1. కింది వాటిలో అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం?
1) తమిళనాడు 2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా 4) కేరళ
2. 'సబాయి గడ్డి' దేని తయారీలో ఉపయోగిస్తారు?
1) పేపర్ తయారీ 2) కూలర్ల తయారీలో
3) సుగంధ ద్రవ్యాల తయారీలో 4) సారాయి తయారీలో
3. దక్కన్ పీఠభూమిలోని వర్షాచ్ఛాయ ప్రాంతంలో విస్తరించిన అడవులు ఏవి?
1) పర్వతీయ అడవులు 2) ఆకురాల్చే అడవులు
3) సతత హరిత అడవులు 4) ముళ్లజాతి అడవులు
4. బొడ్డుపొన్న, రైజోపోరా లాంటి వ క్షాలు ఏ అరణ్యాల్లో పెరుగుతాయి?
1) ఆల్ఫైన్ అడవులు
2) ముళ్లజాతి అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) సతత హరిత అరణ్యాలు
5. దేశంలోప్రధానంగా హిమాద్రి పర్వతాల్లో పెరిగే అడవులు ఏవి?
1) ఉష్ణమండల సతత హరితారణ్యాలు
2) ఆల్ఫైన్ అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) ముళ్లజాతి అరణ్యాలు
6.సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్ 2) అలహాబాద్
3) జోధ్‌పూర్ 4) సిమ్లా
7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది?
1) సిమ్లా 2) భోపాల్
3) జోధ్‌పూర్ 4) డెహ్రాడూన్
8. 'చిలుకా' సరస్సు ఏ తీరంలో ఉంది?
1) సర్కార్ తీరం 2) ఉత్కళ్ తీరం
3) కోరమాండల్ తీరం 4) వంగ తీరం
9. కింది వాటిలో దేన్ని 'కాంతి తీరమైదానం' అని పిలుస్తారు?
1) కోరమాండల్ తీరం 2) మలబార్ తీరం
3) వంగ తీరం 4) సర్కార్ తీరం
10. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మహారాష్ట్ర - కొంకణ్
2) పశ్చిమ బెంగాల్ - వంగ
3) తమిళనాడు - కోరమాండల్
4) ఒడిశా - సర్కార్
11. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తై శిఖరం?
1) దొడబెట్ట 2) అనైముడి
3) గురుశిఖర్ 4) సాడిల్ పీక్
12. నామ్చాబర్వా టటటటశిఖరం ఏ రాష్ట్రంలో విస్త రించి ఉంది?
1) ఉత్తరాఖండ్ 2) అరుణాచల్ ప్రదేశ్
3) సిక్కిం 4) జమ్ము-కశ్మీర్
13. కశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది?
1) అత్యున్నత, బాహ్య హిమాలయాలు
2) హిమాచల్, శివాలిక్ హిమాలయాలు
3) హిమాద్రి, హిమాచల్ హిమాలయాలు
4) బాహ్య, హిమాద్రి హిమాలయాలు
14. 'గేట్ వే ఆఫ్ శ్రీనగర్' అని పిలిచే కనుమ?
1) జోజిలా 2) బనిహాల్
3) షిప్కిలా 4) రోహతంగ్
15. సట్లేజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది?
1) బారాలాప్చాలా 2) రోహతంగ్
3) జోజిలా 4) షిప్కిలా
16. 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ' ఎక్కడ ఉంది?
1) ముంబై 2) కోల్‌కతా
3) పనాజీ 4) కవరత్తి
17. అగ్ని పర్వతాలకు చెందిన ఎర్రమట్టి, సముద్ర జీవ రాశులకు చెందిన నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి?
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) మహా సముద్రపు అగాధం
18. టస్కరోరా అగాధం ఏ మహా సముద్రంలో ఉంది?
1) పసిఫిక్ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం
19. ఏ సముద్రపు భూతల భాగంలో భూకంపాలు అధి కంగా సంభవిస్తాయి?
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) మహా సముద్రపు అగాధం
20. సముద్ర భూతల విస్తీర్ణంలో 'మహా సముద్రపు అగా ధాలు' ఎంత శాతం కలిగి ఉంటాయి?
1) 7.5% 2) 2.1%
3) 1.2% 4) 3.1%
21. టెలిగ్రాఫ్ పీఠభూమి ఏ మహా సముద్రంలో భాగం గా ఉంది?
1) ఆర్కిటిక్ 2) అట్లాంటిక్
3) దక్షిణ మహా సముద్రం
4) హిందూ మహా సముద్రం
22. టెలిగ్రాఫ్ పీఠభూమి ఏ మహా సముద్రంలో భాగంగా ఉంది?
1) ఆర్కిటిక్ 2) అట్లాంటిక్
3) దక్షిణ మహా సముద్రం
4) హిందూ మహా సముద్రం
23. ఉత్తర ధవాన్ని ఆవరించి ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్ 2) అట్లాంటిక్
3) హిందూ 4) ఆర్కిటిక్
24. కింది వాటిలో ఏది అతి తక్కువ లవణీయతను కలిగి ఉంది?
1) కాస్పియన్ సముద్రం 2) ఎర్ర సముద్రం
3) బాల్టిక్ సముద్రం 4) అరల్ సముద్రం
25. ప్రపంచంలో లోతైన కందకం ఏ సముద్రంలో ఉంది?
1) ఉత్తర అమెరికా సముద్రం 2) పసిఫిక్
3) అరేబియన్ 4) అట్లాంటిక్ సముద్రం
26. కింది వాటిలో అధిక లవణీయత ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్ 2) అంటార్కిటిక్
3) ఆర్కిటిక్ 4) అట్లాంటిక్
27. పేలియోజిక్ నిక్షేపాల్లో అత్యధిక శాతం ఉండేది ఏది?
1) రేడియో లేరియన్ 2) గ్లోబిజెరినా
3) ఎర్ర మన్ను 4) డయాటం
28. సింధూర బంకమన్ను ఏ పదార్థ సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది?
1) ఐరన్ ఆక్సైడ్, ఎర్ర రంగు ఓకర్
2) డయాటం, రేడియోలేరియా
3) ఐరన్ ఆక్సైడ్, రేడియోలేరియా
4) డయాటం, ఐరన్ ఆక్సైడ్
29. 'ప్లైటో ప్లవకాల నిలయం'గా ఏ సముద్రాన్ని పిలుస్తారు?
1) ఎర్ర సముద్రం 2) పసుపు సముద్రం
3) దక్షిణ సముద్రం 4) ఉత్తర సముద్రం
30. సముద్రపు అడుగున నివసించే జీవులను ఏమని పిలుస్తారు?
1) ఫైటో ప్లవకాలు 2) జూ ప్లవకాలు
3) బెంథాస్ 4) డయాటం
31. పేలియోజిక్ నిక్షేపాల్లో 'గ్లోబిజెరినా' ఎంత శాతం కలిగి ఉంటుంది?
1) 33% 2) 29% 3) 26.5% 4) 6.4%
32. అటోల్ భిత్తికలు ఎక్కువగా ఏ మహా సముద్రంలో కనిపిస్తాయి?
1) పసిఫిక్ 2) అట్లాంటిక్
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం
33. కింది వాటిలో తీరాంచల భిత్తిక రకానికి చెందిన దీవి ఏది?
1) ఫిజి 2) మాల్దీవులు
3) లక్షదీవులు 4) గ్రేట్ బ్యారియర్ రీఫ్
34. భూభాగం సాంద్రత, నీటి సాంద్రత కన్నా ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది?
1) 5.6 రెట్లు 2) 4.8 రెట్లు
3) 3.2 రెట్లు 4) 2.5 రెట్లు
35. బేరింగ్ జలసంధి నుంచి ప్రవహించే శీతల ప్రవాహాం ఏది?
1) లాబ్రడార్ 2) ఓషియావో
3) గల్ఫ్‌స్ట్రీమ్ 4) క్యానరీస్
36. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ఏది?
1) దక్షిణ చైనా సముద్రం 2) ఇంగ్లీష్ ఛానల్
3) కరేబియన్ సముద్రం 4) పర్షియన్ గల్ఫ్
37. దేశంలో రోగులకు ఔషధాలను సరఫరా చేయ డానికి ప్రవేశపెట్టిన రైలు ఏది?
1) రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ 2) ధన్వంతరి
3) సైన్స్ ఎక్స్‌ప్రెస్
4) హాస్పిటల్ ఆన్ రైల్వే వీల్స్
38. కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 1 2) 2 3) 3 4) 4
39. కింది వాటిలో సరికానిది ఏది?
1) వెండి విప్లవం - గుడ్ల ఉత్పత్తి
2) పసుపు విప్లవం-నూనె గింజల ఉత్పత్తి
3) నారింజ విప్లవం- ఉద్యానవన పంటల ఉత్పత్తి
4) గుండ్రటి విప్లవం - మాంసం ఉత్పత్తి
40. ప్రపంచంలో జనుము ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న దేశం ఏది?
1) బంగ్లాదేశ్ 2) భారత్
3) పాకిస్తాన్ 4) చైనా
41. ప్రపంచంలో పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
1) డెన్మార్క్ 2) నార్వే
3) చైనా 4) భారత్
42. కింది వాటిలో దేన్ని 'పేదవారి ఆవు'గా పేర్కొంటారు?
1) గొర్రె 2) మేక
3) బర్రె 4) ఆవు
43. 'రూర్ ఆఫ్ ఇండియా' అని కింది వాటిలో దేన్ని పిలుస్తారు?
1) కోడెర్మా 2) రాంచీ
3) హజీరాబాగ్ 4) చోటా నాగ్‌పూర్
44. దేశంలో ఖనిజ నిల్వల విషయంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) ఛత్తీస్‌గఢ్ 2) ఒడిశా
3) మధ్యప్రదేశ్ 4) జార్ఖండ్
45. భారత భూభాగంలో లభ్యమయ్యే ఇనుప ధాతువు ఎక్కువగా ఏ రకానికి చెందింది?
1) హెమటైట్ 2) మాగటైట్
3) లియొనైట్ 4) సెడరైట్
46. 'కుద్రేముఖ్' ఇనుప గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) ఛత్తీస్‌గఢ్ 2) జార్ఖండ్
3) కర్ణాటక 4) ఒడిశా
47. దేశంలో బాక్సైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్ 2) ఒడిశా
3) కర్ణాటక 4) ఆంధ్రప్రదేశ్
48. దేశంలో గోండ్వానా బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతం ఏది?
1) మహానది లోయ ప్రాంతం
2) దామోదర్ నదీ లోయ ప్రాంతం
3) సోన్ నదీ లోయ ప్రాంతం
4) గోదావరి నదీ లోయ ప్రాంతం
49. దేశంలో ఏ రకమైన బొగ్గు అధికంగా లభ్యమవుతుంది?
1) ఆంథ్రసైట్ 2) బిట్యూమినస్
3) లిగ్నైట్ 4) పీట్
50. 'అంకళేశ్వర్' ముడి చమురు బావి ఏ రాష్ట్ర భూ భాగంలో ఉంది?
1) మహారాష్ట్ర 2) అసోం
3) గుజరాత్ 4) రాజస్థాన్
సమాధానాలు
1.2 2.1 3.4 4.3 5.2
6.3 7.2 8.2 9.3 10.4
11.2 12.2 13.3 14.2 15.4
16.3 17.3 18.1 19.4 20.3
21.2 22.2 23.4 24.3 25.2
26.4 27.3 28.1 29.4 30.3
31.2 32.1 33.3 34.4 35.2
36.3 37.2 38.2 39.4 40.2
41.4 42.2 43.4 44.4 45.1
46.3 47.2 48.2 49.2 50.3
Authorization