1. మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా నియమితులైన క్రికెటర్?
ఎ) అనీల్‌కుంబ్లే బి) సంగక్కర
సి) కపిల్‌దేవ్ డి) బ్రియన్ లారా
2. మే 2న రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి పురస్కారాల్లో భాగంగా ఉత్తమ కవితా విభాగంలో అవార్డు గెలుచుకున్న 'బొమ్మల బాయి' రచయిత?
ఎ) సిద్ధార్థ బి) నరసింహం
సి) నందిని సిధారెడ్డి డి) నగేష్ బీరెడ్డి
3. మే 6న చత్తీస్ఘడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) జిస్టిస్ రామచంద్ర మీనన్
బి) జిస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్
సి) జిస్టిస్ ప్రవీణ్‌కుమార్
డి) జిస్టిస్ లావు నాగేశ్వరరావు
4. కింది వాటిని జతపరచండి?
పంట బోర్డు కేంద్ర కార్యాలయం
1. రబ్బరు బోర్డు ఎ. బెంగుళూరు (కర్ణాటక)
2. తేయాకు బోర్డు బి. కొట్టాయం (కేరళ)
3. కాఫీ బోర్డు సి. కోల్‌కతా (పశ్చిమ బంగ్లా)
4. పొగాకు బోర్డు డి. గుంటూరు (ఆంధ్రప్రదేశ్)
ఎ) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
5. 2019 ఏప్రిల్ 25న ద్వైపాక్షిక సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వాద్లి వొస్తోక్ నగరంలో ఎవరితో సమావేశమయ్యారు?
ఎ) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
బి) ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
సి) చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్
డి) ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు
6. భారతీయ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రదర్శన (రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో) - 2019 ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఏ నగరంలో జరిగింది?
ఎ) బెంగుళూరు బి) మధురై
సి) నాగ్‌పూర్ డి) హైదరాబాద్
7. ఇస్రో మే 13 - 26 తేదీల మధ్య నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం యువైక - 2019 (యువ వైజ్ఞానిక కార్యక్రమం)కి ఏ తరగతిలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా విద్యార్థుల్ని ఎంపిక చేశారు?
ఎ) 10వ తరగతి బి) 7వ తరగతి
సి) 8వ తరగతి డి) 9వ తరగతి
8. కింది వాటిలో ఏ చట్టం కింద 'ఎల్టీటీఈ' పై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 5సంవత్సరాల పాటు పొడిగించింది?
ఎ) చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) - 1967
బి) ఉగ్రవాద నిరోధక చట్టం (పోటా) - 2002
సి) ఉగ్రవాదం, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం (టాడా) - 1987
డి) అంతర్గత భద్రత నిర్వహణ చట్టం (మిసా) - 1971
9. లాన్సెట్ గ్లోబర్ హెల్త్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం కింది వాక్యాలలో సరికానిది?
1. ఐదేళ్ళలోపు శిశు మరణాల రేటు భారతదేశంలో 2015లో 47.8(ప్రతి వెయ్యి శిశువులకు)గా నమోదైంది.
2. 2015లో దేశంలో మరణించిన ఐదేళ్ళలోపు చిన్నారుల సంఖ్య 12 లక్షలు
ఎ) 1 మాత్రమే బి) పై రెండూ కాదు
సి) 2 మాత్రమే డి) పై రెండూ
10. 2019 ఆగస్టు 6-14 తేదీల మధ్య అంతర్జాతీయ సైనిక క్రీడల్లో భాగంగా 5వ ఆర్మీ అంతర్జాతీయ స్కౌట్ మాస్టర్ల పోటీలకు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనున్నది?
ఎ) రష్యా బి) పాకిస్తాన్
సి) ఇజ్రాయెల్ డి) భారత్
11. సిరిల్ రమఫోస ఏ దేశ అధ్యక్షునిగా మే 22న రెండవ సారి ఎన్నికయ్యారు?
ఎ) దక్షిణాఫ్రికా బి) ఈజిప్ట్
సి) ఇండోనేషియా డి) ఫిలిప్పీన్స్
12. 'ఆల్క్ మొనవిస్ పోస్చ్లీ' అనే పక్షి తరహా డైనోసార్ని శాస్త్రవేత్తలు ఏ దేశంలో గుర్తించారు?
ఎ) జర్మనీ బి) ఫ్రాన్స్
సి) నార్వే డి) న్యూజిలాండ్
13. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ప్రతి యేటా ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) మే 16 బి) మే 26
సి) ఏప్రిల్ 16 డి) ఏప్రిల్ 26
14. 'సెమ్రష్' అనే సంస్థ మే 7న విడుదల చేసిన నివేదిక ప్రకారం అన్ని సామాజిక మాధ్యమాల్లో కలిపి పదకొండు కోట్ల తొమ్మిది లక్షల మంది ఫాలోవర్స్‌తో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న రాజకీయ నేత?
ఎ) డొనాల్డ్ ట్రంప్ బి) నరేంద్ర మోడీ
సి) వ్లాదిమిర్ పుతిన్
డి) బెంజిమిన్ నెతన్యాహు
15. విదేశీ స్టాక్ మార్కెట్లో మసాలా బాండ్‌ను నమోదు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందినది?
ఎ) గోవా బి) ఢిల్లీ
సి) గుజరాత్ డి) కేరళ
16. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మే 9- 12 తేదీల మధ్య ఆగేయాసియా దేశమైన వియత్నాంలో పర్యటించారు. అయితే భారత్-వియత్నాంల మధ్య అధికారికంగా దౌత్య సంబంధాలు ఏ సంవత్సరా లలో ప్రారంభమయ్యాయి?
ఎ) 1958 బి) 1978
సి) 1969 డి) 1972
17. మే 18, 19 తేదీల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ సమీపంలోని ఒక ప్రాంతంలో 'ధ్యాన్కుటియా' గుహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు. 1985 - 1990 మధ్య ఐదేళ్ళ పాటు సాధువుగా ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక జీవనం గడిపారు. ఆ ప్రాంతం పేరు?
ఎ) విపాస్సన బి) తుషిత
సి) గరుడ్ చట్టి డి) ఆనంద
18. 'విపత్తుల నిర్వహణ' రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం 'యునైటెడ్ నేషన్స్ ఆఫీసర్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ససకవ అవార్డ్ - 2019' ఇటీవల ఏ భారతీయ ఉన్నతాధికారికి ప్రకటించారు?
ఎ) ప్రమోద్ కుమార్ మిశ్రా
బి) శ్రీనాథ్ కుమార్
సి) యూసుఫ్ హమీద్
డి) గగన్‌దీప్
19. కింది వాక్యాలను పరిశీలించి సరైనవి తెలపండి?
1. ప్రధాని స్వదేశీ పర్యటనలకు రక్షణ శాఖ బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తారు.
2. ప్రధాని విదేశీ పర్యటనలకు 'కేబినెట్ మంత్రుల, ప్రధాన మంత్రి విమాన నిర్వహణ, ఇతర ఖర్చులు' అనే బడ్జెట్ పద్దు నుంచి ఖర్చు చేస్తారు.
3. మే 201 - 2019 ఫిబ్రవరి 22 మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 49 విదేశీ పర్యటనలు చేశారు.
ఎ) 1, 3 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2, 3 మాత్రమే డి) 2, 3 మాత్రమే
20. జీవశాస్త్రం, సుస్థిరాభివృద్ధి రంగాల్లో చేసిన సేవలకు గాను ఏప్రిల్ 16న 'క్లీన్‌లాండ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'కు ఎంపికైన ఇండో-అమెరికన్ సైంటిస్ట్, సామాజిక ఉద్యమకారుడు ఎవరు?
ఎ) ప్రొఫెసర్ శ్రీకాంత్
బి) ప్రొఫెసర్ శ్రీనాథ్
సి) ప్రొఫెసర్ యూసుఫ్ హమీద్
డి) ప్రొఫెసర్ వినోద్ మిశ్రా
21. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 1న అబ్బస్ (ఇక చాలు) అనే కార్యక్రమాన్ని ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ) హైదరాబాద్ బి) విశాఖపట్నం
సి) బెంగుళూరు డి) ముంబై
22. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరుపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1. రంజన్ గొగోరుపై వచ్చిన ఆరోపణలు వాస్తవమో కాదో తేల్చడానికి ఏర్పాటైన ప్యానెల్ - జస్టిస్ బోబ్డే ప్యానెల్
2. రంజన్ గొగోరుపై వచ్చిన ఆరోపణల వెనుక ఏమైనా కుట్ర ఉందా అని తేల్చడానికి ఏర్పాటైన ఏకసభ్య కమిటీ - జస్టిస్ ఎ.కె.పట్నాయక్
ఎ) రెండూ సరైనవే బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే డి) ఏదీకాదు
23. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ భారత అటవీ చట్టానికి సవరణలు సూచిస్తూ మే 7న ముసాయిదాను ఖరారు చేసింది. అయితే భారత అటవీ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
ఎ) 1927 బి) 1937
సి) 1917 డి) 1942
24. సేఫ్ సిటీ ప్రాజెక్టు అమలు కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని నగరాలను కలిపి రూ.29 19 కోట్లు మంజూరు చేసింది?
ఎ) 8 బి) 10 సి) 6 డి) 7
25. ప్రపంచ వ్యాప్తంగా 1889 నుంచి వందకు పైగా దేశాలు మెట్రిక్ కొలమాన వ్యవస్థను అనుసరిస్తు న్నాయి. భారతదేశంలో మెట్రిక్ పద్ధతి పార్లమెంట్ చట్టం ద్వారా ఎప్పుడు అమలులోకి వచ్చింది?
ఎ) 1947 బి) 1952
సి) 1957 డి) 1963
26. 2019 మే 18న ఏ దేశ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో 77 సీట్ల బొటాబొటీ మెజారిటీతో ప్రస్తుత ప్రధాని స్కాట్ మోరిసన్ తిరిగి ఎన్నికయ్యారు?
ఎ) న్యూజిలాండ్ బి) డెన్మార్క్
సి) ఆస్ట్రేలియా డి) నార్వే
27. మే 22న శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన సీఎస్ఎల్వీ-46 ఉపగ్రహ వాహక నౌక రోదసీలోకి మోసుకెళ్ళిన రీశాట్-2బి ఉపగ్రహం (రాడార్ ఇమే జింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) బరువు ఎంత?
ఎ) 615 కిలోలు బి) 880 కిలోలు
సి) 505 కిలోలు డి) 650 కిలోలు
28. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ నెలలో కింది ఏ భారత ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడింది?
ఎ) బంగారు ఆభరణాలు బి) తోలు ఉత్పత్తులు
సి) నూలు, ఫ్యాబ్రిక్ డి) పైవన్నీ
29. '2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కింది వాటిలో సరికాని జతలు గుర్తించండి?
1. పోలింగ్ జరిగిన స్థానాలు - 542
2. దేశవ్యాప్తంగా పోటీ చేసిన మొత్తం లోక్‌సభ అభ్యర్థులు - 8,049
3. పోలింగ్ విడతలు - 7
4. ఎన్నిక వాయిదా పడిన నియోజకవర్గాలు - వేలూర్, లక్నో
ఎ) 1, 2 మాత్రమే బి) 1 మాత్రమే
సి) 4 మాత్రమే డి) పైవన్నీ
30. తొలి ప్రయత్నంలోనే మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహిం చిన ఘనతను ఏడుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జి) కమాండోల బృందం ఇటీవల సొంతం చేసుకుంది. ఎన్.ఎస్.జిని దేశంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1996 బి) 1989
సి) 1992 డి) 1984
31. 2019 మే 20న ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వం లో 72వ ప్రపంచ ఆరోగ్య సమావేశాలు (వరల్డ్ హెల్త్ అసెంబ్లీ) ఎక్కడ ప్రారంభమయ్యాయి?
ఎ) జెనీవా (స్విట్జర్లాండ్) బి) న్యూయార్క్ (అమెరికా)
సి) టోక్యో (జపాన్) డి) బీజింగ్ (చైనా)
32. మే 13 - 19 తేదీల మధ్య ఇటలీలోని రోమ్ నగరంలో నిర్వహించిన 76వ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలకు సంబంధించి సరికానిది ఏది?
ఎ) పురుషుల సింగిల్స్ - రఫెల్ నాదెల్
బి) మహిళల సింగిల్స్ - కరోలినా ప్లిస్కోవా
సి) పురుషుల డబుల్స్ - ఆస్ట్రేలియా జోడి
డి) పురుషుల సింగిల్స్ రన్నరప్ - నొవాక్ జుకోవిచ్
33. కింది పుస్తకాలను సంబంధిత రచయితలతో జత పరచండి?
పుస్తకం రచయిత
1. గేమ్ ఛేంజర్ ఎ. నవదీప్ సింగ్ సూరి
2. పాలిటిక్స్ ఆఫ్ జుగాడ్ బి. హర్స్ మందిర్
3. ఖూనీ వైశాఖి సి. సబా నఖ్వి
(ఆంగ్ల అనువాదం)
4. పార్టిషనింగ్ హర్ట్స్ డి. షాహిది ఆఫ్రిది
ఎ) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
34. అమెరికా వలస వెళ్లే వారి కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మే 16న ప్రతిపాదించిన నూతన 'ఇమిగ్రేషన్ (వలస)' విధానానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి?
1. గ్రీన్ కార్డుల స్థానంలో బిల్డ్ అమెరికా వీసా కార్డులు
2. అత్యంత నైపుణ్య వలసల కోటా 12 శాతం నుంచి 57 శాతానికి పెంపు
3. వలసల్లో అధిక వేతన ఉద్యోగులకు ప్రాధాన్యం
ఎ) పైవన్నీ సరైనవే బి) 1, 2 మాత్రమే
సి) 2, 3 మాత్రమే డి) ఏదీకాదు
సమాధానాలు
1.బి 2.ఎ 3.ఎ 4.ఎ 5.బి
6.డి 7.సి 8.ఎ 9.డి 10.డి
11.ఎ 12.ఎ 13.ఎ 14.బి 15.డి
16.డి 17.సి 18.ఎ 19.సి 20.బి
21.ఎ 22.ఎ 23.ఎ 24.ఎ 25.సి
26.సి 27.ఎ 28.డి 29.సి 30.డి 31.ఎ 32.సి 33.ఎ 34.ఎ
Authorization