ఆధునిక ప్రభుత్వాలు శ్రేయోరాజ్య స్థాపనకు కషి చేస్తుండడం మూలాన పెద్ద మొత్తంలో వ్యయం దానికి అనుగుణంగా ఆదాయాలు అవసరమవుతున్నాయి. ప్రభుత్వాలు ఆదాయం సంపాదించే మార్గాలలో పన్నులు అతి ముఖ్యమైనవి. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం వివిధ ఆర్థిక కార్యకలాపాలుపై ఖర్చు చేసినప్పుడు వాటిని చెల్లించిన వారికి పరోక్ష ప్రయోజనం కలుగుతుంది. పన్నులు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే సాధనంగానే కాక సుస్థిర ఆర్థికాభివద్ధిని సాధించడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం, వనరుల పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడడం మొదలైన లక్ష్యాలను సాధించడానికి దోహదపడాలి. పన్నులు విధించేటప్పుడు కొన్ని నియమాలు లేదా సూత్రాలను పాటించడం తప్పనిసరి. అలాంటప్పుడే మంచి పన్నుల విధానం రూపొందుతుంది.
ప్రభుత్వ పన్ను నియమాలు (Canons of Taxation)
అర్థశాస్త్ర పితామహుడైన ఆడంస్మిత్ పన్నులు విధించడంలో అనుసరించవలసిన నాలుగు ముఖ్య నియమాలను పేర్కొ న్నాడు.
1. సమతా నియమం,
2. నిశ్చితా నియమం,
3. సౌకర్య నియమం,
4. మిత వ్యయ నియమం.
ప్రభుత్వ విత్త శాస్త్రం అభివద్ధి చెందడంతో మరి కొన్ని నియ మాలను ఆధునిక ఆర్థిక వేత్తలు రూపొందించినారు. అవి
5. ఉత్పాదకతా నియమం,
6. వ్యాకోచం నియమం,
7. సౌలభ్య నియమం,
8.భిన్నతా నియమం,
9.ఆచరణ సాధ్య నియమం,
10. ఆమోద యోగ్యతా నియమం
1. సమతా నియమం: పన్నులను విధించేటప్పుడు న్యాయ ధర్మాలకు ప్రతిరూపంగా వీటిని పరిగణించడం జరుగు తున్నది. పన్నుల విధానానికి ఈ నియమం నైతిక పునాది వంటిది. వ్యక్తులపై వారి వారి ఆదాయాలను బట్టి పన్నులు విధించాలని సమతా నియమం వివరిస్తుంది. ధనవంతులు ఎక్కువ పన్నులను పేదవారు తక్కువ పన్నులను చెల్లించే విధంగా సమతా నియమం ఉంటుంది.
2. నిశ్చితా నియమం: పన్నులు చెల్లించే వారికి, పన్నులు వసూలు చేసే వారికి, పన్ను మొత్తం గురించి, పన్ను చెల్లించ వలసిన సమయం గురించి, చెల్లింపు పద్ధతి గురించి స్పష్టంగా తెలిసి ఉండటాన్ని నిశ్చితా నియమం తెలుపు తుంది. పన్ను చెల్లించే వారికి తాము ఎందుకోసం పన్ను చెల్లిస్తున్నామో తెలిసి ఉండాలి. అప్పుడే పన్నుల చెల్లింపులు సక్రమంగా ఉంటాయి. ఏయే పన్నుల ద్వారా ఏ కాలంలో ఎంత రాబడి వస్తుందో ప్రభుత్వానికి ముందుగా ఖచ్చితంగా తెలిసినప్పుడే బడ్జెట్ తయారు చేసుకోవడానికి వీలౌతుంది.
3. సౌకర్య నియమం: పన్నులు చెల్లించే వారికి అనుకూల మైన కాలంలో, అనుకూలమైన రీతిలో పన్నులు వసూలు చేయాలని ఆడమ్‌స్మిత్ పేర్కొన్నాడు. ఎక్కువ పన్నులను విధించినప్పుడు వాయిదా పద్ధతిలో వసూలు చేయడం, అమ్మకం పన్నును, వస్తువుల అమ్మకం సమయంలో ధరతో కలిపి వసూలు చేయడం, ఉద్యోగుల ఆదాయపు పన్నును జీతాల నుండి మినహాయించడం సౌకర్యవంతంగా ఉంటుంది.
4. మిత వ్యయం: పన్నుల వసూలకయ్యే వ్యయం, దాని వల్ల వచ్చే రాబడి కంటే మించరాదని ఆడమ్‌స్మిత్ పేర్కొ న్నాడు. మిత వ్యయ సూత్రాన్ని అనుసరించి ప్రతి పన్ను ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి కంటే దానికయ్యే ఖర్చు తక్కువగా ఉండాలి. పన్నుల వసూలు, నిర్వహణ భారీగాను, క్లిష్టంగా ఉండకూడదని ఈ నియమం వివరిస్తుంది.
5. ఉత్పాదకతా నియమం: అభివద్ధి చెందుతున్న దేశాల విత్త అవసరాలు నానాటికి పెరుగుతుండడం వల్ల అధిక ఆదాయం సమకూర్చుకోవడానికి పన్నులు ఉత్పాదకంగా ఉండాలని బాస్టబుల్ వివరించినాడు.
6. వ్యాకోచ నియమం: దేశ ఉత్పత్తి, జాతీయాదాయం పెరిగేకొద్దీ పన్నుల ద్వారా ప్రభుత్వ రాబడి కూడా పెరుగు తుంది. అందువల్లే పన్నులలో వ్యాకోచత్వం ఉండాలి. ఆదాయం పన్ను, అమ్మకం పన్నులకు అధిక వ్యాకోచత్వం ఉంటుంది. ఇవి ఉత్పాదకతా నియమానికి సన్నిహితమైనది.
7. సౌలభ్య నియమం: పన్నుల రేటు, చెల్లింపు విధానం అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా ఉండాలి. ఈ నియమం పన్ను చెల్లింపుదారులకు, పన్నులు వసూలు చేసే ప్రభుత్వ యంత్రాంగానికి అవసరం. అందువల్ల పన్ను చట్టాలు అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా ఉండాలి.
8. భిన్నత్వ నియమం: దేశంలోని ప్రజలందరూ ఏదో ఒక పన్ను చెల్లించే విధంగా పన్నులలో వైవిధ్యం లేదా భిన్నత్వం ఉండాలని ఈ నియమం పేర్కొంటుంది.
9. ఆచరణ సాధ్య నియమం: ఆచరణ సాధ్యమైన, అమలు చేయడానికి వీలైన పన్నులను విధించాలని ఈ నియమం సూచిస్తుంది. ఆచరణ సాధ్యం కాని పన్నులను విధిస్తే ఎగవేతకు అవకాశం ఉంటుంది.
10. ఆమోదయోగ్యతా నియమం: ప్రభుత్వం విధించే పన్నులు న్యాయబద్ధమైనవి, ఆమోదయోగ్యమైనవని ప్రజలు భావించాలి. ప్రజలు తమ సామర్థ్యానికి అనుగుణంగా పన్నులు చెల్లించాలని, పన్నులు విశ్వజనీనంగా ఉండాలని, సామాన్యుల మధ్య విచక్షణ చూపరాదని శ్రీమతి హిక్స్ పేర్కొన్నారు.
పైన పేర్కొన్న పన్ను నియమాల కనుగుణంగా ఏ దేశంలో కూడా పన్నుల వ్యవస్థ లేదు. పన్నుల యొక్క అన్ని నియమాలు పాటించడం సాధ్యం కాదు. కొన్ని నియమాల మధ్య పరస్పర వైరుధ్యం ఉంది. అందువలన ఎక్కువ నియమాలను దష్టిలో ఉంచుకొని పన్నుల విధానాన్ని రూపొందించవలసి ఉంటుంది. వీటి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఎక్కువ ప్రధానమైన నియమాన్ని ఎంచుకోవాలని షిర్రాస్ పేర్కొన్నాడు.
మంచి పన్నుల వ్యవస్థ లక్షణాలు
ఒక దేశ పన్నుల వ్యవస్థ, ఆ దేశ రాబడికి ప్రధాన ఆదాయ మార్గమే కాక, అనేక ఆర్థిక అంశాల సర్దుబాటుకు దోహదపడుతుంది. పన్ను నియమాలలో ఎక్కువ నియమాలను తప్తి పరిచే వ్యవస్థను మంచి పన్నుల వ్యవస్థగా పేర్కొన వచ్చును. అన్ని దేశాలకు ఒకే విధమైన పన్ను నియమాలు వర్తించక పోవచ్చును. అందువల్ల ప్రతి దేశం తనకు అనుకూలమైన పన్ను నియమాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పన్నుల ఆర్థిక వ్యవస్థ, ఉత్తమ ఆర్ధిక ప్రభావాలు గరిష్టంగాను, హానికర ఆర్థిక ప్రభావాలు కనిష్టంగా కలిగించేదిగా ఉండాలని డాల్టన్ అభిప్రాయపడినాడు. ఒక దేశ పన్నుల వ్వస్థను పరిశీలించేట ప్పుడు ఈ కింది అంశాలను దష్టిలో ఉంచుకొనవలసి ఉంటుంది.
1. పన్నుల వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావాలను బట్టి పన్నుల వల్ల మంచి చెడులను బేరీజు వేయవచ్చును. ప్రభుత్వ వ్యయం వలన కలిగే ప్రయోజనాలు బట్టీ పన్నుల వ్యవస్థ గుణదోషాలను తెలుసుకొనవచ్చును.
2. పన్నులు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేటప్పుడు వాటి మంచి, చెడులను పరస్పర విరుద్ధమైన లక్షణాలను పరిశీలించి ఒకే మొత్తంలో ఆదాయం లభించే రెండు పన్నులలో తక్కువ హానికరమైన దానికి ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది .
3. మంచి పన్నుల వ్యవస్థ, చెల్లింపుదారు వైఖరికి కూడా ప్రాముఖ్యం ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి పన్ను చెల్లింపుదారుడు పన్ను భారం తక్కువగా వుండాలని కోరుకుంటాడు. అయితే పన్నుల భారం ప్రజలందరికి సమానంగా ఉండేటట్లు ప్రభుత్వం పన్నుల చట్టాలను రూపొందించాలి.
4. పన్నుల వ్యవస్థను ఒకేసారి సమూలంగా మార్చడం సాధ్యం కాదు. మంచి పన్నుల వ్యవస్థ ప్రధాన జాతీయ లక్ష్యాలతో సమన్వయం కలిగి ఉండాలి. మంచి పన్నుల విధానం పురోగామి సూత్రానికి అనుగుణంగా వుండాలి. జాతీయాదాయం పెరుగుదలకు తగ్గట్లుగా పన్ను రేటు గూడా పెంచవలిసి వుంటుంది. పన్నుల నియమాలు, ఆశయాల దష్ట్యా ప్రత్యక్ష, పరోక్ష పన్నులను సరైన రీతిలో విధించాలి. నేటి ప్రభుత్వ కార్యకలాపాలు విస్తతమై ప్రభుత్వ వ్యయం పెరగడం వలన బహుళ పన్నుల పద్ధతి ద్వారా ప్రభుత్వం తగిన ఆదాయాన్ని సమకూర్చుకోవాలి.
5. మంచి పన్నుల వ్యవస్థలో పన్నుల కనిష్ట అసౌకర్యాన్ని కనిష్ట త్యాగాన్ని కలుగజేసేవిగా ఉండాలి. అనగా పన్నుల విధింపు వలన ఉత్పన్నమయ్యే త్యాగం అతి తక్కువగా ఉన్నదనే భావన పన్ను చెల్లింపుదారులలో కలగాలి.
6. పన్నుల విధింపు ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులను తగ్గించడం, జాతీయ ఉత్పత్తిని పెంచడం, ఆర్థిక అసమాన తలను తొలగించడం, ఉద్యోగ అవకాశాలను పెంచడం మొదలైనవి సాధించవలసి ఉంటుంది.
మంచి పన్నుల వ్యవస్థకు మూడు ముఖ్య లక్షణాలు ఉండాలని శ్రీమతి హిక్స్ పేర్కొన్నారు.
1. ప్రభుత్వానికి తగినంత ఆదాయాన్ని సమకూర్చడం.
2. వ్యక్తులు, కుటుంబాలపై చెల్లించగల సామర్థ్యం మేరకు పన్నులను విధించడం.
3. పన్నులు సార్వజనీనంగా ఉండడం, అనగా విచక్షణ లేకుండా ఉండడం.
పైన చర్చించిన వివిధ అంశాల ఆధారంగా మంచి పన్నుల వ్యవస్థ లక్షణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చును.
1. పన్నుల వ్యవస్థ లో భిన్నత్వం ఉండాలి.
2. సమానత్వం ఉండాలి.
3. సౌలభ్యత్వం ఉండాలి.
4. పన్ను ఎగవేతకు అవినీతికి తావు లేకుండా చూడటం.
5. వ్యాకోచత్వం ఉండడం.
6. నిర్వహణ వ్యయం తక్కువ ఉండుట.
7. ఆర్థిక అసమానతలు తగ్గే విధంగా ఉండడం.
8. పారిశ్రామిక అభివ ద్ధిని ప్రోత్సహించేదిగా ఉండడం.
9. పన్నుల వ్యవస్థ సంఘటితంగా ఉండడం.
ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు - Direct taxes and Indirect taxes
ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, పరిపాలన వ్యవహారాలను నిర్వహించడానికి ఆదాయ వనరులు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి లభించే ఆదాయం ఎక్కువ భాగం పన్నుల రూపంలో లభిస్తుంది.
''తాను పొందే ప్రయోజనంతో సంబంధం లేకుండా, దేశ ప్రజలందరికీ ప్రయోజనం కొరకు ప్రతి పౌరుడు నిర్బం ధంగా ప్రభుత్వానికి చెల్లించే మొత్తాన్ని పన్ను అంటారు''.
ప్రభుత్వం వసూలు చేసే ఇతర చార్జీలతో పోల్చినప్పుడు పన్నులు చెల్లించే వారికి, ప్రభుత్వానికి మధ్య ఏ విధమైన ప్రత్యక్ష ప్రతిఫలం ఉండదని టాసిగ్ (Taussig) అభిప్రాయపడినాడు.
పన్నులను
1. ప్రత్యక్ష పన్నులు,
2. పరోక్ష పన్నులని రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. పన్ను తొలి ప్రభావం దాని అంతిమ ప్రభావం ఒకే వ్యక్తి మీద వుంటే దానిని ప్రత్యక్ష పన్నని, పన్ను తొలి ప్రభావం దాని అంతిమ ప్రభావం వేరు వేరు వ్యక్తుల మీద వుంటే దానిని పరోక్ష పన్నని పేర్కొంటారు. టేలర్ ప్రకారం పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలైతే పరోక్ష పన్నని, పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుకాక పోతే దానిని ప్రత్యక్ష పన్నులు అంటారు. ఇతని ప్రకారం ఆదాయ పన్ను, ఆస్తి పన్నులను ప్రత్యక్ష పన్నులుగా, అమ్మకం పన్ను, ఎక్సైజ్ సుంకాలు, మొద లైనవి పరోక్ష పన్నులుగా పేర్కొనవచ్చును. ఆదాయం ఆధారంగా విధించే పన్నులను ప్రత్యక్ష పన్నులని, వ్యయం ఆధారంగా విధించే పన్నులను పరోక్ష పన్నులని ''ప్రెస్ట్'' పేర్కొన్నాడు.
Authorization