ముఖ్యమంత్రి
మన దేశంలో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎవరు నియమిస్తారు? ఆ పదవిలో ఉండే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఆయనకు ఎలాంటి అధికారాలుం టాయి? ఆ రాష్ట్ర పాలనకు సంబంధించి ఆయన పాత్ర ఏమిటి? రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశాలపై అధ్యయన సమాచారం టీఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం...
రాజ్యాంగం 4వ భాగంలో 163, 164,166,167 నిబంధనల్లో ముఖ్యమంత్రి, మంత్రి మండలి గురించి వివరించారు.
- రాష్ట్ర కార్య నిర్వాహక శాఖ అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలిగా పేర్కొనవచ్చు.
- మన దేశంలో ముఖ్యమంత్రి పదవిని 1935 చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు.
- రాజ్యాంగంలో పొందుపరిచిన పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలో గవర్నర్ నామమాత్రపు అధిపతిగాను, ముఖ్యమంత్రి వాస్తవ (నిజమైనా) నిర్వహణాధికారిగాను ఉంటారు. ఈ విధంగా గవర్నర్‌ను రాజ్యాధినేతగా ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేతగా ఉంటారు. కాబట్టి కేంద్రంలో ప్రధాన మంత్రి హోదా వల్లే రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా ఉంటుంది.
- ప్రకరణం 163(1) ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కు విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించడానికి ముఖ్యమంత్రి, మంత్రి మండలి వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- ముఖ్యమంత్రి కావాలంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ రాష్ట్ర విధాన సభలో మెజార్టీపార్టీ నాయకుడై ఉండాలి. లేదా మెజారిటీ కూటమికి చెందిన నాయకుడై ఉండాలి. విధానసభ (అసెంబ్లీ)లో గాని విధాన పరిషత్లోగానీ సభ్యుడై ఉండాలి. ఒకవేళ సభ్యుడు కాని వ్యక్తిని కూడా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. కూటమి, సభలలో సభ్యుడు కాని వ్యక్తికి ఉదాహరణగా ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేని పేర్కొనవచ్చు.
ముఖ్యమంత్రి నియామకం
ముఖ్యమంత్రి ఎంపిక, నియామకం గురించి రాజ్యాంగంలో ఎక్కడా నిర్ధిష్టమైన పద్ధతి సూచించలేదు. ముఖ్యమంత్రి గవర్నర్ చేత నియమించబడతాడని 164వ అధికరణ తెలియజేస్తుంది. అయితే గవర్నర్ ముఖ్యంమంత్రిని నియమించడంలో తన ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును అని కాదు దీని అర్థం. పార్లమెంటరీ సాంప్రదాయాలను అనుసరించి రాష్ట్ర విధానసభలో మెజార్టీ పార్టీ నాయకుడుని ఆయన ముఖ్యమంత్రిగా నియమించాలి. ఇక వేళ ఏ పార్టీకి విధానసభలో సరైన మెజారిటీ రాకపోతే గవర్నర్ తన వ్యక్తిగత విచక్షణను ఉపయోగించి ముఖ్యమంత్రిని ఎంపిక చేసి, నియమించవచ్చును. ఇటువంటి పరిస్థితిలో గవర్నర్ సాధారణంగా అసెంబ్లీని పెద్ద పార్టీ నాయకుడిని (ఉదా : మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్) గానీ లేదా వివిధ పార్టీలతో ఏర్పడిన సంకీర్ణ నాయకుడిని (ఉదా: ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర (సంకీర్ణం)) కానీ ముఖ్యమంత్రిగా నియమించి, అతడిని సభలో నెల రోజులలో విశ్వాస తీర్మానం నెగ్గమని కోరతాడు.
ఉదాహరణకు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి 1 అక్టోబర్ 2019 సాధారణ ఎన్నికలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ (105 సీట్లు సాధించింది) అభ్యర్థి ఫడ్నవీస్‌కు ముందుగా సీఎంగా నియమించి 'బై సీఎం' గా అజిత్ పవార్‌ను నియమించింది. కానీ అజిత్ రాజీనామా చేయడంతో ఫడ్నవీస్ కూడా సభలో బలం లేక ఫ్లోర్ టెస్టుకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.
ఆ తరువాత సంకీర్ణ కూటమిగా శివసేన, ఎన్సీపీ మరియు కాంగ్రెస్ (44) (మహా వికాస్ ఆగాడిగా) హలుడి ప్రభుత్వాన్ని ఏర్పరచాయి. గవర్నర్ భగత్స్ిం కోశ్యారి ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేకు ఇచ్చిన గడువులోపు అనగా 30 నవంబర్ నాడు విశ్వాస పరీక్షలో 169 ఓట్లతో నెగ్గడం జరిగింది.
మహారాష్ట్ర అసెంబ్లీ సీట్లు - 288
భారతీయ జనతా పార్టీ - 105
శివసేన - 56
ఎన్సీపీ - 54
భారత జాతీయ కాంగ్రెస్ - 44
స్వతంత్రులు - 13
ఇతరులు - 16
మహా అవికాస్ ఆగాడి కూటమి మూడు పార్టీల కలయిక. (శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ మరియు భారత జాతీయ కాంగ్రెస్)
పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అకస్మాత్తుగా మరణిస్తే, ఉదా : - (డా|| వై.ఎస్. రాజశేఖరరెడ్డి), అనారోగ్యానికి గురైతే (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత) అతని స్థానంలో తక్షణం అవసరమైన వారసుడు లభ్యంకాని పక్షంలో గవర్నర్ తన విచక్షణను వినియోగించి ఎవరినైనా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. అయితే అధికార పార్టీ సభ్యులు కొత్త నాయకుడిని ఎన్నుకుంటే గవర్నర్ అతడినే ముఖ్యమంత్రిగా నియమించాలి.
ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమించబడక ముందే అతను విధానసభలో మెజారిటీని నిరూపించుకోవాలనే నిబంధన లేదు.
గవర్నర్ మొదటి ముఖ్యమంత్రిని నియమించి, తరువాత అతనిని ఒక నిర్ణీతకాలంలో అసెంబ్లీలో బలం నిరూపించుకోమని కోరాలి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు అనేక సందర్భాలలో దీనిని అనుసరించారు.
శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. కానీ అతను ఆరు నెలల కాలంలో శాసనసభలో సభ్యుడిగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. లేనిఎడల పదవిని కోల్పోవలసి వస్తుంది.
రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర విధాన సభలో లేదా విధాన మండలిలో రెండింటిలో ఏ సభలోనైనా సభ్యుడు కావచ్చు. సాధారణంగా ముఖ్యమంత్రులు దిగువసభ (అసెంబ్లీ)లో సభ్యుడై (విధాన సభ) ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఎగువ సభ (విధాన మండలి)లోని సభ్యుడు కూడా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకారం, పదవీకాలం, జీతభత్యాలు
164(3) ప్రకరణ ప్రకారం ముఖ్యమంత్రి చేత పదవీ ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయిస్తాడు.
- భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం, రహస్య గోపన ప్రమాణం చేస్తాడు.
- ముఖ్యమంత్రికి ఎలాంటి నిర్ధిష్ట కాలపరిమితి లేదు. ముఖ్యమంత్రి గవర్నర్ అభీష్టం (విశ్వాసం) మేరకు అధికారంలో ఉంటారు. అయితే గవర్నర్ ముఖ్యమంత్రిని తన ఇష్టం వచ్చినపుడు తొలగిస్తాడని భావించరాదు. విధానసభలో అతడికి మెజారిటీ ఉన్నంత కాలం గవర్నర్ ముఖ్యమంత్రిని తొలగించలేడు. కానీ అతడు అసెంబ్లీలో మెజారిటీ కోల్పోతే రాజీనామా చేయాలి. లేనియెడల గవర్నర్ ముఖ్యమంత్రిని తొలగించవచ్చును.
- నిబంధన 164(5) ప్రకారం ముఖ్యమంత్రి జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది.
- భారత రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్ ప్రకారం ముఖ్య మంత్రి జీతభత్యాలను పొందుతాడు.
- ముఖ్యమంత్రి వేతనాన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
- ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి వేతనం రూ.4,10, 000. వేతనంతో పాటు, ఉచిత నివాసం, ప్రయాణ ఖర్చులు, వైద్య సౌకర్యం మొదలైనవి కూడా లభిస్తాయి.
- ముఖ్యమంత్రి రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పిస్తాడు.
ముఖ్యమంత్రి విధులు
- రాష్ట్ర మంత్రి మండలిని ఏర్పాటు చేయడం అనేది ముఖ్యమంత్రి స్వతంత్ర అధికారం, బాధ్యత.
- తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలో కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని మంత్రులుగా నియమించమని గవర్నర్‌కి సలహా ఇస్తారు.
- రాష్ట్ర విధాన సభను రద్దు చేయమని ఆయన గవర్నర్‌కు సిఫార్సు చేయవచ్చును.
- ముఖ్యమంత్రి మంత్రి మండలికి అధ్యక్షుడు. మంత్రి మండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
- గవర్నర్‌కు మంత్రి మండలికి మధ్య ముఖ్యమంత్రి ప్రధాన వారధి.
- గవర్నర్‌కు ముఖ్య సలహాదారుడు.
- రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు.
- రాష్ట్ర ప్రజలకు అభిమాన నాయకుడిగా ముఖ్యమంత్రి కీర్తింపబడతారు.
- రాష్ట్ర ప్రణాళిక మండలికి హోదా రీత్యా అధ్యక్షుడిగా ఉంటారు.
- రాష్ట్రంలో జరిగే అన్ని ముఖ్య నియామకాలు ముఖ్యమంత్రి పేరుమీదనే జరుగుతాయి.
- ప్రభుత్వానికి మార్గనిర్దేశకత్వం చేస్తారు.
- రోటేషన్ ప్రాతిపదికన జోనల్ కౌన్సిల్‌కి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు.
- అంతరాష్ట్ర మండలిలో సభ్యుడిగా తన విధులను నిర్వహిస్తారు.
- జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యుడిగా తన విధులను నిర్వహిస్తారు.
- రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రిది కీలకపాత్ర.
- వివిధ శాఖల అధికారుల సహాయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తారు.
- మంత్రి మండలి విధానాలను ప్రభావితం చేస్తారు.
- సభలో చర్చల సమయంలో ప్రతిష్టంభన ఏర్పడినపుడు ముఖ్యమంత్రి కల్పించుకోని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. తద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తుంది.
- విధానసభ కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి స్పీకర్‌కు సహకరిస్తారు.
- ముఖ్యమంత్రి, మంత్రి మండలి తాము చేసే పనులకు సమిష్టిగా విధానసభకు బాధ్యత వహిస్తుంది.
- రాష్ట్ర శాసనసభను సమావేశ పరచమని, వాయిదా వేయమని గవర్నర్‌ను కోరవచ్చు, సలహా ఇవ్వవచ్చు..
ఇండియాలో అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్య మంత్రులు :
1. హరీశ్‌రావత్ (ఉత్తరాఖండ్) 2 రోజులు (2016 ఏప్రిల్ 21, 22)
2. అర్జున్‌సింగ్ (మధ్యప్రదేశ్) 2 రోజులు (1985 మార్చి 11, 12)
మూడు రోజుల సీఎంగా ముగ్గురు
3. జగదంబికాపాల్ ((ఉత్తర ప్రదేశ్) 3 రోజులు) (1998 ఫిబ్రవరి 21 - 23)
4. యడియూరప్ప (కర్ణాటక) 3 రోజులు (2018 మే 17-19) (2వ దఫా సీఎంగా)
5. దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర) 3 రోజులు (2019 నవంబర్ 23 - 26) (2వ దఫా సీఎంగా)
6. సతీష్ ప్రసాద్ సింగ్ (బీహార్) 5 రోజులు (1968 జనవరి 28 - ఫిబ్రవరి 1)
7. ఓం ప్రకాష్ చౌతాలా (హర్యానా) 6 రోజులు (1990 జులై 12 - 17) (2వ దఫా సీఎంగా)
8. నీలిస్ కుమార్ (బీహార్) 8 రోజులు (2000 మార్చి 3 - 10)
9. బి.ఎస్.యడియూరప్ప (కర్ణాటక) 8 రోజులు (2007 నవంబర్ 12 - 19) (తొలి దఫాలో)
10. ఎస్.సి. మారక్ (మేఘాలయ) 12 రోజులు (1998 ఫిబ్రవరి 27 - మార్చి 10)
11. ఓంప్రకాశ్ చౌతాలా (హర్యానా) 17 రోజులు (1991 మార్చి 21 - ఏప్రిల్ 6) (మూడో దఫా సీఎంగా)
12. జానకి రామచంద్రన్ (తమిళనాడు) 24 రోజులు (1998 జనవరి 7 - 30)
13. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బీహార్) 31 రోజులు (1968 ఫిబ్రవరి 1 - మార్చి 2)
14. నాదెండ్ల భాస్కర్‌రావు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) 32 రోజులు (1984 ఆగస్టు 16 - సెప్టెంబర్ 16)
15. సీహెచ్. మహ్మద్ కోయా (కేరళ) 50 రోజులు (1979 అక్టోబర్ 12 - డిసెంబర్ 1)
16. మహారాష్ట్రలో పీ.కె.సావంత్ 1963 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు 10 రోజుల పాటు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అత్యధిక కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులు
1. పవన్‌కుమార్ ఛామ్లింగ్ (సిక్కిం) 6సార్లు (1994 డిసెంబర్ 12 - 2019 మే 21) 8932 రోజులు.
( భారత దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న జ్యోతిబసు రికార్డును అధిగమించారు.)
2. జ్యోతిబసు (పశ్చిమబెంగాల్) 5 సార్లు (21జూన్ 1977 - 6 నవంబర్ 2000) 8540 రోజులు
3. గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్ ప్రదేశ్) 5 సార్లు (1980, 1984, 1990, 1995, 2004) 8286 రోజులు
4. లాల్ తన్హావాలా (మిజోరం) 5సార్లు (1984, 1989, 1993, 2008, 2013) 8080 రోజులు
5. వీరభద్రసింగ్ (హిమాచల్ ప్రదేశ్) 5 సార్లు (1983, 1985, 1993, 2003, 2012) 7685 రోజులు
6. ప్రకాశ్‌సింగ్ బాదల్ (పంజాబ్) 5 సార్లు (1970, 1977, 1997, 2007, 2012) 6924 రోజులు.
7. కరుణానిధి (తమిళనాడు) 5 సార్లు (1969, 1971, 1989 1996, 2006) 6863 రోజులు
8. జయలలిత (తమిళనాడు) 6 సార్లు (1991, 2001, 2002, 2011, 2015, 2016) 5239 రోజులు
9. మానిక్ సర్కార్ (త్రిపురా) 4 సార్లు (1998 - 2018) 7303 రోజులు
10. నవీన్ పట్నాయక్ (ఒరిస్సా) 4 సార్లు (2000, 04, 09, 14) 6666 రోజులు
11. నరేంద్ర మోడీ (గుజరాత్) 4 సార్లు (2001, 2002, 2007, 2012) 4610 రోజులు
భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు
1. సుజాత కృపలాని (ఉత్తరప్రదేశ్) కాంగ్రెస్ పార్టీ (మొదటి మహిళా సీఎం) కాంగ్రెస్ పార్టీ (1258 రోజులు)
2. నందిని శతపతి (ఒడిశా) కాంగ్రెస్ పార్టీ (1278 రోజులు)
3. శశికళా కదోత్కర్ (గోవా) మహారాష్ట్ర వాదిగోమంతక్ (2084 రోజులు)
4. సైదా అన్వరా తైమూర్ (అసోం) కాంగ్రెస్ (206 రోజులు) (మొదటి ముస్లిం మహిళా సీఎం)
5. జానకి రామచంద్రన్ (తమిళనాడు) ఎ.ఐ.ఎ.డి.ఎం.కె (24 రోజులు)
6. జయలలిత (తమిళనాడు) ఎ.ఐ.ఎ.డి.ఎం.కె (5239 రోజులు)
7. మాయావతి (ఉత్తరప్రదేశ్) బహుజన సమాజ్‌పార్టీ (2562 రోజులు)
8. రాజీందర్ కార్భట్టాల్ (పంజాబ్) కాంగ్రెస్ (388 రోజలు)
9. రబ్రీదేవి (బీహార్) రాష్ట్రీయ జనతాదళ్ (2746 రోజులు)
10. సుష్మాస్వరాజ్ (ఢిల్లీ) భారతీయ జనతా పార్టీ (52 రోజులు)
11. షీలాదీక్షిత్ (ఢిల్లీ) కాంగ్రెస్ (అత్యధిక కాలం మహిళా సీఎం) (5504 రోజులు)
12. ఉమాభారతి (మధ్యప్రదేశ్) బీజేపీ (259 రోజులు)
13. వసుంధరా రాజె సింథియా (రాజస్తాన్) బీజేపీ (3660 రోజులు)
14. మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్) తృణమూల్ కాంగ్రెస్ (3,120 రోజులు)
15. ఆనందిబెన్ పటేల్ (గుజరాత్) బీజేపీ (808రోజులు)
16. మెహబూబాముఫ్తి (జమ్మూకాశ్మీర్) పీడీపీ (804 రోజులు ) (రెండవ ముస్లిం మహిళా సీఎం)
అదనపు సమాచారం :
- ముఖ్యమంత్రి అయిన తొలి సినీ నటుడు - ఎం.జీ.రామ చంద్రన్
- మొదటి దళిత ముఖ్యమంత్రి - దామోదర సంజీవయ్య
- మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి - మాయావతి
- పదవిలో ఉండగా మరణించిన తొలి సీఎం - గోపీనాథ్ బోర్డోలారు (అస్సాం)
- అతిపిన్న వయస్సులో సీఎం అయిన వ్యక్తి - ప్రపుల్లకుమార్ మహంతి (అసోం)
- ఈ మధ్యనే ముఫ్తీ మహ్మద్సయ్యద్ (జయ్ము - కాశ్మీర్) జయలలిత (తమిళనాడు) పదవిలో ఉండగా మరణించారు.
(ఇప్పటి వరకు భారతదేశంలో 17 మంది సీఎంలు పదవిలో ఉండగా మరణించారు)
- దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వారు - పవన్ కుమార్ చామ్లింగ్
- అత్యధి కాలం సీఎంగా పనిచేసిన మహిళ - షీలాదీక్షిత్
- దేశంలో అతి తక్కువ కాలం సీఎంగా పనిచేసిన వారు - హరీష్‌రావత్, అర్జున్‌సింగ్, జగదంబికపాల్
- అతి తక్కువ కాలం సీఎంగా పనిచేసిన మహిళ - జానకి రామచంద్రన్
రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారు
1. టంగుటూరి ప్రకాశం పంతులు (మద్రాస్, ఆంధ్ర ప్రదేశ్)
2. నారాయణదత్ తివారి (ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్)
- మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మహిళలు
1. జయలలిత 2. మాయావతి 3.షీలాదీక్షిత్
- ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ముఖ్యమంత్రులు గా పనిచేసిన రాష్ట్రం - జమ్మూకాశ్మీర్
1.షేక్ అబ్దుల్లా 2. ఫరూక్ అబ్దుల్లా
3. ఓమర్ అబ్దుల్లా
ా తండ్రికొడుకులు సీఎం, డిప్యూటీ సీఎంగా నియమిం చబడిన రాష్ట్రాలు
1. కరుణానిధి (సీఎం), స్టాలిన్ (డిప్యూటీ సీఎం) (తమిళనాడు)
2. ప్రకాశ్‌సింగ్ బాదల్ (సీఎం), సుఖ్బిర్ సింగ్ (డిప్యూటీ సీఎం) (పంజాబ్)
- భారత్‌లో ప్రస్తుతం ఎంఎల్సీ సభ్యత్వంతో సీఎం పదవిలో ఉన్నావారు - అభిలేష్ యాదవ్ (ఉత్తరప్రదేశ్)
- ప్రస్తుతం భారత్‌లో ఎంఎల్ఏ, ఎంఎల్సీ కాకుండా ముఖ్య మంత్రి పదవిలో ఉన్న వారు - ఉద్దవ్‌ఠాక్రే (మహారాష్ట్ర)
- ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని స్వీకరించిన వారు - నీలం సంజీవరెడ్డి
- ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానులు అయిన వారు - ఆరుగురు
1. మొరార్జీదేశాయ్ 2. చౌదరి చరణ్‌సింగ్
3. వీపీ సింగ్ 4. పీవీ నర్సింహారావు
5. దేవెగౌడ 6. నరేంద్రమోడీ
- ప్రస్తుతం భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలు ఎన్ని ? - 1 (పశ్చిమ బెంగాల్)
బిట్స్
1. ఈ కింది వివరణలను పరిశీలించండి.
రాష్ట్ర మంత్రి మండలికి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి :
1. శాఖల పంపిణీలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు.
2. మంత్రుల శాఖలను మార్చగలడు మరియు ఏ మంత్రినైనా రాజీనామా చేయమని కోరగలడు.
3. మంత్రుల సలహాలకు బద్దుడై ఉంటాడు.
4. పరిపాలనలో మంత్రులకు సలహాలిస్తాడు.
పై వివరణలో ఏవి సరైనవి.
1. 1, 2 2. 2, 3 3. 1, 2, 4 4. 3, 4
2. భారత రాజ్యాంగం ప్రకారం ఈ కింది వానిలో ఏది సరైనది?
1) మంత్రుల మధ్య శాఖల కేటాయింపును ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు.
2) ఎప్పుడైతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడో, మంత్రి మండలి రద్దు అయిపోతుంది.
3) ప్రభుత్వం విధాన ప్రకటనలను ముఖ్యమంత్రి చేస్తాడు.
4) రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి మంత్రి మండలి తీసుకొన్న నిర్ణయాలను గవర్నర్‌కు తెలియ జేయుట ముఖ్యమంత్రి విధి.
3. ఈ కింది వాటిలో సరికానిది ఏది?
1) ముఖ్యమంత్రి గవర్నర్ చేత నియమించబడతాడు
2) గవర్నర్ ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులకు శాఖలు కేటాయిస్తాడు.
3) ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలను కుంటే ఆ లేఖను స్వీకర్‌కు అందివ్వాలి.
4) ముఖ్యమంత్రి చేత ప్రమాణం చేయించేది గవర్నర్.
4. ప్రతిపాదన (ఎ) : ఒకరాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర మంత్రి మండలి అధినేత
హేతువు (ఆర్) : ముఖ్యమంత్రి శాసనసభకు బాధ్యత వహిస్తాడు. సభలో మెజారిటీ మద్దతును అనుభవిస్తాడు.
కోడ్లు
1) ఎ, ఆర్ రెండూ విడివిడిగా సరైనవి. ఆర్, ఏకు సరైన వివరణ.
2) ఎ, ఆర్ రెండూ విడివిడిగా సరైనవి. ఆర్, ఏకు సరైన వివరణ కాదు.
3) ఎ సరైనది కాని ఆర్ తప్పు
4) ఎ తప్పు కాని ఆర్ సరైనది
5. ఈ కింది వారిలో భారతదేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?
1) మాయావతి
2) దామోదరం సంజీవయ్య
3) మమతా బెనర్జీ
4) టంగుటూరి ప్రకాశం పంతులు
6. ఇండియాలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
1) జానకీ రామచంద్రన్ 2) షీలాదీక్షిత్
3) సుచేత కృపలానీ
4) నందిని శతపథి
7. ఈ కింది అధికారాలు / విధులు పరిశీలించండి?
ఎ. మంత్రులను నియమించటం, వారికి శాఖలు కేటాయించడం
బి. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించడం
సి. మంత్రుల మధ్య బేదాభిప్రాయాలను తొలగించడం
డి. గవర్నర్‌కు సమాచారం అందించడం
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారాలు / విధులతో కూడినది
1) 2, 3, 4 2) 1, 4
3) 1, 2, 3 4) పైవన్నీ
8. రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి ఆధిక్యం రాకపోతే, రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ప్రధా నంగా పరిగణలోకి తీసుకునే అంశం?
1) సభలో స్థిరమైన మెజారిటీని నిరూపించుకునేందుకు ఆ వ్యక్తికి గల సామర్థ్యం
2) శాసనసభలో అతి పెద్ద రాజకీయ పార్టీ
3) ఒక యూనిట్‌గా ఏర్పడిన చాలా రాజకీయ పార్టీల కలయిక
4) పార్టీ సభ్యుల విధేయత, మద్దతు
9. రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాన్ని నిర్ణయించేది?
1) పార్లమెంటు 2) విధానసభ
3) గవర్నర్ 4) మంత్రులు
10. ప్రతిపాదన(ఎ): మంత్రుల నియామకం, తొలగింపు విషయంలో ముఖ్యమంత్రి మాటే అంతిమం
హేతువు(ఆర్): మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు.
కోడ్లు :
1) ఎ, ఆర్ రెండూ విడివిడిగా సరైనవి. ఆర్, ఏకు సరైన వివరణ.
2) ఎ, ఆర్ రెండూ విడివిడిగా సరైనవి. ఆర్, ఏకు సరైన వివరణ కాదు.
3) ఎ సరైనది కాని ఆర్ తప్పు
4) ఎ తప్పు కాని ఆర్ సరైనది
11. రాష్ట్రాలు వాటి ముఖ్యమంత్రులకు సంబంధించి జత పరచండి?
ఎ. ఉద్ధవ్‌ఠాక్రే 1. మిజోరం
బి. జోరంతంగా 2. కర్ణాటక
సి. బిప్లాబ్ కుమార్ దేబ్ 3. మహారాష్ట్ర
డ. యడియూరప్ప 4. త్రిపుర
ఎ బి సి డి
1) బి ఎ డి సి
2) ఎ సి బి డి
3) సి ఎ డి బి
4) డి బి సి ఎ
12. ఈ కింది వానిలో ముఖ్యమంత్రి సభ్యత్వం కలిగి ఉండే సంస్థ పని?
ఎ. ఎన్డీసీ
బి. అంతరాష్ట్ర మండలి
సి. జోనల్ మండలి
1) ఎ, బి 2) బి, సి
3) పైవన్నీ 4) సి మాత్రమే
సమాధానాలు
1.ఎ 2.డి 3.సి 4.ఎ 5.బి 6.సి 7.ఎ 8.ఎ 9.బి 10.ఎ 11.సి 12. సి