1. మార్చి 23 - మే 12 మధ్య జరిగిన ఐపీఎల్ - 12 టోర్న మెంట్‌కు సంబంధించి కింది జతలలో సరికానిది ఏది?
ఎ) ఆరెంజ్ క్యాప్ - డేవిడ్ వార్నర్
బి) పర్పుల్ క్యాప్ - రషీద్ ఖాన్
సి) రన్నరప్ - చెన్నై
డి) ఫెయిర్ ప్లే అవార్డ్ - సన్‌రైజర్స్ హైదరాబాద్
2. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ జాక్ ఫర్జ్ రఫెల్ జాకబ్‌ను ఇటీవల 'హాల్ ఆఫ్ హానర్'తో గౌరవించిన దేశం?
ఎ) బంగ్లాదేశ్ బి) రష్యా
సి) దక్షిణ కొరియా డి) ఇజ్రాయెల్
3. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి 20,000 అంగన్వాడీ కేంద్రాల్లో 2.5 లక్షల చిన్నారులకు వారానికి రెండు సార్లు 100 ఎం.ఎల్ పాలు ఉచితంగా ఇచ్చేందుకు 'ముఖ్యమంత్రి అన్చల్ అమృత్ యోజన' కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఎ) రాజస్థాన్ బి) మధ్యప్రదేశ్
సి) గుజరాత్ డి) ఛత్తీస్‌గఢ్
4. ప్రపంచ మేధోహకుకల సంస్థ ఏటా ఏ తేదీనాడు 'ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం' జరపాలని 2000 సంవత్స రంలో తీర్మానించింది?
ఎ) ఏప్రిల్ 24 బి) ఏప్రిల్ 26
సి) ఏప్రిల్ 14 డి) మే 26
5. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో నవ్యపథంలో నడుస్తున్న తొలి పది మందిని (టాప్ - టెన్) టైమ్ మ్యాగజైన్ ఇటీవల ఎంపిక చేసింది. ఇందులో చోటు దక్కించుకున్న భారతీయుడు 'అజరునగర్' ఏ రంగానికి చెందినవారు?
ఎ) వ్యాపారం బి) విద్య సి) సంగీతం డి) క్రీడలు
6. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన 'గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ - 2019' ప్రకారం ప్రపంచ జనాభాలో ఎంత శాతం అత్యంత పేదరికంలో ఉన్నారు?
ఎ) 60 శాతం బి) 80 శాతం
సి) 50 శాతం డి) 70 శాతం
7. దేశంలో 16వ జనగణన ఏ తేదీన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం 2019 మే 2న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది?
ఎ) ఏప్రిల్ 1, 2021 బి) మార్చి 1, 2021
సి) ఫిబ్రవరి 1, 2021 డి) జనవరి 1, 2021
8. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్' అమలు కమిటీకి చైర్మన్‌గా ఎవరుంటారు?
ఎ) కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీ
బి) కేంద్ర పర్యావరణ మంత్రి
సి) కేంద్ర కాలుష్య మండలి చైర్మన్
డి) జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్
9. మహావజిరలాంగ్ కోర్న్ 2019 మే 4న ఏ దేశానికి రాజుగా సింహాసనం అధిష్టించారు?
ఎ) భూటాన్ బి) మంగోలియా
సి) కంబోడియా డి) థారులాండ్
10. కోలొకేషన్ సదుపాయాన్ని దుర్వినియోగం చేసి కొన్ని సంస్థలకు అనుచిత లబ్ది చేకూర్చిన కేసులో ఏ సంస్థపై ఇటీవల సెబీ రూ.625 కోట్ల జరిమానా, భవిష్యత్ కార్యకలాపాలపై నియంత్రణ విధించింది?
ఎ) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ బి) కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజీ
సి) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ డి) ఎ, సి
11. 'ఎన్నో కాల పరీక్షలను ఎదుర్కొని నిలబడిన భారత ఆర్థిక సమాఖ్యవాదం 2014 తర్వాత వచ్చిన మార్పుల వల్ల ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నదని తెలిపిన ఇటీవలి పుస్తకం 'ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం' రచయితలు ఎవరు?
ఎ) వై.వి.రెడ్డి, బి.ఆర్.రెడ్డి
బి) బిమన్ జలాన్, అరవింద సుబ్రహ్మణ్యం
సి) వై.వి.రెడ్డి, అరవింద్ పణగారియా
డి) రఘురాం రాజన్, జి.ఆర్.రెడ్డి
12. గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి మండలి సభ్యులు స్వదేశీ, విదేశీ పర్యటనల కోసం మొత్తం ఎంత ఖర్చయినట్టు కేబినెట్ వ్యవహారాల పే అండ్ అకౌంట్స్ కార్యాలయం ఒక ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది?
ఎ) రూ.263 కోట్లు బి) రూ.500 కోట్లు
సి) రూ.88 కోట్లు డి) రూ.393 కోట్లు
13. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోలింగ్ కేంద్రంగా వార్తల్లో నిలిచిన హిమాచల్ ప్రదేశ్‌లో 'తషిగాంగ్' గ్రామం సమద్ర మట్టానికి ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది?
ఎ) 10,228 బి) 8,686
సి) 16,280 డి) 15,256
14. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కింది వారిలో ఏ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది?
1. దర్పణ్ - గ్రామీణ తపాలా కార్యాలయాల డిజిటలీకరణ
2. బీమ్ (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్
3. ఆధార్ మర్చంట్ పే సదుపాయం
4. బీమ్ యుఎస్ఎస్డి 2.0
ఎ) 1, 2, 4 మాత్రమే బి) 2, 3, 4 మాత్రమే
సి) పైవన్నీ డి) 1, 2 మాత్రమే
15. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన అంతర్జా తీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు (ఐఎన్ సీబీ)కి మే 7న రెండవసారి ఎన్నికయిన భారత నార్కోటిక్స్ మాజీ కమిషనర్?
ఎ) దియా మీర్జా బి) మనీష్ మహేశ్వరి
సి) జగ్జిత్ పవాడియా డి) సంజీవ్ పూరి
16. భారత్ - ఫ్రాన్స్‌ల నౌకాదళాలు సంయుక్తంగా నిర్వ హించిన 17వ వరుణ-2019 నౌకా విన్యాసాలు మే నెలలో ఎక్కడ నిర్వహించారు?
ఎ) విశాఖపట్నం తీరం బి) ముంబై తీరం
సి) గోవా తీరం డి) కొచ్చి తీరం
17. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకుర్కి ఏ దేశ సుప్రీంకోర్టులో నాన్ రెసిడెంట్ ప్యానల్ న్యాయమూర్తిగా సేవలందించడానికి 2018 డిసెంబర్ 31న ఆహ్వానం అందింది?
ఎ) ఫిజి బి) సింగపూర్
సి) న్యూజిలాండ్ డి) స్విట్జర్లాండ్
18. పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇటీవల తెలంగాణలోని ఏ ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రంలో వారియర్ (యోధుడు) పోలికతో ఉన్న రాష్ట్రంలోనే అతిపెద్ద (1.73 మీటర్ల పొడవు, 35 ఇంచుల వెడల్పు) సున్నపురాయి విగ్రహం బయట పడింది?
ఎ) నంది కొండ బి) దేవుని గుట్ట
సి) ఫణిగిరి డి) బోధన్
19. జులై 9 - 16 తేదీల మధ్య ఇస్రో ప్రయోగించనున్న చంద్రయాన్-2 ఉపగ్రహంలోని మూడు మాడ్యుల్స్ (భాగాలు)లో ఉండే భారత పేలోడ్ల సంఖ్యకి సంబంధించి కింది వాటిలో సరైన జతలు ఏవి?
1. ఆర్బిటార్ - 8 పేలోడ్లు 2. రోవర్ - 3 పేలోడ్లు
3. ల్యాండర్ - 2 పేలోడ్లు
ఎ) 3 మాత్రమే బి) 1, 3 మాత్రమే
సి) పైవన్నీ డి) 1 మాత్రమే
20. భారతదేశంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాల దర్శనాన్ని 'ఛోటా చార్ధామ్ యాత్ర' అంటారు. మరి 'చార్ధామ్ యాత్ర' లో దర్శించవలసిన ఆలయాలు ఏవి?
1. బద్రీనాథ్ 2. ద్వారక 3. మధుర
4. పూరీ 5. రామేశ్వరం
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3, 5
సి) 1, 2, 4, 5 డి) 1, 3, 4, 5
21. 2013లో తపాలా శాఖలో కుదుర్చుకున్న రూ.1100 కోట్ల ఒప్పందంలో భాగంగా ఏ సంస్థ దేశంలోని సుమారు 1.50 లక్షల కోట్ల తపాలా కార్యాలయాలను సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించింది?
ఎ) విప్రో బి) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
సి) టెక్ - మహీంద్రా డి) ఇన్ఫోసిస్
22. కింది వాటిని జతపరచండి?
1. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం
ఎ. ఏప్రిల్ 25
2. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
బి. మే 3
3. ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినోత్సవం
సి. ఏప్రిల్ 23
4. ప్రపంచ టెలీకమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ సొసైటీ డే
డి. మే 17
ఎ) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
23. తన కెరీర్లో వివిధ ఘటనల దర్యాప్తులో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను 'మెక్కెయిన్ ఇన్స్టిట్యూట్ అవార్డ్-2019' గెలుచుకున్న నిర్భయ అత్యాచార కేసు దర్యాప్తు అధికారి?
ఎ) నగేన్ సైకియా బి) రీతూ శర్మ
సి) ఛాయా శర్మ డి) విమలా మెహ్రా
24. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ఇటీవల వార్తల లో ప్రముఖంగా వచ్చింది. ఈ నేపథ్యంలో కింది వాటిలో సరైన వాక్యాలు ఏవో తెలపండి?
1. చైనా నుంచి అమెరికా చేసుకునే దిగుమతుల విలువ 539.5 బిలియన్ డాలర్టు
2. అమెరికా చైనాకు చేసే ఎగుమతుల విలువ 120.3 బిలియన్ డాలర్లు
3. అమెరికా 250 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై సుంకాలు విధించింది.
ఎ) 1, 2 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) పైవన్నీ డి) ఏదీకాదు
25. తెలంగాణ హైకోర్టులో నియమితులైన తొలి మహిళా న్యాయమూర్తిగా ఇటీవల పొందిన వారు ఎవరు?
ఎ) జస్టిస్ గండికోట శ్రీదేవి బి) జస్టిస్ టి.మీనా కుమారి
సి) జస్టిస్ జి.రోహిణి డి) జస్టిస్ ఇందు మల్హోత్రా
26. 2019 సార్వత్రిక ఎన్నికలోల సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్లాంట్లను లెక్కించారు?
ఎ) ఐదు పోలింగ్ కేంద్రాలు
బి) 50 శాతం పోలింగ్ కేంద్రాలు
సి) 50 పోలింగ్ కేంద్రాలు డి) 20 పోలింగ్ కేంద్రాలు
27. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ - 2019 పోటీల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి?
ఎ) చైనా, జపాన్ బి) జపాన్, దక్షిణ కొరియా
సి) థాయిలాండ్, జపాన్ డి) చైనా, ఉత్తర కొరియా
28. ఆంధ్రప్రదేశ్‌లోని కింది ఏ దేవస్థానానికి ఆహార నాణ్యత, పనితీరు విభాగాలలో ఏప్రిల్ 21న ఐ.ఎస్.ఓ. సర్టిఫికెట్టు లభించాయి?
ఎ) తిరుమల తిరుపతి దేవస్థానం
బి) శ్రీకాళహస్తి దేవస్థానం
సి) సింహాచలం దేవస్థానం డి) అన్నవరం దేవస్థానం
29. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ ప్రభావంతో 2019 ఏప్రిల్ నెలలో నమోదైన భారత నికర వాణిజ్య లోటు సుమారుగా ఎంత?
ఎ) రూ. 50,000 కోట్లు బి) రూ. లక్ష కోట్లు
సి) రూ. 80,000 కోట్లు డి) రూ. 1,20,000 కోట్లు
30. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రచార కర్తగా ఇటీవల నియమితులైన బాలీవుడ్ నటి?
ఎ) దిశా పఠానీ బి) దియా మీర్జా
సి) కంగనా రనౌత్ డి) ప్రియాంక చోప్రా
31. భారతదేశం 2019 మార్చి 7న రష్యాతో కుదుర్చు కున్న సుమారు రూ.21 వేల కోట్ల విలువైన లీజు ఒప్పందం ప్రకారం రష్యా 2025 నాటికి అందిం చవలసిన అణు జలాంతర్గామి?
ఎ) చక్ర - 1 బి) చక్ర - 3
సి) చక్ర - 2 డి) ఏదీకాదు
32. నేపాల్‌లోని ఖంబు పసంగ్ల మున్సిపాలిటీ ఆధ్వర్యం లో ఏ పర్వతాన్ని శుద్ధి చేయడానికి 2019 ఏప్రిల్ 14న క్లీనింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు?
ఎ) ఎవరెస్ట్ బి) పామిర్
సి) కే 2 డి) కాంచన్‌జంగ
33. 'గర్భస్థ శిశువు నుంచి కట్టె కాలే వరకు మనిషికి హక్కులు వర్తిస్తాయని పేర్కొన్న ప్రముఖ న్యాయమూర్తి ఎవరు?
ఎ) జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి బి) జస్టిస్ సుదర్శన్ రెడ్డి
సి) జస్టిస్ చలమేశ్వర్ డి) జస్టిస్ సుభాషణ్ రెడ్డి
సమాధానాలు
1.బి 2.డి 3.సి 4.బి 5.సి
6.డి 7.బి 8.ఎ 9.డి 10.సి
11.ఎ 12.డి 13.డి 14.సి 15.సి
16.సి 17.ఎ 18.సి 19.డి 20.సి
21.బి 22.బి 23.సి 24.సి 25.ఎ
26.ఎ 27.డి 28.డి 29.బి 30.బి
31.బి 32.ఎ 33.డి