1. నీటిలో ఏర్పడిన శబ్దతరంగం ఉపరితలంలోని గాలి లోకి ప్రవేశించినపుడు స్థిరంగా ఉండే తరంగం అభిలక్షణం?
ఎ) వడి బి) తరంగదైర్ఘ్యం
సి) పౌన:పున్యం డి) ఏదీకాదు
2. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలల్లో సూర్యుడు ఏ ఆకారంలో కనిపిస్తాడు?
ఎ) వృత్తాకారం బి) కోలాకారం
సి) స్తూపాకారం డి) వక్రాకారం
3. గాలిలోని నీటి బిందువు ఏ విధంగా పనిచేస్తుంది?
ఎ) అపసరణ కటకం బి) అభిసరణ కటకం
సి) కటకం వలె పని చేయదు
డి) సమతల దర్పణం వలె పనిచేస్తుంది
4. అయస్కాంత పదార్థాలన్నీ కింది వాటిలో దేని వల్ల అయస్కాంత ధర్మాలను పోగొట్టుకుంటుంది?
ఎ) నీటిలో ముంచినపుడు
బి) నూనెలో ముంచినపుడు
సి) ఇనుప ముక్క వద్దకు తెచ్చినపుడు
డి) బాగా వేడి చేసినపుడు
5. ఒక వస్తువును మరొక వస్తువుతో రుద్దినపుడు ఆవేశం పొందుతుంది. ఆ వస్తువు భారంలో మార్పు ఏ విధంగా ఉంటుంది?
ఎ) భారం మారదు బి) స్వల్పంగా పెరగకపోవచ్చు
సి) స్వల్పంగా తగ్గుతుంది
డి) స్వల్పంగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది
6. క్రేస్కోగ్రాఫ్తో దేన్ని కొలుస్తారు?
ఎ) హృదయ స్పందన బి) నాడీ స్పందన
సి) మొక్కల పెరుగుదల డి) స్ఫటిక నిర్మాణం
7. ఎల్ఈడీ ఉద్గారించే కాంతి రంగు ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది?
ఎ) తిరోశక్మంపై బి) ఎల్ఈడీ పురోశక్మంపై
సి) ఎల్ఈడీ ద్వారా ప్రవహించే పురో విద్యుత్‌పై
డి) ఎల్ఈడీలోని అర్ధ వాహక స్వభావంపై
8. సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోనూ అత్యధిక వేడి కలిగిన గ్రహం ఏది?
ఎ) బుధుడు బి) శుక్రుడు
సి) యురేనస్ డి) శని
9. కింది వాటిలో ఏది పరమాణువు కేంద్రకంలో ఉండదు?
ఎ) ఫోటాన్ బి) ప్రోటాన్
సి) న్యూట్రాన్ డి) మెసాన్
10. ఓల్టా మీటరుతో దేనిని కొలుస్తారు?
ఎ) బ్యాటరీ బి) ఓల్టేజీ
సి) విద్యుత్ రసాయన తుల్యాంకం డి) విద్యుత్
11. కంటి శుక్లాల వల్ల కంటిలోని ఏ భాగం దెబ్బ తింటుంది?
ఎ) రెటీనా బి) కటకం
సి) కనుపాప డి) కార్నియా
12. రెండు అట్టముక్కలను అతి దగ్గరగా ఉంచి వాటి మధ్య గాలి ఊదితే అవి
ఎ) ఎక్కడికి కదలవు బి) దూరంగా జరుగుతాయి
సి) దగ్గరకు వస్తాయి
డి) దగ్గరికి వస్తూ దూరంగా పోతూ ఉంటాయి
13. కింది వాటిలో ఉష్ణశక్తి తరంగాలు అని పిలిచే తరంగాలు ఏవి?
ఎ) రేడియో తరంగాలు
బి) అతినీల లోహిత తరంగాలు
సి) పరారుణ తరంగాలు డి) పైవన్నీ
14. ఏకవర్ణ కాంతిని ఉద్గారించే కాంతి జనకం ఏది?
ఎ) పాదరస దీపం
బి) టంగ్స్టన్ హాలోజన్ దీపం
సి) సోడియం దీపం డి) చలిమంట
15. ఒక పట్టకం ద్వారా కాంతిని పంపినపుడు అతి తక్కువగా విచలనం చెందే రంగు ఏది?
ఎ) ఎరుపు బి) ఆకుపచ్చ
సి) నీలం డి) వైలెట్
16. సరళ హరాత్మక చలనంలో ఉన్న వస్తువుకు గరిష్ట త్వరణం ఎప్పుడు కలిగి ఉంటుంది?
ఎ) మాధ్యమిక స్థానాల వద్ద
బి) దాని మార్గంలోని అన్ని స్థానాల వద్ద
సి) అంతిమ స్థానం, మాధ్యమిక స్థానం వద్ద
డి) అంతిమ స్థానం వద్ద
17. పరమాణు కేంద్రకంలోని కేంద్రక బలాలు ఎలా ఉంటాయి?
ఎ) బలమైన ఆకర్షణ బలాలు
బి) బలమైన వికర్షణ బలాలు
సి) బలహీనమైన ఆకర్షణ, వికర్షణ బలాలు
డి) గురుత్వాకర్షణ బలాలు
18. గాలిలో ప్రయాణించే విమానంపై పనిచేసే వాయు గతిక ఉత్థాపకాన్ని విశదీకరించే సూత్రం ఏది?
ఎ) బెర్నోలీ సిద్ధాంతం బి) ఉత్ల్పవన సూత్రం
సి) పాజ్వేల్ సమీకరణం డి) రేనాల్డ్ సంఖ్య
19. అత్యధిక అయనీకరణ సామర్థ్యం కలిగినవి ఏవి?
ఎ) ఎక్స్ కిరణాలు బి) ఆల్ఫా కణాలు
సి) గామా కిరణాలు డి) బీటా కిరణాలు
20. రాకెట్ ప్రొపెలెంట్గా ఉపయోగించేది?
ఎ) నైట్రోజన్ బి) అమ్మోనియా
సి) ఆక్సిజన్ డి) హైడ్రాజన్
21. చల్లని నీరు నింపిన గాజు గ్లాసు బయటి భాగం తడిగా ఎందుకు అవుతుంది?
ఎ) గాజుగ్లాసు ద్వారా నీరు విస్తాపన చెందడం వల్ల
బి) వాతావరణంలో నీటి ఆవిరి గ్లాసుపై ద్రవీభవించడం వల్ల
సి) పరిసరాల ఉష్ణోగ్రతను గ్లాసు అందుకోలేకపోవడం
డి) గ్లాసు, పరిసరాల మధ్య ఉష్ణరాశి వినిమయం లేకపోవడం
22. విశ్వవ్యాప్తంగా విస్తారంగా ఉన్న మూలకం ఏది?
ఎ) హైడ్రోజన్ బి) హీలియం
సి) ఆక్సిజన్ డి) నైట్రోజన్
23. సాయంకాల చుక్క అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
ఎ) బుధుడు బి) శుక్రుడు
సి) తోకచుక్క
డి) రాత్రులు మనకు కనపించే వెలుగు చారలు
24. భారతదేశంలోని పరిశోధన ప్రయోగశాలల పితామ హుడు అని ఏ శాస్త్రవేత్తకు పేరు?
ఎ) ఎస్.ఎస్.బట్నాగర్ బి) విక్రమ్ సారాబారు
సి) ప్రపుల్ చంద్ర రే డి) రాజారామన్న
25. వంటగది నుంచి వెలువడే వ్యర్థాలు భూమిలో కుళ్లి సేంద్రియ ఎరువుగా మారే ప్రక్రియ ఒక
ఎ) ఉష్ణ మోచక చర్య బి) ఉష్ణ గ్రాహక చర్య
సి) ఉష్ణ రసాయన చర్య
డి) తిరోగమన రసాయన చర్య
26. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగేది?
1) వ్యవస్థ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు
2) వ్యవస్థకు, పరిసరాల మధ్య ఉష్ణ వినిమయం
3) వ్యవస్థ అంతర్గత శక్తి స్థిరం
4) పీడనం, ఘనపరిమాణం వ్యవస్థకు స్థిరం
ఎ) 2, 3 బి) 3, 4 సి) 1, 3 డి) 1, 4
27. కింది వాటిలో దేనిని ఉపయోగించుకుని ఒక వలయం లో కావాల్సిన పౌన:పున్యం ఉన్న ఏకాంతర విద్యుత్‌ను పొందవచ్చు?
ఎ) ట్రాన్స్ఫార్మర్ బి) పవర్ సప్లరు
సి) ఆంప్లిఫయర్ డి) ఆసిలేటర్
28. గాజు పరిశ్రమల్లో ఉపయోగించే కల్లెట్ అంటే ఏమిటి?
ఎ) సోడియం సిలికేట్ బి) వర్ణద్రవ్యకాలు
సి) పగిలిన గాజు ముక్కలు డి) చీనా మట్టి ముద్దలు
29. జీవ ప్రక్రియ జరిగే ఆవరణం?
ఎ) స్ట్రాటో ఆవరణం బి) ట్రోపో ఆవరణం
సి) మీసో ఆవరణం డి) అయానో ఆవరణం
30. అంతర గ్రహాలు అని ఏ గ్రహాలను అంటారు?
ఎ) సూర్యునికి భూమికి మధ్య ఉన్న గ్రహాలు
బి) సూర్యునికి బృహస్పతికి మధ్య ఉన్న గ్రహాలు
సి) వాయు స్థితిలోని గ్రహాలు
డి) ఉపగ్రహాలు లేని గ్రహాలు
31. పైరో విద్యుత్ ఉత్పత్తి దేని వల్ల జరుగుతుంది?
ఎ) సంపీడనం బి) ఉష్ణోగ్రత
సి) తన్యత డి) స్నిగ్ధత
32. సముద్రపు నీటి ఘనీభవ స్థానం కింది దేని వల్ల తగ్గుతుంది?
ఎ) లవణీయత పెరగడం వల్ల
బి) ఉష్ణోగ్రత పెరగడం వల్ల
సి) ఆక్సిజన్ పెరగడం వల్ల
డి) నీటి సంక్షోభం పెరగడం వల్ల
33. సూపర్ నోవా అనేది ఒక
ఎ) నక్షత్ర మండలం బి) నక్షత్ర విస్ఫోటనం
సి) అత్యధిక భారం ఉన్న నక్షత్రం
డి) భారీ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రం
34. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో శీతలకరణ పదార్థం ఏది?
ఎ) భార జలం బి) తేలిక జలం
సి) ద్రవ హీలియం డి) ద్రవ సోడియం
35. డాప్లర్ ప్రభావం అనువర్తింప చేయగలిగే తరంగాలు?
ఎ) ధ్వని తరంగాలు బి) కాంతి తరంగాలు
సి) రేడియో తరంగాలు
డి) పై మూడు రకాల తరంగాలు
36. కింది వాటిలో బహుళ పరావర్తన ధ్వనిపై ఆధారపడి పనిచేసే పరికరాలు ఏవి?
ఎ) మెగాఫోన్ బి) స్టోతస్కోప్
సి) లౌడ్‌స్పీకర్ డి) పైవన్నీ
37. 'ఏకో-రీజింగ్' అని దేనిని అంటారు?
ఎ) శరీర అంతర్భాగాల పరిమాణాన్ని కొలవడం
బి) సమాచార తరంగాల విస్తరణ దూరం
సి) మిసైల్ దూరాన్ని
డి)అతి ధ్వనులను ఉపయోగించి నీటి లోపల ఉన్న వస్తువుల మధ్య దూరాన్ని కనుగొనడం
38. వయోలిన్, పియానో నుంచి వెలువడే స్వరాల మధ్య బేధాన్ని తెలియజేసే సంగీత స్వర లక్షణం?
ఎ) కీచుదనం బి) తీవ్రత
సి) నాణ్యత డి) ఆవర్తన కాలం
39. ఒక ప్లాస్టిక్ సీసా అడుగున త్రిభుజాకారంలో ఉన్న గుర్తులో '1' అనే అంకె ఉంది. ఇది దేనిని సూచిస్తుంది?
ఎ) అధిక సాంద్రత ఉన్న పాలి ఎథిలీన్
బి) అల్ప సాంద్రత ఉన్న పాలి ఎథిలీన్
సి) పాలి ఎథిలీన్ టెరిఫ్తాలేట్ డి) పాలీ స్టైరీన్
40. ఒక వ్యక్తి చత్వారంతో బాధపడుతున్నాడు. అతడిని వైద్యుడు పరీక్షించి ఏ కటకాలు ఉన్న కంటి అద్దాలను ఉపయోగించాలని సూచిస్తాడు?
ఎ) తక్కువ నాభ్యంతరం ఉన్న ద్వికుంభాకార కటకాలు
బి) ఎక్కువ నాభ్యంతరం ఉన్న పుటాకార కటకాలు
సి) ద్వినాభ్యంతర కటకాలు
డి) ద్విపుటాకార కటకాలు
41. వాన చినుకులు గోళాకారంగా ఉండటానికి కారణం?
ఎ) నీటి స్నిగ్ధత బి) నీటి తలతన్యత
సి) నీటి విసరణం డి) ద్రవాభిసరణ పీడనం
42. ఏ సిద్ధాంతంతో 'రామన్ ఫలితం'ను వివరంగా విశదీకరించవచ్చు?
ఎ) తరంగ సిద్ధాంతం బి) కణ సిద్ధాంతం
సి) విద్యుత్ అయాస్కాంత సిద్ధాంతం
డి) క్వాంటం సిద్ధాంతం
43. ఎమ్ఆర్ఐలో ఉపయోగించే విద్యుదయస్కాంత వికిరణం ఏది?
ఎ) ఎక్స్ కిరణాలు బి) మైక్రో తరంగాలు
సి) రేడియో తరంగాలు డి) పరారుణ కిరణాలు
44. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ద్రవ్యశక్తి తుల్యతా నియమం E=mc2లో E:శక్తి, m:ద్రవ్యరాశి c:?
ఎ) ఒక స్థిరాంకం బి) ద్రవ్యవేగం
సి) ద్రవ్యరాశి వేగం డి) కాంతి వేగం
45. పదార్థంలో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ప్రభావితం చేసేవి?
ఎ) ఉష్ణీయ కంపనాలు
బి) పరమాణువుల కల్మషం
సి) స్ఫటిక లోపాలు డి) పైవన్నీ
46. ఒక సిల్క్ గుడ్డతో గాజు కడ్డీని రుద్దిన రెండింటికీ ఆవేశం కలగడానికి కారణం?
ఎ) ఘర్షణ వల్ల
బి) ఉపరితలాలు నునుపు కావడం వల్ల
సి) ఎలక్ట్రానుల మార్పిడి వల్ల
డి) ఎలక్ట్రానులు, ప్రోటానుల మార్పిడి వల్ల
47. ఎక్స్-కిరణాల అభిలక్షణం ఏది?
ఎ) రుణావేశ కణాల ప్రవాహం
బి) ప్రోటానుల ప్రవాహం
సి) పరమాణు మూలం ఉన్న విద్యుదయస్కాంతాల వికిరణాల ప్రవాహం
డి) కేంద్రక మూలం ఉన్న విద్యుదయస్కాంత వికిరణాల ప్రవాహం
48. కంటి రెటీనాలోని లోపాలను సవరించడానికి ఉపయోగించే విద్యుదయస్కాంత వికిరణం?
ఎ) అతినీల లోహిత కిరణాలు బి) పరారుణ కాంతి
సి) ఎక్స్ - కిరణాలు డి) లేజర్
సమాధానాలు
1.సి 2.బి 3.బి 4.డి 5.డి
6.సి 7.డి 8.బి 9.ఎ 10.సి
11.బి 12.సి 13.సి 14.సి 15.ఎ
16.డి 17.ఎ 18.ఎ 19.బి 20.డి
21.బి 22.ఎ 23.బి 24.ఎ 25.ఎ
26.సి 27.డి 28.సి 29.బి 30.బి
31.బి 32.ఎ 33.బి 34.డి 35.డి
36.డి 37.డి 38.సి 39.సి 30.సి
41.బి 42.డి 43.సి 44.డి 45.డి
46.సి 47.సి 48.డి