బీహెచ్ఈఎల్లో ఇంజనీర్ పోస్టులు
బెంగళూరు (కర్ణాటక)లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
ఇంజనీర్స్: 27
విభాగాలు:ఎలక్ట్రికల్-9, మెకానికల్-8, సివిల్-10.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.
సూపర్ వైజర్స్ (సివిల్): 6
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత. నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.
వయసు: 2019, జూన్ 1 నాటికి 35 ఏళ్లకు మించకూడదు. ఓబీసీ (ఎన్సీఎల్)లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా)లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 12, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.bhelisg.com
టొబాకో బోర్డ్‌లో ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు
గుంటూరు (ఏపీ)లోని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన టొబాకో బోర్డ్ తాత్కాలిక ప్రాతిపదికన 41 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
ఫీల్డ్ ఆఫీసర్ / టెక్నికల్ అసిస్టెంట్ :25
అకౌంటెంట్ / సూపరింటెండెంట్: 16
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్), ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత లేదా టాలీ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసుండాలి.
వయసు: 2019, జూలై 15 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/- జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు).
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 15, 2019.
వివరాలకు వెబ్సైట్: https://tobaccoboa rd.com
బీపీఆర్డీలో వివిధ పోస్టులు
న్యూఢిల్లీలోని హౌంమంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ).. 15 పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-1, డేటా అనలిస్ట్-1, సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్-2, సొల్యూషన్ ఆర్కిటెక్ట్-2, ప్రోగ్రామ్ మేనేజర్-2, లీగల్ అసిస్టెంట్-1, బిజినెస్/రీసెర్చ్ అనలిస్ట్-6.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్, బీసీఏ, ఎంసీఏ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎల్ఎల్బీ/ ఎల్ఎల్ఎం ఉత్తీర్ణత. నిర్దిష్ట అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.250).
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 5, నుంచి జూలై 15, 2019లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.becil.com
ఏఎఫ్ఎంఎస్లో ఆఫీసర్ పోస్టులు
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసుల్లో.. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదలైంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు: 150 (పురుషులు-135, మహిళలు-15).
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. మెడికల్ పీజీ/డిప్లొమా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలచిన వారు స్టేట్ మెడికల్ కౌన్సిల్/ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలి. నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 2019, డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ, ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 21, 2019.
వివరాలకు వెబ్సైట్: http://amcsscentry.gov.in