1) ఒక సంఖ్యను 56చే భాగించగా 29 శేషము వచ్చును. ఆ సంఖ్యను 8తో భాగిస్తే వచ్చే శేషం ఎంత?
1) 4 2) 5 3) 6 4) 7
2) రెండు సంఖ్యల క.సా.గు. 48. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 అయిన ఆ రెండు సంఖ్యల మొత్తము ఎంత?
1) 28 2) 32 3) 40 4) 64
3)12 పెన్నులు, 5 పెన్సిళ్ళ ధర రూ.111. ఒక పెన్సిల్ ధర పెన్ను ధర కంటే రూ.5లు తక్కువ అయిన 8 పెన్నులు, 9 పెన్సిళ్ళ ధర ఎంత?
1) రూ.89 2) రూ.97
3) రూ.91 4) రూ.78 స:3
4) బాలల దినోత్సవము సందర్భముగా ఒక పాఠశాలలోని 300 మంది విద్యార్థులకు స్వీట్లు పంచాలని ఆ పాఠశాల వారు నిర్ణయించారు. కానీ ఆ రోజు 50 మంది విద్యా ర్థులు హాజరు కానందున మిగిలిన ప్రతి విద్యార్థికి అదనం గా ఒక స్వీటు ఇచ్చినా, ఆ పాఠశాల విద్యార్థులకు ఎన్ని స్వీట్లు పాఠశాల వారు పంచారు?
1) 1450 2) 1700 3) 1500 4) 1650
5) 5 సంవత్సరాల క్రితం రాణి మరియు సురభిల సరాసరి వయస్సు 20 సంవత్సరాలు. ప్రస్తుతం రాణి, సురభి, మీరాల సరాసరి వయస్సు 30 సంవత్సరాలు. 15 సంవ త్సరాల తర్వాత మీరా వయస్సు ఎంత (సంవత్సరాలలో)?
1) 35 2) 55 3) 59 4) 67
6) ఒకతను 8 క్వింటాళ్ళ బియ్యాన్ని కొంత సొమ్ముకు కొని, వారం తర్వాత 3 క్వింటాళ్ళ బియ్యాన్ని 10 శాతం లాభానికి, 3 క్వింటాళ్ళ బియ్యాన్ని లాభముగాని, నష్టంగాని పొందనిచో మిగిలిన 2 క్వింటాళ్ళ బియ్యాన్ని 5 శాతం నష్టంనకు అమ్మిన మొత్తం మీద అతను పొందే లాభ శాతం ఎంత?
1) 10% 2) 20% 3) 25% 4) ఏదీకాదు
7) కొంత సొమ్ము సాధారణ వడ్డీ రేటుతో 20 సంవత్స రాలకు నాలుగు రెట్లు అయిన వడ్డీ రేటు అగును?
1)15% 2)5% 3)10% 4)8%
8) కొంత సొమ్మును సాధారణ వడ్డీ రేటుతో 5 సంవత్స రాలకు మొత్తం రూ.1350గాను, 8 సంవత్సరాలకు మొత్తం రూ.1620గాని అయితే ఆ సొమ్ము ఎంత?
1)రూ. 700 2)రూ.800
3)రూ.900 4)రూ.1000 స:3
9) ఒక కారు ధర రూ.4,00,000. ప్రతి సంవత్సరం దాని ధర 10% తగ్గిన, మూడు సంవత్సరాల తరువాత కారు ధర ఎంత?
1)రూ.281600 2)రూ.291600
3)300000 4)281500 స:2
10) ఒకతను 2000 కిలోల బియ్యము నందు కొంత భాగాన్ని 36% లాభానికి, మిగిలిన భాగాన్ని 16% లాభానికి అమ్మిన మొత్తం మీద అతడు 28 శాతం లాభాన్ని పొందితే, 16% లాభము గల బియ్యమును ఎన్ని కిలోలు అమ్మాడు?
1) 400 2) 300 3) 900 4) 800
11) ఒక వ్యక్తి రూ. 2,550ని 4% సాలీన వడ్డీ రేటుతో చక్రవడ్డీకి తీసుకుని రెండు సంవత్సరాలలో సమాన సాలీన వాయిదాల్లో చెల్లించును. ఒక్కో సాలీన వాయిదాకు ఎంత మొత్తం చెల్లించును? (రూ.లలో)
1)1377 2)1275 3)1283 4)1352
12) రోజుకు పంపులు 8 గంటలు చొప్పున పని చేసి ఒక ట్యాంకును 2 రోజుల్ల ఖాళీ చేయగలవు. నాలుగు పంపులు రోజుకు ఎన్ని గంటలు పని చేసి ఒక రోజులో ఆ ట్యాంకును ఖాళీ చేయగలవు?
1) 9 2) 10 3) 11 4) 12
13) రూ.50,000 పెట్టుబడితో 'ఏ' ఒక వ్యాపారాన్ని ప్రాంర భించెను. ఆరు నెలల తర్వాత రూ.80,000 పెట్టుబడితో భాగస్వామిగా 'బి' చేరెను. సంవత్సరాంతమున వారికి వచ్చిన లాభము రూ.27,000 అయిన, అందులో 'బి' వాటా ఎంత?
1) రూ. 15,000 2) రూ. 12,000
3) రూ. 18,000 4) రూ. 13,500
14) ఒక కిరాణదారుడు ఒక వస్తువుని రూ.840కి అమ్మి 20% లాభం పొందెను. 30% లాభం పొందవలెనంటే ఆ వస్తువును ఎంత ధరకు అమ్మవలెను?(రూ.లలో)
1)900 2)960 3)910 4)920
15) ఐదు వరుస సంఖ్యల సరాసరి 23. అయిన వాటి లో అతి చిన్న సంఖ్య?
1)20 2)21 3)22 4)25
16) ఒక తండ్రి మరియు కుమారుడి వయస్సుల మొత్తం 55 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితము, వారి వయ స్సుల లబ్దము 350. కుమారు డి ప్రస్తుత వయసు ఎంత?
1)15 సం. 2)10 సం. 3)12 సం 4)13 సం
17) 2003 వ సంవత్సరం కేలండర్ క్రింద వాటిలో ఏ సంవత్సరం కేలండర్తో సమానంగా ఉంటుంది?
1)2012 2)2014 3)2013 4)2015
18) 10 మంది క్రీడాకారుల నుంచి ముగ్గురు క్రీడాకారు లని ఎన్ని విధాలుగా ఎన్నుకోవచ్చును ?
1)30 2)27 3)60 4)120
19) 6,8,4,7 మరియు 9 లను ఉపయోగించి ఎన్ని '5' అంకెల సంఖ్యలను ఏర్పరచవచ్చు?
1)60 2)120 3)240 4)150
20) ఒక దీర్ఘ చతురస్రాకారపు స్థలం ఒక భుజం 15మీ మరియు కర్ణం 17 మీ అయిన ఆ స్థలము యొక్క వైశాల్యం కనుగొనుము(చ.మీ.)?
1)100 2)140 3)120 4)150
21) ఒక కుళాయి ఒక తొట్టెను 2గంటలలో నింపును. మరొక కుళాయి 3 గంటలలో ఆ తొట్టెను ఖాళీ చేయును. రెండు కుళాయిలు ఒకేసారి తెరిచి ఉంచిన ఆ తొట్టె నిండుటకు ఎంత సమయముగును?
1)5గం. 2)6 గం. 3)7 గం. 4)3 గం.
22) రైలు వేగము గంటకు 72 కి.మీ అయినచో దాని పొడవు 200మీ. ఉన్నపుడు, 1000 మీ పొడవు ఉన్న ఫ్లాట్ ఫారమును దాటుటకు పట్టు సమయం ఎంత (సెం.మీ.లలో)?
1)80 2)60 3)40 4)30
23) ఒక రాంబస్లో రెండు కర్ణములు వరుసగా 40మీ మరియు 30 మీ. అయిన చుట్టుకొలత ఎంత?
1)50 2)100 3)120 4)150
24) రెండు స్థూపముల వ్యాసార్థముల నిష్పత్తి 2 : 3, వాటి ఘ.ప.లు సమానంగా ఉంటే వాటి ఎత్తుల నిష్పత్తి ఎంత?
1)4:9 2)3:2 3)9:4 4)2:3
25) ఒక లోహ దీర్ఘ ఘనము కొలతలు 9 సెం.మీ., 6 సెం.మీ., 4 సెం.మీ., అయిన దాని సంపూర్ణ ఉపరితల వైశాల్యం ఎంత (చ.సెం.మీ.లలో)?
1)264 2)144 3)228 4)196
26) మార్చి 2,1994 బుధవారము అయినచో, 25 జనవరి, 1994 ఏ వారము అగును?
1)బుధ 2)గురు 3)మంగళ 4) సోమ
27) ఒక పాఠశాల వారములోని మొదటి 4 రోజుల సగటు హాజరు 30, వారంలోని మొదటి 5 రోజుల సగటు 32. అయిన 5వ రోజు హాజరు ఎంత?
1)32 2)40 3)38 4)36
28) రూ.8000 లకు 3 సంవత్సరాలకు 2.5% వడ్డీ రేటు వద్ద చక్రవడ్డీ, సామాన్య వడ్డీ మధ్య తేడా ఎంత(రూ.లలో)?
1)15.125 2)15
3)20 4)20.25
సమాధానాలు
1.2 2.3 3.3 4.3 5.2
6.4 7.1 8.3 9.2 10.4
11.4 12.4 13.2 14.3 15.2
16.1 17.2 18.4 19.2 20.3
21.2 22.2 23.2 24.3 25.3
26.3 27.2 28.1
- సి. ప్రకాశ్ రెడ్డి
మెదక్, ఫోన్: 9440783828