1. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1980 బి) 1985
సి) 1992 డి) 1993
2. జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షులుగా ఈ కింది వారిలో ఎవరు అర్హులు?
ఎ) పదవీ విరమణ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే
బి) పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే
సి) హైకోర్టులో పనిచేస్తున్న ఏ న్యాయమూర్తి అయినా సరే.
డి) సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి
3. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడిని (చైర్మన్) ఎవరు తొలగిస్తారు?
ఎ) రాష్ట్ర గవర్నర్
బి) భారత రాష్ట్రపతి
సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
డి) ముఖ్యమంత్రి
4. ఈ కింది వారిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ ఎవరు?
ఎ) ఎం.ఎన్.వెంకటాచలయ్య బి) జె.ఎస్. వర్మ
సి) రంగనాథ్ మిశ్రా డి) ఎ.ఎస్.ఆనంద్
5. జాతీయ మానవ హక్కుల కమిషన్కు చైర్మన్తో పాటు ఎంది మంది సభ్యులు ఉంటారు?
ఎ) ఇద్దరు బి) నలుగురు
సి) ఐదుగురు డి) ముగ్గురు
6. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
ఎ) గవర్నర్ బి) రాష్ట్ర ప్రభుత్వం
సి) ముఖ్యమంత్రి డి) ఏదీకాదు
7. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక బహుళ సభ్య సంస్థ
2) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు.
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) ఏవీకాదు
8. జాతీయ మానవ హక్కుల కమిషన్లో పదవీ రీత్యా సభ్యులు ఎంత మంది?
1) జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్
2) జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్
3) జాతీయ మహిళా కమిషన్ చైర్మన్
4) జాతీయ మైనార్టీ కులాల కమిషన్ చైర్మన్
కింది వాటిలో సరైన సమాధానాన్ని సూచించండి.
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 3, 4 డి) పైవన్నీ సరైనవే
9. ఈ కింది వాటిలో దేని ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది?
ఎ) పార్లమెంటు తీర్మానం
బి) పార్లమెంటు చట్టం
సి) కేంద్ర కేబినెట్ ఆదేశం
డి) సుప్రీంకోర్టు ఆదేశం
10. 20 డిసెంబర్ 2019న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఎస్. ఆనందరావు బి) మహ్మద్ ఇర్షాన్
సి) సి.రాములు డి) గుండా చంద్రయ్య
11. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమి తులు కావడానికి కింది వారిలో ఎవరు అర్హులు?
ఎ) విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
బి) ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సి) ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి
డి) విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
12. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల నియామకానికి సిఫార్సు చేసే కమిటీ వీరితో కూడుకొని ఉంటుంది?
1. ప్రధాన మంత్రి
2. కేంద్ర గృహ మంత్రి
3. లోక్సభ స్పీకర్
4. లోక్సభ మరియు రాజ్యసభలలో ప్రతిపక్ష నాయకులు
5. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
ఎ) 2 మరియు 4 బి) 1 మరియు 3
సి) 1,3 మరియు 4 డి) పైవన్నీ సరైనవే
13. ఎన్హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ బి) చెన్నై
సి) లక్నో డి) బెంగళూరు
సమాధానాలు
1.డి 2.బి 3.బి 4.సి 5.బి
6.బి 7.ఎ 8.డి 9.బి 10.డి
11.డి 12.డి 13.ఎ
Authorization