1. ద ఇంటర్నేషనల్ హార్టీకల్చరల్ ఎగ్జిబిషన్ - 2019 ను ఎక్కడ ప్రారంభించారు?
1) జపాన్ రాజధాని టోక్యో
2) స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్
3) చైనా రాజధాని బీజింగ్
4) భారత రాజధాని ఢిల్లీ
2. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆంధ్రప్రదేశ్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ- 46ను ఏ రోజున విజయ వంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు?
1) మే 22, 2019 2) మే 17, 2019
3) మే 9, 2019 4) మే 5, 2019
3. రీశాట్ - 2బీఆర్1 ఉపగ్రహంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి?
ఎ. రీశాట్ - 2బీఆర్ 1 ఉపగ్రహం అత్యాధునిక సింథటిక్ రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహం
బి. ఈ ఉపగ్రహం 4 సంవత్సరాల పాటు సేవలు అందిస్తుంది
సి. ఈ ఉపగ్రహం బరువు 615 కిలోలు
డి. ఈ ఉపగ్రహంలో ఎక్స్‌బాండ్ అపార్చర్ రాడార్ అనే ఉపకరాన్ని అమర్చారు
1) ఎ, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
4. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్ 2) చెన్నై
3) ముంబాయి 4) న్యూఢిల్లీ
5. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎక్కువసార్లు విజేతగా నిలిచిన జట్టు?
1) చెన్నై సూపర్ కింగ్స్ 2) సన్‌రైజర్స్, హైదరాబాద్
3) ముంబయి ఇండియన్స్ 4) కలకత్తా నైట్ రైడర్స్
6. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. అమెరికాలోని న్యూయార్క్‌లో 2020లో నిర్వహించ నున్న 'ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ (దిమెట్) 150' వార్షికోత్సవంలో పణిగిరి శిల్పాన్ని ప్రదర్శించనున్నారు
బి. ఈ వేడుకలో 'ట్రీ అండ్ సర్పెంట్' పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు
1) ఎ మాత్రమే 2) ఎ,బి
3) బి మాత్రమే 4) ఏదీకాదు
7. ప్రపంచంలోని అత్యుత్తమ 10 విమానాశ్రయాల్లో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ స్థానం దక్కింది?
1) 5 2) 8 3) 3 4) 10
8. ఫొని పెనుతుఫాను కారణంగా 34మందికి పైగా మరణించారు. ఇది ఏ రాష్ట్రంలో సంభవించింది?
1) అస్సాం 2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా 4) కర్నాటక
9. కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి?
ఎ. గుజరాత్లో బంగాళాదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకో నున్నట్టు పెప్సీకో సంస్థ మే 2న ప్రకటించింది.
బి. పెప్సికో సంస్థ మొత్తం 21 మంది రైతులపై కేసులు వేసింది
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ,బి 4) ఏదీకాదు
10. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ. దేశంలో తొలిసారిగా ప్రతిష్టాత్మక వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ సదస్సు తెలంగాణ రాజధాని హైదారా బాద్‌లో జరగనుంది
బి. 'హ్యుమనైజింగ్ డిజైన్' నినాదంతో 2019 అక్టోబర్ 11, 12 తేదీల్లో జరగనుంది
1) ఎ, బి 2) ఎ మాత్రమే
3) బి మాత్రమే 4) ఏదీకాదు
11. ఆసియాన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డుకు సంబంధించి కింది వాటిలో సరైనది?
1) నీలిన ఎం.ఎస్. రాసిన కోల్గేట్ 2.0 రచన ఈ అవార్డుకు ఎంపికైంది
2) ఛత్తీస్‌ఘడ్‌లోని పర్బ ఈస్ట్ మరియు కంతా బేసిన్లో నిర్బంధంగా కేటాయించిన బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించిన అక్రమాలను వెలికితీసి కోల్గేట్ 2.0 పేరుతో ప్రచురించారు.
3) ఈ అవార్డు కింద రూ.20,000 నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందిస్తారు
4) కోల్గేట్ 2.0 రచన 2017లో ప్రచురితమైంది
12. గోల్డ్‌మెన్ పర్యావరణ పురస్కారం 2019కి ఎంపికైన వారిలో లేని వారిని గుర్తించండి?
1) అల్ఫ్రెడో ఒపేన్ 2) లిండా గార్సియా
3) జాక్వెలైన్ ఈవాన్స్ 4) ఆల్బెర్టో కురామిల్
13. తెలంగాణ సాహిత్య అకాడమి పురస్కారాలకు సంబంధించి సరైనవేవి?
ఎ. ఉత్తమ వచన రచనా విభాగంలో ఉప్పుల నరసింహం రచించిన 'మట్టి మనిషి' కథా సంపుటికి అవార్డు లభించింది.
బి. ఉత్తమ కవితా పురస్కారాన్ని సిద్ధార్థ రచించిన 'బొమ్మల బాయి' కవితా సంపుటికి ప్రదానం చేశారు
1) ఎ మాత్రమే 2) ఎ, బి
3) బి మాత్రమే 4) ఏదీకాదు
14. 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జి' పురస్కారం అందుకున్నది ఎవరు?
1) శ్రీశ్రీ రవిశంకర్ 2) బాబా రామ్‌దేవ్
3) ప్రణబ్‌ముఖర్జీ 4) మన్మోహన్సింగ్
15. ఐరాస నేతృత్వంలో జెనీవాలో నిర్వహించిన సమా వేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వెలు వడుతున్న కాలు ష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఒక న్యాయ సమ్మతమైన చరిత్రాత్మక ఒప్పందాన్ని ఎన్ని దేశాలు ఆమోదించాయి?
1) 184 దేశాలు 2) 189 దేశాలు
3) 186 దేశాలు 4) 192 దేశాలు
16. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిదేది?
1) అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ - డేవిడ్ వార్నర్
2) అత్యధిక వికెట్టు తీసిన బౌరల్ - ఇమ్రాన్ తాహిర్
3) అత్యధిక విలువైన ఆటగాడు - లోకేష్ రాహుల్
4) ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ - శుభ్‌మన్ గిల్
17. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు ఎవరికి లభించింది?
1) ఇమ్రాన్ తాహిర్ 2) జన్ప్రీత్ బుమ్రా
3) రాహుల్ చాహర్ 4) హార్థిక్ పాండ్యా
18. కింది వాటిలో సరైనవి ఏది?
ఎ. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి 2019 మే 1న ప్రకటించింది.
బి. మసూద్ అజార్ 2000 జనవరి 31న జైషే మహ్మద్‌ను స్థాపించాడు
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ,బి 4) ఏదీకాదు
19. ప్రపంచ పత్రికా స్వేచ్ఛాఅవార్డు - 2019కి సంబం ధించి సరైన వాటిని గుర్తించండి?
ఎ. వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ప్రైజ్ -2019కి మయన్మార్‌కు చెందిన ఇద్దరు పాత్రికేయులు వాలోన్, క్లాన్సోపూలు ఎంపికయ్యారు
బి. వీరిద్దరూ రాయిటర్స్ పాత్రికేయులు, వారు గత 7 సంవత్సరాలుగా జైలులో నిర్భంధించబడ్డారు.
సి. ఈ అవార్డుకు గాను 35000 డాలర్ల నగదును బహుమతిగా అందిస్తారు
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే
3) సి మాత్రమే 4) పైవన్నీ
20. ఐక్యరాజ్యసమితికి చెందిన విపత్తు నష్ట భయాల తగ్గింపు సంస్థ ససాకవా అవార్డు 2019కి గానూ ఎంపికైనది?
1) సందీప్ కుమార్ మిశ్రా 2) రమేష్ రాజన్
3) ప్రమోద్ కుమార్ మిశ్రా 4) అంబికా చౌదరి
21. ప్రపంచ తీర్మానాలు అనుగుణంగా 60 దేశాలు చెందిన ప్రతినిధుల అంతర్జాతీయ కొలమానాల విధానంలోని ఏడు ప్రామాణిక కొలతల్లో నాలుగిం టికి కొత్త ప్రమాణాలు నిర్దేశించారు. కింద ఇచ్చిన వాటిలో ఎలాంటి మార్పు లేని ప్రమాణం ఏది?
1) క్యాండిలా 2) కెల్విన్
3) ఆంపియర్ 4) మోల్
22. అత్యాధునిక రక్షణ వ్యవస్థలో రూపొందించిన ప్రియదర్శి గస్తీ నౌక సేవలను ఎక్కడ ప్రారంభిం చారు?
1) కాకినాడ 2) విశాఖపట్నం
3) చెన్నై 4) ట్యూటికొరిన్
23. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఆల్ఫా... ఎక్స్ అనే బుల్లెట్ రైలు ఏ దేశానికి చెందినది?
1) చైనా 2) రష్యా
3) దక్షిణ కొరియా 4) జపాన్
24. 16వ వెసక్ (వైశాఖ పూర్ణిమ లేక బుద్ధపూర్ణిమ) ఉత్సవాలు ఏ దేశంలో నిర్వహించారు?
1) భూటాన్ 2) నేపాల్
3) వియత్నాం 4) సింగపూర్
25. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) లో చైనా ఏ సంవత్సరంలో చేరింది?
1) 2005 2) 2001
3) 1995 4) 1998
26. లెకనోర్చిస్ తైవానియాన్ (పరాన్నజీవి) అనే ఆర్కిడ్ను ఏ రాష్ట్రంలో గుర్తించారు?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) మణిపూర్
3) సిక్కిం 4) అస్సాం
27. తక్కువ ఖర్చుతో ప్రయాణించేలా పర్యావరణ హితమైన హైబ్రిడ్ కారును ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు రూపొందించారు?
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) తెలంగాణ 4) కేరళ
28. పెరుగుతున్న కాలుష్యం తరుగుతున్న వనరుల కారణంగా భూమిపై అనేక వాతావరణ మార్పులు వాటిల్లుతున్నాయి. చెట్లను నరికి వేయడం వల్ల భూమి వేడెక్కుతుందని దీంతో ఆందోళనకర స్థితిలోకి వెళ్తున్న భూతాపం, వాతావరణ ఎమర్జెన్సీని ప్రకటించింది?
1) అమెరికా 2) ఐర్లాండ్
3) బ్రిటన్ 4) నార్వే
29. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం గ్రానైట్ నిల్వల్లో అరు ణాల్ప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం నిల్వలు ఉన్నాయి?
1) 15 2) 20 3) 35 4) 28
30. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. భారత నౌకాదళం కోసం నిర్మించిన 'ఇండియన్ నావల్ షిప్ (ఐఎన్ఎస్) వెలా' మే 6న జలప్రవేశం చేసింది
బి.దీనిని ముంబైలోని మజ్‌గావ్‌డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ నిర్మించింది
1) ఎ మాత్రమే 2) ఎ, బి
3) బి మాత్రమే 4) ఏదీకాదు
31. భారత్ ఫుట్‌బాల్ జట్లు కోచ్‌గా ఎవరు నియమితుల య్యారు?
1) డావర్ సుకార్ 2) జొరాన్ విలిచ్
3) ఐగర్ స్టిమాక్ 4) రాబర్ట్ ప్రొసినిక్
32. 2019లో వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు?
1) మే 30 నుంచి జులై 14 2) మే 31 నుంచి జులై 14
3) మే 29 నుంచి జులై 15 4) మే 28 నుంచి జులై 15
33. సౌరభ్ఘోష్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
1) రెజ్లింగ్ 2) స్వ్కాష్
3) షూటింగ్ 4) బాక్సింగ్
34. సైనిక వ్యయంలో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉందని స్టాకహేోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది?
1) 8వ 2) 7వ 3) 4వ 4) 3వ
35. ఆర్బీఐకి సంబంధించిన 'ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్' సమీక్షించడం కోసం 2018 డిసెంబర్ 26న ఏ కమిటీని నియమించారు?
1) ఎన్‌కె.సింగ్ కమిటీ 2) విశ్వనాథ్ కమిటీ
3) రాకేష్ మెహన్ కమిటీ
4) బిమన్ జలాన్ కమిటీ
36. దేశంలోనే మొట్టమొదటి హరిత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రత్యేక పార్కు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది?
1) కర్నాటక 2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్ 4) పశ్చిమ బెంగాల్
సమాధానాలు
1.3 2.1 3.2 4.1 5.3
6.2 7.2 8.3 9.2 10.1
11.4 12.1 13.2 14.1 15.3
16.3 17.2 18.3 19.2 20.3
21.1 22.2 23.4 24.3 25.2
26.4 27.2 28.3 29.3 30.2
31.3 32.1 33.2 34.3 35.4 36.2