1. భారతదేశంలో అధికంగా 'పోటులు' సంభవించే 'ఓక్లా' అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా 2) మహారాష్ట్ర
3) గుజరాత్ 4) పశ్చిమ బెంగాల్
2. పర్వవేల్యా'పోటు పాటు'లు ఒక నెలలో ఎన్నిసార్లు సంభవిస్తాయి?
1) 2 సార్లు 2) 3 సార్లు
3) 4 సార్లు 4) 6 సార్లు
3. హిందూ మహా సముద్ర ద్వీపం డిగోగార్షియాలో మిలటరీ స్థావరం కలిగి ఉన్న దేశం ఏది?
1) రష్యా 2) ఇంగ్ల్లండ్
3) జర్మనీ 4) అమెరికా
4.కింది వాటిలో ఏది అట్లాంటిక్ మహా సముద్ర ప్రవాహా వ్యవస్థకు సంబంధించనిది?
1) లాబ్రడార్ ప్రవాహాం 2) గల్ఫ్‌స్ట్రీమ్ ప్రవాహాం
3) కురుషివో ప్రవాహాం 4) బెంగుల్యా ప్రవాహాం
5. కింది వాటిలో శీతల ప్రవాహాం కానిది ఏది?
1) కాలిఫోర్నియా ప్రవాహాం 2) సుసీమా ప్రవాహాం
3) కామ్చెట్కా ప్రవాహాం 4) ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్
6. ఏ ప్రవాహాన్ని 'యూరప్ వెచ్చని దుప్పటి' అని పిలుస్తారు?
1) గల్ఫ్‌స్ట్రీమ్ 2) లాబ్రడర్
3) బెంగుల్యా 4) కాలిఫోర్నియా
7. మొజాంబిక్ ప్రవాహాం ఏ మహాసముద్ర ప్రవాహా వ్యవస్థకు చెందింది?
1) పసిఫిక్ 2) అట్లాంటిక్
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం
8. కెనరీ శీతల ప్రవాహాం వల్ల ఏర్పడిన ఎడారి ఏది?
1) సోనారన్ ఎడారి 2) అటకామా ఎడారి
3) కలహారి ఎడారి 4) సహారా ఎడారి
9. ఈ రోజు వచ్చే పోటు కన్నా రేపు వచ్చే మొదటి పోటు ఎంత ఆలస్యంగా వస్తుంది?
1) 6 గంటల 13 నిమిషాలు
2) 12 గంటల 26 నిమిషాలు
3) 13 నిమిషాలు 4) 53 నిమిషాలు
10. 'ప్రశాంత మహా సముద్రం' అని ఏ మహా సముద్రాన్ని పిలుస్తారు?
1) అట్లాంటిక్ మహా సముద్రం
2) హిందూ మహా సముద్రం
3) ఆర్కిటిక్ మహా సముద్రం
4) పసిఫిక్ మహా సముద్రం
11. ఒకే లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?
1) ఐసోబాథ్స్ 2) ఐస్కోహె ట్స్
3) ఐసోహెలైన్స్ 4) ఐసోబార్స్
12. సముద్రపు ఏ భాగంలో 'చేపలు' లాంటి జలచర జీవులు ఎక్కువగా పెరుగుతాయి?
1) ఖండతీరపు అంచు 2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం 4) అగాధాలు
13. డాగర్ మత్స్య బ్యాంకు ఉన్న ప్రదేశం ఏది?
1) అమెరికా 2) ఇంగ్లండ్
3) ఆస్ట్రేలియా 4) కెనడా
14. ప్రపంచంలో అతి వెడల్పయిన ఖండతీరపు అంచులు ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్ మహా సముద్రం
2) దక్షిణ మహా సముద్రం
3) ఆర్కిటిక్ మహా సముద్రం
4) అట్లాంటిక్ మహా సముద్రం
15. సోమాలియా శీతల ప్రవాహం ఏ మహా సముద్రంలో భాగం?
1) అట్లాంటిక్ 2) పసిఫిక్
3) హిందూ మహా సముద్రం
4) దక్షిణ మహాసముద్రం
16. కలహారి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది?
1) కెనరీ 2) పెరూవియన్
3) కాలిఫోర్నియా 4) బెంగుల్యా
17. చంద్రుడు, సూర్యుని ఆకర్షణ నిష్పత్తి ఎంత?
1) 5:11 2) 11:5 3) 6:13 4) 13:6
18. ఒక పోటు, ఒక పాటుకు మధ్య సమయ వ్యత్యాసం ఎంత?
1) 12గం.26ని. 2) 24గం.52 ని.
3) 6గం.13ని. 4) 5గం. 26 ని.
19. ఒక ప్రదేశంలో వర్షపాతం పెరిగే కొద్ది ఆ ప్రాంత సముద్ర లవణీయత ఏమవుతుంది?
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) పెరిగి తగ్గుతుంది 4) మారదు
20. ఖండతీరం నుంచి 180 మీ. లోతు వరకు ఉన్న ఖండ భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) ఖండతీరపు వాలు
2) అగాధ సముద్ర మైదానం
3) అగాధ సముద్ర ప్రాంతాలు
4) ఖండతీరపు అంచు
21. సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే 'ప్రమాణం' ఏది?
1) నాటికల్ మైల్ 2) పాథమ్
3) కిలోమీటర్లు 4) అడుగులు
22. సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?
1) ఐసోబార్లు 2) ఐసోహెలైన్స్
3) ఐసోబాథ్స్ 4) ఐసోహలైన్స్
23. కింది వాటిలో సరికానిది ఏది?
1) పసిఫిక్ మహా సముద్రం-డెల్టా ఆకారం
2) అట్లాంటిక్ మహా సముద్రం-ఎస్ ఆకారం
3) దక్షిణ మహా సముద్రం-కల్లోల సముద్రం
4) హిందూ మహా సముద్రం-ఎమ్ ఆకారం
24. సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగపు కొన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1) బేసిన్ 2) అగ్రం
3) సింధు శాఖ 4) అఖాతం
25. సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది?
1) 35% 2) 45% 3) 55% 4) 66%
26. తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్ర కారం గా మారితే దానిని ఏమని పిలుస్తారు?
1) సింధు శాఖ 2) అగ్రం
3) షోల్ 4) అఖాతం
27. కింది వాటిలో ఏ మహా సముద్రానికి ఉత్తరాన 'బేరింగ్ జలసంధి' సరిహద్దుగా ఉంది?
1) పసిఫిక్ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) అంటార్కిటికా మహా సముద్రం
28. సీమౌంట్స్ అంటే?
1) సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన ఇసుక దిబ్బలు
2) జీవ సంబంధమైన దిబ్బలు
3) సముద్రాల లోపల 1000 మీ. ఎత్తుకుపైగా ఉండే పర్వతాలు
4) సముద్రాల్లో లోతు తక్కువగా ఉన్న భూభాగం
29.ప్రిన్స్ ఎడ్వర్డ్స్ రిడ్జ్ ఏ మహా సముద్రంలో ఉంది?
1) హిందూ మహా సముద్రం
2) దక్షిణ మహా సముద్రం
3) పసిఫిక్ 4) అట్లాంటిక్
30. కింది వాటిలో అధిక లవణీయత ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్ 2) అంటార్కిటిక్
3) ఆర్కిటిక్ 4) అట్లాంటిక్
31. పేలియోజిక్ నిక్షేపాల్లో అత్యధిక శాతం ఉండేది ఏది?
1) రేడియో లేరియన్ 2) గ్లోబిజెరినా
3) ఎర్ర మన్ను 4) డయాటం
32. సింధూర బంకమన్ను ఏ పదార్థ సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది?
1) ఐరన్ ఆక్సైడ్, ఎర్ర రంగు ఓకర్
2) డయాటం, రేడియోలేరియా
3) ఐరన్ ఆక్సైడ్, రేడియోలేరియా
4) డయాటం, ఐరన్ ఆక్సైడ్
33. 'ప్లైటో ప్లవకాల నిలయం'గా ఏ సముద్రాన్ని పిలుస్తారు?
1) ఎర్ర సముద్రం 2) పసుపు సముద్రం
3) దక్షిణ సముద్రం 4) ఉత్తర సముద్రం
34. సముద్రపు అడుగున నివసించే జీవులను ఏమని పిలుస్తారు?
1) ఫైటో ప్లవకాలు 2) జూ ప్లవకాలు
3) బెంథాస్ 4) డయాటం
35. పేలియోజిక్ నిక్షేపాల్లో 'గ్లోబిజెరినా' ఎంత శాతం కలిగి ఉంటుంది?
1) 33% 2) 29% 3) 26.5% 4) 6.4%
36. అటోల్ భిత్తికలు ఎక్కువగా ఏ మహా సముద్రంలో కనిపిస్తాయి?
1) పసిఫిక్ 2) అట్లాంటిక్
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం
37. కింది వాటిలో తీరాంచల భిత్తిక రకానికి చెందిన దీవి ఏది?
1) ఫిజి 2) మాల్దీవులు
3) లక్షదీవులు 4) గ్రేట్ బ్యారియర్ రీఫ్
38. భూభాగం సాంద్రత, నీటి సాంద్రత కన్నా ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది?
1) 5.6 రెట్లు 2) 4.8 రెట్లు
3) 3.2 రెట్లు 4) 2.5 రెట్లు
39. బేరింగ్ జలసంధి నుంచి ప్రవహించే శీతల ప్రవాహాం ఏది?
1) లాబ్రడార్ 2) ఓషియావో
3) గల్ఫ్‌స్ట్రీమ్ 4) క్యానరీస్
40.ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ఏది?
1) దక్షిణ చైనా సముద్రం 2) ఇంగ్లీష్ ఛానల్
3) కరేబియన్ సముద్రం 4) పర్షియన్ గల్ఫ్
41. అగ్ని పర్వతాలకు చెందిన ఎర్రమట్టి, సముద్ర జీవరాశులకు చెందిన నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి?
1) ఖండతీరపు అంచు 2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) మహా సముద్రపు అగాధం
42. టస్కరోరా అగాధం ఏ మహా సముద్రంలో ఉంది?
1) పసిఫిక్ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం
43. ఏ సముద్రపు భూతల భాగంలో భూకంపాలు అధికంగా సంభవిస్తాయి?
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) మహా సముద్రపు అగాధం
44. సముద్ర భూతల విస్తీర్ణంలో 'మహా సముద్రపు అగాధాలు' ఎంత శాతం కలిగి ఉంటాయి?
1) 7.5% 2) 2.1% 3) 1.2% 4) 3.1%
45. టెలిగ్రాఫ్ పీఠభూమి ఏ మహా సముద్రంలో భాగంగా ఉంది?
1) ఆర్కిటిక్ 2) అట్లాంటిక్
3) దక్షిణ మహా సముద్రం
4) హిందూ మహా సముద్రం
46. టెలిగ్రాఫ్ పీఠభూమి ఏ మహా సముద్రంలో భాగంగా ఉంది?
1) ఆర్కిటిక్ 2) అట్లాంటిక్
3) దక్షిణ మహా సముద్రం
4) హిందూ మహా సముద్రం
47. ఉత్తర ధవాన్ని ఆవరించి ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్ 2) అట్లాంటిక్
3) హిందూ 4) ఆర్కిటిక్
48. ప్రపంచంలో లోతైన కందకం ఏ సముద్రంలో ఉంది?
1) ఉత్తర అమెరికా సముద్రం 2) పసిఫిక్
3) అరేబియన్ 4) అట్లాంటిక్ సముద్రం
సమాధానాలు
1.3 2.1 3.4 4.3 5.2
6.1 7.3 8.4 9.4 10.4
11.3 12.1 13.2 14.4 15.3
16.4 17.2 18.3 19.4 20.4
21.2 22.3 23.3 24.2 25.1
26.4 26.1 27.3 29.1 30.4
31.3 32.1 33.4 34.3 35.2
36.1 37.3 38.4 39.2 40.3
41.3 42.1 43.4 44.3 45.2
46.2 47.4 48.2
Authorization