1. కీన్స్ వినియోగ ఫలంలో C = a +b Y్ లో C = 850, a= 50, Y = 1000 అయినb = ఎంత?
ఎ) 0.5 బి) 0.6 సి) 0.7 డి) 0.8
2. గుణంకం విలువ దేనికి సమానం?
ఎ) 1/1-MPC బి) 1/MPS
సి) DY/DI డి) పైవన్నీ
3. ఉపాంత వినియోగ ప్రవత్తి 0.8 గా వున్నప్పుడు పెట్టుబడి 50 కోట్లు పెరిగితే, ఆదాయంలో పెరుగుదల ఎంత?
ఎ) 200 కోట్లు బి) 250 కోట్లు
సి) 300 కోట్లు డి) 350 కోట్లు
4. ఉపాంత మూలధన సామర్థ్యంతో సంబంధంవున్న అంశాలేవి?
ఎ) యంత్రం సప్లై ధర
బి) యంత్రం జీవిత కాలంలో ఆశించే రాబడి
సి) డిస్కౌంట్ రేటు డి) పైవన్నీ
5. వేగత్వరణంతో సంబంధం లేనిది ఏది?
ఎ) జె.యం.క్లార్క్
బి) వినియోగంలోని మార్పు, పెట్టుబడిలో మార్పు
సి) DC/DI డి) DI/DC
6. ద్రవ్యత్వాబిరుచి బోను పరిస్థితులలో వడ్డీ రేటు ఎట్లా వుంటుంది?
ఎ) గరిష్ట స్థాయిలో వుంటుంది
బి) కనిష్ట స్థాయిలో వుంటుంది
సి) స్థిరంగా వుంటుంది డి) ఏదీకాదు
7. ద్రవ్యోల్భణ విరామం ఎప్పుడు ఏర్పడుతుందని కీన్స్ పేర్కొన్నాడు?
ఎ) ఆర్థిక మాంధ్యం ఉన్నప్పుడు
బి) అల్పోద్యోగిత వద్ద
సి) సంపూర్ణోద్యోగిత చేరుకున్న తర్వాత
డి) పైవేవీకావు
8. పెట్టుబడిలో వచ్చిన మార్పు వల్ల ఆదాయంలో వచ్చే మార్పును తెలియజేసేది?
పెట్టుబడి గుణకం
ఎ) ఉపాంత మూలధన సామర్థ్యం
బి) వేగత్వరణం
సి) ప్రేరిత పెట్టుబడి
9. సరికాని వాక్యం ఏది?
ఎ) MPCవిలువ 0 నుండి 1 మధ్య వుంటుంది
బి) గుణకం (K) విలువ 1 నుండి అనంతంగా వుంటుంది
సి) MPC = 1 అయితే గుణకం విలువ 1.
డి) MPC= 1 అయితే గుణకం విలువ = అనంతం.
10. కీన్స్ ప్రకారం వాస్తవ లేదా నిజ ద్రవ్యోల్బణం ఎప్పుడు వస్తుంది?
ఎ) ఆర్థిక మాంధ్యం
బి) సంపూర్ణోద్యోగిత తర్వాత.
సి) పునర్జీవనం దశలో డి) సంకోచం దశలో
11. ద్రవ్యబ్రాంతి అనగా ?
ఎ) ద్రవ్యం ఎక్కువగా ఉందని భావించడం
బి) బంగారం ఎక్కువగా వుందని బ్రమించడం
సి) ధరలు పెరిగినందు వల్ల ఆదాయాలు పెరిగినప్పుడు, ఆదాయం పెరిగిందని బ్రమలో వుండడం
డి) గాలివాటు లాభాల వల్ల ద్రవ్యం పెరగడం
12. ఉత్పత్తి కారకాల దష్ట్యా జాతీయాదాయం 500 కోట్లు కాగా, కార్పోరేట్ పన్నులు 5 కోట్లు, పంచిపెట్టని లాభాలు 7 కోట్లు, సాంఘిక సంక్షేమ చెల్లింపులు 3 కోట్లు, పెన్షన్లు 5 కోట్లు,నిరుద్యోగ భతి 3 కోట్లు, ప్రత్యక్ష పన్నులు 3 కోట్లు అయిన వ్యయార్హ ఆదాయమెంత?
ఎ) 490 కోట్లు బి) 493 కోట్లు
సి) 495 కోట్లు డి) 497 కోట్లు
13. How to pay for the war.అనే గ్రంధాన్ని రాసింది ఎవరు?
ఎ) ఆడమ్ స్మిత్ బి) కార్ల్ మార్క్స్
సి) డేవిడ్ రికార్డో డి) జె.యం. కీన్స్
14. భారత ప్రభుత్వం దేశరక్షణ కొరకు, యుద్ధాలు, కరువు కాటకాల నివారణకు కొరకు చేసే రుణాలను ఏమని పిలుస్తారు?
ఎ) అంతర్గత రుణాలు బి) బహిర్గత రుణాలు
సి) ఉత్పాదక రుణాలు డి) అనుత్పాదక రుణాలు
15. భారత్లో ప్రజల వద్ద నుండి నిర్బంధ రుణాలు మొట్ట మొదటిసారిగా ఏ సంవత్సరంలో స్వీకరించారు?
ఎ) 1964 బి) 1974
సి) 1984 డి) 1982
16. భారత్లో అభివద్ధిని వేగంగా విస్తరించడానికి తీసుకునే రుణాలను ఏమని పిలుస్తారు?
ఎ) స్వచ్ఛంద రుణాలు బి) నిర్బంధ రుణాలు
సి) ఉత్పాదక రుణాలు డి) అనుత్పాదక రుణాలు
17. ప్రభుత్వాలు కొన్ని అసాధారణ పరిస్థితులలో రుణాలను చెల్లించనట్లైతే వాటిని ఏమని పిలుస్తారు?
ఎ) రుణ పరివర్తన బి) రుణ విమోచన
సి) రుణ నిరాకరణ డి) రుణ తిరోగమన
18. భారత్లో కేంద్ర - రాష్ట్రాల్లో వ్యయం పెరగడానికి సంబంధించిన సరైన అంశాలు గుర్తించండి?
1) గ్రామీణ అభివద్ధి వ్యయం పెరగడం వాస్తవికం
2) సామాజిక సేవలపై వ్యయం పెరగడం అవాస్తవం
3) భారత్లో జనాభా అధిక వద్ధి వాస్తవం
4) పేదరిక నిరుద్యోగ నిర్మూలన పథకాలు అమలు అవాస్తవం
ఎ)1, 2 సరైనవి బి) 2,3 సరైనవి
సి) 2,4 సరైనవి డి) 1,3 సరైనవి
19. ఈ కింది అంశాలలో వాస్తవిక అంశాలు గుర్తించండి?
1) భారత్ లో ప్రభుత్వ రుణాలు పెరగడం వాస్తవికం
2) నిర్బంధ రుణాలు కంటే స్వచ్ఛంద రుణాలు పెరగడం వాస్తవికం
3) భారత్లో రుణాలపై వడ్డీ చెల్లింపులు క్రమంగా పెరగడం అవాస్తవం
4) భారత్లో సంక్షేమ పథకాల వ్యయాలు పెరగడం వాస్తవం
ఎ) 1, 2, 3, 4 సరైనవి బి) 1, 2, 4 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి) 2, 3, 4 సరైనవి
20. ఈ కింది అంశాలను జతపరచండి
1. 12 వ ఆర్థిక సంఘం a.2000 -2005
2. 13వ ఆర్థిక సంఘం b.2015- 20
3. 14వ ఆర్థిక సంఘం ష.2010- 15
4. 11 వ ఆర్థిక సంఘం స.2005- 10
ఎ) 1-d,2-c,3-b,4-a,4-a బి) 1-a,2-b,3-c,4-d
సి) 1-d,2-a,3-b,4-c డి) 1-b,2-d,3-a,4-c
21. భారత్లో దిగుమతి సుంకాలు తగ్గించడం విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం అవుతుందని ఏ కమిటీ సూచించింది?
ఎ) కాల్దర్ కమిటీ బి) రంగరాజన్ కమిటీ
సి) రాజా చెల్లయ్య డి) కేల్కర్ కమిటీ
22. ఆర్థిక సంఘానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి?
1. రాజ్యాంగంలో 280 ఆర్థిక తెలియజేస్తుంది
2. రాష్ట్రపతి చేత నియమించబడుతుంది
3. ఐదుగురు సభ్యుల చేత నియమించబడు తుంది
4.10 సంవత్సరాల కాలం వరకు కొనసాగుతుంది
ఎ) 1, 2, 3,4 సరైనవి బి) 1, 2, 3 సరైనవి
సి) 1, 2, 4 సరైనవి డి) 2, 3, 4 సరైనవి
23. భారత ప్రభుత్వం దేశంలో ప్రజల నుండి పొందే రుణాలను ఏమని పిలుస్తారు?
ఎ) బహిర్గత రుణాలు బి) స్వచ్ఛంద రుణాలు
సి) అంతర్గత రుణాలు డి) నిర్బంధ రుణాలు
24. ఆడంస్మిత్ పన్నులు విధించడంలో అనుసరించిన పన్ను నియమాలను గుర్తించండి?
1) సమతా నియమం 2) నిశ్చిత నియమం
3) సౌకర్య నియమం 4) భిన్నత్వ నియమం
ఎ) 1, 2, 3, 4 సరైనవి బి) 1, 2, సరైనవి
సి) 1, 2, 3 సరైనవి డి) 2, 3, 4 సరైనవి
25. భారత్లో పన్నుల విభాగంకు సంబంధించి సరైన అంశాలు గుర్తించండి?
1) భారత్ లో పన్నుల వసూలు సిబ్బంది ఎక్కువ వాస్తవం
2) భారత్ లో నల్లధనం అధికం అవాస్తవం
3) భారత్ లో ప్రత్యక్ష పన్నుల వాటా అధికం వాస్తవం
4) భారత్ లో పన్నుల రాబడి వాటా అధికం వాస్తవం
ఎ) 1, 2, 3 సరైనవి బి) 1, 2, 3, 4 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి) 2, 3, 4 సరైనవి
26. ఈ కింది అంశాలు జతపరచండి.
1.ఆదాయపన్ను a. ఫ్రాన్స్
2. అమ్మకపు పన్ను b.అమెరికా
3. కనీస ప్రత్యామ్నాయపన్ను c. జర్మనీ
4. . VAT d.. ఇంగ్లాండ్
ఎ) 1-d, 2-c-, 3-b, 4-aబి) 1-a, 2-b-, 3-c, 4-d
సి)1-d, 2-a, 3-b, 4-c, 4-ష డి) ) 1-b, 2-a-, 3-d, 4-c
27. ఈ కింది అంశాలను పరిశీలించి సరైన వాటిని ఎంపిక చేయండి?
1) ప్రభుత్వంకు ఆదాయ మార్గాలు ప్రైవేట్ కంటే ఎక్కువ
2) ప్రభుత్వ వ్యయాలు సామాజిక సేవలపై ఎక్కువ
3) ప్రైవేటు వ్యయాలు గరిష్ట లాభార్జన
4) ప్రైవేటు వ్యక్తులు ఆదాయ,వ్యయాలు రహస్యం
ఎ) 1, 2, 3 సరైనవి బి) 1, 2, 3, 4 సరైనవి
సి) 2, 3,4 సరైనవి డి) 1, 2, 4 సరైనవి
28. కేంద్ర- రాష్ట్రాలు పరిశ్రమలు, అవస్థాపన సౌకర్యాలు అభివద్ధికై చేసే వ్యయాలను ఏమని పిలుస్తారు?
ఎ) మూలధన వ్యయం బి) రెవెన్యూ వ్యయం
సి) ప్రభుత్వ వ్యయం డి) అభివద్ధి వ్యయం
29. రాజా చెల్లయ్య కమిటీ స్వదేశీ- విదేశీ కంపెనీల మధ్య కార్పొరేషన్ పన్ను వ్యత్యాసం ఎంతకు మించరాదని సిఫారసు చేసింది?
ఎ) 5% బి) 10% సి) 15% డి) 20%
30. లాఫర్ వక్రరేఖ కింది ఏ అంశాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది?
ఎ) పన్ను శాతం- పన్నువాటా
బి) పన్ను రేటు- పన్ను రాబడి
సి) పన్ను నిష్పత్తి- పన్ను శాతం
డి) పన్ను వాటా- పన్ను రాబడి
31. అభివద్ధి నిరోధకాలలో దేశీయ నిరోధకాలు ఎవి?
1. పేదరిక విష వలయాలు
2. మార్కెట్ అసంపూర్ణతలు
3. రాజకీయ అస్థిరత
4. అల్ప ప్రాథమిక వస్తువుల ఎగుమతులు
ఎ) 1,2 బి) 2,3
సి) 2,3,4 డి) 1,2,3,4
32. ఈ కింది వానిలో ఏది వాస్తవం?
Assertion:: నవకల్పనలకు షుంపీటర్ తెలిపారు.
Reason: నవకల్పనలలో భాగంగా పాత ఉత్పత్తి పద్ధతు లను ప్రవేశపెట్టాడు.
ఎ) A,R= రెండూ వాస్తవం
బి) A అనే దానికి,R సరైన వివరణ వాస్తవం
సి) A అవాస్తవం R అవాస్తవం
డి) A,R రెండూ అవాస్తవం
33. ఆర్థిక వ్యవస్థలో భిన్నరంగాలలో ఉత్పత్తిలో వచ్చిన పెరుగుదలను తెలిపేది ?
ఎ) ఆర్థిక అభివద్ధి
బి) అసంతులిత అభివద్ధి
సి) ఆర్థికాభివద్ధి
డి) కొనసాగించ గలిగే అభివద్ధి
34. ఈ కింది వానిలోPQLI సూచికలు ?
1.అక్షరాస్యత 2.ఆయు ప్రమాణం
3.తలసరి ఆదాయం 4.జీవన ప్రమాణం
ఎ) 1,2,4 బి) 1,2,3
సి) 2,3,4 డి) 1,3,4
35. సంప్రదాయవాదుల ప్రకారం విలువకు ఆధారం?
ఎ) కార్మికుల శ్రమ బి) మూలధనం
సి) సాంకేతిక ప్రగతి డి) భూమి
36. కింది వానిలో సరైనది ఏది ?
Assertion:శ్రమకు ఉన్న డిమాండ్ మూలధనంపై ఆధారపడి ఉంటుంది
Reason: శ్రామికులకు కనిష్ట జీవన స్థాయిలో ఉండే వేతనం అవసరమని సంప్రదాయవాదులు భావించినారు.
ఎ) A,R రెండూ సరైనవే, A కుR సరైన వివరణ
బి)A,R= రెండూ సరైనవే కానీ, A కు Rసరైన వివరణ కాదు
సి) A సరైనది, R సరైనది కాదు
డి) A సరైనది కాదు, R సరైనది
సమాధానాలు
1.డి 2.డి 3.బి 4.డి 5.డి
6.బి 7.సి 8.ఎ 9.సి 10.బి
11.సి 12.ఎ 13.డి 14.డి 15.బి
16.సి 17.సి 18.డి 19.బి 20.ఎ
21.సి 22.బి 23.సి 24.సి 25.సి
26.ఎ 27.బి 28.ఎ 29.బి 30.బి
31.డి 32.సి 33.సి 34.బి 35.ఎ
36.బి
డాక్టర్.అక్కెనపల్లి మీనయ్య
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు, నల్లగొండ
రిటైర్డ్ (ఎచ్.ఓ.డి) ఎకనామిక్స్ నాగార్టున ప్రభుత్వ కళాశాల
ఫోన్:9490138118
Authorization