఇది అమెరికా దేశ GNP లో కలుపుతారు. అయితే అమెరికా దేశ GDP లో దీనిని లెక్కించరు.
3. నికర జాతీయోత్పత్తి (Net National Product): ప్రస్తుత ధరలలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల నికర ద్రవ్య విలువనే నికర జాతీయాదాయం అంటారు. ఒక దేశంలో జరిగే ఉత్పత్తి అనేక ఉత్పాదకాలు, యంత్ర పరికరాల సహాయంతో జరుగుతుంది. కాలం గడిచేకొద్దీ యంత్ర పరికరాల ఉత్పత్తి సామర్ధ్యం క్రమేపీ తగ్గుతుంది. దీనినే తరుగుదల అంటారు. స్థూల జాతీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చే దానిని నికర జాతీయోత్పత్తి అంటారు.
నికర జాతీయోత్పత్తి= NNP = GNP- D. (D =తరుగుదల)
4. నికర దేశీయోత్పత్తి (Net Domestic Product): ఒక దేశ స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే నికర దేశీయోత్పత్తి లభిస్తుంది.
నికర దేశీయోత్పతి= NDP = GDP - D.
5. ఉత్పత్తి కారకాల దష్ట్యా నికర జాతీయోత్పత్తి (Net
National Product at Factor Cost): వస్తూత్పత్తికి అవసరమయ్యే ఉత్పాదకాలైన భూమి, శ్రమ, మూలధనం వ్యవస్థాపనం వాటి ప్రతిపలాలైన భాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో ఆర్జించిన మొత్తాన్ని ఉత్పత్తి కారకాల దష్ట్యా జాతీయాదాయం అంటారు. నికర జాతీయోత్పత్తి అంతా ఉత్పత్తి కారకాలు మధ్య పంపిణీ కాదు. అందులో కొంత భాగం పరోక్ష పన్నుల (Ti) కింద ప్రభుత్వానికి చేరుతుంది. వస్తువులపై విధించిన ఎక్సైజ్ సుంకం, అమ్మకం పన్ను మొదలైనవి, ఉత్పాదక సంస్థల వ్యయంలో భాగంగా ఉంటాయి. ఆ మేరకు ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తి అమ్మకాలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం సబ్సిడీలను(Su) చెల్లిస్తుంది. ఈ సబ్సిడీల మేరకు వస్తువుల ధరలు తగ్గుతాయి. నికర జాతీయోత్పత్తి నుండి పరోక్ష పన్నులను తీసివేసి, సబ్సిడీలను కలిపి నట్లయితే ఉత్పత్తి కారకాల దష్ట్యా జాతీయాదాయం లభిస్తుంది.
ఉత్పత్తికారకాల దష్ట్యా నికర జాతీయాదాయ = NNPFC = NNP - Ti + Su.
7. వ్యష్టి ఆదాయయం (Personal Income): ఒక సంవ త్సరకాలంలో దేశంలోని వ్యక్తులకు, సంస్థలకు లభించిన ఆదాయాల మొత్తాన్ని వ్యష్టి ఆదాయం అంటారు. జాతీయా దాయానికి, వ్యష్టి ఆదాయానికి తేడా ఉంది జాతీయాదాయం వ్యక్తులు ఆర్జించిన మొత్తం ఆదాయాన్ని తెలుపుతుంది. కానీ ఆర్జించిన ఆదాయం అంతా వ్యక్తులకు చెందదు. వ్యష్టి ఆదాయం వ్యక్తులకు వచ్చిన ఆదాయాన్ని తెలుపుతుంది. కార్పొరేట్ పన్నులు (Tc), పంచిపెట్టని లాభాలు (Pu), సాంఘిక సంక్షేమ విరాళాలు (Sd)మొదలైనవి పోగా మిగిలిన జాతీయాదాయం మాత్రమే వ్యక్తులకు చెందు తుంది. వ్యక్తులకు లభించే ఆదాయంలో కొంత భాగం ఉత్పత్తి లో పాల్గొనడంవల్ల గాక పెన్షన్లు, నిరుద్యోగ భతి, ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ మొదలైనవాటి వల్ల లభించవచ్చును, వీటిని బదిలీ చెల్లింపులు (Tp) అంటారు. ఈ బదిలీ చెల్లింపులు వ్యక్తులకు అందినప్పటికి వాటిని జాతీయాదాయంలో లెక్కించరు.
వ్వష్ఠి ఆదాయం = PI = NNPFC - Tc - Pu - Sd + Tp.
8. వ్యయార్హ ఆదాయం (Disposable Income): వ్యక్తులకు వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టడానికి వీలుండదు. వ్యక్తులకు వచ్చిన ఆదాయంలో కొంత భాగం ప్రత్యక్ష పన్నులైన ఆదాయం పన్ను, ఆస్తి పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తారు. వ్యష్టి ఆదాయం నుండి వ్యష్టి పన్నుల (PT) ను తీసివేయగా వచ్చిందే వ్యయార్హ ఆదాయం అంటారు.
వ్యయార్హ ఆదాయం= DI = PI -PT.
9. తలసరి ఆదాయం (Per Capita Income) : ఒక దేశ జాతీయాదాయాన్ని దేశంలో ఉన్న జనాభాతో భాగిస్తే సగటు తలసరి ఆదాయం తెలుస్తుంది.
తలసరి ఆదాయం =జాతీయాదాయం / దేశ జనాభా
10. నిజ లేదా వాస్తవ జాతీయాదాయం (Real Natio nal Income): జాతీయాదాయాన్ని రెండు రకాలుగా పేర్కొనవచ్చును 1) ప్రస్తుత ధరలలో జాతీయాదాయం (Real Natio nal Income)
2) స్థిర ధరలలో లేదా నిజ (వాస్తవ) జతీయాదాయం (National Income at Constant Prices). ధరలలో పెరుగుదల మూలంగా జాతీయోత్తత్తిలో పెరుగుదల తక్కువగా వున్నప్పటికి, జాతీయాదాయంలో పెరుగుదల ఎక్కువ వుంటుంది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి ధరలలోని పెరుగుదలను, ధరల సూచీ ద్వారా సరిచేయడం జరుగుతుంది. ఇందుకోసం ధరలలో ఒడుదుడుకులు లేని ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని నిజ జాతీయాదాయన్ని లెక్కించడం జరుగుతున్నది.
నిజ జాతీయాదాయం = ప్రస్తుత ధరలలో జాతీయాదాయం / ప్రస్తుత ధరల సూచీ X 100
గమనిక
డిగ్రీ పూర్తి చేసుకొని పీజీలో అడుగు పెట్టాలనుకునే విద్యార్థులు 2019లో ఎంట్రెన్స్‌ను ఆన్లైన్లోనే రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రతి యూనివర్సిటీ వేరువేరుగా ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించేవారు. డిగ్రీ సిలబస్ ఒక్కటే కావడం వల్ల ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు కలిపి ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సెట్, ఎకనామిక్స్‌లో పీజీ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తుంది. అయితే ఈ పరీక్ష రాయాలంటే నల్గొండ ఎకనామిక్ ఫోరం వెబ్సైట్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో గ్రాండ్ టెస్ట్‌లు రాయడం ద్వారా ముందు నుంచే ఆన్లైన్లో పరీక్ష రాయడం అలవాటు అవుతుంది. టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అయితే ఆన్లైన్ పరీక్షల రిజిస్ట్రేషన్‌కు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్‌కు కింది వెబ్‌సైట్‌ను చూడగలరు : http://www.nalgondaeconomicsforum.org
- డాక్టర్.అక్కెనపల్లి మీనయ్య
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు, నల్లగొండ
రిటైర్డ్ (ఎచ్.ఓ.డి) ఎకనామిక్స్ నాగార్టున ప్రభుత్వ కళాశాల
ఫోన్:9490138118