పీడీఐఎల్‌లో 82 పోస్టులు నోయిడాలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ (పీడీఐఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న తనిఖీ కార్యాలయాలు, ప్రాజెక్టు ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న 82 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు... మేనేజ్మెంట్ ట్రైనీ: 55 అసిస్టెంట్ మేనేజర్: 1 సీనియర్ ఆఫీసర్: 11 డ్రాఫ్ట్స్‌మెన్: 15 అర్హత: పోస్టులను బట్టి సంబంధిత బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ/పీజీ డిప్లొమా, ఎంబీఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఐటీఐ/డిప్లొమా, గేట్-2019 స్కోర్, నిర్దిష్ట అనుభవం ఉండాలి. వయసు: 2019, జూన్ 30 నాటికి 29-36 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.200బీ మిగిలిన వారికి 400. దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 21, 2019. పూర్తి వివరాలకు వెబ్సైట్:https://pdilcareer.in