1. క్లోమం స్రవించే ఎంజైములు ఏవి?
1) అమైలేజ్, సుక్రేజ్, లైపేజ్
2) ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్
3) లైపేజ్, పెప్సిన్, టయలిన్
4) పెప్సిన్, లైపేజ్, సుక్రేజ్
2. మానవుని హదయంలో కుడి పార్శ్వం వైపు ఉన్న కవాటాలు?
1) అగ్రత్రయ కవాటం, పుపుస ధమని కవాటం
2) అగ్రత్రయ కవాటం, మహాధమని కవాటం
3) అగ్రద్వయ కవాటం, మహాధమని కవాటం
4) మిట్రల్ కవాటం, పుపుస ధమని కవాటం
3. రక్తకేశనాళికా గుచ్ఛంలో పీడనం పెరగడానికి కారణ మేమిటి?
1) సన్నని నాళం ఉన్న అభివాహి ధమనిక
2) పోడోసైట్ల మధ్య ఉన్న సూక్ష్మరంధ్రాలు
3) సన్నని నాళం ఉన్న అపవాహి ధమనిక
4) సన్నని నాళం ఉన్న అపవాహి సిరిక
4. కింది వాటిలో ఒకే సందర్భంలో జరిగే ప్రతీకారచర్య, సహ జాత ప్రవత్తి ఏది?
1) కదులుతున్నది ఏదైనా మొదటిసారి కనిపిస్తే దాని వెనకే వెళ్లడం
2) మొనదేలిన వస్తువును తాకినపుడు కలిగే ప్రతిస్పందన
3) సంతానోత్పత్తి కోసం భిన్న లింగ జీవులను ఎన్నుకోవడం
4) బడిగంట మోగగానే విద్యార్థులు మైదానాన్ని వదలి వెళ్లడం
5. హేమంత్ తన ఆహారంలో నీటిలో కరిగే, కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఉండేలా చూసుకుంటాడు. కింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్, నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
1) ఫోలిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం
2) బయోటిన్, కాల్సిఫెరాల్
3) టోకోఫెరాల్, ఫిల్లోక్వినోన్
4) రెటినాల్, పైరిడాక్సిన్
6. కింది వాటిలో 'దండాల' ప్రత్యేక లక్షణం ఏమిటి?
1) అతి తక్కువ కాంతిలో వస్తువులను గుర్తించడం
2) కాంతివంతమైన వెలుతురులో రంగుల్ని గుర్తించడం
3) రంగుల్లోని ప్రత్యేకతల్ని గుర్తించడం
4) దష్టి స్పష్టంగా ఉండేలా చేయడం
7. వేర్వేరు మట్టి నమూనాలు, ప్లాస్టిక్ గరాటు, వడపోత కాగితం, నీరు, కొలజాడి, డ్రాపర్లను ఉపయోగించి నిర్వహించే ప్రయోగం ద్వారా తెలుసుకోగలిగేది?
1) మట్టిలో తేమ శాతం
2) మట్టి నీటిని పీల్చుకునే స్వభావం
3) మట్టిలోని ఖనిజ లవణాలు
4) మట్టిలో ఉండే పదార్థాలు
8. ఊపిరితిత్తులలో 'ఉచ్చ్వాసం', 'నిశ్వాసం' ప్రక్రియల్లో జరిగే మార్పులు వరసగా..
1) లోపలి పీడనం తగ్గుతుంది - లోపలి పీడనం పెరుగుతుంది
2) లోపలి పీడనం పెరుగుతుంది - లోపలి పీడనం తగ్గుతుంది
3) లోపలి పీడనం తగ్గుతుంది - లోపలి పీడనం తగ్గుతుంది
4) లోపలి పీడనం పెరుగుతుంది - లోపలి పీడనం పెరుగుతుంది
9. మన దేహంలో కదలని కీలు, మడతబందు కీలు ఉన్న అవయవాలు ఏవి?
1) భుజం, మెడ
2) పై దవడ - తల, ముంజేయి
3) కింది దవడ - తల, భుజం
4) మోకాలు, మెడ
10. ద్విపార్శ్వ సౌష్ఠవం, త్రిస్తరిత లక్షణంతోపాటు ఖండితయుత దేహం కలిగివున్న జీవులు ఏవి?
1) జలగలు 2) ఆల్చిప్పలు
3) ఏలిక పాములు 4) సీ ఆర్చిన్లు
11. 'తారక' పరిమాణాన్ని కాంతి తీవ్రతను బట్టి సర్దుబాటు చేయగల కండర నిర్మాణం?
1) శైలికామయ కండరాలు
2) అవలంబిత స్నాయువులు
3) కంటిపాప
4) స్నాయువులు, కండరాలు
12. కింది ఏ ఆల్కలాయిడ్ స్క్రీజోఫ్రీనియాను నివారిస్తుంది?
1) థియీన్ 2) మార్ఫీన్
3) రిసర్పిన్ 4) అట్రోపిన్
13. సకశేరుకాల కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లోపిస్తే?
1) ప్రొటీన్ల సంశ్లేషణ జరగదు
2) జీర్ణరసాల ఉత్పత్తి జరగదు
3) కొవ్వుల సంశ్లేషణ జరగదు
4) విషపదార్థాల నిర్వీర్యం జరగదు
14. A, B ల నుంచి సరైన వాటిని ఎన్నుకొని కింది పట్టికను పూరించండి.
వినాళ గ్రంథి పేరు విడుదలచేసే హార్మోన్
స్త్రీ బీజకోశం -A B - ల్యూటినైజింగ్ హార్మోన్
1) A : ప్రొలాక్టిన్, B: క్లోమం
2) A : ప్రొజెస్టిరాన్, B: పిట్యుటరీ
3) A : అడ్రినలిన్, B: అడ్రినల్
4) A : థైరాక్సిన్, B: థైమస్
15. కస్క్యుట రెఫ్లెక్సా దేని ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది?
1) అంటు వేర్లు 2) చూషకాలు
3) వాయుగత వేర్లు 4) లెంటికణాలు
16. సూక్ష్మమైన మొక్కలు, జంతువులపై కీటకనాశనులు ప్రమాద కరమైన ప్రభావాన్ని చూపుతాయని తన గ్రంథంలో సూచించిన శాస్త్రవేత్త ఎవరు?
1) రేచల్ కార్సన్ 2) జూలియట్ క్యూరి
3) మేరీ ఎన్నింగ్ 4) రోసాలిండ్
17. కింది వాటిలో నీటి నుంచి ఆహారాన్ని వడపోసి గ్రహించడానికి తమ దంతాలను ఉపయోగించు కొనేవి ఏవి?
1) కొంగ - కప్ప 2) చేప - బాతు
3) చేప - బల్లి 4) కప్ప - బాతు
18. సాక్యులస్, యుట్రిక్యులస్ల నుంచి బయలుదేరిన నాడీ తంతువులు కలసి ఏర్పడేది?
1) కర్ణావర్త నాడి 2) పేటికా నాడి
3) శ్రవణ నాడి 4) దక్ నాడి
19. రవి రక్తవర్గం 'A', రవి తండ్రి రక్తవర్గం 'O'. అత్యవసర సమయంలో రవికి, రవి తండ్రికి రక్తదానం అవసరమైతే ఎక్కించాల్సిన రక్త వర్గాలు?
రవి రవి తండ్రి
1) A, O O
2) AB A B
3) B, O A
4) B B, O
20. కింది వాటిలో పుష్పంలోని ఏ భాగం అనావశ్యకం?
1) కేసరావళి 2) అండకోశం
3) రక్షక పత్రావళి 4) పరాగకోశం
21. ఏ మొక్కలో వేర్లు, కాండం, పత్రాలు రూపాంతరం చెందుతాయి?
1) డ్రాసీనా 2) కలబంద
3) ఆస్పరాగస్ 4) వాండ
22. ఏ మొక్కలో వేర్లు, కాండం, పత్రాలు రూపాంతరం చెందుతాయి?
1) డ్రాసీనా 2) కలబంద
3) ఆస్పరాగస్ 4) వాండ
23. అధిక భాష్పోత్సేకం దేని ద్వారా జరుగుతుంది?
1) వాయు రంధ్రాలు 2) పత్ర రంధ్రాలు
3) అవబాసిని 4) బాహ్య చర్మం
24. 'హైడ్రోపోనిక్స్' ప్రక్రియలో మొక్కలు పెంచి నప్పుడు కింది వాటిలో అవసరం లేనిది ఏది?
1) నేల 2) కాంతి
3) నీరు 4) పోషకాలు
25. పత్రహరితంలో ఉండే మూలకం ఏది?
1) ఇనుము 2) సల్ఫర్
3) మెగ్నీషియం 4) కాల్షియం
26. మానవ శుక్రకణంలో లోపించిన కణాంగం?
1) అంతర్జీవ ద్రవ్యజాలం 2) మైటోకాండ్రియా
3) కేంద్రకం 4) సెంట్రియోల్
27. జతపరచండి.
జాబితా I జాబితా II
a) పరీక్షా సంకరణం i) 9 : 3 : 1
b) ఏక సంకరణం ii)Tt × tt
c) పూర్వ సంకరణం iii)Tt × TT
d) ద్వి సంకరణం iv) 3 : 1
1) a-ii, b-iv, c-iii, d-i
2) a-ii, b-iv, c-i, d-iii
3) a-iii, b-iv, c-i, d-ii
4) a-i, b-iv, c-ii, d-iii
28. రోగికి అవయవ మార్పిడి చేసే సమయంలో ఉపయో గించే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి సంగ్రహిస్తారు?
1) బ్యాక్టీరియా 2) శిలీంధ్రం
3) వైరస్ 4) మొక్కలు
29. కింది వాటిలో ఏ జంతువు ఒకే ఆవరణ వ్యవస్థలో ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమిస్తుంది?
1) బొద్దింక 2) సింహం
3) మేక 4) కప్ప
30. కింది వాటిలో కాలుష్య సూచికలు ఏవి?
1) లెకైన్లు, మాస్లు 2) ఖీరోనోమస్ లార్వా
3) డాప్నియా 4) పైవన్నీ
31. కింది వాటిలో ఏ హార్మోన్ ఉత్పత్తి వల్ల పత్రాలు రాలుతాయి?
1) సైటోకైనిన్ 2) ఏబీఏ
3) ఎన్ఏఏ 4) ఆక్సీన్లు
32. నిరంతరాయంగా వినైల్ క్లోరైడ్ బహిర్గతమైతే ఏ కాన్సర్ సోకే అవకాశం ఉంది?
1) యోని 2) చర్మం
3) కాలేయం 4) ప్రొస్టేట్ గ్రంథి
33. జతపరచండి.
జాబితా I జాబితా II
a) డిఫ్తీరియా i) బాసిల్లస్
b) డిసెంట్రీ ii) విబ్రియో
c) కలరా iii) పాశ్చురెల్లా
d) టైఫాయిడ్ iv) కొర్ని బ్యాక్టీరియం
v) సాల్మోనెల్లా
1) a-iii, b-v, c-i, d-iv
2) a-ii, b-iii, c-iv, d-i
3) a-ii, b-i, c-iv, d-v
4) a-iv, b-i, c-ii, d-v
34. జతపరచండి.
జాబితా I
a) ఎడ్వర్డ జెన్నర్ b) లూయి పాశ్చర్
c) ఐవనో విస్కీ d) డబ్ల్యు.ఎం. స్టాన్లీ
జాబితా II
i) టి.ఎం.వి. వైరస్ను స్పటీకీకరించడం
ii) కంటాజియమ్ వైవమ్ ప్లూయిడమ్
iii) వైరస్లను కనుక్కోవడం
iv) మశూచి టీకా v) రేబిస్ టీకా
1) a-iv, b-v, c-iii, d-i
2) a-iv, b-v, c-i, d-iii
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-ii, b-iii, c-iv, d-v
35. జతపరచండి.
జాబితా I
a) జిబ్బరెల్లిన్లు b) ఆక్సీన్లు
c) ఇథిలీన్ d) సైటోకైనిన్లు
జాబితా II
i) రిచ్మాండ్ - లాంగ్ ప్రభావం
ii) ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల
iii) బార్లీ విత్తనాల అంకురణ
iv) అగ్రాధిక్యత
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-i, b-iv, c-iii, d-ii
4) a-iv, b-iii, c-ii, d-i
36. జతపరచండి.
జాబితా- I
a) లాక్టోజెనిక్ హార్మోన్
b) యాంటీ డై యురిటిక్ హార్మోన్
c) పోరాట పలాయన హార్మోన్
d) బర్త హార్మోన్
జాబితా- II
i) ఆక్సిటోసిన్ ii) ప్రొలాక్టిన్
iii) వాసోప్రెసిన్ iv) అడ్రినలిన్
1) a-ii, b-iii, c-iv, d-i
2) a-i, b-ii, c-iii, d-iv
3) a-ii, b-iii, c-i, d-iv
4) a-ii, b-i, c-iv, d-iii
సమాధానాలు
1.2 2.1 3.3 4.2 5.4
6.1 7.2 18.1 9.2 10.1
11.3 12.3 13.4 14.2 15.2
16.1 17.2 18.2 19.1 20.3
21.3 22.2 23.2 24.1 25.3
26.1 27.1 28.2 29.1 30.4
31.2 32.3 33.4 34.1 35.2
36.1