1. కింది వాటిని జత చేయండి?
1) పరిహేళి పి) జూలై 4
2) అపహేళి క్యూ) జనవరి 3
3) శరత్కాల విషవత్తు ఆర్) సెప్టెంబర్ 23
4) వసంతకాల విషవత్తు ఎస్) మార్చి 21
ఎ) 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
బి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
సి) 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
డి) 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
2. వివిధ దేశాలలో నావిగేషన్ సిస్టమ్‌లను ఏ పేరుతో పిలుస్తారు?
దేశం నావిగేషన్ సిస్టమ్
1) రష్యా పి) గ్లోనాస్
2) అమెరికా క్యూ) జీపిఎస్
3) చైనా ఆర్) బీడు
4) ఐరోపా ఆర్) గెలీలియో
ఎ) 1-ఎస్, 2-పి, 3-క్యూ 4-ఆర్
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
సి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
డి) 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
3. 'ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్' కు గల పేరు?
ఎ) నావిక్ బి) గగన్
సి) థృవ డి) పూర్ణిమ
4. కరువు విపత్తును ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
ఎ) గృహ మంత్రిత్వ శాఖ
బి) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సి) ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ
డి) పర్యావరణ, అటవీశాఖ
5. మన దేశంలో మొదటిసారి వ్యర్థ పదార్థాలతో నిర్మించిన రాక్ గార్డెన్ ఏ రాష్ట్రంలో కలదు?
ఎ) గోవా బి) ఛత్తీస్‌గఢ్
సి) సిక్కిం డి) ఛండీగఢ్
6. గ్రాండ్ క్యానస్ అమెరికాలోని ఏ రాష్ట్రంలో కలదు?
ఎ) ఫ్లోరిడా బి) కాలిఫోర్నియా
సి) కొలరాడో డి) చికాగో
7. ఇండియాలో దుమ్ముతుఫానులు ఏ నెలలో ఎక్కువుగా వస్తాయి?
ఎ) జనవరి బి) ఆగస్ట్
సి) నవంబర్ డి) మే
8. జెట్ విమానాలు ఎగిరే ఆవరణం?
ఎ) స్ట్రాటో బి) ట్రోపో
సి) మెసో డి) థర్మో
9. అల్ట్రా వైలట్ రేస్ (అతినీలలోహిత కిరణాలు)ను అడ్డుకునే వాతావరణ పొర?
ఎ) ట్రోపో బి) స్ట్రాటో
సి) మెసో డి) ఐనో
10. ఇండియాలో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు?
ఎ) చోలాము(సిక్కిం)
బి) లోక్తక్(మణిపూర్)
సి) థాల్ (కాశ్మీర్)
డి) సాంబార్(రాజస్థాన్)
11. జూన్ 21న సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడే రేఖ?
ఎ) కర్కాటక రేఖ బి) మకర రేఖ
సి) భూమధ్య రేఖ
డి) అంటార్కిటికా వలయం
12. ఎక్కువ దేశాలు గల ఖండం?
ఎ) ఆసియా బి) ఆఫ్రికా
సి) దక్షిణాఫ్రికా డి) ఆస్ట్రేలియా
13. అతి తక్కువ జనాభా గల రెండో రాష్ట్రం?
ఎ) మణిపూర్ బి) మిజోరాం
సి) మేఘాలయ డి) గోవా
14. ఒకపోటుకు, మరోక పాటుకు మధ్యగల కాలవ్యవధి?
ఎ) 6గం.13 ని. బి) 7 గం. 15 ని.
సి) 5గం. 10 ని. డి) 4 గం. 26 ని.
15. ఈ రోజు ఉదయం 7 గంటలకు సంభవించిన పోటు మరుసటి రోజు ఉదయం ఎన్ని గంటలకు సంభవించును?
ఎ) 7 గం. 52 ని. బి) 8 గం. 30 ని.
సి) 9 గం. 10 ని. డి) 7 గం. 15 ని.
16. ఉష్ణోగ్రతను గ్రహించటంలో భూమి-జల భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన విషయాలను గుర్తించండి?
1) భూమి త్వరగా వేడెక్కి - త్వరగా చల్లబడును
2) భూమి త్వరగా వేడిక్కి - ఆలస్యంగా చల్లబడును
3) నీరు నెమ్మదిగా(ఆలస్యంగా) వేడెక్కి, నెమ్మదిగా చల్లబడుతుంది.
4) నీరు నెమ్మదిగా వేడెక్కి, త్వరగా చల్లబడుతుంది.
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 4
17. కింది వాటిలో శీతల పవనం కానిది?
ఎ) మిస్ట్రల్ బి) బ్లిజార్డ్స్
సి) బోరా డి) సిరాకో
18. వాతావరణంలోని ఉష్ణోగ్రత సున్నా సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువగా వున్నప్పుడు నీటి ఆవిరి చెట్లు, శిలలు, గడ్డిపరకలపై మంచు బిందువులుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
ఎ) శ్వేత తుహినం బి) మిస్ట్
సి) స్మోగ్ డి) తుషారం
19. సిలోన్‌ను ప్రస్తుతం ఏమని పిలుస్తారు?
ఎ) తైవాన్ బి) మలేషియా
సి) శ్రీలంక డి) జాంబియా
20. సింథ్రీ ఏ పరిశ్రమకు సంబంధించింది.
ఎ) సిమెంట్ బి) బొగ్గు
సి) ఎరువులు డి) ఔషద
21. భూటాన్‌తో ఎక్కువ సరిహద్దును కలిగిన రాష్ట్రం?
ఎ) అసోం బి) సిక్కిం
సి) అరుణాచల్ ప్రదేశ్ డి) పశ్చిమ బెంగాల్
22. ముర్రే డార్లింగ్ నదులు ఏ ఖండంలో కలవు?
ఎ) ఆఫ్రికా బి) ఆసియా
సి) ఆస్ట్రేలియా డి) దక్షిణ అమెరికా
23. కిందివాటిలో సరికానిది పేర్కొనండి?
1) ఏప్రిల్ - తేనెటీగల పెంపకం
2) పిసికల్చర్ - చేపల పంపకం
3) హార్టికల్చర్ - పూలు పండ్లు తోటల పెంపకం
4) సెరికల్చర్ - పట్టు పరుగుల పెంపకం
ఎ) 1 బి) 2, 3 సి) 4 డి) పైవన్నీ సరైనవే
24. భూమిపై ప్రవహించే శిలాద్రవాన్ని ఏమంటారు?
ఎ) మాగ్మొ బి) లావా
సి) స్కోరియా డి) డైక్
25. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ బి) ముంబయి
సి) పనాజీ డి) దిస్పూర్
26. వివిధ నగరాలకు గల పేర్లను జత చేయండి?
పేరు నగరం
1) పింక్ సిటీ పి) జైపూర్
2) సన్‌సిటీ క్యూ) జోథ్‌పూర్
3) ఆరంజ్‌సిటీ ఆర్) నాగ్‌పూర్
4) గోల్డెన్ సిటీ ఎస్) అమృతసర్
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్ 4-ఎస్
బి) 1-ఆర్, 2-ఎస్, 3-పి 4-క్యూ
సి) 1-ఎస్, 2-పి, 3-క్యూ 4-ఆర్
డి) 1-పి, 2-ఎస్, 3-క్యూ 4-ఆర్
27. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా.
ఎ) గోవా బి) కేరళ
సి) కాశ్మీర్ డి) మేఘాలయ
28. కింది వాటిలో రేఖాంశాలకు సంబంధించని పేరు?
ఎ) మధ్యాహ్న రేఖలు బి) అర్థవృత్తాలు
సి) మెరిడియన్లు డి) పూర్ణ వృత్తాలు
29. నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ.
ఎ) యురాల్ బి) అపలేచియన్
సి) ఆరావళి డి) హిమాలయాలు
30. రేడియో తరంగాలను పరావర్తనం చెందించి రేడియో ప్రసారాలకు వీలు కల్పిస్తున్న వాతావరణ పొర?
ఎ) ఎక్సో ఆవరణం బి) ఐనో ఆవరణం
సి) మెసో ఆవరణం డి) స్ట్రాటో ఆవరణం
31. కులు, కాంగ్రా లోయలు ఏ రాష్ట్రానికి సంబంధించింది?
ఎ) కాశ్మీర్ బి) ఉత్తరాఖండ్
సి) హిమాచల్ ప్రదేశ్ డి) పంజాబ్
32. సముద్రాలకు సంబంధించి కింది ప్రమాణాలలో సరికానిది?
1) లోతు - పాథమ్స్
2) దూరం - నాటికల్ మైల్స్
3) వేగం - నాట్
ఎ) 1 బి) 2 సి) 3 డి) అన్నీ సరైనవే
33) రాష్ట్రాలను వాటి తీరాలతో జత చేయండి?
రాష్ట్రం తీరం పేరు
1) ఒరిస్సా పి) ఉత్కళ, కళింగ
2) కర్ణాటక క్యూ) కెనరా
3) మహారాష్ట్ర ఆర్) కొంకణ్
4) తమిళనాడు ఎస్) కోరమండల్
5) కేరళ టి) మలబార్
ఎ) 1-ఎస్, 2-క్యూ, 3-పి 4-ఆర్, 5-టి
బి) 1-ఆర్, 2-పి, 3-క్యూ 4-ఎస్, 5-టి
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్ 4-ఎస్, 5-టి
డి) 1-క్యూ, 2-ఎస్, 3-పి 4-ఆర్, 5-టి
34. మనదేశంలో భూకంప తీవ్రత ఎక్కువ గల ప్రాంతం?
ఎ) హిమాలయ పర్వతాలు బి) పశ్చిమ కనుమలు
సి) తూర్పు కనుమలు డి) మధ్య భారతం
35. పెనిప్లేన్స్ అనగా?
ఎ) క్రమక్షయ మైదానాలు
బి) తీర మైదానాలు
సి) వరద మైదానాలు
డి) డెల్టా మైదానాలు
36. అగ్ని పర్వతం విస్పోటనం చెందినప్పుడు ఏర్పడే చిన్న చిన్న రాతి ముక్కలను ఏమంటారు?
ఎ) స్కోరియా బి) ప్యూమైస్
సి) లాపిలి డి) డైక్
37. అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపం కానిది గుర్తించండి?
1) డైక్ 2) సిల్
3) లాకోలిత్ డి) బాతోలిత్
ఎ) 1 బి) 2, 3 సి) 3, 4 డి) ఏదీకాదు
(ఇవన్నీ అంతర్గత భూస్వరూపాలు)
38. నైరుతి రుతుపవనాలు ఏయేశాఖలుగా విడిపోతాయి?
1) అరేబియా శాఖ
2) బంగాళాఖాత శాఖ
3) హిందూ మహాసముద్ర శాఖ
4) తూర్పు తీర శాఖ
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 2, 3 డి) పైవేవీకావు
39. కింది వాటిని జత చేయండి?
1) డీజిల్ కాంపొనెంట్ వర్క్స్ పి) పాటియాలా
2) రైల్ కోచ్ ఫ్యాక్టరీ క్యూ) కపుర్తలా
3) ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్) పెరంబూర్
4) వీల్ అండ్ ఏక్సిల్ ప్లాట్ ఎస్) ఎల్హంక
ఎ) 1-క్యూ, 2-ఎస్, 3-పి, 4-ఆర్
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
సి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
డి) 1-ఎస్, 2-ఆర్, 3-పి, 4-క్యూ
40. కిందివాటిని జత చేయండి?
షిప్‌యార్డ్ ప్రదేశం
1) గార్డెన్ రీచ్ పి) విశాఖపట్నం
2) హిందుస్థాన్ క్యూ) కోల్‌కతా
3) ఐఎన్ఎస్ కదంబ ఆర్) ముంబాయి
4) మజ్గావ్ డాక్ ఎస్) కార్వార్ (కర్ణాటక)
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
బి) 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
సి) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
డి) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
41. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే
ఎ) మార్చ్ 2 బి) మార్చ్ 3
సి) మార్చ్ 4 డి) మార్చ్ 5
42. మనదేశంలో తక్కువ పగలు ఉండే రోజు
ఎ) మార్చ్ 21 బి) సెప్టెంబర్ 23
సి) డిసెంబర్ 22 డి) జూన్ 2
43. రోదసి గ్రహాల అధ్యయనం?
ఎ) ఆస్ట్రాలజీ బి) ఫిజిక్స్
సి) పామిస్ట్రీ డి) ఆస్ట్రానమి
44. క్వీన్ ఆఫ్ మౌంటెన్స్?
ఎ) ముస్సోరి బి) డార్జిలింగ్
సి) కులు డి) ఊటీ
45. సూర్యశక్తి ఆధారం?
ఎ) కేంద్రక విచ్చిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) రేడియో థార్మికత
డి) పైవేవీకాదు
సమాధానాలు
1.బి 2.బి 3.ఎ 4.బి 5.డి
6.సి 7.డి 8.ఎ 9.బి 10.ఎ
11.ఎ 12.బి 13.బి 14.ఎ 15.ఎ
16.సి 17.డి 18.ఎ 19.సి 20.సి
21.ఎ 22.సి 23.డి 24.బి 25.సి
26.ఎ 27.సి 28.డి 29.డి 30.బి
31.సి 32.డి 33.సి 34.ఎ 35.ఎ
36.సి 37.డి 38.ఎ 39.బి 40.సి
41.బి 42.సి 43.డి 44.ఎ 45.బి
Authorization