1. సిలికా రసాయన ఫార్మూలా?
1) సిలికాన్ డై ఆక్సైడ్ (SiO2) 2) సిలికాన్ (Si)
3) సిలికాన్ కార్బైడ్ (SiC) 4) ఏదీకాదు
2. ఇసుకకు స్ఫటిక రూపాంతరం?
1) రూబీ 2) క్వార్ట్జ్ (Quartz)
3) కోక్ 4) సాండ్ స్టోన్
3. రసాయనికంగా క్వార్ట్జ్ అనేది వీటిలో ఏదీ?
1) కాల్షియం సిలికేట్ 2) సిలికాన్ ఆక్సైడ్
3) సోడియం సల్ఫేట్ 4) కాల్షియం సల్ఫేట్
4. కుండలు, మట్టి సామాగ్రి, పింగాణీ (పోర్సిలిన్) మొదలైన వస్తువులను ఏమంటారు?
1) మర్మొయ పాత్రలు (సిరామిక్స్) 2) కాస్మొటిక్స్
3) గాజు 4) లేపనాలు
5. సిరామిక్స్ పరిశ్రమకు ప్రధాన ముడి ఖనిజం?
1) బంకమన్ను 2) సున్నపురాయి
3) బాక్సైట్ 4) బోరాక్స్
6. సిరామిక్స్ పరిశ్రమలో కింది వాటిలో ఏది అవసరం లేదు?
1) బంకమన్ను 2) ఫెల్స్ఫార్ ఖనిజం
3) ఇసుక 4) సోడాయాష్
7. సిలికాన్ దేనిలో ఉంది?
1) బొగ్గు 2) ఇసుక
3) చలువరాయి 4) ఉప్పు
8. ప్రయోగశాలలో అతి నీలలోహిత కిరణాలను (UV) పంపించడానికి ఉపయోగించే గాజు?
1) సోడా గాజు 2) పెరైక్స్ గాజు
3) క్వార్ట్జ్ గాజు 4) మెత్తటి గాజు
9. జతపర్చండి?
ముడిపదార్థం ఉత్పాదితం
1. లైమ్‌స్టోన్ ఎ. పోర్సిలీన్
2. జిప్సం బి. గ్లాస్
3. సిలికా ఇసుక బి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్
4. మట్టి డి. సిమెంట్
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-4 బి-3 సి-2 డి-1
3) ఎ-1 బి-3 సి-4 డి-2
4) ఎ-4 బి-1 సి-3 డి-2
10. పాలరాయి/సున్నపురాయి రసాయన నామం?
1) CaCo3 2) CaSo4
3) CaHCo 4) MgCo3
11. ఉత్కష్ట వాయు మిశ్రమం నుంచి జడవాయువులను వేరుచేసే పద్ధతి?
1) దీవార్ 2) సోనార్
3) ఫిషర్ 4) రామ్సే
12. కింది వాటిలో వాసన ఉండే వాయువు?
1) ఆర్గాన్ 2) నైట్రోజన్
3) హైడ్రోజన్ 4) క్లోరిన్
13. విద్యుత్ బల్బుల్లో ఉండే వాయువు ఏది?
1) ఆక్సిజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) ఆర్గాన్ 4) నైట్రోజన్
14. ద్రవరూపంలో ఉన్నపుడు పాత్ర గోడలపైకి ఎగబాకే వాయువు ఏది?
1) హీలియం 2) నియాన్
3) నైట్రోజన్ 4) హైడ్రోజన్
15. సముద్రపు లోతుల్లోకి వెళ్లే ఈతగాళ్ల శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వాలంగ్ పరికరాలను వాడతారు. వీటిలో ఉండే వాయు మిశ్రమం ఏది?
1) 10% ఆక్సిజన్, 90% నైట్రోజన్
2) 20% ఆక్సిజన్, 80% నైట్రోజన్
3) 20% హీలియం, 80% ఆక్సిజన్
4) 20% ఆక్సిజన్, 80% హీలియం
16. సాధారణంగా బెలూన్లు, ఎయిర్‌షిప్‌లలో వాడే వాయువు ఏది?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) హీలియం
3) హైడ్రోజన్ 4) నైట్రోజన్
17. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేం దుకు కారణమయ్యే ప్రక్రియ?
1) హైడ్రోజన్ సంలీనం 2) రేడియం సంలీనం
3) హీలియం సంలీనం 4) నైట్రోజన్ సంలీనం
18. సూర్యుడిలో కేంద్రక సంలీనం చర్య జరిగి చివరగా ఏర్పడే మూలకం?
1) హైడ్రోజన్ 2) హీలియం
3) ఆక్సిజన్ 4) నైట్రోజన్
19. ఫొటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బుల్లో వాడే జడవాయువు?
1) హీలియం 2) నియాన్
3) ఆర్గాన్ 4) క్జినాన్
20. బొగ్గుగని కార్మికుల టోపీలైట్లలో వాడే వాయువు?
1) క్రిప్టాన్ 2) హీలియం
3) నియాన్ 4) ఆక్సిజన్
21. సున్నపు తేటను గోడలకు వెల్ల వేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని తెల్లగా మారుతుంది. ఇందులో చివరగా ఏర్పడే పదార్థం?
1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం సల్ఫేట్
3) కాల్షియం కార్బైడ్ 4) కాల్షియం ఫాస్ఫేట్
22. విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) రసాయన ఫార్మూలా?
1) CaCl2 2) CaOCl2
3) CaCo3 4) CaClo3
23. బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కరిగించినప్పుడు విడుద లయ్యే వాయువు ఏది?
1) క్లోరిన్ 2) ఆక్సిజన్
3) ఫ్లోరిన్ 4) అయొడీన్
24. మున్సిపల్ వాటర్‌ను శుద్ధి చేసే ప్రక్రియ?
1) ఆక్సీజినేషన్ 2) క్లోరినేషన్
3) అయొడినేషన్ 4) హైడ్రేషన్
25. మామిడి కాయలను కత్రిమంగా పక్వానికి తెప్పించ డానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయో గిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది?
1) ఇథిలీన్ 2) ఎసిటలీన్
3) క్లోరోఫాం 4) హైడ్రోజన్
26. బేకింగ్ సోడా రసాయన నామం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం బైకార్బొనేట్
3) సోడియం కార్బొనేట్
4) సోడియం బైకార్బొనేట్
27. చాకలి సోడా రసాయన నామం?
1) సోడియం కార్బొనేట్
2) సోడియం బై కార్బొనేట్
3) సోడియం క్లోరైడ్ 4) సుక్రోజ్
28. జతపర్చండి?
1. సోడియం కార్బొనేట్ ఎ.NaoH
2. సోడియం బై కార్బొనేట్ బి.Na2CO3
3. సోడియం క్లోరైడ్ సి.NaHCO3
4. సోడియం హైడ్రాక్సైడ్ డి.NaCl
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-2 బి-3 సి-1 డి-4
3) ఎ-2 బి-3 సి-4 డి-1
4) ఎ-3 బి-1 సి-2 డి-4
29. సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్) రసాయన నామం?
1) సోడియం సల్ఫేట్ 2) సోడియం క్లోరైడ్
3) సోడియం హైడ్రాక్సైడ్ 4) సోడియం ఫాస్ఫేట్
30. సాధారణంగా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించే ముందు కాళుకడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం?
1) పొటాషియం పర్మాంగనేట్ 2) పొటాషియం క్లోరేట్
3) పొటాషియం సల్ఫేట్ 4) హైడ్రోజన్ పెరాక్సైడ్
31. సిమెంటు తయారీకి కావాల్సిన ప్రధాన ముడి పదార్థం?
1) ఇసుక 2) సున్నపురాయి
3) సోడాయాష్ 4) ఏదీకాదు
32. సిమెంట్‌ను 1824లో ఒక తాపీమేస్త్రీ కనుగొన్నాడు. అతని పేరు?
1) జె. ఎడిసన్ 2) జె. ఏస్పిడిన్
3) జె. థామ్సన్ 4) జె. పోర్ట్ ల్యాండ్
33. కింది వాటిలో సిమెంటు పరిశ్రమకు అవసరమైంది?
1) సున్నపురాయి 2) బంకమన్ను
3) బొగ్గు 4) అన్నీ
34. సరైన వాక్యాలను గుర్తించండి?
1) సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్ల గట్టి ముద్దలను క్లింకర్లు అంటారు.
2) క్లింకర్లను చూర్ణం చేసి 2-3 శాతం జిప్సంను కలిపితే వచ్చేది సిమెంట్.
3) జిప్సం వల్ల సిమెంట్‌కు గట్టిపడే గుణం వస్తుంది.
4) అన్నీ సరైనవే
35.సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం?
1) బంకమన్ను 2) సిలికా
3) సున్నపురాయి 4) జిప్సం
36. జిప్సం రసాయన ఫార్మూలా
1) Caso4 2H2O 2) Caso4 H2O
3) అనార్థ్ర Caso4 4) Caso4 1/2 H2O
37. జిప్సంను 120°C - 130°C కు వేడిచేస్తే ఒకటిన్నర అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు?
1) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 2) సిమెంట్
3) గాజు 4) పోర్సెలిన్
38. భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంత కాలం తర్వాత గట్టి పదా ర్థంగా మారుతుంది. దీన్నే 'సెట్టింగ్' అని అంటారు. ఈ ప్రక్రియలో ఘన పరిమాణం పెరగడంతోపాటు?
1) కార్బొనేషన్ జరుగుతుంది.
2) నిర్జలీకరణం (డీహైడ్రేషన్) చోటు చేసుకుంటుంది.
3) హైడ్రేషన్ జరుగుతుంది.
4) హైడ్రోజనీకరణం సంభవిస్తుంది.
39. ఒక భాగం తడి సున్నం, మూడు భాగాల ఇసుక, నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు?
1) లైమ్ మోర్టార్
2) లైమ్ సిమెంట్
3) రేయిన్ఫోర్స్ డ్ కాంక్రీట్
4) ఏదీకాదు
40. విరిగిన ఎముకలు సరైన స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టిగా దేన్ని ఉపయోగిస్తారు?
1) జిప్సం 2) సున్నం
3) సిమెంట్ 4)ప్లాస్టర్ ఆఫ్ పారిస్
41. వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటే గ్రీన్హౌస్ ప్రభావంకనిపిస్తుంది?
1) హీలియం 2) నైట్రోజన్
3) కార్బన్ డైఆక్సైడ్ 4) ఆక్సిజన్
42. ఉత్కష్ట వాయువుల సంయోజకత?
1) సున్నా 2) ఒకటి 3) రెండు 4) మూడు
43. ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది?
1) దంతాలు 2) కళ్లు 3) నాలుక 4) చెవులు
44. ద్విపరమాణుక అణువు కానిది ఏది?
1) ఫ్లోరిన్ 2) క్లోరిన్ 3) ఆక్సిజన్ 4) హీలియం
45. 'క్రయోజనిక్ ద్రవం' ఏది?
1) ద్రవ ఆక్సిజన్ 2) ద్రవ హైడ్రోజన్
3) నీరు 4) ద్రవ హీలియం
46. వాయు థర్మామీటర్లలో ఏ వాయువును ఉపయోగిస్తారు?
1) నియాన్ 2) హైడ్రోజన్
3) హీలియం 4) ఆక్సిజన్
47. హాలోజన్ విద్యుద్దీపాల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపే జడవాయువు ఏది?
1) హీలియం 2) క్రిప్టాన్ 3) క్జినాన్ 4) రేడాన్
48. బలమైన ఆమ్లం ఏది?
1) HF 2) HC 3) HBr 4) HI
49. థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నది?
1) ఫ్లోరిన్ 2) అయోడిన్
3) క్లోరిన్ 4) బ్రోమిన్
50. బాహ్యకక్ష్యలో అష్టక ఎలక్ట్రాన్లు లేని జడవాయువు?
1) నియాన్ 2) రేడాన్
3) హీలియం 4) ఆర్గాన్
51. సముద్ర మొక్కల్లో ఉండేది?
1) అయోడిన్ 2) క్లోరిన్
3) క్లోరిన్ 4) సల్ఫర్
52. హైడ్రోఫ్లోరికామ్లం(HF)ను దేనిలో నిల్వ చేయలేం?
1) ఇనుప సీసా 2) ప్లాస్టిక్ సీసా
3) గాజు సీసా 4) తగరపు సీసా
సమాధానాలు
1.1 2.2 3.2 4.1 5.1
6.4 7.2 8.3 9.2 10.1
11.1 12.4 13.3 14.1 15.4
16.2 17.1 18.2 19.4 20.1
21.1 22.2 23.1 24.2 25.2
26.4 27.1 28.3 29.2 30.1
31.2 32.2 33.4 34.4 35.4
36.1 37.1 38.3 39.1 40.4
41.3 42.1 43.1 44.4 45.4
46.3 47.2 48.4 49.2 50.3
51.1 52.3