గూగుల్ ఫొటోస్ యాప్ పెద్దగా పరిచయం చేయనవసరంలేనిది. ఇందులో ఫొటోలు షేర్ చేసి, సేవ్ చేసుకుంటూ ఉంటాం. అవసరమైన వాటిని సందర్భాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ మధ్య ఇందులోనూ టెక్నికల్ ఇష్యూ బయట పడింది. అది.. ఈ యాప్ వాడే వారికి సంబంధించిన వీడియోలు వేరే వారి గ్యాలరీల్లోకి వెళ్లాయి. ఈ విషయాన్ని గూగులే స్వయంగా వెల్లడించింది. గూగుల్ అందించే డౌన్లోడ్ యువర్ డేటా అనే టేక్ అవుట్ సర్వీస్ సమస్యలను ఎదుర్కొంది. ఈ సర్వీసుల ద్వారా డేటా ఎక్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నించిన వారికి ఈ సమస్య ఎదురైనట్లు గూగుల్ పేర్కొంది. ఈ సంఘటనను ఎదుర్కొన్న వినియోగదారులకు సమస్యను వివరించడానికి సంస్థకు రెండు నెలలు పట్టింది. నవంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఐదు రోజుల పాటు గూగుల్ ఫొటోస్ను ఎక్స్పోర్ట్ సర్వీస్ ద్వారా ఫొటోలు డౌన్లోడ్ చేసిన వారికి మాత్రమే ఈ సమస్య ఎదురైందని, మిగిలిన వారికి ఈ సమస్య ఎదురుకాలేదని గూగుల్ పేర్కొంది. ఈ సమయంలో గూగుల్ ఫోటోస్‌లోని కొన్ని వీడియోలు సంబంధం లేని వారి ఆర్కైవ్లకు తప్పుగా ఎక్స్పోర్ట్ అయ్యాయి. సరిగ్గా ఎన్ని వీడియోలు దీని కారణంగా ప్రభావితం అయ్యాయనే అంశంపై ఇది స్పష్టత ఇవ్వలేదు. అంటే ఈ వ్యవధిలో డౌన్లోడ్ చేసిన డేటా సరిగ్గా లేకపోవచ్చు లేదా వేరే వారి వీడియోలు వచ్చి చేరి ఉండవచ్చని తెలియజేసింది. దీని కారణంగా ప్రభావితమైన వినియోగదారులు ప్రస్తుతం ఉన్న కంటెంట్‌ను డిలీట్ చేసే ముందు ఒక్కసారి ఎక్స్పోర్ట్ చేయాల్సిందిగా కోరింది. ఈ సమస్యను గుర్తించి పరిష్కరించినట్లు సంస్థ పేర్కొంది. కాబట్టి ఆయా తేదీల్లో మీరు మీ ఫొటోస్ను గూగుల్ ఫొటోస్ నుంచి డౌన్లోడ్ చేయకపోతే మీ వీడియోలు సేఫ్‌గా ఉన్నట్లే. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే వ్యక్తిగతం అనుకున్న వీడియోలను ఆన్లైన్ స్టోరేజ్‌లో కాకుండా పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డ్రైవ్‌లలో సేవ్ చేసుకోవడం ఉత్తమం.
Authorization